నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
-
మోఖాపై వెళ్లి సర్వే చేపట్టాలి
-
టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు
శాయంపేట : జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో వర్షాలతో కూలిపోయిన ఇండ్లను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు మొక్కజోన్న, పత్తి, మిర్చి, వరి పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అంతేకాకుండా వందలాది ఇండ్లు నేలమట్లమయ్యాయన్నారు. ఇంత జరిగిన వ్యవసాయ, హార్టికల్చర్, రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, బాసని శాంతా, చిందం రవి, బాసని మార్కండేయా, పెద్దిరెడ్డి రాజిరెడ్డి, రాజు పాల్గొన్నారు.
జిల్లాల పునర్విభజనతో ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్
రేగొండ : జిల్లాల పునర్విభజన పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను పక్కదారి పట్టించి మోసం చేస్తున్నారని గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనగామ ప్రజలను విస్మరించి తన స్నేహితుడు కెప్టె¯ŒS లకీ‡్ష్మకాంతరావు కోసం హన్మకొండ జిల్లాను ఏర్పరచడం దారుణమన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు ఇప్పటికీ రుణమాఫీ చేయకపోవడం శోచనీయమన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు.