మాట్లాడుతున్న కొండూరు వేణుగోపాల్‌రెడ్డి
హిందూపురం: వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలందరూ సైనికులుగా పని చేసి హిందూపురంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేద్దామని వైఎస్సార్‌సీపీ నాయకులు కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, చౌళూరు రామకృష్ణారెడ్డిలు పిలుపునిచ్చారు. స్థానిక ఐఎంఏ హాల్‌లో బుధవారం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయం తక్కువగా ఉంది.. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పని చేయాలన్నారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని నాయకులు అన్నారు.
టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని వారు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైన గెలుపొందాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారు. బూత్ కన్వీనర్లు ఓటరు జాబితాలను క్షుణంగా పరిశీలించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
నవరత్నాల గురించి ఇంటింటికి ప్రచారం చేయాలి
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. నవరత్నాలతోనే పేదల భవిష్యత్తు మారుతుందని, ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు.
మహమ్మద్ ఇక్బాల్‌కు స్వాగత ఏర్పాట్లు
నేడు వైఎస్సార్‌సీపీ నేత, రిటైర్డు ఐజీ మహమ్మద్ ఇక్బాల్ హిందుపూరానికి రానున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ నాయకులు కొడికొండ చెక్‌పోస్టు వద్ద మహమ్మద్ ఇక్బాల్‌కు ఘనంగా స్వాగతం పలకనున్నారు. పెద్దఎత్తున నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలిరావాలన్నారు. చెక్‌పోస్టు నుంచి ప్రత్యేక వాహనంలో ర్యాలీగా చిలమత్తూరు, లేపాక్షి మండలాల మీదుగా హిందూపురం చేరుకుంటారు.
సమావేశంలో మండల కన్వీనర్లు నారాయణస్వామి, శ్రీరాంరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, హిందూపురం పార్లమెంట్ యువజన విభాగ అధ్యక్షుడు ఉపేంద్రరెడ్డి, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, రెహెమాన్ నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి, రాజారెడ్డి, బసిరెడ్డి, బలరామిరెడ్డి, గోపికృష్ణ,అంజన్‌రెడ్డి, నరిసింహరెడ్డి, పురుషోత్తంరెడ్డి, జనార్థన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment