
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి విశ్వసనీయతను తీసుకు వచ్చి, పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందు వచ్చే లా చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మాట చెబితే దానిపై నమ్మకం ఏర్పడేలా చేస్తానన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు రాయితీల రూపంలో బకాయి పడిన మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం చెల్లించేందుకు రీస్టార్ట్ ప్యాకేజీని ప్రక టించింది. అందులో భాగంగా మే లో తొలి విడతగా రూ.450 కోట్లు చెల్లించింది. రెండో విడతగా సీఎం వైఎస్ జగన్ సోమవారం రూ.512.35 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.