కాన్ఫిడెన్స్‌ క్వీన్‌ | Kangana Ranaut foresaw her walking the Cannes red carpet? | Sakshi
Sakshi News home page

కాన్ఫిడెన్స్‌ క్వీన్‌

Published Sat, May 19 2018 6:19 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

Kangana Ranaut foresaw her walking the Cannes red carpet? - Sakshi

కె ఫర్‌ కంగనా. కాదు కాదు కె ఫర్‌ కాన్ఫిడెన్స్‌ అంటున్నారు బాలీవుడ్‌ జనాలు. కారణం కంగనా రనౌత్‌ కాన్ఫిడెన్సే. మేటర్‌ ఏంటంటే.. ఇటీవల కాన్స్‌ ఫెస్టివల్స్‌లో రెడ్‌ కార్పెట్‌పై ఫస్ట్‌ టైమ్‌ నడిచారు క్వీన్‌ కంగనా రనౌత్‌. కానీ కాన్స్‌ రెడ్‌ కార్పెట్‌ మీద కచ్చితంగా నడుస్తాను అని 22 ఏళ్ల వయసులోనే ఊహించారట ఆమె. ఈ విషయం గురించి కంగనా మాట్లాడుతూ – ‘‘22 ఏళ్ల వయసులో సొంతంగా డబ్బు సంపాదిస్తున్న టైమ్‌లో ఫ్రాన్స్‌ విజిట్‌ చేయాలనిపించింది. అక్కడ 10 డేస్‌ స్పెండ్‌ చేశాను. పెర్ఫ్యూమ్‌ తయారు చేసే ఫ్యాక్టరీల చుట్టూ తిరిగాను.

ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాను. ఆ తర్వాత రెడ్‌ కార్పెట్‌ చూడాలనిపించింది. ఆ ప్లేస్‌కు ఒక టూరిస్ట్‌గా వెళ్లాను. ఆ టైమ్‌లో ఎందుకో అనిపించింది ‘రెడ్‌ కార్పెట్‌ చూడవసరంలేదు, ఎలాగూ ఏదో రోజు ఆ కార్పెట్‌ మీద మనం నడుస్తాను’ అని. అలా అనుకున్న వెంటనే వెనక్కి వచ్చేశా’’ అని పేర్కొన్నారు కంగనా. ఇది జరిగిన జస్ట్‌ 9 ఏళ్లలోనే కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రెడ్‌ కార్పెట్‌పై నడిచారీ క్వీన్‌. ఏదైనా విషయాన్ని  కాన్ఫిడెంట్‌గా బిలీవ్‌ చేస్తే చాలు అయిపోతుంది అనడానికి ఇదో ఉదాహరణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement