ఆర్బీఐపై నమ్మకాన్ని ఇది దెబ్బకొట్టింది!
ఆర్బీఐపై నమ్మకాన్ని ఇది దెబ్బకొట్టింది!
Published Wed, Dec 14 2016 7:11 PM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
ముంబాయి : కేంద్రప్రభుత్వం తీసుకున్న హఠాత్తు పరిణామం పాత నోట్లను రద్దు ప్రక్రియ వల్ల సెంట్రల్ బ్యాంకు గౌరవాన్ని, స్వాతంత్య్రాన్ని నిర్లక్ష్యం చేసినట్టు వెల్లడవుతుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ డైరెక్టర్ కైరాన్ కర్రీ అన్నారు. ఆర్బీఐ స్వాతంత్య్రానికి నోట్ల రద్దు ప్రక్రియ ముసుగులా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ సెంట్రల్ బ్యాంకు క్రెడిబుల్ ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. కర్రీ మీడియాతో నిర్వహించిన భేటీలో ఈ విషయాలను వెల్లడించారు. పాత నోట్ల రద్దు ప్రక్రియ భారత్లో విధానపర నిర్ణయాలపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేసిందని, ఆర్బీఐపై నమ్మకాన్ని కూడా దెబ్బతీసిందని పేర్కొన్నారు. అయితే ఆర్బీఐ క్రెడిబుల్ సంస్థగానే ఉందని తాము అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు.
చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, దాని అమలులో లోటుపాట్ల వల్ల కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాపైనా పలు కామెంట్లు వస్తున్నాయి. పాత కరెన్సీ నోట్లను రద్దు చేసినప్పటికీ, కొత్త కరెన్సీ నోట్లు ప్రజలకు సరిపడ రీతిలో అందుబాటులోకి రావడం లేదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజులు దాటినా ప్రజలు ఇంకా బ్యాంకులు, ఏటీఎం వద్ద క్యూలైన్లోనే నిల్చువాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నగదు కొరతతో ఆర్థికవ్యవస్థలో చాలా రంగాలు దెబ్బతిన్నాయి. అయితే సరిపడ నగదు అందుబాటులో ఉందని, త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆర్బీఐ, ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. అయితే ఆర్బీఐ ముందస్తు ఎలాంటి ప్రణాళికలు చేసుకోకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఈ నేపథ్యంలో ఆర్బీఐ స్వాతంత్య్రం ఎక్కడుందని పలువురు ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు.
Advertisement
Advertisement