Entrepreneurs
-
తెలంగాణకు పెట్టుబడులు.. రూ.1.78 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో రికార్డు స్థాయిలో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు, 49,500 ఉద్యోగాల కల్పనకు సంబంధించి పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల సాధన లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం’.. ముందెన్నడూ లేనిరీతిలో భారీ ఫలితాన్ని సాధించినట్లు తెలిపింది. గత ఏడాది జరిగిన సదస్సులో కేవలం రూ.40 వేల కోట్ల పెట్టుబడులు సాధించగా.. ప్రస్తుత సదస్సులో నాలుగింతలకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొంది. ఈ నెల 16న విదేశీ పర్యటనకు బయలుదేరిన రేవంత్‌రెడ్డి బృందం 17 నుంచి 19వ తేదీ వరకు సింగపూర్‌లో పర్యటించింది. అనంతరం దావోస్‌కు చేరుకుని మూడురోజుల పాటు డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో పాల్గొంది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. సమావేశాలు సక్సెస్ అయ్యాయన్న సర్కారు దావోస్‌లో పారిశ్రామికవేత్తలతో తెలంగాణ రైజింగ్ బృందం నిర్వహించిన సమావేశాలు విజయవంతమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. అమెజాన్, సన్ పెట్రో కెమికల్స్, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్, మేఘా ఇంజనీరింగ్ సంస్థలు భారీ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీలు హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో హైదరాబాద్ కేంద్రంగా విస్తరణ ప్రణాళికలు ప్రకటించాయి. డేటా సెంటర్ల రంగంలో అమెజాన్, టిల్మాన్, ఉర్సా, సిఫి, కంట్రోల్ ఎస్ సంస్థలు పెట్టుబడులను ప్రకటించాయి. సోలార్ సెల్స్, రాకెట్ తయారీ, రక్షణ రంగంలోనూ భారీ ఎత్తున పెట్టుబడుల ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలున్నాయని పేర్కొంది. తెలంగాణ రైజింగ్– 2050 లక్ష్య సాధనపై అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలు, విధాన నిర్ణేతల నుంచి పెద్దయెత్తున సానుకూలత వ్యక్తమైనట్లు ప్రకటించింది. యూనీలివర్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్, సుహానా మసాలా, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, ఫోనిక్స్, అగిలిటీ, స్కైరూట్ ఏరోస్సేస్, జేఎస్‌డబ్ల్యూ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపింది. అనేక రంగాల్లో అనుకూలతలు: సీఎం రేవంత్ ‘అంతర్జాతీయగా వాణిజ్యానికి పర్యాయపదంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. సాఫ్ట్వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్, తెలంగాణకు అనుకూలతలు ఉన్నాయి. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్రి్టక్ వాహనాలు, సెమీ కండక్టర్లతో పాటు ఇతర రంగాల్లో పురోగతికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ తర్వాత సరఫరా వ్యవస్థలు చైనా బయట అవకాశాలను (చైనా ప్లస్ వన్) అన్వేషిస్తున్న నేపథ్యంలో ఆ అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోంది. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు క్లస్టర్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాం. ఔటర్ రింగు రోడ్డు లోపలి వైపు సేవలు, ప్రతిపాదిత రీజినల్ రింగు రోడ్డు, ఓఆర్ఆర్ నడుమ తయారీ, ట్రిపుల్ ఆర్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణను ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఉద్యోగాల కల్పన, ఆదాయం పెంపు, వాణిజ్య అవకాశాలు, మరింత మెరుగైన సంక్షేమం కోసం ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగుతాం..’ అని దావోస్ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. -
మహిళా వ్యాపారవేత్తలు ఎక్కువ ఉన్న రాష్ట్రం అదే
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు, నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా తోడుగా నిలుస్తోంది. ఇందులో భాగంగానే స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఎస్‌వీఈపీ) అనే కార్యక్రమం ప్రారంభించింది.స్వయం సహాయక సంఘాల్లోని (ఎస్‌హెచ్‌జీలు) ఔత్సాహికులైన మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ అంత్యోదయ యోజన - నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఈ ఎస్‌వీఈపీ కార్యక్రమం ప్రారంభించింది. ఔత్సాహికులైన మహిళలు దేశవ్యాప్తంగా 3,13,464 చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకుని.. వాటి ద్వారా వారు ఎదగడమే కాకుండా, మరికొంతమందికి ఉపాధి చూపుతున్నారు.కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకారం.. అత్యధిక ఎంటర్‌ప్రైజెస్‌తో కేరళ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 3,45,69 మంది వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత స్థానంలో ఉత్తరప్రదేశ్ (28,904 మంది), మధ్యప్రదేశ్ (28,318 మంది), ఆంధ్రప్రదేశ్ (27,651 మంది), ఝార్ఖండ్ (25,991 మంది), బీహార్ (24,892 మంది), ఛత్తీస్‌గఢ్ (21,016 మంది) రాష్ట్రాలు ఉన్నాయి. -
ఏంజెల్ ట్యాక్స్ రద్దుతో స్టార్టప్‌లకు బూస్ట్
వాషింగ్టన్: ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేస్తూ భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను సిలికాన్ వ్యాలీకి చెందిన పారిశ్రామికవేత్తలు స్వాగతించారు. దీన్నొక చరిత్రాత్మక నిర్ణయంగా అభివరి్ణంచారు. స్టార్టప్‌ల ఎకోసిస్టమ్‌కు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని టీఐఈ సిలికాన్ వ్యాలీ ప్రెసిడెంట్ అనిత మన్వానీ అన్నారు. దేశ వృద్ధికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా వ్యాపార నిర్వహణ పట్ల ఆసక్తి పెరుగుతుండడాన్ని చూడొచ్చు. కేవలం టెక్నాలజీలోనే కాకుండా, సేవలరంగం, తయారీలో మరింత మంది యువ పారిశ్రామికవేత్తలు అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో పెరుగుతున్న యువ జనాభా నేపథ్యంలో ఏంజెల్ ఇన్వెస్టర్లను పన్ను నుంచి మినహాయించే ఇలాంటి చట్టాలే అవసరం. ఇది భారాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల పారిశ్రామికవేత్తలు నిబంధనల అమలుకు బదులు తమ వ్యాపారంపై దృష్టి పెట్టేందుకు వీలు కలుగుతుంది. అంతిమంగా ఈ నిర్ణ యం భారత్–యూఎస్ కారిడార్‌లో ఏంజెల్ పెట్టు బడులను పెంచుతుంది’’అని మన్వానీ వివరించారు. పలువురు ఇతర పారిశ్రామికవేత్తలు సైతం ఈ నిర్ణయాన్ని అభినందించారు. సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే పారిశ్రామికవేత్తలు ఎప్పటి నుంచో ఏంజెల్ ట్యాక్స్ రద్దు కోసం డిమాండ్ చేస్తుండడం గమనార్హం. స్టార్టప్‌కు నిధులు పెరుగుతాయి.. భారత ప్రభుత్వ నిర్ణయంతో స్టార్టప్‌లకు స్థానికంగానే కాకుండా, విదేశాల నుంచి పెట్టుబడుల సా యం పెరుగుతుందని యూఎస్ ఇండియా వ్యూహా త్మక భాగస్వామ్య సంస్థ పేర్కొంది. ఏంజెల్ ట్యాక్స్ రద్దు ద్వైపాక్షిక సాంకేతిక సహకారం, ఆవిష్కరణల విషయంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుందని యూ ఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ తెలిపింది. ‘‘భారత్‌లో స్టార్టప్‌ల వ్యవస్థకు ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. స్టార్టప్ ఎకోసిస్టమ్ రాణించేందుకు, ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, పోటీతత్వాన్ని పెంచేందుకు సాయపడుతుంది’’ అని యూఎస్ఏ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కరుణ్ రిషి పేర్కొన్నారు. రిపాట్రియేషన్లోనూ సంస్కరణలు అవసరం స్వదేశానికి నిధుల తరలింపులో(రిపాట్రియేషన్ )నూ సంస్కరణలు అవసరమని మన్వానీ అభిప్రాయపడ్డారు. ‘‘రిపాట్రియేషన్ అన్నది అధిక శాతం ఎన్ఆర్ఐలు, ఇన్వెస్టర్లకు ప్రాముఖ్యంగా ఉంటుంది. ఈ విషయంలోనూ నిబంధనలను సడలించాలి. నేడు ఎవరైనా యూఎస్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రిపా్రటియేషన్కు సంబంధించి ఇదే విధమైన నిబంధనలు, నియంత్రణలను భారత్ కూడా పాటించొచ్చు’’అని మన్వానీ తెలిపారు. -
Mitti Cafe: అలీన అద్భుత దీపం...
అద్భుతాలు జరగడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం అక్కర్లేదు. కాస్త ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. అలీన ఆ ఆత్మవిశ్వాసంతో సాధించిన అద్భుతం...మిట్టీ కేఫ్. ఆఫీసుల నుంచి రెస్టారెంట్ల వరకు దివ్యాంగులకు సరిౖయెన సౌకర్యాలు లేని పరిస్థితి. ‘నేను ఉద్యోగం చేస్తాను’ అని అడిగితే ‘సారీ’ చెప్పే పరిస్థితి. ఇది తెలిసి కూడా దివ్యాంగులను ఉద్యోగులుగా, ఎంటర్ప్రెన్యూర్లుగా చూడాలని కల కన్నది అలీనా అలమ్. ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఆమె మొదలుపెట్టిన ‘మిట్టీ కేఫ్’ ఆ తరువాత కాలంలో అద్భుతం సృష్టించింది. ‘మిట్టి కేఫ్’ అనేది ఇప్పుడు ఒక కేఫ్ బ్రాండ్ మాత్రమే కాదు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిధ్వనించే బ్రాండ్...దివ్యాంగుల కోసం పనిచేస్తున్న బెంగళూరులోని ‘సమర్థన’ ట్రస్ట్‌లో ఇంటర్న్‌షిప్ ్ర΄ోగ్రామ్ చేస్తున్న రోజుల్లో ‘మిట్టీ కేఫ్’ ఆలోచన ఆలీనా అలమ్‌కు వచ్చింది. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన కలను సాకారం చేసుకోవడానికి ‘మిట్టీ కేఫ్’ మంచి ఆలోచన అనుకుంది.‘పెళ్లి చేసుకో లేదా ఉద్యోగం చెయ్’ అన్నారు తల్లిదండ్రులు. అలీనా మాత్రం సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దారిలో నడక మొదలు పెట్టింది. దివ్యాంగుల కోసం, దివ్యాంగుల చేత నడుస్తున్న ‘మిట్టీ కేఫ్’లు సక్సెస్ అయ్యాయి.‘మన దేశంలోని లక్షలాది మంది దివ్యాంగులు సమాన అవకాశాల కోసం, ఆర్థికంగా సొంతకాళ్ల మీద నిలబడడం కోసం ఎదురుచూస్తున్నారు. సమస్య అనేది వారి సామర్థ్యం గురించి కాదు. సమస్య మనం చూసే దృష్టి కోణంలో ఉంది. వారి గురించి మనకు ఎన్నో అ΄ోహలు ఉంటాయి. చిన్న చూపు ఉంది. ఈ పరిస్థితి పూర్తిగా మారి΄ోవాలి’ అంటున్న అలీన ‘మిట్టీ కేఫ్’ ద్వారా ఎంతోమంది దివ్యాంగులకు ఉ΄ాధితో΄ాటూ ఆత్మస్థైర్యాన్నీ ఇచ్చింది.దాతలు ఇచ్చిన విరాళాలతో‘మిట్టీ కేఫ్’ మొదలైంది. ‘సంకల్పం మంచిదైతే సహాయపడడానికి సమాజం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అన్నట్లు ఒక ప్రింటింగ్ ప్రెస్ యజమాని కేఫ్‌కు సంబంధించిన ΄ోస్టర్లను ఉచితంగా ముద్రించి ఇచ్చాడు.దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ‘మిట్టీ కేఫ్’లను తీర్చిదిద్దారు. దృష్టి లోపం ఉన్నవారు బిల్లింగ్ చేయడానికి వీలుగా బిల్లింగ్ సిస్టమ్‌లో ఆడియో ఫీచర్ ఉంది. మెనూ బ్రెయిలీ లిపిలో ఉంటుంది. వినికిడి లోపం ఉన్న, మూగ ఉద్యోగులు కస్టమర్లతో కమ్యూనికేట్ చేయడానికి ప్లకార్డులు కూడా ఉంటాయి.హుబ్లీలోని చిన్న షెడ్లో మొదలైన ‘మిట్టీ కేఫ్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. దేశవ్యాప్తంగా ఎయిర్΄ోర్ట్స్, పెద్ద కంపెనీలు, బ్యాంకులు... మొదలైన వాటిలో 46 ‘మిట్టీ కేఫ్’లు నడుస్తున్నాయి. గత సంవత్సరం సుప్రీంకోర్టు ్ర΄ాంగణం, రాష్ట్రపతి భవన్, ఐఐఎం–బెంగళూరులో ‘మిట్టీ కేఫ్’లను ్ర΄ారంభించారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని విమాన్రాశయాలు, మెట్రో, రైల్వే స్టేషన్లలో ‘మిట్టీ కేఫ్’ లు ఏర్పాటు చేయనున్నారు.‘కరేజ్’ ‘మ్యాజిక్’ అనే మాటలు అలీన నోటి నుంచి తరచుగా వినిపిస్తుంటాయి. ‘ధైర్యం’ ఉన్న చోటే ఊహించని అద్భుతాలు, మ్యాజిక్‌లు జరుగుతాయి. ‘మిట్టీ కేఫ్’ రూపంలో అద్భుతం సృష్టించడానికి అలీనాలోని ధైర్యమే కారణం. ఆమెకు బాగా ఇష్టమైన కొటేషన్...‘ఎక్కడ దయాగుణం ఉంటుందో... అక్కడ మంచితనం ఉంటుంది.ఎక్కడ మంచితనం ఉంటుందో... అక్కడ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది’‘మనం మాత్రం ఏం చేయగలం’ అనుకునే నిరాశావాదులకు అలీన ఆలమ్ విజయం కనువిప్పు లాంటిది. కొత్త దారి చూపే కాంతి కిరణంలాంటిది. ‘మిట్టీ కేఫ్’లో పనిచేసిన దివ్యాంగ ఉద్యోగులలో కొందరు సొంతంగా ఎంటర్ప్రెన్యూర్లుగా రాణించడం మరో మంచి విజయం. -
ఈ చిన్నారి ఇప్పుడు గ్లోబల్ స్టార్.. ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
యువతరానికి దిక్సూచి ‘భవిత’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్న చొరవకు పారిశ్రామికవేత్తలు ఫిదా అయ్యారు. ‘భవిత’ పేరుతో ప్రారంభించిన స్కిల్ కాస్కేడింగ్ కార్యక్రమం.. యువత భవిష్యత్తుకు దిక్సూచిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీలో నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మ్యాన్ పవర్ దొరుకుతోందని.. ఇక్కడ విద్యార్థుల్ని సానబెడితే అన్ని రంగాల్లోనూ రాణించగల సత్తా ఉందని సూచించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం.. తమలాంటి ఎందరో యువతీ యువకుల జీవన స్థితిగతుల్ని మార్చేసిందని ఉద్యోగాలు పొందిన యువత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నేను కోరుకున్న ఫీల్డ్‌లో స్థిరపడ్డాను మాది విశాఖపట్నం పెదగంట్యాడ. మా నాన్న లిఫ్ట్ ఆపరేటర్, అమ్మ గృహిణి, నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకున్నాం. నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆటోమేషన్‌లో స్ధిరప డాలని సీడాప్ ద్వారా స్కిల్ కాలేజ్‌లో జాబ్ ఓరియెంటెడ్ కోర్సు గురించి తెలుసుకొని రిజిస్టర్ చేసుకొని ట్రైనింగ్ తీసుకున్నాను. మాకు టెక్నికల్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్‌కు ఎంపికయ్యాను. చెన్నైలోని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో 4 రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా సెలక్ట్ అయ్యాను. – దీపిక, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ కంపెనీ, చెన్నై స్కిల్లింగ్ ఎకో సిస్టమ్‌ని అభివృద్ధి చేసిన ఏపీ.. ఏపీలో యంగ్ సీఎం ఉన్నారు. అందుకే యువతకి అవకాశాలు ఎక్కువగా కల్పించాలన్న ఆలోచనలతో అడుగులు వేస్తున్నారు. సింగపూర్‌లో స్కిల్లింగ్కి ఏజ్ బార్ లేదు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. దేశంలో స్కిల్లింగ్ ఎకోసిస్టమ్‌ని అభివృద్ధి చేసిన రాష్ట్రం ఆంధప్రదేశ్ మాత్రమే. పదిస్థాయిల్లో శిక్షణ అందించేలా స్కిల్ పిరమిడ్‌ను కూడా సీఎం జగన్ రూపొందించారు. యువతకి నైపుణ్యాన్ని పెంపొందించే ప్రోగ్రామ్ని కూడా తయారు చేశారు. పరిశ్రమలతో అనుసంధానం చేయడంతో వారికి కావాల్సిన సాంకేతిక నైపుణ్యం ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. – బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ఆర్థిక, స్కిల్‌డెవలప్‌మెంట్ శాఖ మంత్రి ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం మా సంస్థని, పెట్టుబడుల్ని ఎంతగానో ప్రోత్సహి స్తోంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు రావాలని ఆశిస్తున్నాం. స్కిల్ సెక్టార్ కు ఇది గొప్ప అడుగు. స్కిల్ ఎకో సిస్టమ్‌ని అభివృద్ధి చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం చర్యలకు నిజంగా అభినందనలు. కియా మోటార్స్ ఇండియా ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్‌ని శ్రీ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం. స్కిల్ డెవలప్మెంట్ సంస్థల ద్వారా అద్భుత అవకాశాలు ఏపీలో ఉన్న యువతకు అందుతున్నాయి. –కె.గ్వాంగ్లీ, కియా మోటర్స్ ఎండీ కమిట్మెంట్ ఉన్న సీఎం జగన్ దేశంలో ఇప్పటి వరకూ చాలా స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలకు హాజరయ్యాను. ఇలాంటి కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వాన్ని ఇంతవరకూ చూడలేదు. యువత ముందే పారిశ్రామికవేత్తల్ని కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పడం అద్భుతం. మా సంస్థ విమానాలు తయారు చేస్తుంది. భవిష్యత్తులో విమానయానంలో ఎన్నోరకాల ఉపాధి అవకాశాలున్నాయి. లెర్నింగ్ వింగ్స్ ఫౌండేషన్ అనే స్కిల్లింగ్ భాగస్వామితో పని చేస్తున్నాం. మా సంస్థ సామర్థ్యం మేరకు స్కిల్ ఎకో సిస్టమ్‌కు మద్దతు అందిస్తాం. – ప్రవీణ యజ్ఞంభట్, బోయింగ్ ఇండియా చీఫ్ ఆఫ్ స్టాఫ్ కెమికల్ ఇంజినీర్స్ అవసరం చాలా ఉంది ఏపీ సెజ్ అచ్యుతాపురంలో మా సంస్థని ఏర్పాటు చేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆటమిక్ రీసెర్చ్ ఉత్పత్తుల్లో ఎంతో ఉన్నతి సాధించాం. కెమికల్ ప్రాసెసింగ్ వైపు కూడా మా సంస్థ అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో మాకు కెమికల్ ఇంజినీర్స్ అవసరం ఎంతో ఉంది. నేరుగా నియామకం చేసుకోవాలని భావిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర స్కిల్ డెవలప్ మెంట్ సొసైటీతో కలిసి పనిచేస్తున్నాం. విద్యార్థులకు మాకు అవసరమైన రీతిలో శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తాం. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల్ని అందించడంలో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కృషి అనిర్వచనీయం. – కొయిచీ సాటో, టొయేట్సు రేర్ ఎర్త్ ప్రై.లి., ఎండీ సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు నేను మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేశాను. అప్పుడు ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో 45 రోజులు శిక్షణ తీసుకున్నాను. శిక్షణలో నేను చాలా నేర్చుకున్నాను. మెషిన్ ఆపరేటింగ్, సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పారు. 2021లో ఏషియన్ పెయింట్స్ వారి ఇంటర్వ్యూలకు హాజరై ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఏడాదికి రూ. 5 లక్షల ప్యాకేజ్‌లో సెలక్ట్ అయ్యాను. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్‌గా ఏడాదికి రూ. 7.2 లక్షల ప్యాకేజీ తీసుకుంటున్నాను. మా కుటుంబానికి నేను ఇప్పుడు చాలా ఆసరాగా ఉన్నాను. ఈ విధమైన శిక్షణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీఎంకు నా కృతజ్ఞతలు. – భార్గవ్, విశాఖపట్నం మానవవనరుల్లో మనమే ముందంజ.. అత్యధికంగా నైపుణ్యంతో కూడిన మానవ వనరులున్న రాష్ట్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దడంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరసలో ఉంది. స్కిల్ ట్రైనింగ్ అనేది కేవలం ఉపాధి అవకాశాల్ని అందిస్తోంది. ఐదేళ్లలో 15 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వగా.. 3.8 లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఇంకొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు. సీఎం జగన్ 27 స్కిల్ కాలేజీలు, 192 స్కిల్ హబ్స్, 55 స్కిల్ స్కోప్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. భవిత పేరుతో శిక్షణని అప్‌గ్రేడ్ చేస్తున్నాం. – సురేష్‌కుమార్, ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ -
రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడి రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. రాష్ట్ర యువతకు నైపుణ్య ‘భవిత’ రాష్ట్ర యువత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ‘భవిత’ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. భావి అవసరాలకు తగిన విధంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ఉపాధి శిక్షణ సంస్థ స్కిల్ క్యాస్కేడింగ్ వ్యవస్థను తీసుకొచ్చినట్టు నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి బి.సురేష్ కుమార్ పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా ‘భవిత’ను తీర్చిదిద్దినట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే 152 యూనిట్లతో ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో నైపుణ్య శిక్షణకు సంబంధించి పలు సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో రూ.90 కోట్లతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను ముఖ్యమంత్రి వర్చువల్‌గా విశాఖ నుంచి ప్రారంభిస్తారు. అలాగే ఎంపీల్యాడ్స్ నిధులతో ఒక్కోటి రూ.70 లక్షలతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లనూ సీఎం ప్రారంభిస్తారు. 2023–24 సంవత్సరంలో నైపుణ్య శిక్షణను పూర్తి చేసుకుని ప్లేస్‌మెంట్స్ పొందిన 7,110 మంది విద్యార్థుల గ్రాడ్యుయేషన్ సెర్మనీని నిర్వహించనున్నారు. 7న సీఎం అనకాపల్లి రాక సాక్షి, అనకాపల్లి : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 7న అనకాపల్లి రానున్నారు. వైఎస్సార్ చేయూత చివరి విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌లు సభా స్థలిని పరిశీలించారు. అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానంలో హెలిప్యాడ్‌కు స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మలసాల భరత్‌కుమార్ తదితరులున్నారు. -
Astrology: గ్రహాలేం చెబుతున్నాయ్..
న్యూఢిల్లీ: సర్వత్రా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయా, ఇంక్రిమెంట్లు పడతాయా వంటి అనేకానేక సందేహాలు చాలామంది ఉద్యోగులను వెంటాడుతున్నాయి. తమ భవిష్యత్తు గురించి గ్రహాలేం చెబుతున్నాయో తెలుసుకోవాలనే ఆరాటం కొద్దీ ఆన్లైన్ జ్యోతిష్యం పోర్టల్స్‌ను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారిలో యువ ఉద్యోగులే కాకుండా ఔత్సాహిక వ్యాపారవేత్తలు కూడా ఉండటం గమనార్హం. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, కెరియర్లో పురోగతి, ఉద్యోగంలో మార్పులు వంటి అంశాలపై ఉద్యోగులు ఆరాటపడుతుండగా, స్టార్టప్ వ్యవస్థాపకులు తమ నిధుల సమీకరణ యత్నాలు సక్రమంగా సాగుతాయా లేదా, ఇతర వ్యవస్థాపకులతో సంబంధాలు బాగుంటాయా లేదా అనే విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆన్లైన్ ఆ్రస్టాలజీ పోర్టల్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. కెరియర్, బిజినెస్ గురించి తెలుసుకునేందుకు డిజిటల్ ఆ్రస్టాలజీ ప్లాట్‌ఫాం గణేషాస్పీక్స్డాట్కామ్కి యువ ప్రొఫెషనల్స్, ఎంట్రప్రెన్యూర్ల నుంచి వచ్చే కన్సల్టేషన్ల అభ్యర్ధనలు పది రెట్లు పెరిగాయి. వారిలో చాలా మంది 23–35 ఏళ్ల మధ్య వారే కావడం విశేషం. ఇక ఆస్ట్రోయోగి ప్లాట్‌ఫాంపై యూజర్ల సంఖ్య .. కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే 10 రెట్లు పెరిగింది. ఆస్ట్రోటాక్, ఆస్ట్రోయోగి వంటి ప్లాట్‌ఫాంలు అందించే మొత్తం కన్సల్టేషన్లలో సుమారు 30 శాతం కన్సల్టేషన్లు .. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, ఉద్యోగాల్లో కోతల భయాలు మొదలైన వాటి గురించే ఉంటున్నాయి. రూ. 10 నుంచి కన్సల్టేషన్.. జ్యోతిష్యుల అనుభవాన్ని బట్టి కన్సల్టేషన్‌కు వసూలు చేసే చార్జీలు ఉంటున్నాయి. నిమిషానికి రూ. 10 నుంచి మొదలుపెడితే రూ. 200 వరకు కూడా ఇవి ఉంటున్నాయి. జ్యోతిష్యుల్లో పక్కాగా జ్యోతిష్యం నేర్చుకున్నవారే కాకుండా ఇంజనీర్లు, ఎంటెక్, సీఏలు చేసిన వారు కూడా ఉంటున్నారు. సోషల్ మీడియా వినియోగం అత్యధికంగా ఉండే నగరాల్లోని మొత్తం ఆన్లైన్ ఆ్రస్టాలజీ యూజర్లలో 60 శాతం వాటా జనరేషన్ జెడ్ యువతదే ఉండటం ప్రస్తావించతగ్గ అంశమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వ్యాపారాల విషయంలో అనిశ్చితి నెలకొన్న తరుణంలో చిన్న పట్టణాలు మొదలుకుని మెట్రో నగరాల వరకు అన్ని చోట్లా యువ యూజర్ల నుంచి దాదాపు ఒకే తరహా సందేహాలకు కన్సల్టేషన్ అభ్యర్ధనలు వస్తున్నాయని పేర్కొన్నాయి. ఆస్ట్రో యూజర్లలో ఎక్కువ శాతం మంది ఢిల్లీ, ముంబై, బెంగళూరు, లక్నో, జైపూర్, చండీగఢ్, లూధియానా వంటి పెద్ద నగరాల నుంచి ఉంటున్నట్లు వివరించాయి. వ్యాపారం జోరు.. పెరుగుతున్న యూజర్ల సంఖ్యకు అనుగుణంగా ఆస్ట్రో పోర్టల్స్ ఆదాయాలు కూడా జోరుగా ఉంటున్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో ఆస్ట్రోటాక్ ఆదాయం రూ. 65 కోట్లుగా ఉండగా 2023 ఆర్థిక సంవత్సరానికల్లా రూ. 282 కోట్లకు పెరిగింది. లాభాలు రూ. 11.2 కోట్ల నుంచి రూ. 27 కోట్లకు చేరాయి. యూజర్ల సంఖ్య 25 లక్షల నుంచి ఇప్పటివరకు 1.9 కోట్లకు ఎగిసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 630 కోట్లకు, లాభం రూ. 130 కోట్లకు చేరగలదని ఆస్ట్రోటాక్ అంచనా వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లకు కూడా విస్తరించాలనే యోచనలో కంపెనీ ఉంది. ఇందులో భాగంగా ఇతర సంస్థలను కొనుగోలు చేయడం, కొత్త విభాగాలను ప్రారంభించడం, సీనియర్ల హోదాలో నియామకాలు చేపట్టడం మొదలైన వాటిపై కసరత్తు చేస్తోంది. మరోవైపు, గణేషాస్పీక్స్ పోర్టల్‌ను తీసుకుంటే 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 58 శాతం పెరిగింది. -
లండన్ మేయర్ ఎన్నికల బరిలో ఇద్దరు భారత సంతతి వ్యాపారవేత్తలు
లండన్: ప్రతిష్టాత్మక లండన్ మేయర్ పదవికి భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు పోటీ పడనున్నారు. మే 2వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలో వీరిద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో, 2016 నుంచి లండన్ మేయర్‌గా కొనసాగుతున్న పాక్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. ఢిల్లీలో జన్మించిన తరుణ్ గులాటి(63) స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా లండన్‌లో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో భారత్ పర్యటన సమయంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అదేవిధంగా, ప్రాపర్టీ వ్యాపారి శ్యామ్ భాటియా(62) మేయర్ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తాజాగా ప్రకటించారు. గులాటి ఎన్నికల ట్యాగ్ లైన్ ‘విశ్వాసం–అభివృద్ధి’కాగా, భాటియా ‘అంబాసిడర్ ఆఫ్ హోప్’ట్యాగ్‌లైన్‌తో ముందుకు వెళ్తున్నారు. చదవండి: ఎవరీ ఎర్రసముద్రపు హౌతీలు! -
అలాంటి ఉద్యోగులు అక్కర్లేదు.. యువ వ్యాపారవేత్త సంచలన వ్యాఖ్యలు
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు 'ఎన్ఆర్ నారాయణ మూర్తి' గత కొన్ని రోజులకు ముందు భారతదేశం అభివృద్ధి చెందాలంటే వారానికి 70 గంటల పని అవసరమని వెల్లడించారు.. ఈ విషయం మీద సాధారణ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రముఖ వరకు పెద్ద ఎత్తున స్పందించారు. ఇదిలా ఉండగానే ఇటీవల ఓ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేసేవారు అవసరం లేదంటూ వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా మంది యువత ఉద్యోగం చేయడానికంటే కూడా సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'అనుభవ్ దూబే' (Anubhav Dubey). 23 ఏళ్ల వయసులోనే స్టార్టప్ కంపెనీ ప్రారభించి కోట్లు సంపాదిస్తున్నారు. చాయ్ సుత్తా బార్ (Chai Sutta Bar) పేరుతో ఒక చాయ్ కంపెనీ ప్రారంభించాడు, ఇది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 500 అవుట్లెట్లను కలిగి ఉంది. ఈ సంస్థ విలువ రూ. 150 కోట్లు కావడం గమనార్హం. తక్కువ వయసులోనే సక్సెస్ సాధించి ఎంతోమంది యువకులకు రోల్ మోడల్‌గా నిలిచాడు. అనుభవ్ దూబే ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే వారి కోసం వెతకడం లేదని, ఇక్కడ సైన్యం తయారు చేస్తున్నామని, ట్వీట్ చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. దీనిపైన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదీ చదవండి: ఆస్తులు అమ్మేయడానికి సిద్దమైన హెచ్‌సీఎల్.. ఎందుకంటే? నిజానికి అనుభవ్ దూబే తన బృందాన్ని మోటివేట్ చేయడానికి ఇలా చెప్పినట్లు తెలుస్తోంది, అయినప్పటికీ ఇది చాలామందికి కోపాన్ని తెప్పించింది. చాయ్ అమ్మడం పెద్ద విషయం కాదని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు చాయ్ అమ్మడానికి సైన్యం ఎందుకని ప్రశ్నించారు. We are not looking for office employees working 9 to 5. No, not at all. We are making f**king Army here. pic.twitter.com/MGBeb9Mk0J — Anubhav Dubey (@tbhAnubhav) November 27, 2023 -
ఒక్క ఫోన్ చాలు 'సమస్యలన్నీ పరిష్కారం'..
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా అన్ని రకాలుగా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉందని గుర్తు చేశారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదిరిన ఒప్పందాలను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ త్వరితగతిన అమల్లోకి తెస్తున్నామని, ఇందుకోసం కృషి చేస్తున్న అధికారులకు అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలను విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,100 కోట్ల విలువైన తొమ్మిది ప్రాజెక్టులకు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. విశాఖ ఒప్పందాలు వేగంగా సాకారం.. పారిశ్రామిక రంగంపై ముఖ్యంగా ఎంఎస్ఎంఈ, పుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. జిల్లా స్ధాయిలో కలెక్టర్లు కూడా దీనిపై దృష్టి సారించి పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలి. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో 386 ఎంవోయూలు చేసుకున్నాం. వీటి ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులతోపాటు ఆరు లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవన్నీ సాకారమయ్యేలా నిరంతరం సమీక్షిస్తూ పురోగతి కోసం చర్యలు తీసుకున్నాం. ఇందులో 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. మరో 94 ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిగిలిన వాటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో మరింత పురోగతి సాధించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలకు చేయూతనిస్తున్నాం. నెలకు కనీసం రెండు సమీక్షా సమావేశాలు నిర్వహించడం ద్వారా వీటన్నింటినీ వేగంగా కార్యరూపంలోకి తెస్తున్నాం. కలెక్టర్లు కూడా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని నడిపిస్తూ దీన్ని మరింత వేగవంతం చేయాలి. ఎంఎస్ఎఈలతో 12.62 లక్షల మందికి ఉపాధి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయగలిగాం. వీటి ద్వారా దాదాపు రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 86 వేలమందికి ఉద్యోగాలు కూడా ఇవ్వగలిగాం. ఎంఎస్ఎంఈ రంగంలో ఎప్పుడూ చూడని విధంగా అడుగులు వేశాం. కోవిడ్ సమయంలో ఎక్కడా, ఎవరూ కుప్పకూలిపోకుండా వారికి చేయూతనిచ్చాం. గత నాలుగున్నరేళ్లలో దాదాపు 1.88 లక్షల ఎంఎస్ఎంఈలు కొత్తగా వచ్చాయి. వీటి ద్వారా 12.62 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అందరం కలసికట్టుగా బాధ్యత తీసుకున్నాం కాబట్టే ఇది సాకారమైంది. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మనం కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామనే మెస్సేజ్‌ను ఎంత సానుకూలంగా తీసుకెళ్లగలిగితే అంత ఉత్సాహంగా ముందుకొస్తారు. ఇది కచ్చితంగా నా దగ్గర నుంచి మొదలుకుని మీ వరకు ఇదే రకమైన తత్వాన్ని అలవరచుకోవాలి. రూ.1,100 కోట్ల పెట్టుబడులకు శ్రీకారం పరిశ్రమలు–వాణిజ్యశాఖ, పుడ్ ప్రాసెసింగ్ రంగాలలో ఇవాళ తొమ్మిది ప్రాజెక్టులు చేపడుతున్నాం. దాదాపు రూ.1,100 కోట్ల పెట్టుబడితో 21,744 మందికి ఉద్యోగాలు లభించేలా మంచి అడుగు పడుతోంది. మూడు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, మిగిలిన ఆరు ప్రాజెక్టులకు శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. కొద్ది రోజుల క్రితం నేను పత్తికొండ వెళ్లినప్పుడు టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు దిశగా అడుగులు వేయమని చెప్పా. కొద్ది కాలంలోనే అది అధికారుల కృషితో కార్యరూపం దాల్చి శంకుస్ధాపన దశకు వచ్చింది. రూ.12 కోట్ల పెట్టుబడితో టమోటా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు పత్తికొండలో శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ అంతే వేగంగా అడుగులు ముందుకేయాలి. ఇవాళ శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను జరుపుకొంటున్న తొమ్మిది యూనిట్లకు శుభాభినందనలు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ పరిశ్రమలు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మీ అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు, కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, వ్యవసాయం, పుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, పుడ్ ప్రాసెసింగ్ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్‌కుమార్, హ్యాండ్లూమ్స్, టెక్టŠస్టైల్స్ కమిషనర్ ఎంఎం నాయక్, పరిశ్రమలశాఖ కమిషనర్ సీహెచ్ రాజేశ్వరరెడ్డి, ఉన్నతాధికారులు, పరిశ్రమలు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో శంకుస్థాపనలు, ప్రారంభించిన యూనిట్లు 1.ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ముత్తుకూరు మండలం దొరువులపాలెంలో రూ.250 కోట్లతో గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్ సంస్ధ ఆధ్వర్యంలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ ప్రారంభం. దీని ద్వారా 1,150 మందికి ఉద్యోగాలు. ఏటా 4.2 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి దీని సామర్ధ్యం. 2. రూ.144 కోట్లతో శ్రీవేంకటేశ్వర బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ పనులకు శంకుస్థాపన. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం కొమ్మూరు గ్రామం వద్ద ఏర్పాటయ్యే ఈ మొక్కజొన్న ఆధారిత పరిశ్రమ ద్వారా 310 మందికి ఉద్యోగావకాశాలు. ఏడాదికి 90 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. దీని ద్వారా వేలమంది రైతులకు ప్రయోజనం. 3. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ వద్ద రూ.13 కోట్లతో బ్లూఫిన్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీకి శంకుస్థాపన. దీనిద్వారా 45 మందికి ఉద్యోగావకాశాలు. 3,600 మెట్రిక్ టన్నుల గోధుమలు, 480 టన్నుల మిల్లెట్స్, 720 మెట్రిక్ టన్నుల పొటాటో ఉత్పత్తులు తయారు చేసే ఈ కంపెనీ ఏర్పాటుతో స్థానిక రైతులకు లబ్ధి. 4. కర్నూలు జిల్లా పత్తికొండ వద్ద టామాటో ప్రాసెసింగ్ యూనిట్ పనులకు శంకుస్థాపన. రూ.12 కోట్ల పెట్టుబడితో ఏటా 3,600 మెట్రిక్ టన్నుల టమాటా ఉత్పత్తుల తయారీ. ఈ ప్రాజెక్టును పత్తికొండ వెజిటబుల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్‌కు అప్పగించనున్న ప్రభుత్వం. వారి ద్వారా లీజు ప్రాతిపదికన మంచి సమర్థత కలిగిన కంపెనీకి అప్పగించేలా సహకారం. పత్తికొండలో రైతులకు భారీ ప్రయోజనం. టమాటా ధరల స్థిరీకరణకు దోహదం చేయనున్న పరిశ్రమ. 5. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం రేగ పంచాయతీ పెద్దిరెడ్లపాలెం వద్ద నువ్వుల ప్రాసెసింగ్ యూనిట్‌కు ప్రారంభోత్సవం. ప్లాంట్‌ను నెలకొల్పిన ఏపీఎఫ్‌పీఎస్. ఎల్.కోట జైకిసాన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్‌కు ప్లాంట్‌ను అప్పగించిన ప్రభుత్వం. నువ్వుల నూనె, చిక్కీ ఉత్పత్తుల తయారీ. రూ.2.5 కోట్ల పెట్టుబడితో 20 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 600 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కలిగిన ఈ యూనిట్‌తో స్థానిక రైతులకు ప్రయోజనం. పరిశ్రమల శాఖలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా 1. కర్నూలు జిల్లా ఓర్వకల్లు నోడ్ గొట్టిపాడు వద్ద సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా (ఏపీఐ) యూనిట్‌కు శంకుస్థాపన. రూ.280 కోట్ల పెట్టుబడితో 850 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 72 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. 2. కర్నూలు జిల్లా ఓర్వకల్ నోడ్ గొట్టిపాడు వద్ద న్యూట్రాస్యూటికల్స్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న ఆర్పీఎస్ ఇండస్ట్రీస్. పనులకు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన. రూ.90 కోట్ల పెట్టుబడితో 285 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 4,170 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. 3. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 18 జిల్లాల్లో 21 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు, ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లకు సీఎం ప్రారంభోత్సవాలు, మరికొన్ని చోట్ల పనులకు శంకుస్ధాపనలు. కాంప్లెక్స్ ద్వారా రూ.1,785 కోట్ల పెట్టుడులకు అవకాశం. తద్వారా 18,034 మందికి ఉద్యోగాలు. 4. కాకినాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రింటింగ్ క్లస్టర్లో కామన్ ఫెసిలిటీ సెంటర్లను ప్రారంభించిన సీఎం జగన్. ఈ సెంటర్లలో 1,000 మందికి ఉద్యోగాలు. -
ఎంటర్ప్రెన్యూర్లుగా రాణిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు
‘ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించడం అంటే మాటలా?’ అన్నది ఒకప్పటి మాట. మాటల మాంత్రికులైన యువ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు కలర్‌ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కలలు కంటున్నారు. ‘వ్యాపారం అంటే మాట్లాడినంత తేలిక కాదు’ అనే విమర్శను దాటి ఇన్ఫ్లూయెన్సర్లుగా తమ అనుభవాన్ని ఉపయోగించి ఎంటర్ప్రెన్యూర్లుగా గెలుపు జెండా ఎగరేస్తున్నారు. బ్రాండ్స్ ద్వారా గుర్తింపు పొందిన యంగ్ ఇన్ఫ్లూయెన్సర్లు ఆ తరువాత తామే ఒక బ్రాండ్‌గా మారుతున్నారు. మాసివ్ ఆన్లైన్ ఫాలోయింగ్‌తో ఎంటర్ప్రెన్యూర్లుగా మారుతున్నారు. ఫ్యాషన్, బ్యూటీ అండ్ లైఫ్‌స్టైల్ యూ ట్యూబర్ జ్యోతీ సేథీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అడుగులు వేస్తోంది. కొన్ని నెలల క్రితం ‘అభారి’ పేరుతో శారీ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. వివిధ ప్రాంతాలలో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసింది. తక్కువ సమయంలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా సక్సెస్ అయింది.‘సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం కంటే ముందు వివిధ ప్రాంతాలలో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయడం వల్ల కస్టమర్ల పల్స్ తెలుసుకోగలిగాను. వారి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ నాకు ఎంతో ఉపయోగపడింది’ అంటుంది జ్యోతి సేథీ. ముంబైకి చెందిన సంజయ్ ఖీర్ ఆరో తరగతిలోనే వంట చేయడం నేర్చుకున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్న సంజయ్ ఫుడ్‌కు సంబంధించి యూట్యూబ్ చానల్ ‘యువర్ ఫుడ్ ల్యాబ్’ ప్రారంభించాడు. 13 మిలియన్ల ఫాలోవర్లతో దూసుకు΄ోయాడు. మూడు నెలల క్రితం కిచెన్ అండ్ హోమ్ అప్లయెన్స్ బ్రాండ్ ‘వైఎఫ్ఎల్ హోమ్’ను స్టార్ట్ చేశాడు. ‘ఒక వీడియోను రూపొందించడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఒక బ్రాండ్‌ను నిర్మించడానికి మాత్రం నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఇది పెద్ద సవాలు. ఆ సవాలును ఓపికతో మాత్రమే స్వీకరించాలి. కంటెంట్ క్రియేటర్‌గా నాకు అడ్వాంటేజ్ ఉండొచ్చు. అయితే ప్రొడక్ట్ మాట్లాడాలి’ అంటున్నాడు సంజయ్ ఖీర్. ఇన్ఫ్లూయెన్సర్గా తనకు ఉన్న పది సంవత్సరాల అనుభవంతో రెండు సంవత్సరాల క్రితం ‘వియరీఫెడ్’ అనే బ్యూటీ బ్రాండ్‌ను స్టార్ట్ చేసి సక్సెస్ అయింది అనమ్ చష్మావాలా. తన స్కిన్ టోన్‌కు మ్యాచ్ అయ్యే లిప్‌స్టిక్ గురించి ఎంత వెదికినా ఎక్కడా కనిపించలేదు. ఈ నిరాశ నుంచే బ్రాండ్ ఆలోచన చేసింది. అయిదు సంవత్సరాల రీసెర్చ్ తరువాత తన బ్రాండ్‌ను పట్టాలకెక్కించింది. 26 సంవత్సరాల హిమాద్రి పటేల్ ఇన్ఫోసిస్‌లో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లూయెన్సర్గా మారింది. ఇన్ఫ్లూయెన్సర్గా సక్సెస్ అయిన తరువాత ఎత్నిక్ క్లాతింగ్ బ్రాండ్ ‘డ్రై బై హిమాద్రి’ స్టార్ట్ చేసింది. కంటెంట్ క్రియేటర్‌గా ప్రయాణం ప్రారంభించిన రణ్వీర్ అల్హబాదియా పాడ్‌కాస్ట్ షో ‘ది రణ్వీర్ షో’తో డిజిటల్ ప్రపంచంలో సుపరిచితుడయ్యాడు. కాలేజి ఫ్రెండ్ విరాజ్ సేథ్తో కలిసి ‘మాంక్ ఎంటర్టైన్మెంట్’ కంపెనీ ప్రారంభించి విజయం సాధించాడు. ఫ్యాషన్ సెన్స్, ఫన్–లవ్ కంటెంట్‌తో కంటెంట్ క్రియేటర్‌గా పేరు తెచ్చుకున్న దీక్షా ఖురానా ‘డీక్లాతింగ్’ పేరుతో క్లాతింగ్ బ్రాండ్‌ను స్టార్ట్ చేసి సక్సెస్ అయింది. ఇన్ఫ్లూయెన్సర్గా పేరు తెచ్చుకున్నవారికి ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలదొక్కుకోవడం అంత తేలిక కాదు.‘సక్సెస్ఫుల్ బ్రాండ్లను క్రియేట్ చేయడానికి మౌలిక సదుపాయాల కొరత ఇన్ఫ్లూయెన్సర్లకు అడ్డంకిగా ఉంది’ అంటున్నాడు ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘వన్ ఇంప్రెషన్’ సీయీవో అపాక్ష్ గుప్తా అంతమాత్రాన ‘ఇది మన స్పేస్ కాదు’ అనుకోవడం లేదు, అధైర్యపడడం లేదు యువ ఇన్ఫ్లూయెన్సర్లు. ఒక్కో అడుగు వేసుకుంటూ నడకలో వేగం పెంచుతున్నారు. ఎంటర్ప్రెన్యూర్లుగా విజయం సాధిస్తున్నారు. కలా నిజమా అనుకున్నాను నా బ్రాండ్‌కు ఆర్డర్లు మొదలై, పెరుగుతూ పోతున్న క్రమంలో ‘ఇది కలా నిజమా?’ అనుకున్నాను. ఈ విజయం నాకు బాగా ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘ఇంకా ఏం చేయవచ్చు’ అని రక రకాలుగా ఆలోచించేలా చేసింది. ఇన్ఫ్లూయెన్సర్తో పోల్చితే ఎంటర్‌ప్రెన్యూర్‌గా బాగా కష్టపడాలి. – అనమ్ చష్మవాలా, బ్యూటీ బ్రాండ్ ‘వియరీఫెడ్’ ఫౌండర్ ఆ కష్టమే ఇక్కడ కూడా... వ్యాపారరంగంలోకి అడుగు పెట్టాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అయితే ముందుగా ఇన్ఫ్లూయెన్సర్, కంటెంట్ క్రియేటర్‌గా నాకంటూ పేరు తెచ్చుకోవాలనుకున్నాను. ఆ తరువాత వ్యాపారం వైపు అడుగులు వేశాను. యూట్యూబ్ ద్వారా ఒక కంపెనీ ఎలా మొదలు పెట్టాలి? జీఎస్టీ నంబర్ అంటే ఏమిటి... మొదలైన విషయాలను తెలుసుకున్నాను. మొదట్లో కొన్ని పొరపాట్లు జరిగాయి. అయితే వాటి నుంచి విలువైన విషయాలు నేర్చుకున్నాను. ఇన్ఫ్లూయెన్సర్గా పేరు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. అలాంటి కష్టమే వ్యాపారంలో పెడితే విజయం సాధిస్తాను అని నమ్మాను. ప్రజల నమ్మకాన్ని చూరగొనడం అనేది అది పెద్ద విజయం. – జ్యోతి సేథీ, క్లాత్ బ్రాండ్ ‘అభారీ’ ఫౌండర్ ట్రెండ్ సెట్ చేయాలి ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్‌కు సంబంధించి సుపరిచిత బ్రాండ్లతో కలిసి పనిచేయడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోగలిగాను. ఆ తరువాత సొంతంగా ‘డీక్లాతింగ్’ క్లాతింగ్ బ్రాండ్‌ను స్టార్ట్ చేశాను. బ్రాండ్ స్టార్ట్ చేయడానికి ముందు ‘నా బ్రాండ్ ట్రెండ్ సెట్ చేయాలి’ అనుకున్నాను. అందరిలో ఒకరిగా కాకుండా మనదైన ప్రత్యేకతను సృష్టించుకున్నప్పుడు మాత్రమే మార్కెట్లో నిలదొక్కుకోగలం. – దీక్షా ఖురానా, క్లాతింగ్ బ్రాండ్ ‘డీక్లాతింగ్’ ఫౌండర్ -
లక్ష్యంతో సాగితే విజయం తథ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రతి వ్యక్తీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడితే విజయం తప్పకుండా వరిస్తుందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అని వివరించారు. కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సింగిల్ విండో ఎన్నికల్లో నిరుత్సాహపడినా ఆ తర్వాత పట్టుదలతో కష్టపడ్డారన్నారు. తెలంగాణ లక్ష్యసాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారని.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పారు. గురువారం ఓ హోటల్లో ఎస్టీ ఆంట్రప్రెన్యూర్స్ సక్సెస్ మీట్లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన యువత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కలలు కనాలని, అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. గిరిజన పారిశ్రామికవేత్తలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలతో గిరిజన యువత అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని పేర్కొన్నారు. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం అత్యంత కీలకమని చెప్పారు. ఆంట్రప్రెన్యూర్స్‌గా ఎదిగిన గిరిజన యువత భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గతంలో జరిగిన ఆసక్తికరమైన ఘటనను తెలియజేశారు. గతంలో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు షాపూర్జీ–పల్లోంజీ గ్రూప్‌కు చెందిన దివంగత బిజినెస్ టైకూన్ సైరస్ మిస్త్రీ వచ్చారని చెప్పారు. అప్పుడు తన తండ్రి షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో సబ్‌కాంట్రాక్టర్‌గా పనిచేసినట్లు కేసీఆర్ గుర్తుచేసుకోగా మిస్త్రీ ఆశ్చర్యపోయారని కేటీఆర్ పేర్కొన్నారు. సైరస్ మిస్త్రీ ఇంటికి వెళ్లిన తర్వాత రికార్డులు తిరగేసి ఫోన్ చేశారని, 1950–60 మధ్య కాలంలో పనిచేసినట్లు వివరించారన్నారు. ఎన్నికల్లో గెలిచేది మళ్లీ మేమే.. త్వరలో ఎస్టీ ఆంట్రప్రెన్యూర్స్ కోసం ఉత్పత్తుల పార్కు పెడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలో ముగ్గురు దళితబంధు లబ్ధిదారులు రైస్‌మిల్లు పెట్టుకున్నారని చెప్పారు. అదేవిధంగా వాటర్ వర్క్స్ విభాగానికి దళితబంధు పథకం కింద 150 వాహనాలు పంపిణీ చేశామన్నారు. వచ్చే నెల 3న మరోసారి బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని, అప్పుడు మళ్లీ సక్సెస్ మీట్ జరుపుకుందామని చెప్పారు. సీఎం వల్లే ఎస్టీల ఎదుగుదల: సత్యవతి రాథోడ్ రాష్ట్రంలో గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని, సీఎం కేసీఆర్ విజన్ వల్లే ఇది సాధ్యమైందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. గతంలో అనేక పార్టీలు, ప్రభుత్వాలను చూశామని, కానీ గిరిజనులను ఎవరూ పట్టించుకోలేదన్నారు. గిరిజనులు చదువు తర్వాత ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగ అవ కాశా లు కల్పించే స్థాయికి ఎదిగారని, గిరిజనులపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ ఉందన్నారు. బీఆర్ఎస్ పాలన లోనే గిరిజన రిజర్వేషన్ పెంచుకోవడంతోపాటు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎస్టీలకు మరిన్ని అవకాశాలు కల్పించామని, గిరిపుత్రులకు పోడు పట్టాలు అందించామని గుర్తుచేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని, ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే మనం నష్టపోతామని వ్యాఖ్యానించారు. -
విశాఖలోనూ విద్యుత్ నియంత్రణ మండలి
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు పడుతోంది. అక్కడి ప్రజలకు, పారిశ్రామిక, వ్యాపార వేత్తలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) త్వరలో అందుబాటులోకి వస్తోంది. కొన్ని విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు, కేసులను విశాఖ నుంచే ఏపీ ఈఆర్సీ పరిష్కరించనుంది. గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకూ ఉన్న వినియోగదారులకు హైదరాబాద్‌కు, భవిష్యత్‌లో కర్నూలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విశాఖలోనూ కార్యకలాపాలు మొదలుపెడుతోంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ కేంద్రంగా 1999 మార్చిలో ఏపీ ఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే.. విద్యుత్ నియంత్రణ మండలి మాత్రం హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ వస్తోంది. ప్రస్తుతం అనేక కేసుల్లో వాయిదాలకు హాజరయ్యేందుకు విద్యుత్ సంస్థల అధికారులు, ముఖ్యంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు తరచూ హైదరాబాద్‌లోని ఏపీ ఈఆర్సీ ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. కనీసం రెండు, మూడు రోజులు ఏపీ ఈఆర్సీ అధికారులు రాష్ట్రంలో అందుబాటులో ఉండటం లేదు. 24 గంటలూ పనిచేయాల్సిన అత్యవసర విభాగాల్లో విద్యుత్ శాఖ ప్రధానమైనది కావడంతో ప్రజలకు కూడా దీనివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇకపై ఈ పరిస్థితిలో చాలా వరకూ మార్పు రానుంది. కర్నూలులో ఏపీ ఈఆర్సీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే విధులు నిర్వర్తించాలని ఈ ఏడాది ఏప్రిల్ 25న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు అక్కడ భవన నిర్మాణం జరుగుతోంది. షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల కొన్నేళ్లుగా వార్షిక టారిఫ్ ఆర్డర్ (విద్యుత్ చార్జీల సవరణ)పై ప్రజాభిప్రాయ సేకరణ, ఆర్డర్ విడుదల వంటి కార్యకలాపాలను మాత్రమే విశాఖపట్నం నుంచి నియంత్రణ మండలి నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు 18న ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఆవరణలో ఏపీ ఈఆర్సీ క్యాంపు కార్యాలయం ప్రారంభమైంది. ఆ మరుసటి రోజే రాష్ట్ర విద్యుత్ సంస్థలు తయారు చేసిన ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ప్లాన్‌పై ఏపీ ఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టింది. ఎప్పుడూ హైదరాబాద్‌లోని కమిషన్ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ విచారణ విశాఖలో కొత్తగా ప్రారంభించిన క్యాంపు కార్యాలయంలో జరిగింది. అయితే.. ఇది ఏపీ ట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థలు ఇచ్చిన నివేదికలపై జరిగిన విచారణ. ఇదే కాకుండా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు వేసిన పిటిషన్లపై కూడా కమిషన్ విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. నవంబర్ 4న క్యాంపు కార్యాలయంలో ఒకేరోజు 9 పిటిషన్లపై బహిరంగ విచారణ చేపట్టనుంది. షెడ్యూల్ నోటిఫికేషన్‌ను ఏపీఈఆర్సీ తాజాగా విడుదల చేసింది. -
AP: సాగర తీరంలో ఐటీ వెలుగులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఐటీ సేవల హబ్‌గా మారేందుకు విశాఖపట్నానికి అన్ని అవకాశాలు, సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖలో ఇన్ఫోసిస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. టైర్ 1 సిటీగా విశాఖ రూపాంతరం చెందేందుకు ఇన్ఫోసిస్ రాక దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు 20 వేల మంది నేవీ ఉద్యోగులతో తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా కూడా నిలిచిందని గుర్తు చేశారు. ఇక్కడ ఇప్పటికే రెండు పోర్టులున్నాయని త్వరలోనే మూడో పోర్టు సమీపంలోని శ్రీకాకుళంలో రానుందని తెలిపారు. మరో రెండేళ్లల్లో పూర్తిస్థాయి అంతర్జాతీయ పౌర విమానాశ్రయం కూడా సిద్ధం కానుందని చెప్పారు. పరిశ్రమలకు ఏ సహాయం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటామని పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. సోమవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన సందర్భంగా విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. ఫార్మా కంపెనీల నాలుగు యూనిట్లకు ప్రారంభోత్సవాలు, రెండు యూనిట్లకు శంకుస్థాపనలు నిర్వహించారు. మొత్తం రూ.1,646 కోట్ల విలువైన ఐటీ కార్యాలయాలు, ఫార్మా యూనిట్ల ఏర్పాటుతో 3,450 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. విశాఖలో సముద్ర తీరం శుభ్రత కోసం జీవీఎంసీ సిద్ధం చేసిన ఆరు బీచ్ క్లీనింగ్ యంత్రాలను కూడా ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో సీఎం జగన్ ఏమన్నారంటే.. విశాఖకు విశేష సామర్థ్యం.. విశాఖ నగరానికి విశేషమైన సామర్ధ్యం ఉంది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తరహాలో విశాఖపట్నం కూడా ఐటీ హబ్‌గా మారబోతోంది. ఆ స్ధాయిలో ఈ నగరానికి సహకారాన్ని అందిస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తరహా మెట్రో నగరం ఆంధ్రప్రదేశ్‌లో లేదు. ఐటీ, ఐటీ సేవలకు సంబంధించిన పరిశ్రమలు గతంలో విశాఖలో ఏర్పాటు కాలేదు. వాస్తవానికి ఆ కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం నగరానికి ఉన్నప్పటికీ అవన్నీ అప్పటి రాజధాని హైదరాబాద్‌లోనే ఏర్పాటయ్యాయి. ఏపీలో విశాఖ అతిపెద్ద నగరం. టైర్ 1 సిటీగా ఎదగడానికి కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం ఈ నగరానికి ఉన్నాయి. ప్రథమశ్రేణి నగరంగా ఎదగడానికి అవసరమైన తోడ్పాటును ఇన్ఫోసిస్ అందించగలదని నేను బలంగా నమ్ముతున్నా. దాదాపు 3.28 లక్షల మంది ఉద్యోగులు, 18.5 బిలియన్ డాలర్ల రెవెన్యూ సామర్ధ్యం కలిగిన ఇన్ఫోసిస్‌తో పాటు టీసీఎస్, విప్రో లాంటి సంస్ధలు నగర ఐటీ స్వరూపాన్ని, ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి వేస్తాయి. విశాఖకు ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది. రానున్న రోజుల్లో మిగిలిన ఐటీ కంపెనీలు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి. విశాఖలో ఆదానీ డేటాసెంటర్ కూడా రాబోతుంది. సబ్‌మెరైన్ ఇంటర్నెట్ కేబుల్ మనకు ప్రత్యేకంగా సింగపూర్ నుంచి వస్తుంది. రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ రానుంది. క్లౌడింగ్‌తో పాటు ఐటీ రంగంలో చాలా మార్పులు రానున్నాయి. ఇవన్నీ సాకారం కానున్నాయి. నీలాంజన్, నీలాద్రిప్రసాద్, సురేష్, రఘు లాంటి ఐటీ నిపుణులతో మాట్లాడిన తర్వాత వీరంతా విశాఖ ఐటీలో కచ్చితంగా ఒకరోజు అద్భుతాలు సృష్టిస్తారని బలంగా విశ్వసిస్తున్నా. నాకు ఆ నమ్మకం ఉంది. ఇవాళ 1,000 మందితో ఇక్కడ ప్రారంభమైన ఇన్ఫోసిస్ రానున్న రోజుల్లో మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ఇన్ఫోసిస్‌తో కలసి ఐటీ రంగంలో విశాఖ బహుముఖ ప్రగతిని సాధిస్తుందన్న విశ్వాసం నాకుంది. రానున్న రోజుల్లో విశాఖలో పెట్టుబడులకు అనేక మంది ముందుకొచ్చే అవకాశాలున్నాయి. అందుకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్ విశాఖలో ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు ఏర్పాటయ్యాయి. 14 ఇంజనీరింగ్ కాలేజీలు, 8 యూనివర్సిటీలు, 4 మెడికల్ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీలతో విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా ఉంది. ఇక్కడి నుంచి ఏటా దాదాపు 12 వేల నుంచి 15 వేల మంది ఇంజనీర్లు డిగ్రీ పూర్తి చేసుకుని వస్తున్నారు. వీటితో పాటు ఐఐఎం, నేషనల్ లా యూనివర్సిటీ లాంటి అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు కూడా విశాఖలో ఉన్నాయి. ఇదీ విశాఖ సామర్ధ్యం. ఇక్కడే ఐవోసీతోపాటు తూర్పు నౌకా దళం ప్రధాన కేంద్రం కూడా ఉంది. విశాఖ, గంగవరం లాంటి రెండు బలమైన పోర్టులు కూడా ఉన్నాయి. వీటితో పాటు శ్రీకాకుళంలో మూడో పోర్టు వస్తోంది. మధురవాడ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్ గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ తొలుత మధురవాడ ఐటీ హిల్స్‌లో రూ.35 కోట్లతో ఏర్పాటైన ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్‌ని ప్రారంభించారు. సంస్థ ప్రాంగణమంతా పరిశీలించారు. అనంతరం గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సముద్రతీర ప్రాంత శుభ్రత కోసం రూ.15 కోట్లతో ఏర్పాటు చేసిన 6 బీచ్ క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించారు. క్లీనింగ్ యంత్రాలపైకి ఎక్కి అవి ఎలా పనిచేస్తాయన్న వివరాలను ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆ తరువాత పరవాడ చేరుకుని రూ.500 కోట్లతో ఫార్మాసిటీలో 19.34 ఎకరాల్లో ఏర్పాటైన అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ యూజియా స్టెరిలైజ్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ ఏటా 420 మిలియన్ సామర్థ్యం కలిగిన జనరల్ ఇంజెక్టబుల్స్‌ను తయారు చేయనుంది. అనంతరం అచ్యుతాపురంలో లారస్ సంస్థ రూ.440 కోట్లతో నిర్మించిన ఫార్ములేషన్ బ్లాక్‌ను, రూ.191 కోట్లతో ఏర్పాటైన యూనిట్–2ను సీఎం ప్రారంభించారు. లారస్ రూ.240 కోట్లతో 450 మందికి ఉపాధి కల్పించేలా నిర్మించనున్న యూనిట్–3తో పాటు మరో రూ.240 కోట్లతో ఇదే సంస్థ పరవాడ వద్ద నిర్మించనున్న యూనిట్–7కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఫార్మా ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా పరిపాలన రాజధానిగా శరవేగంగా ముస్తాబవుతున్న విశాఖకు అక్టోబర్‌కే తరలి వెళ్లాల్సి ఉన్నా కార్యాలయాలు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడం, విస్తృత భద్రతా కారణాల దృష్ట్యా అధికారుల సూచనల మేరకు డిసెంబర్లో వెళ్లే అవకాశం ఉందని సీఎం సమావేశంలో చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్, వైస్ ప్రెసిడెంట్ నీలాద్రి ప్రసాద్ మిశ్రా, లారస్ సీఈవో సత్యనారాయణతో పాటు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, విడదల రజని, మేయర్ హరివెంకటకుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా.సత్యవతి, గొడ్డేటి మాధవి, ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, కలెక్టర్ డా.మల్లికార్జున, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 40 శాతం మహిళా ఉద్యోగులే 1981లో ఏర్పాటైన ఇన్ఫోసిస్ భవిష్యత్తు డిజిటల్ సేవలు, కన్సల్టింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉంది. 56 దేశాలలో 274 చోట్ల సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డీలర్స్ ఆటోమేటెడ్ కొటేషన్స్ (నాస్డాక్) జాబితాలో భారత తొలి ఐటీ కంపెనీగా ఇన్ఫోసిస్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 71.01 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇన్ఫోసిస్‌లో ప్రపంచవ్యాప్తంగా 3,50,000 మంది ఉద్యోగులు పని చేస్తుండగా వీరిలో 40 శాతం మంది మహిళా ఉద్యోగులే కావడం గమనార్హం. 2023లో ప్రపంచంలో అత్యంత నైతికత (ఎథికల్) సంస్థలలో ఒకటిగా ఇన్ఫోసిస్ గుర్తింపు పొందింది. టైమ్ మ్యాగజైన్ టాప్ 100 ప్రపంచ అత్యుత్తమ సంస్థలు 2023 జాబితాలో ఉన్న ఏకైక భారతీయ సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది. గ్లోబల్ టాప్ ఎంప్లాయర్ 2023 సర్టిఫికేషన్‌ను సొంతం చేసుకుంది. అలల ప్రేరణతో కార్యాలయం టాలెంట్ స్ట్రాటజీలో భాగంగా ప్రతిభా కేంద్రాలకు దగ్గరగా డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్ నిర్దేశించుకుంది. మంగళూరు, మైసూర్, త్రివేండ్రం, నాగ్‌పూర్, ఇండోర్, జైపూర్, హుబ్లీ, చండీగఢ్, భువనేశ్వర్, కోయంబత్తూర్ లాంటి టైర్ 2 నగరాల్లో డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తాజాగా విశాఖలో సేవలను ప్రారంభించింది. మధురవాడలోని ఐటీ హిల్ నం.2లో ఉన్న సిగ్నిటివ్ టవర్స్‌లో లీజుకు తీసుకున్న బిల్డ్ అప్ స్థలంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. విశాఖకు సహజ అందాలను తీసుకొచ్చిన సముద్రపు అలల ప్రేరణతో కార్యాలయంలోని ఇంటీరియర్ డిజైన్ రూపొందించారు. జావా, జే2ఈఈ, శాప్, డేటాసైన్స్, డేటా అనలటిక్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ – యుటిలిటీ, రిటైల్ సహా బహుళ పరిశ్రమలకు ప్రపంచవ్యాప్తంగా క్లెయింట్స్ సేవలను ఈ కేంద్రం నుంచి అందిస్తారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులలో సింహభాగం విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. కాగా మరింత మంది నియామకం కోసం విశాఖలోని వివిధ కళాశాలలతో ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ రాక విశాఖలో ఐటీ పరిశ్రమ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఉన్న బీపీవో/కేపీవో పరిశ్రమలతో పాటు కోర్ ఐటీ కంపెనీలతో కలసి ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్‌గా విశాఖ అడుగులు వేసేందుకు దోహదం చేయనుంది. -
మరిన్ని పెట్టుబడుల కోసం విదేశాలకు..
సాక్షి, అమరావతి: మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో కూడిన బృందం ఈనెల 15 నుంచి 25 వరకు దక్షిణ కొరియా, వియత్నాం దేశాల్లో పర్యటించనుంది. అక్కడ ప్రముఖ సంస్థలను సందర్శించి.. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించనుంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, స్కిల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి వినోద్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటారు. మంత్రి బుగ్గన ఈ నెల 10న ఢిల్లీలో దక్షిణ కొరియా, వియత్నాం రాయబారులతో సమావేశమై పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు. దీనికి కొనసాగింపుగా ఏపీ బృందం కొరియాలోని కియా పరిశ్రమను సందర్శించి ఏపీలోని యూనిట్‌ను మ రింతగా విస్తరించడానికి గల అవకాశాలను వివరిస్తా రు. శామ్సంగ్, దేసాంగ్ కార్పొరేషన్లతో పాటు కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ అండ్ ఫిష రీస్ టెక్నాలజీలను ఈ బృందం సందర్శించనుంది. విశాఖలో జరిగిన జీఐఎస్‌లో వియత్నాం ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. దీనికి కొనసాగింపుగా తాజా పర్యటనలో ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సమావేశమవ్వనున్నారు. వియత్నాంలోని సౌత్ ఎకనామిక్ జోన్‌ను సందర్శించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి వినోద్‌కుమార్ మాట్లాడుతూ..పరిశ్రమలు, టెక్స్టై ల్స్, ఆక్వా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అక్కడ పాటిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పరిశీలించనున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. -
చలికాలం ఈ భార్యాభర్తలను రూ. కోట్ల వ్యాపారవేత్తలను చేసింది
చండీఘర్‌కు చెందిన మోహిత్ అహ్లువాలియా, జగజ్యోత్ కౌర్ భార్యాభర్తలు. 2017 శీతాకాలంలో బాలికి విహారయాత్ర కోసం వెళ్లారు. ఈ వెకేషన్ వీరికి అద్భుతమైన జ్ఞాపకాలను అందించడమే కాకుండా కొత్త ఆలోచనను రేకెత్తించింది. నూతన ఆశ, ఆశయాలతో ఇంటికి వెళ్లిన ఆ దంపతులు తమ ఉద్యోగాలను వదిలిపెట్టి సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. మోహిత్ అహ్లువాలియా సేల్స్ ప్రొఫెషనల్‌గా, జగజ్యోత్ కౌర్ హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేసేవారు. ఈ చండీగఢ్ జంట 2019లో ‘రామే’ (raamae) అనే పేరుతో గృహపయోగ, జీవనశైలి వస్తువుల వ్యాపార సంస్థను స్థాపించారు. ఇది శిక్షణ పొందిన కళాకారులు తయారు చేసిన హ్యాండ్-బ్లాక్ ప్రింటెడ్ వస్తువులైన కుషన్ కవర్లు, టోట్ బ్యాగ్‌లు, క్విల్ట్‌లు, పర్సులను విక్రయిస్తుంది. రామే అనేది బాలినీస్ పదం. బాలినీస్ ప్రజల జీవన విధానాన్ని ఇది సూచిస్తుంది. రద్దీ, అస్తవ్యస్తమైన ప్రపంచంలో నివసిస్తున్నప్పటికీ ఆనందాన్ని పొందడం దీని అర్థం. బాలి పర్యటనతో మలుపు ‘కొన్ని సంవత్సరాల క్రితం నేను చేసిన బాలి పర్యటన నా జీవితానికి మలుపు. అక్కడ స్థానికులు చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న ఆదరణను గమనించాను. భారత్‌లోనూ హస్తకళా ఉత్పత్తులు అనేకం ఉన్నాయి. అయితే విదేశాల్లో హస్తకళా ఉత్పత్తులకు ఉన్నంత ఆదరణ భారత్‌లో ఎందుకు ఉండటం లేదో ఆశ్చర్యంగా ఉంది’ అని జగజ్యోత్ కౌర్ ‘షి ద పీపుల్’ అనే ఆన్లైన్ మ్యాగజైన్‌తో పేర్కొన్నారు. బ్లాక్ ప్రింటింగ్‌తో రూపొందించిన భారతీయ వస్త్రాలకు ఎంతటి ఆదరణ ఉందో బాలిలోని వీధుల్లో తిరుగుతున్నప్పుడు తెలుసుకున్నట్లు మోహిత్ ‘ది బెటర్ ఇండియా’తో చెప్పారు. డబ్బు పరంగానే కాకుండా కస్టమర్ల గౌరవం కూడా వాటికి అదే స్థాయిలో ఉందన్నారు. బాలిలో వాటికి గణనీయమైన డిమాండ్ ఉన్నప్పటికీ, ఆ ఉత్పత్తులకు భారత్‌లో ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ జంట చేతివృత్తుల జీవనోపాధికి మద్దతు ఇవ్వాలని, బ్లాక్ ప్రింటింగ్‌ను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. పదేళ్లకు పైగా ఉన్న తమ కార్పొరేట్ కెరీర్‌ను విడిచిపెట్టారు. 2018లో జైపూర్ వెళ్లి స్థానిక కళాకారుల వద్ద బ్లాక్ ప్రింటింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. తర్వాత 2019లో రామే సంస్థను స్థాపించారు. ప్రస్తుతం వారు క్విల్ట్‌లు, పర్సులు, పర్సులు, పిల్లో కవర్లతో సహా 60 విభిన్న ఉత్పత్తులను దేశ విదేశాల్లో విక్రయిస్తున్నారు. రూ. 4 లక్షలతో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు ప్రతి నెలా రూ.18 లక్షలు, ఏటా రూ. 2.16 కోట్ల మేర వ్యాపారం సాగిస్తోంది. రాజస్థాన్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, మైసూర్, గోవా, కేరళ, ఇంఫాల్, అస్సాం, మిజోరాం ప్రాంతాల నుంచి వీరికి ఆర్డర్లు వస్తున్నాయి. యూఏఈ, అమెరికా వంటి దేశాల నుంచి కూడా వీరికి కస్టమర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Raamaé - Home Baby Lifestyle (@raamae_life) -
రియల్టీ కింగ్.. డీఎల్ఎఫ్ సింగ్.. లిస్ట్‌లో తెలుగువారు!
న్యూఢిల్లీ: దేశీ రియల్ ఎస్టేట్ రంగంలో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రూ. 59,030 కోట్ల సంపదతో మరోసారి నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. 2023కి గాను దేశీ రియల్టీ కుబేరులతో కిచెన్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ సంస్థ గ్రోహె, రీసెర్చ్ సంస్థ హురున్ ఇండియా సంయుక్తంగా ఈ లిస్టును రూపొందించింది. 16 నగరాలకు చెందిన 67 కంపెనీలకు సంబంధించి 100 మంది సంపన్నులకు ర్యాంకింగ్ ఇచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 10 మంది చోటు దక్కించుకున్నారు. జీఏఆర్ కార్పొరేషన్ వ్యవస్థాపక చైర్మన్ జీ అమరేందర్ రెడ్డి కుటుంబం (రూ. 15,000 కోట్లు) పదో స్థానంలో నిల్చింది. మంగళవారం విడుదల చేసిన సంపన్నుల జాబితా ప్రకారం.. రూ. 42,270 కోట్ల సంపదతో మంగళ్ ప్రభాత్ లోధా కుటుంబం (మాక్రోటెక్ డెవలపర్స్ – లోధా గ్రూప్) రెండో స్థానంలో, రూ. 37,000 కోట్ల సంపదతో ఆర్ఎంజెడ్ కార్ప్ అర్జున్ మెండా కుటుంబం మూడో స్థానంలో ఉన్నాయి. ఈసారి లిస్టులో 25 మందికి కొత్తగా చోటు దక్కగా, 36 మంది సంపద తగ్గింది. ఇతర వివరాలు.. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 37 మంది రియల్టీ కుబేరులు ఉన్నారు. ఢిల్లీ (23), కర్ణాటక (18) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో 9 మంది, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరు ఉన్నారు. నగరాలవారీగా చూస్తే ముంబై (29 మంది), న్యూఢిల్లీ (23), బెంగళూరు (18) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. టాప్ 10లో చోటు దక్కించుకునేందుకు కనీస సంపద 2017లో రూ. 3,350 కోట్లుగా ఉండగా ప్రస్తుతం రూ. 15,000 కోట్లకు ఎగిసింది. అలాగే టాప్ 50లో చోటు దక్కించుకునేందుకు కనీస సంపద రూ. 660 కోట్ల నుంచి రూ. 1,330 కోట్లకు చేరింది. టాప్ 100 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తల మొత్తం సంపద గతేడాదితో పోలిస్తే 4% పెరిగి రూ. 4,72,330 కోట్లుగా (57 బిలియన్ డాలర్లు) ఉంది. ఇందులో టాప్ 10 కుబేరుల వాటా 60%గా ఉంది. డీఎల్ఎఫ్కు చెందిన పియా సింగ్, రేణుకా తల్వార్ అత్యంత సంపన్న మహిళలుగా ఉన్నారు. ఇదీ చదవండి: Income Tax Return: అందుబాటులోకి ఐటీఆర్ 1, 4 ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా.. -
రూట్స్ : సేవే శక్తి!
ఉత్సాహం నుంచి శక్తి జనిస్తుంది. మరి ఆ ఉత్సాహం ఎలా వస్తుంది? ఎవరి మాట ఎలా ఉన్నా... విట, జలజ్ దాని దంపతులకు మాత్రం ఆ ఉత్సాహం స్వచ్ఛంద సేవాకార్యక్రమాల ద్వారా వస్తుంది. పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన ఈ దంపతులు తన ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఒక మంచి పని చేసి చూడండి. అందులో నుంచి వచ్చే శక్తి ఏమిటో మీకే తెలుస్తుంది’ అంటున్నారు... ముందుకు వెళ్లడం మంచిదేగానీ వెనక్కి తిరిగి చూసుకోవడం కూడా మంచిదే. విటల్, జలజ్ దాని దంపతులు అదే చేశారు. వారి తాత స్వçస్థలం గుజరాత్‌లోని చారిత్రక పట్టణం కపడ్ వంజ్. ఆయన రకరకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఒకసారి ఆయన సేవాకార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. ఆ స్ఫూర్తితో ఎనభై సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ‘కపడ్వంజ్ కెలవాణి మండల్’ (కెకెఎం) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఈ సంస్థ పరిధిలో పదమూడు విద్యాసంస్థలు ఉన్నాయి. ‘కెకెఎం’తో కలిసి పనిచేయడం విట, జలజ్ దంపతులలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. కొన్ని సంవత్సరాల తరువాత... తమ సేవాకార్యక్రమాలను విస్తృతం చేయడం కోసం ‘దాని ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ‘కెకెఎం’తో పాటు అన్నమిత్ర ట్రస్ట్, ఈఎల్ఎంఎస్ స్పోర్ట్స్ ఫౌండేషన్... మొదలైన సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ‘అన్నమిత్ర’తో కలిసి దేశంలోని 6,500 పాఠశాలలో పిల్లల కోసం మ«ధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ‘బాలకార్మిక వ్యవస్థ పోవాలంటే ముందు పిల్లలకు కడుపు నిండా తిండి దొరకాలి. ఆ భోజనమే వారిని విద్యకు దగ్గర చేస్తుంది. అభివృద్థిపథంలోకి నడిపిస్తుంది’ అంటుంది విట. ‘ప్రథమ్’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి అట్టడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే కార్యక్రమాలలో పాలుపంచుకుంటుంది దాని ఫౌండేషన్. సేవా కార్యక్రమాలే కాకుండా తమ కుమారుడు, ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ముదిత్ కోరిక మేరకు ఆటలపై కూడా దృష్టి సారించారు. ఈఎల్ఎంఎస్ స్పోర్ట్స్ ఫౌండేషన్‌తో కలిసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి క్రీడా నైపుణ్యాలు మెరుగుపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ఆటలకు ప్రాచుర్యాన్ని తీసుకువస్తున్నారు. పాఠశాలలో క్రీడాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రొఫెషనల్ లెవెల్లో పిల్లలను క్రీడల్లో తీర్చిదిద్దడానికి హై–పెర్ఫార్మెన్స్ ప్లాన్స్, హై–పెర్ఫార్మెన్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్‌కు రూపకల్పన చేశారు. గతంతో పోల్చితే విద్యార్థులు ఆటలపై ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఇదొక శుభపరిణామంగా చెప్పుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా అంటుంది విట... ‘ఆటలో ఉత్సాహం ఉంటుంది. వినోదం ఉంటుంది. గెలుపు కోసం చేసే పథక రచన ఉంటుంది. లైఫ్ స్కిల్స్‌ను పిల్లలు ఆటల్లో నుంచే నేర్చుకోవడం మొదలు పెడతారు. మన దేశంలో కోట్ల జనాభా ఉంది. ఇలాంటి దేశంలో మనం ఛాంపియన్లను తయారు చేయలేమా!’ ‘క్రీడలపై వారి అనురక్తి, అంకితభావాన్ని దగ్గరి నుంచే చూసే అవకాశం వచ్చింది. క్రీడారంగంపై వారు చేపడుతున్న కార్యక్రమాల ప్రభావం తప్పకుండా ఉంటుంది’ అంటున్నాడు ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత అభినవ్ బింద్రా. గతకాలం మాట ఎలా ఉన్నా విట ప్రస్తుతం తమ ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువ సమయం గడుపుతుంది. ‘ఆడ్వర్బ్ టెక్నాలజీ ప్రైవెట్ లిమిటెడ్’ చైర్మన్ జలజ్ కంపెనీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమాలకు తగిన సమయం కేటాయిస్తుంటాడు. విట దృష్టిలో స్వచ్ఛంద సేవ అంటే చెక్ మీద సంతకం చేయడం కాదు. యాంత్రికంగా చేసే పని కాదు. మనసుతో చేసే మంచిపని. ప్రజలతో కలిసి పోయి చేసే ఉత్తేజకరమైన పని. ‘ఆటలో ఉత్సాహం ఉంటుంది. వినోదం ఉంటుంది. గెలుపు కోసం చేసే పథక రచన ఉంటుంది. లైఫ్ స్కిల్స్‌ను పిల్లలు ఆటల్లో నుంచే నేర్చుకోవడం మొదలు పెడతారు. – విట, దాని ఫౌండేషన్ -
Vijaya Gupta K: విశ్రాంత జీవితమూ విలువైనదే!
ఆమె రోజుకు ఆరు గంటలు పని చేస్తారు. ఇందులో ప్రత్యేకత ఏముంటుంది? నిజమే. ఆమె వయసు డెబ్బయ్. ఇదీ ఆమె ప్రత్యేకత. తన కోసమే కాదు... సమాజానికీ పనిచేస్తారు. ‘సృజనాత్మకత మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇష్టమైన పని దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజూ విలువైనదే... సద్వినియోగం చేసుకోవాలి’ అంటూన్న విజయాగుప్తా పరిచయం. ఇది స్క్రీన్ ఎరా. టీవీ స్క్రీన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్ ఫోన్. ఇరవై నాలుగ్గంటల్లో పద్నాలుగు గంటలు స్క్రీన్‌తోనే గడిపేస్తున్నారు. స్క్రీన్ మీద పని చేయాల్సిన ఉద్యోగులకు తప్పదు. మరి ఖాళీగా ఉంటూ సమయం ఎలా గడపాలో తెలియక స్క్రీన్‌కి అంకితమయ్యే వాళ్లు మాత్రం తప్పనిసరిగా తమ ఇరవై నాలుగ్గంటలనూ ఒకసారి విశ్లేషించుకోవాలని చెబుతున్నారు హైదరాబాద్, హిమాయత్ నగర్‌కు చెందిన విజయాగుప్తా కోట్రికె. తనకిష్టమైన వ్యాపకం కోసం ఇంట్లో ఒక గదిని వర్క్ స్టేషన్‌గా మార్చుకున్నారామె. ఎనిమిదేళ్ల వయసులో గ్రీటింగ్ కార్డు తయారు చేసిన సృజనాత్మకమైన ఆమె విజయ ప్రస్థానం ఇది. జీవితం ఇచ్చిన గిఫ్ట్ ‘‘మా నాన్న ఉద్యోగ రీత్యా నేను పుట్టినప్పుడు చెన్నైలో ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్‌కి బదిలీ. ముగ్గురు అక్కలు, ముగ్గురు అన్నలతో మొత్తం ఏడుగురం. ఇంట్లో ఎవరూ ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండేవారు కాదు. పెళ్లి పత్రికల వెనుక ఖాళీ పేజీ మీద బొమ్మలు గీసి, పత్రిక మీద ఉండే కొన్ని బొమ్మలను కత్తిరించి అతికించి సొంతంగా గ్రీటింగ్ కార్డు తయారు చేశాను. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలతో విరామం వచ్చింది. పిల్లలు పెద్దయ్యి, నాక్కొంత విరామం వచ్చేటప్పటికి యాభై ఏళ్లు నిండాయి. అప్పుడు అనుకోకుండా ఒక వరలక్ష్మీవ్రతంలో వాళ్లిచ్చిన రిటర్న్ గిప్టులు చూసినప్పుడు నాలోని సృజనాత్మక కోణం నిద్రలేచింది. ఆ సందర్భం... జీవితం నాకిచ్చిన గిఫ్ట్ అనే చెప్పాలి. ఇక అప్పటి నుంచి రకరకాల ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు రెండు వందలకు పైగా క్రియేటివ్ పీస్‌లను తయారు చేస్తున్నాను. నాకు ఎగ్జిబిషన్లకు వెళ్లడం అలవాటు. కొన్నా కొనకపోయినా సరే... ఎగ్జిబిషన్లకు వెళ్లేదాన్ని. ఏ ప్రాంతం ఏ హస్తకళలకు ప్రసిద్ధి అనేది అవగతమైంది. అలా ఉదయ్పూర్కెళ్లి అక్కడి కళాకారుల పనితీరును తెలుసుకున్నాను. నేను బీఏ హిందీ లిటరేచర్ స్టూడెంట్‌ని కావడంతో భాష సమస్య రాలేదు. మావారి సలహాతో నేను చేస్తున్న పనిని రిజిస్టర్ చేశాను. నాకు వచ్చిన ఆర్డర్లకు పని చేసివ్వడంతోపాటు పని నేర్చుకుంటామని వచ్చే మహిళలకు ఉచితంగా నేర్పిస్తున్నాను. ఇదీ రొటీన్! ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచిన తర్వాత రెండు గ్లాసుల వేడి నీటిని తాగుతాను. అరగంట వాకింగ్, మరో అరగంట డాక్టర్ సూచించిన ఎక్సర్సైజ్లు. ఎనిమిదింటికి కాఫీ లేదా టీ, ఓ గంట సేపు ఫోన్లో మెసేజ్ లు చెక్ చేసుకుని నా క్లయింట్ల నుంచి ఆర్డర్లు, ఇతర సందేహాలకు రిప్లయ్ ఇస్తాను. పదిగంటలకు వంట, పూజ పూర్తి చేసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. రెండు గంటలు విశ్రాంతి. మధ్యాహ్న భోజనం తర్వాత మా వారు బయటకు వెళ్లినప్పటి నుంచి నా గదిలో పని మొదలు పెడితే ఏడు గంటల వరకు కొనసాగుతుంది. రాత్రి ఎనిమిదిన్నరకు భోజనం. కొద్దిసేపు టీవీలో వార్తా విశేషాలు, గేమ్ షోలు కొద్దిసేపు టీవీ చూడడం పది గంటలకు నిద్ర. వారంలో మూడు రోజులు మా వాసవీ మహిళా సంఘం కార్యకలాపాలతో ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఉంటాను. హడావుడిగా పరుగులు ఉండవు, కానీ పనిలో ఉంటాను. మా అబ్బాయి, అమ్మాయి కూడా హైదరాబాద్‌లోనే ఉంటారు. వాళ్లు మా ఇంటికి వచ్చే ముందు ‘రేపు నీ పనులేంటమ్మా? మేము ఎప్పుడు రావచ్చు’ అని అడుగుతారు. పిల్లలు వాళ్ల ఉద్యోగాలు, వ్యాపారాల్లో, వాళ్ల పిల్లల చదువులతో బిజీగా ఉంటారు. పిల్లలు మన కోసం టైమ్ ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటే ఈ వయసులో తరచూ నిరాశ ఎదురవుతుంటుంది. అందుకే నా టైమ్‌ని సహాయం అవసరమైన బాలికల చదువు, ఉపాధి కల్పనలో నిమగ్నం చేసుకుంటాను. లాభనష్టాల్లేకుండా నడిచే బాలికల హాస్టల్ నిర్వహణ, మహిళా సంఘం కార్యకలాపాలు సంయుక్తంగా చూసుకుంటాం. సహాయం అవసరమై వచ్చిన వాళ్లకు హాస్టల్లో వసతి ఇచ్చి, మహిళా సంఘం తరఫున స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తాం. ఉడాన్ సర్వీస్ ఆర్గనైజేషన్‌లోనూ మెంబర్ని. దేశరక్షణలో ప్రాణాలు వదిలిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం పూర్తిగా అందనప్పుడు మా సంస్థ నుంచి వాళ్ల పిల్లల చదువు కోసం స్కూల్ ఫీజులు చెల్లిస్తాం. ఇదే మంచి సమయం! నా వయసు మహిళలకు నేను చెప్పగలిగిందొక్కటే... విశ్రాంత జీవితం శాపం కాదు, ఇది ఒక వరం. పిల్లలు మన మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా చూసుకోవాలని కోరుకోకూడదు. ఎవరికి వాళ్లు తమకంటూ ఒక వ్యాపకాన్ని వృద్ధి చేసుకోవాలి. పుస్తకాలు చదవడం కావచ్చు, పూజలు, సత్సంగాలు, ఆలయాల సందర్శనం... ఏదైనా కావచ్చు. మనిషికి సోషల్ లైఫ్ ఉండాలి. ఇంటినుంచి బయటకు వస్తే పరిచయాలు పెరుగుతాయి. భావ సారూప్యం కలిగిన వాళ్లతో స్నేహం ఏర్పడుతుంది. అప్పుడు జీవితంలో ప్రతిరోజూ సంతోషకరంగానే గడుస్తుంది’’ అన్నారు విజయా గుప్తా కోట్రికె. – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
Andhra Pradesh: ప్రభుత్వ మద్దతు అమోఘం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికే వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్న పారిశ్రామిక దిగ్గజాలు తమ భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించడం ద్వారా రాష్ట్ర ఫ్రభుత్వంపై తమకున్న విశ్వాసాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు వేదికగా ప్రపంచానికి చాటిచెప్పారు. విశాఖలో జరిగిన రెండ్రోజుల జీఐఎస్ సదస్సులో కొత్త పరిశ్రమలు, పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకోవడమే కాకుండా ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న వివిధ సంస్థలు తమ భారీ విస్తరణ కార్యక్రమాలను ప్రకటించాయి. రిలయన్స్ గ్రూపు దగ్గర నుంచి కొత్త తరం నోవా ఎయిర్ సంస్థ వరకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్పందిస్తున్న తీరును సభా వేదికగా కీర్తించాయి. అంతేకాక.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రండి అంటూ ఇతర పారిశ్రామికవేత్తలను ఆయా సంస్థల అధిపతులు ఆహ్వా నించడం విశేషం. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, రిటైల్ వంటి వ్యాపారాల్లో ఇప్పటికే రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టామని.. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతుతో మరో రూ.50,000 కోట్లతో 10 గిగావాట్ల రెన్యువబుల్ సోలార్ ఎనర్జీ పార్కును ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. అదానీ మరో రూ.43,664 కోట్లు అలాగే.. అదానీ గ్రూపు పోర్టులు, సిమెంట్ వంటి రంగాల్లో రాష్ట్రంలో సుమారు రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెట్టగా భవిష్యత్తులో ఆయా రంగాల్లో సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నట్లు ఏపీ సెజ్ సీఈఓ కరణ్ అదానీ ప్రకటించారు. రాష్ట్రంలో డేటా సెంటర్, గ్రీన్ ఎనర్జీతో పాటు వివిధ రంగాల్లో రూ.43,664 కోట్ల పెట్టుబడులను పెట్టే విధంగా అదానీ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. ఇక లాక్డౌన్ కాలంలో తక్కువ సమయంలో యూనిట్‌ను ప్రారంభించామని, దీనికి రాష్ట్ర మద్దతే కారణమని నోవా ఎయిర్ సీఈఓ, ఎండీ గజానన్ నంబియార్ స్పష్టంచేశారు. సాధారణంగా ఆక్సిజన్ వంటి పారిశ్రామిక వాయువుల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేయడానికి కనీసం 18 నుంచి 24 నెలల సమయం పడుతుందని, కానీ కేవలం 14 నెలల కాలంలోనే యూనిట్‌ను ప్రారంభించి వేలాది మంది జీవితాలను కాపాడినట్లు ఆయన తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ రూ.50,632 కోట్లు జిందాల్ స్టీల్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ఏపీ పారిశ్రామిక రాష్ట్రంగా ఎదగనుందన్నారు. అందుకే తన సోదరుడికి చెందిన జేఎస్‌డబ్ల్యూ రూ.50,632 కోట్ల పెట్టుబడులు పెడుతోందన్నారు. ఇక, ఇతర రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ పార్కును దక్కించుకుంది. దీనితో రాష్ట్రంలో ఫార్మా రంగం మరింతగా విస్తరించనుంది. సాధారణంగా ఫార్మా పరిశ్రమ స్థాపనకు మూడు నుంచి నాలుగేళ్లు పడుతుందని, కానీ అన్ని అనుమతులున్న బల్క్ డ్రగ్ పార్కులో తక్షణం కార్యకలాపాలు మొదలుపెట్టే అవకాశం కలుగుతుందని దివీస్ ఫార్మా వైస్ ప్రెసిడెంట్ మధుబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా రంగానికి ఇస్తున్న మద్దతుతో తాము మరింతగా కార్యకలాపాలు విస్తరించడానికి రూ.వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు దివీస్, లారస్, హెటిరో, అపోలో తదితర సంస్థలు ప్రకటించాయి. రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్న సంస్థలు ఇలా భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించడంతో రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ తెలుగుదేశంతో పాటు దాని అనుబంధ పత్రికల దుష్ప్రచారానికి తెరపడుతుందని భావిస్తున్నట్లు పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఏపీకి పరిశ్రమల పట్టం
సుదీర్ఘ తీర ప్రాంతం.. అపారమైన సహజ వనరులు.. మానవ వనరుల కొరత లేకపోవడం.. వీటన్నింటికీ తోడు అన్ని విధాలా ప్రభుత్వ సహకారం.. కొత్తగా పరిశ్రమ స్థాపించడానికి ఏ పారిశ్రామికవేత్తకైనా ఇంతకంటే ఏం కావాలి? ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులో ఉండటంతో దిగ్గజ సంస్థల చూపు ఇప్పుడు రాష్ట్రంపై పడింది. పరిశ్రమలు పెడుతున్న వారిని చేయి పట్టుకుని నడిపించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకు రావడంలో సీఎం వైఎస్ జగన్ ఇతరుల కంటే నాలుగడుగులు ముందుండటం కలిసివస్తోంది. సాక్షి, అమరావతి: పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని దిగ్గజ సంస్థలు పారిశ్రామిక అనుకూల విధానాలున్న మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఇప్పటికే టాటాలు, బిర్లాలు, అదానీ, అర్సెలర్ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో పెట్టుబడులు పెట్టడానికి అనేక దిగ్గజ సంస్థలు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి సీఎం అధ్యక్షతన ఢిల్లీతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబయి, హైదరాబాద్ వంటి పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షోలకు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన వచ్చింది. కోవిడ్ సంక్షోభ సమయంలో రాష్ట్ర పరిశ్రమలను ఆదుకునేలా సీఎం జగన్ చూపిన చొరవ దేశ పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది. అప్పటికే రాష్ట్రంలో అడుగుపెట్టిన పరిశ్రమలు త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటూనే.. మరో పక్క కొత్త పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేసింది. గత 44 నెలల్లో పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడంతోపాటు, సులభతర వాణిజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉండటం పారిశ్రామిక వేత్తలను ఇటువైపు వచ్చేలా చేస్తోంది. కోవిడ్ సమయంలో ఉపాధి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టి్టన తర్వాత 2019 జూన్ నుంచి 2023 జనవరి వరకు రూ.75,649.77 కోట్ల విలువైన పెట్టుబడులు (ఎంఎస్ఎంఈ సహా) వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇందులో 111 భారీ, మెగా యూనిట్లు రూ.56,534.53 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా 73,876 మందికి ఉపాధి లభించింది. అంటే సగటున ఏడాదికి రూ.15,418 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి మొదలైంది. ఇందులో సీఎం వైఎస్ జగన్ చేతులు మీదుగా రూ.13,766 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఆరు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. వీటి ద్వారా 15,040 మందికి ఉపాధి లభించింది. ఇవి కాకుండా రూ.7,305 కోట్ల విలువైన కియా పరిశ్రమ వాణిజ్య పరమైన ఉత్పత్తిని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 డిసెంబర్ 5న లాంఛనంగా ప్రారంభించారు. వీటికి అదనంగా ఎంఎస్ఎంఈ రంగంలో 1,52,558 కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.19,115.24 కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా 13,63,706 మందికి ఉపాధి లభించింది. ప్రస్తుత ప్రభుత్వంలో గత 44 నెలల్లో సుమారు 24 నెలలు కోవిడ్ సంక్షోభంతో గడిచి పోయినప్పటికీ భారీ ఎత్తున పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో ముందంజలో ఉందని స్పష్టమవుతోంది. మరో రూ.2.35 లక్షల కోట్ల పెట్టుబడులు ఇవికాక మరో 86 ప్రాజెక్టులకు సంబంధించి రూ.2,35,125.60 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవీ వాస్తవ రూపంలోకొస్తే 2,36,806 మందికి ఉపాధి లభించనుంది. వీటిలో రూ.35,672.28 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఏడు భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా 7,015 మందికి ఉపాధి లభించనుంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక సుమారు రూ.13,962 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 17 యూనిట్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీటి ద్వారా 24,866 మందికి ఉపాధి లభించనుంది. మరో 5 భారీ యూనిట్లు అన్ని అనుమతులు తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా రూ.46,621.82 కోట్ల పెట్టుబడులతో 15,800 మందికి ఉపాధి లభించనుంది. -
పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం
సాక్షి, న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల కల్పన, అనుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం భేష్ అని గ్లోబల్ ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సులో వివిధ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు ప్రశంసించారు. దేశంలోనే వ్యాపార పెట్టుబడులకు ఏపీ స్వర్గధామంలా ఉందని కీర్తించారు. ఏపీ అందిస్తున్న సహకారంతో వ్యాపార విస్తరణకు, కొత్త వ్యాపార కార్యకలాపాలకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు వారు వెల్లడించారు. విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సందర్భంగా న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన సన్నాహక సదస్సులో వివిధ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు మాట్లాడారు. కోవిడ్ వంటి కఠినతర పరిస్థితుల్లోనూ ఏపీ అందించిన సహకారం మరువలేనిదంటూ కొనియాడారు. ఈ సదస్సులో ఎవరెవరు ఏమన్నారంటే.. పెట్టుబడులను రెట్టింపు చేస్తాం – యమగుచి, ఎండీ, టోరే ఇండస్ట్రీస్ (జపాన్) ఇక్కడ రూ.1,000 కోట్ల పెట్టుబడితో రెండు వ్యాపార యూనిట్లు ప్రారంభించాం. అదే సమయంలో కోవిడ్ మొదలైంది. ఏపీ ప్రభుత్వ మద్దతుతో జూన్ 2020లో ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించాం. 2030 నాటికి మా ప్రస్తుత పెట్టుబడిని రెండింతలు కంటే ఎక్కువ పెట్టడానికి ప్రణాళిక రూపొందించుకున్నాం. ఏపీ సహకారంతో మరింత విస్తరిస్తాం – రోషన్ గుణవర్ధన, డైరెక్టర్, ఎవర్టన్ టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఇటలీ) ఏపీలో మేం గణనీయంగా అభివృద్ధి చెందాం. ఏపీ టీ ఉత్పత్తి చేసే రాష్ట్రం కానప్పటికీ, ఏపీపై నమ్మకం ఉంచాం. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది గొప్పగా ఉంది. ప్రభుత్వం అందించిన సహకారంతోనే మేం ఇక్కడ యూనిట్లు ఏర్పాటుచేశాం. మా యూనిట్లలో 99శాతం మంది ఉద్యోగులు స్థానికులే. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఏపీ సర్కారు మాకు మద్దతుగా ఉన్నందుకు ప్రభుత్వం, అధికారులకు కృతజ్ఞతలు. ఏపీలో ప్రభుత్వ సహకారంతో మరింత విస్తరించేందుకు ఎదురుచూస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో దోహదపడాలని భావిస్తున్నాం – సెర్గియో లీ, డైరెక్టర్, అపాచీ, గ్రూప్ (తైవాన్) 2006లో షూ తయారీ సంస్థను స్థాపించాం. రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న తొమ్మిది నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాం. ఏపీ ప్రభుత్వ మద్దతు లేకుండా కంపెనీ విజయం సాధ్యంకాదు. ఎంఓయూపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంతకం చేస్తే ఇప్పుడు మేం పనిచేస్తున్నాం. అపాచీ ఇండియా–2 ప్రాజెక్టు కోసం మేమిప్పుడు ఏపీతో కలిసి పనిచేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో దోహదపడాలని భావిస్తున్నాం. ఏపీలో అసాధారణ మద్దతు – ఫణి కునార్, సీఎండీ, సెయింట్, గోబైన్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఫ్రాన్స్) రెండు దశాబ్దాల్లో మేం రూ.12,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాం. కోవిడ్ సమయంలో ఏపీలో ఫ్యాక్టరీ ప్రారంభించాం. ఏపీ అసాధారణ మద్దతుతో మేం ప్రారంభించిన యూనిట్ అత్యంత సంపన్నమైన యూనిట్‌గా మారింది. ఇక్కడి ప్రజల ప్రతిభ, నిబద్ధతతో కూడిన పరిపాలనా యంత్రాంగం, రాజకీయ నాయకత్వం మేం మరింత విజయవంతమయ్యేందుకు తోడ్పడింది. దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఎంచుకుంటే, ఏపీ స్వర్గధామంగా ఉంటుంది. ఏపీలో మంచి వాతావరణం – రవిసన్నారెడ్డి, శ్రీసిటీ ఫౌండర్, ఎండీ ఏపీలో పెట్టుబడులకు మంచి వాతావరణం ఉంది. ఈ సదస్సుకు 60 దేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు రావడం సంతోషం. ఢిల్లీ సదస్సు విజయవంతమైంది. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. మార్చిలో విశాఖలో జరగబోయే సమ్మిట్ మరింత విజవయంతం అవుతుంది. ముఖ్యమంత్రికి భవిష్యత్తు దార్శనికత – సుచిత్ర ఎల్లా, సీఐఐ సదరన్ చాప్టర్ అధ్యక్షురాలు పరిశ్రమలకు సింగిల్ విండో తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం ఏపీ. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉంది. సీఐఐ ఎక్కువ కాలం దివంగత సీఎం వైఎస్సార్‌తో కలిసి పనిచేసింది. సీఎం వైఎస్ జగన్‌కు భవిష్యత్తు దార్శనికత ఉంది. తద్వారా ఏపీ ప్రగతిశీల అభివృద్ధిని చూస్తోంది. గ్లోబల్ ఎకనామిక్ చెయిన్ వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వృద్ధి ఒక బలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తోంది. ప్రపంచస్థాయి కార్ల ఉత్పత్తికి ఏపీ సహకారం – టే జిన్ పార్క్, ఎండీ, కియా మోటర్స్, (కొరియా) రాష్ట్రంలో కియా నిర్వహణకు వనరుల మద్దతుతో పాటు ఆటోమోటివ్ బెల్ట్ చైన్‌ను అభివృద్ధి చేయడం, పెంపొందించడంలో ఏపీ ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంది. ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్‌లతో సహా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కార్ల ఉత్పత్తికి ప్రభుత్వం మాకు సహాయం చేసింది. కృష్ణపట్నం, చెన్నై వంటి ప్రధాన ఓడరేవులకు కనెక్టివిటీ సౌలభ్యంతో పాటు 95 దేశాలలో మా కార్లను విక్రయించడానికి వీలు కల్పించింది. కోవిడ్ సమయంలోనూ సురక్షితంగా కార్ల తయారీకి మాకు మద్దతిచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వ్యాపార విస్తరణకు దేశంలో ఏపీ ఉత్తమం – దీపక్ ధర్మరాజన్ అయ్యర్, ప్రెసిడెంట్, క్యాడ్బరీ ఇండియా (యూఎస్ఏ) ఏపీతో భాగస్వామి కావడం మాకు గర్వకారణం. శ్రీసిటీలో మేం మా వ్యాపార యూనిట్లను ప్రారంభించినప్పటి నుండి ఏపీ చురుకైన మద్దతిస్తోంది. రూ.2,500 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా 6వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించాం. సంస్థలో 80శాతం మంది ఉద్యోగులు స్థానికులే. ఇప్పటికే ఆరు ఆపరేటింగ్ యూనిట్లు ఉండగా, త్వరలో మరొకటి అందుబాటులోకి రానుంది. దేశం మొత్తంలోనే అత్యుత్తమ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌ను తెచ్చినందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మేం దేశవ్యాప్తంగా వ్యాపారం చేస్తున్నా.. ఏపీ అత్యుత్తమం. ఆంధ్రప్రదేశ్‌కు సీఎం జగన్ పెద్ద ఆస్తి – సుమంత్ సిన్హా, అసోచామ్ అధ్యక్షుడు ఏపీకు పెద్ద సీఎం జగన్ పెద్ద ఆస్తి. ఆయన నాయకత్వంలో రాష్ట్రం పరిశ్రమలకు అనుకూలంగా ఉంది. ఏపీని గమ్యస్థానంగా ఎంచుకోవాలని పారిశ్రామికవేత్తలందరినీ కోరుతున్నా. రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలు స్నేహ పూర్వకంగా ఉన్నాయి. రాష్ట్ర జీడీపీ 50 బిలియన్ డాలర్లకు పైగా దేశంలో ఎనిమిదో స్థానంలోఉంది. మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తొలి స్థానంలో ఉంది. రెన్యువబుల్, క్లీన్ ఎనర్జీలో ముందంజలో ఉంది. ఏపీకి పారిశ్రామిక వేత్తలు రావడానికి సహాయ అందించడానికి సీఎం ముందుచూపుతో ఉన్నారు. నిస్సందేహంగా పెట్టుబడులు పెట్టొచ్చు – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి ప్రపంచంలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం వృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో సింగిల్ విండో సిస్టమ్‌తో అన్ని విధాలా సహకారం ఉంటుంది. పెట్టుబడుల అనుమతులకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ అందిస్తుంది. 23 శాఖల పరిధిలో 93 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశాబివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న పారిశ్రామికవేత్తలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ వన్‌గా ఉంటున్న ఏపీలో పెట్టుబడులు నిస్సందేహంగా పెట్టొచ్చు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌సెల్ ఉంది. విశాఖలో సదస్సుకు పారిశ్రామిక వేత్తలంతా హాజరు కావాలి. ఏపీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నాం – దేవయాని ఘోష్, నాస్కామ్ అధ్యక్షురాలు ఏపీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నాం. ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఏపీతో కలిసి పని చేస్తున్నాం. డీప్‌టెక్ రంగంలో కలిసి పని చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం హైపర్ డిజిటల్ యుగంలోకి వెళ్తున్నాం. దీనికి కావాల్సిన వనరులన్నీ ఏపీలో ఉన్నాయి. రాష్ట్రానికి తీరప్రాంతం పెద్ద అడ్వాంటేజ్. బెస్ట్ పోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ప్రపంచం ఎదురు చూస్తున్న ఎనర్జీ, లాజిస్టిక్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఏపీకి సామర్థ్యం ఉంది. సీఎం డాక్యుమెంట్ ఆకట్టుకుంది. -
గ్రామీణ ఎంట్రప్రెన్యూర్లకు అదానీ క్యాపిటల్ నిధులు
న్యూఢిల్లీ: వచ్చే మూడు నెలల్లో సీఎస్సీ గ్రామీణ్ ఈ–స్టోర్స్ నిర్వహిస్తున్న 1,500 మంది గ్రామీణ స్థాయి ఎంట్రప్రెన్యూర్లకు (వీఎల్ఈ) నిర్వహణ మూలధనాన్ని సమకూర్చనున్నట్లు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ అదానీ క్యాపిటల్ వెల్లడించింది. దీనికి సంబంధించి సీఎస్సీ ఈ–గవర్నె న్స్ సర్వీసెస్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 10,000 మంది వీఎల్ఈలు సీఎస్సీ గ్రామీణ్ ఈ–స్టోర్స్‌లో నమోదు చేసు కున్నారు. ఎఫ్ఎంసీజీ, గృహోపకరణాలు, వాహనాలు మొదలైన వాటి తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాల్లోనూ నేరుగా పంపిణీ చేసేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. కేంద్ర ఎ లక్ట్రానిక్స్, ఐటీ శాఖ కింద స్పెషల్ పర్పస్ వెహికల్‌గా సీఎస్సీ ఏర్పాటైంది. ఇది 2020 ఏప్రిల్‌లో గ్రా మీణ్ ఈ–స్టోర్‌ను ప్రారంభించింది. అదానీ గ్రూప్‌నకు సీఎస్సీ గ్రామీణ్ ఈ–స్టోర్‌లో 10 శాతం వాటా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.64 లక్షల స్టోర్స్ పని చేస్తుండగా, ప్రారంభించినప్పట్నుంచి ఇప్పటివరకు రూ. 643 కోట్ల పైచిలుకు వ్యాపారం చేశాయి. చదవండి: ‘నాటునాటు’: అంత ఎనర్జీలేదు అయినా ఓకే.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్ -
స్టార్టప్స్‌లోకి భారీగా విదేశీ పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు, స్టార్టప్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో దేశీ అంకుర సంస్థల్లోకి కొత్త ఏడాది (2023)లో భారీగా విదేశీ పెట్టుబడులు రాగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్ జైన్ ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం భారత్.. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఉందని, మన అంకుర సంస్థల పనితీరును బట్టి చూస్తే త్వరలోనే అంతర్జాతీయంగా అగ్ర స్థానానికి చేరుకోగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘గుర్తింపు పొందిన స్టార్టప్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. స్టార్టప్స్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ఎఫ్ఎస్), స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాలకు మంచి ఆదరణ ఉంటోంది’’ అని జైన్ పేర్కొన్నారు. ప్రభుత్వం సరళతరమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని పాటిస్తుండటం కూడా అంకుర సంస్థల్లోకి మరిన్ని పెట్టుబడుల రావడానికి దోహదపడనుందని ఆయన చెప్పారు. మరోవైపు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) వినియోగించుకునేందుకు అంతర్జాతీయ సంస్థలు కూడా ఆసక్తిగా ఉన్నాయని జైన్ తెలిపారు. పలు గ్లోబల్ సంస్థలు తమ తయారీ కార్యకలాపాలను భారత్‌కు మార్చుకునే యోచనలో ఉన్నాయని ఆయన వివరించారు. 14 రంగాల్లో పీఎల్ఐ స్కీములతో రూ. 2.74 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని అంచనా వేస్తున్నట్లు జైన్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫార్మా, టెలికం, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన రంగాలు పెట్టుబడులు, ఉత్పత్తి/విక్రయాలు, ఉద్యోగాల కల్పనలో కీలకంగా ఉంటున్నాయని ఆయన తెలిపారు. పథకాల దన్ను దేశీయంగా నవకల్పనలు, అంకుర సంస్థలు, స్టార్టప్ వ్యవస్థలోకి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా ప్రణాళికను ఆవిష్కరించింది. గణాంకాల ప్రకారం నవంబర్ 30 వరకూ దీని కింద 84,000 పైగా అంకుర సంస్థలు గుర్తింపు పొందాయి. ఇక, స్టార్టప్‌లకు వివిధ దశల్లో అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందించేందుకు కేంద్రం ఎఫ్ఎఫ్ఎస్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్ఐఎస్ఎఫ్ఎస్), రుణ హామీ పథకం (సీజీఎస్ఎస్) మొదలైనవి అమలు చేస్తోంది. ఎఫ్ఎఫ్ఎస్ కింద 93 ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్‌లు) 773 స్టార్టప్స్‌లోకి పెట్టుబడులు పెడుతున్నాయి. అలాగే, 2021–22లో ప్రవేశపెట్టిన ఎస్ఐఎస్ఎఫ్ఎస్ కింద 126 ఇన్క్యుబేటర్స్లోకి రూ. 455 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. నవంబర్ 30 వరకూ ఈ ఇన్‌క్యుబేటర్స్ ద్వారా ఆర్థిక తోడ్పాటు పొందేందుకు 650 స్టార్టప్స్ ఆమోదం పొందాయి. ఇక సీజీఎస్ఎస్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నోటిఫై చేయగా, పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్నారు. -
చిన్న సంస్థలకు రుణాలపై ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, మధ్య తరహా సంస్థలు, స్వయం ఉపాధి పొందుతున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణాలపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ ఎండీ వైఎస్ చక్రవర్తి వెల్లడించారు. కొత్తగా సప్లై చెయిన్ ఫైనాన్సింగ్, విద్యా రుణాల విభాగాల్లోకి కూడా మరికొద్ది నెలల్లో ప్రవేశించనున్నట్లు చక్రవర్తి వివరించారు. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 15% పైచిలుకు, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 18% వరకు వ్యాపార వృద్ధిని అంచనా వేస్తున్నట్లు శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్) రూ. 1,71,000 కోట్లుగా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఇది రూ. 33,000 కోట్లుగా ఉందని చక్రవర్తి వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.3,000 కోట్ల డిపాజిట్లు, 46,000 పైచిలుకు డిపాజిట్‌దారులు, 10,000 మంది పైగా సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. అన్ని శాఖల్లో అన్ని సర్వీసులు .. ప్రస్తుతం 268 శాఖల్లో మాత్రమే వాణిజ్య వాహన (సీవీ) రుణాలు ఇస్తుండగా, కొత్తగా మరో 170 శాఖల్లో కూడా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. 2023 ఆఖరు నాటికి అన్ని శాఖల్లోనూ అన్ని ఉత్పత్తులను అందించాలని నిర్దేశించుకున్నట్లు చక్రవర్తి చెప్పారు. -
‘వీహబ్’తోడుగా.. విజయం దిశగా..
సాక్షి, హైదరాబాద్: వారు సాధారణ దళిత మహిళలు.. వ్యాపారం చేయాలన్న తపన ఉన్నా ఏం చేయాలనే స్పష్టత లేనివారు.. కానీ ఇప్పుడు వారు ఉపాధి పొందడమేకాదు.. మరికొందరికి ఉపాధినిచ్చే దశకూ చేరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’ ఆర్థికసాయం.. మహిళలు వ్యాపార, వాణిజ్యవేత్తలుగా ఎదిగేలా తోడ్పడేందుకు ఏర్పాటైన ‘వీహబ్’ భాగస్వామ్యం.. కలిసి దీనిని సాకారం చేశాయి. కేవలం మూడు నెలల వ్యవధిలో హుజూరాబాద్ ప్రాంతంలో 343 మంది ఎస్సీ మహిళలు వీహబ్ తోడ్పాటుతో ఎంట్రప్రెన్యూర్లుగా ప్రస్థానం ప్రారంభించడం గమనార్హం. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన వీహబ్ ఇప్పటికే సుమారు 4 వేల మంది గ్రామీణ మహిళల్లో వ్యాపార దక్షత పెరిగేందుకు తోడ్పాటును అందించింది కూడా. ప్రత్యేకంగా అవగాహన కల్పించి.. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వీహబ్ చేస్తున్న కృషిని గుర్తించిన అధికారులు.. హుజూరాబాద్‌లో దళితబంధు పథకం అమల్లో భాగస్వామ్యం కావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన వీహబ్.. మూడు నెలల పాటు దళితబంధు లబ్ధిదారులతో కలిసి పనిచేసింది. వారి అవసరాలు తెలుసుకోవడంతోపాటు ఉపాధి పొందడానికి అవసరమైన తోడ్పాటును అందించింది. మొదట ఉపాధి మార్గం,దానిని ఆచరణలో పెట్టడానికి అవసరమైన వనరులు తదితర అంశాలపై ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను (ఈడీపీ) నిర్వహించింది. దళితబంధు పథకం కింద స్థానికంగా అధికారులు ఎంపికచేసిన 790 మంది లబ్ధిదారులు హాజరయ్యారు. అందులో 343మంది మహిళలు సొంతంగా ఉపాధి యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపారు. అన్ని అంశాల్లో తోడుగా.. మహిళల వ్యాపార ఆలోచన, దాని వెనుకుండే లాభనష్టాలు, ప్రాజెక్టు నివేదిక తయారీ వంటి అంశాలపై వీహబ్ అవగాహన కల్పించింది. లబ్ధిదారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఏడు అంశాలపై లోతుగా శిక్షణ ఇచ్చింది. వారికి అవసరమైన డాక్యుమెంట్లు, రిజిస్ట్రేష¯] ్లు, లైసెన్సులు, యంత్రాల కొనుగోలుకు అమ్మకందారులతో పరిచయాలు, కొటేషన్లు, స్కీమ్ డబ్బులను అధికారులు విడుదల చేయడం దాకా తోడుగా నిలిచింది. దీంతో 343 మంది మహిళలు 3 నెలల వ్యవధిలోనే వ్యాపారాలను ప్రారంభించగలిగారు. వారి తపన అభినందనీయం తొలుత మేం దళితబంధు లబ్ధిదారులతో సమావేశమై వారి ఆలోచనలను తెలుసుకున్నాం. వాటిని ఆచరణలోకి ఎలా తేవాలనే దానిపై మార్గదర్శనం చేశాం. వారిలో పట్టుదలను నింపేందుకు ఇప్పటికే సక్సెస్ అయిన మహిళా ఎంట్రప్రెన్యూర్ల విజయగాథలను వీడియోల ద్వారా చూపించాం. దళిత మహిళలు లింగ, కుల, సామాజిక, ఆర్థిక అడ్డంకులను దాటుకుని ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేందుకు పడుతున్న తపన అభినందనీయం. – దీప్తి రావుల, సీఈవో, వీహబ్ రెండు నెలల్లోనే సంపాదన మార్గంలోకి.. ఇంటర్ వరకు చదువుకున్న నేను పెళ్లయిన తర్వాత డిగ్రీ పూర్తి చేశా. హోమ్ ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాను. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన చాలా కాలం నుంచి ఉంది. దళిత బంధు కింద ఎంపిక కావడంతో ఏ వ్యాపారమైతే బాగుంటుందనేది తెలుసుకునేందుకు ఎన్నో ప్రాంతాలు తిరిగి, ఎంతో మందిని కలిశాను. నా భర్తకు డ్రైవింగ్ తెలుసు కాబట్టి కారు కొందామనుకున్నా. వీహబ్ ప్రతినిధులను కలిశాక స్పష్టతకు వచ్చా. వారి తోడ్పాటుతో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, స్టేషనరీ షాప్ పెట్టి.. రెండు నెలల్లోనే నెలకు రూ.10వేలకుపైగా సంపాదించే దశకు చేరుకున్నా. – నీరటి మౌనిక, దళితబంధు లబ్ధిదారు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థితిలో ఉన్నా.. చాన్నాళ్లు ఇంటికే పరిమితమైన నేను ఇప్పుడు ఎంట్రప్రెన్యూర్‌గా మారాను. ఇంట్లోనే ఏర్పాటు చేసిన క్యారీబ్యాగ్స్ తయారీ యూనిట్‌తో నెలకు రూ.50వేల దాకా ఆదాయం వస్తోంది. నిజానికి దళితబంధు పథకానికి ఎంపికైన తర్వాత శారీ సెంటర్‌గానీ, కిరాణా దుకాణంగానీ ఏర్పాటు చేయాలనుకున్నాను. వీ హబ్ భేటీ తర్వాత చేతి సంచుల తయారీ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాను. గతంలో ఉపాధి వెతుక్కునే దశ నుంచి ఇప్పుడు వేరేవాళ్లకు ఉపాధి కల్పించే దశకు చేరుకోవడం ఆనందాన్నిస్తోంది. – వేల్పుల శారద, దళితబంధు లబ్ధిదారు, హుజూరాబాద్ -
పారిశ్రామికవేత్తలే ప్రచారకర్తలు
సాక్షి, అమరావతి: సాధారణంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖ సినీ నటులు, క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. వారు కోరినంత డబ్బులు చెల్లించి మరీ ప్రచారాన్ని చేపడతాయి. ఇక గత సర్కారు ప్రచార ఆర్భాటాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంవోయూల పేరుతో మభ్యపుచ్చింది. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ సహకారం ఉన్నప్పుడు ఇలాంటి కృత్రిమ ప్రచారంతో పనిలేదు. వచ్చే ఏడాది మార్చిలో విశాఖ వేదికగా నిర్వహించనున్న అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన దిగ్గజ సంస్థలే ప్రచారకర్తలుగా నిలవనున్నాయి. ఆయా యూనిట్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా పరిశ్రమలు నెలకొల్పిన దిగ్గజాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు నూతన పెట్టుబడులను రప్పించేందుకు చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పునాది సమయంలోనే విస్తరణ ప్రణాళికలు.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాన్ని మెచ్చి దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆదిత్య బిర్లా, టాటా, ఐటీసీ, టెక్ మహీంద్రా, డిక్సన్, సెంచురీ ప్లై, అపాచీ ఫుట్‌వేర్, ఏటీజీ టైర్స్, రామ్‌కో, శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్, అరబిందో, బ్లూస్టార్, హావెల్స్ లాంటి పలు సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఆదిత్య బిర్లా, ఐటీసీ గత ఏడాది కాలంలో రాష్ట్రంలో రెండేసి యూనిట్లు ఏర్పాటు చేయడమే కాకుండా విస్తరణ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాయి. ఏటీజీ టైర్స్, సెంచురీ ప్లైవుడ్స్ లాంటి సంస్థలైతే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తున్న వేగాన్ని చూసి పునాది సమయంలోనే విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలకు నిదర్శనం. పూర్తిగా పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో వరుసగా మూడో ఏడాది ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం ఇందుకు తార్కాణం. ఇటీవల రాష్ట్రంలో వివిధ యూనిట్ల ప్రారంభం, శంకుస్థాపన సందర్భంగా ఆయా సంస్థలు ఏమన్నాయో చూద్దాం.. రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏపీ కొత్తగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూపు రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనం. రెండు నెలల క్రితం వైఎస్ఆర్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేశాం. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్‌సోడా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మా గ్రూపు సంస్థలకు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. ఇప్పటికే ఆరు వ్యాపారాలకు సంబంధించి రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. వీటి ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉంది. – బలభద్రపురంలో క్లోర్ అల్కాలి (కాస్టిక్ సోడా) యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అర నిమిషంలోనే ఒప్పించారు.. మే నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి 30 సెకన్లు మాత్రమే మాట్లాను. ఎమర్జింగ్ టెక్నాలజీని ఏపీకి తేవడంలో సహకరించాలని సీఎం కోరారు. ఈ సందర్భంగా మా అబ్బాయి బయోఇథనాల్ ప్లాంట్ స్థాపనకు వివిధ రాష్ట్రాలను పరిశీలిస్తున్న విషయం చెప్పా. ఎక్కడో ఎందుకు? మా రాష్ట్రంలో పెట్టండి అని సీఎం ఆహ్వానించారు. ఏపీలో బయో ఇథనాల్ పాలసీ లేదని ఆయన దృష్టికి తేవడంతో యూనిట్ ప్రారంభమయ్యే సరికి రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. ఇది జరిగిన ఆరు నెలల్లోనే రాజమహేంద్రవరంలో యూనిట్‌కు శంకుస్థాపన చేశాం. ఇలా మా అబ్బాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం గర్వకారణంగా ఉంది. – అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవ సభలో సీపీ గుర్నానీ, సీఈవో, టెక్ మహీంద్రా పెట్టుబడుల ఆకర్షణలో ఫస్ట్ దేశ జీడీపీ వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటమే కాకుండా అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టిస్తోంది. సామాజిక ఆర్థికాభివృద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటీవల గుంటూరులో వెల్కమ్ ఫైవ్‌స్టార్ హోటల్‌ను శరవేగంగా ప్రారంభించాం. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల పార్క్‌ను ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ పరిశీలిస్తుంటే సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం ఎటువంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. – యడ్లపాడులో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ పార్క్ ప్రారంభోత్సవ సదస్సులో సంస్థ సీఈవో సంజయ్ పూరి అత్యుత్తమ ఈఎంసీ కొప్పర్తి కేవలం తొమ్మిది నెలల్లోనే అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ దేశంలోనే అత్యుత్తమ ఈఎంసీగా నిలుస్తుంది. ఇక్కడి యూనిట్ ద్వారా శామ్సంగ్, బాష్, షావోమి లాంటి పలు ప్రముఖ సంస్థలకు చెందిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉత్పత్తి చేస్తాం. రావాలి జగన్.. కావాలి జగన్.. అనే నినాదం రాష్ట్రమంతా మారుమోగింది. ఇప్పుడు ఆ నినాదం జగన్ వచ్చారు... అభివృద్ధి తెచ్చారుగా మారింది – కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ యూనిట్ భూమిపూజ కార్యక్రమంలో డిక్సన్ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్‌శర్మ రూ.6 వేల కోట్ల నుంచి రూ.26 వేల కోట్లకు.. తొలుత తమిళనాడులో యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వైఎస్సార్ జిల్లా బద్వేల్లో యూనిట్ నెలకొల్పుతున్నాం. పెట్టుబడుల ప్రతిపాదనలు అందచేసిన రెండు నెలల్లోనే అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేశారు. ప్రభుత్వ సహకారాన్ని చూశాక రూ.6,000 కోట్ల పెట్టుబడులను రూ.26,000 కోట్లకు పెంచాలని నిర్ణయించుకున్నాం. – బద్వేల్లో సెంచురీ ఫ్లైవుడ్ కంపెనీ చైర్మన్ సజ్జన్ భజాంక పారిశ్రామికవేత్తల మనోగతమే మాకు బ్రాండింగ్ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రత్యేకంగా బ్రాండింగ్ అవసరం లేదు. ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న ప్రజాదరణే అతి పెద్ద బ్రాండింగ్. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ సంస్థల అభిప్రాయాలనే వచ్చే మార్చిలో విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు బ్రాండింగ్‌గా వినియోగించుకుంటాం. 100 శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మూడేళ్లుగా మొదటి స్థానంలో నిలవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి -
యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు..
రాయవరం: రాష్ట్ర ప్రభుత్వం విద్యలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. ఇప్పటికే మనబడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల భౌతిక స్వరూపాన్ని మార్చడమే కాకుండా తరగతి గదిలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. పూర్తి స్థాయిలో ఇంగ్లీషు విద్యకు బాటలు వేసిన ప్రభుత్వం పాఠశాల దశ నుంచే సాంకేతిక విద్యను అందించేందుకు కృషి చేస్తోంది. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నూతనంగా తొమ్మిదో విద్యార్థులకు పారిశ్రామిక మనస్తత్వ పెంపుదలకు శిక్షణ ఇవ్వనున్నారు. వారిని యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన లక్షణాలు, 21వ శతాబ్దపు నైపుణ్యాలను వారికి అందివ్వనున్నారు. ఈ శిక్షణలో ఐదు స్వచ్ఛంధ సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. 450 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తొమ్మిదో తరగతి బోధించే తరగతి ఉపాధ్యాయులకు తొలుతగా శిక్షణ అందజేస్తున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన 63 మంది రీసోర్స్ పర్సన్లు, మండల స్థాయిలో 9వ తరగతి క్లాస్ టీచర్లకు ఈ నెల 10, 11, 12, 13 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 10, 11 తేదీల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల ఉపాధ్యాయులకు, 12, 13 తేదీల్లో కాకినాడ జిల్లాలోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. జీఏఎంఈ, అస్లాటోన్, ఉధ్యం, మేకర్గాట్, రీపీ బెనిఫిట్ స్వచ్ఛంద సంస్థలు జిల్లా రీసోర్స్ పర్సన్స్‌కు శిక్షణ ఇవ్వడంతో పాటు బోధనకు అవసరమైన మెటీరియల్ అందజేశారు. 25వేల మంది విద్యార్థులకు ప్రయోజనం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులకు ‘పారిశ్రామిక వ్యవస్థాపక మనస్తత్వ పెంపుదల’(ఈఎండీపీ)పై శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 25 వేల మంది విద్యార్థులకు ఈ శిక్షణ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వారంలో ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన శిక్షణనిస్తారు. ఈ నెల 14 నుంచి విద్యార్థులకు శిక్షణ ప్రారంభమవుతోంది. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు పారిశ్రామిక రంగాల వైపు మళ్లేలా, వారిలో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నైపుణ్యాల అభివృద్ధిని పెంచుతారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో విద్యార్థులు వారి కాళ్లపై వారు నిలబడేలా ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే అవకాశం కలుగుతుంది. అలాగే వారిలో భవిష్యత్తుపై భయం పోయి, ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యావేత్తలంటున్నారు. (క్లిక్: వీడు అసలు మనిషేనా! ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు..) లక్ష్యాలు చేరుకునేందుకు విద్యార్థి దశ నుంచే వారి భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహద పడుతుంది. చదువుకున్న అనంతరం ఉద్యోగం కోసం చూడకుండా, విద్యార్థులే పదిమందికి ఉద్యోగాలు కల్పించేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ శిక్షణ ద్వారా కచ్చితంగా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందనడంలో సందేహం లేదు. – సీహెచ్ ఉదయ్‌కుమార్, డిస్ట్రిక్ట్ మేనేజర్, ఈఎండీపీ సద్వినియోగం చేసుకోవాలి నేటి నుంచి ఇస్తున్న రెండు రోజుల శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని, తిరిగి విద్యార్థులకు అందించాలి. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన శిక్షణను అందించాలి. ప్రభుత్వ ముందుచూపుకు ఇది ఒక్క చక్కని ఉదాహరణగా చెప్పొచ్చు. మండల స్థాయి శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. – ఎన్వీ రవిసాగర్, డీఈవో, కోనసీమ జిల్లా మంచి ఆలోచన విద్యార్థి దశ నుంచే పారిశ్రామిక వ్యవస్థాపక మనస్తత్వ పెంపుదలపై శిక్షణ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ప్రతి వారం విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. – ఎస్ఏ అబ్రహం, డీఈవో, తూర్పు గోదావరి జిల్లా -
‘కాకినాడ’లో.. బల్క్ డ్రగ్ పార్క్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో ఇది ఏర్పాటు కానుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఎస్ఎస్సీ (స్కీమ్ స్టీరింగ్ కమిటీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) 90 రోజుల్లోగా ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఏజెన్సీ అయిన ఐఎఫ్సీఐ(ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కు పంపాలని కేంద్రం కోరింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ పరిధిలోని ఫార్మాసూటికల్స్ విభాగం సంయుక్త కార్యదర్శి ఎన్.యువరాజ్ మంగళవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బల్క్ డ్రగ్స్ పార్క్‌ల ప్రోత్సాహక పథకం ద్వారా దీన్ని చేపట్టేందుకు అంగీకరిస్తూ వారం రోజుల్లోగా తమకు లేఖ పంపాలని అందులో కోరారు. రూ.వేల కోట్ల పెట్టుబడులు.. బల్క్ డ్రగ్ పార్కుల ఏర్పాటును ప్రోత్సహించేందుకు 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద దేశంలో మూడు ప్రాంతాల్లో బల్క్ డ్రగ్ పార్క్‌లను ఏర్పాటు చేస్తామని, అందుకోసం ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కాగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం 2020–23 ప్రకటించింది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో రెండు వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. రానున్న ఎనిమిదేళ్లలో పార్క్ ద్వారా రూ.46,400 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని, 10 వేల నుంచి 12 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. కేంద్రం ప్రకటించిన పథకం కింద బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన పంపాలని, ఒకవేళ ఆమోదించకుంటే సొంతంగా చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తీవ్ర పోటీలో రాష్ట్రం విజయం.. కేంద్రం ప్రకటించిన పథకం కింద తొండంగి మండలం కేపీ పురం, కోదాడలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం 2020 అక్టోబర్ 15న ప్రతిపాదనలు పంపింది. బల్క్ డ్రగ్ పార్క్‌ను దక్కించుకునేందుకు మనతోపాటు తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. దేశంలో అత్యాధునిక ఫార్మా సిటీని విశాఖకు సమీపంలోని పరవాడ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఫార్మా వ్యర్థాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ను సీఎం వైఎస్ జగన్ అగ్రగామిగా నిలిపారు. ఈ రెండు అంశాలు రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదముద్ర వేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఫార్మాలో అగ్రగామిగా రాష్ట్రం.. కాకినాడ జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించాక రాష్ట్ర ప్రభుత్వం వేగంగా మౌలిక సదుపాయాలను కల్పించనుంది. తద్వారా భారీ పరిశ్రమలు ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. ఫార్మా రంగంలో పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేయడంతోపాటు చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద ఎంఎస్ఎంఈ ఫార్మా పార్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అటు బల్క్ డ్రగ్ పార్క్.. ఇటు ఎంఎస్ఎంఈ ఫార్మా పార్క్‌ల ద్వారా ఫార్మా రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. -
దేశంలో ఎంట్రప్రెన్యూర్ సంస్కృతి పెరగాలి
సాక్షి, హైదరాబాద్: వాణిజ్యవేత్తలుగా మారడం, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం భారతదేశంలో అంత సులభతరం కాదని, దేశంలో త్వరగా ఎదిగే వాణిజ్యవేత్తలను అనుమానంగా చూసే సంస్కృతి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో దేశం ఇంకా చాలా ఎదగాల్సి ఉందని, 1987లో జీడీపీ పరంగా చైనా, భారత్ ఒకే విధంగా ఉన్నా ప్రస్తుతం అమెరికా కంటే చైనా కేవలం ఒక అడుగు మాత్రమే వెనుకంజలో ఉందని పేర్కొన్నారు. ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే ‘ప్లాస్ట్ ఇండియా 2023’సందర్శకుల రిజిస్ట్రేషన్ యాప్‌ను కేటీఆర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాతీలు వారసత్వంగా వచ్చే వ్యాపారాల్లో ఉంటూనే కొత్త రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటారని కొనియాడారు. గుజరాతీ ఎంట్రప్రెన్యూర్స్‌ను ఆదర్శంగా తీసుకుని దేశంలో ఎంట్రప్రెన్యూర్ సంస్కృతి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి వచ్చే పెట్టుబడిదారులు తెలంగాణ లాంటి అనువైన రాష్ట్రాన్ని ఎంచుకుని కార్యకలాపాలు ప్రారంభించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రంగానికి ప్రోత్సాహకాలు.. ప్లాస్టిక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఇస్తోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 2014కు ముందు రాష్ట్రంలో 10 వేలకు పైగా ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 15 వేలకు చేరిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 144 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ పార్కులో 149 కంపెనీలకు స్థలం కేటాయించగా రూ.847 కోట్ల పెట్టుబడి వచ్చిందన్నారు. 102 యూనిట్లు కార్యకలాపాలు ప్రారంభించగా, మరో 25 యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నాయని, ఈ పార్కు ద్వారా 5 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించిందన్నారు. తిరిగి ఉపయోగించే వీలున్న ప్లాస్టిక్ పైనే యూనిట్లు దృష్టి సారించాలని, ప్లాస్టిక్‌కు సరైన ప్రత్యామ్నాయం చూపడం ద్వారానే పూర్తి స్థాయిలో నిషేధం సాధ్యమవుతుందని అన్నారు. పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణపై కూడా దృష్టి సారించాలని సూచించారు. వచ్చే ఏడాది జరిగే ప్లాస్ట్ ఇండియా 2023 గురించి మాట్లాడుతూ.. ఢిల్లీతో తమకు ఇటీవలి కాలంలో సత్సంబంధాలు లేవని చమత్కరించారు. కాగా, ప్లాస్ట్ ఇండియా ఎగ్జిబిషన్ విజయవంతం కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. 2025 నాటికి తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న విశాఖ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ చైర్మన్ జిగేశ్ దోషి, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ అజయ్‌షా, కో చైర్పర్సన్ పద్మజారెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
భారత్‌లో గూగుల్ స్టార్టప్ స్కూల్
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు ప్రారంభ దశలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, నిలదొక్కుకునేందుకు తోడ్పాటు అందించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్.. భారత్‌లో స్టార్టప్ స్కూల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో దాదాపు 10,000 స్టార్టప్‌లకు సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రాం వర్చువల్‌గా తొమ్మిది వారాల పాటు ఉంటుంది. మెరుగైన ఉత్పత్తిని సమర్థంగా రూపొందించేందుకు వ్యూహాలు, కొత్తగా ఇంటర్నెట్కు పరిచయమయ్యే యూజర్ల కోసం యాప్‌ల రూపకల్పన, కొత్త యూజర్లను దక్కించుకునేందుకు పాటించాల్సిన వ్యూహాలు మొదలైన వాటిలో ఇందులో శిక్షణ పొందవచ్చు. అలాగే స్టార్టప్ వ్యవస్థకు సంబంధించిన పలువురు దిగ్గజాలతో చర్చా కార్యక్రమాలు మొదలైనవి కూడా ఉంటాయి. దాదాపు 70,000 పైచిలుకు అంకుర సంస్థలతో స్టార్టప్‌ల విషయంలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల నుంచే కాకుండా చిన్న పట్టణాల నుంచి కూడా అనేకానేక స్టార్టప్‌లు వస్తున్నాయి. అయితే, 90 శాతం స్టార్టప్‌లు తొలి అయిదేళ్లలోనే మూతబడుతున్నాయి. ఖర్చులపై అదుపు లేకపోవడం, డిమాండ్‌ను సరిగ్గా అంచనా వేసుకోలేకపోవడం, సారథ్యం సరిగ్గా లేకపోవడం వంటి అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయని గూగుల్ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో వివరించింది. ఇలాంటి సవాళ్లను అధిగమించి అంకుర సంస్థలు నిలదొక్కుకోవడంలో సహకరించే లక్ష్యంతోనే స్టార్టప్ స్కూల్‌ను తలపెట్టినట్లు పేర్కొంది. -
AP: వ్యాపారవేత్తలుగా ‘పొదుపు’ మహిళలు
సాక్షి, అమరావతి: మహిళల పొదుపు సంఘాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది. పది నుంచి పన్నెండు మంది చొప్పున ఉండే ప్రతి పొదుపు సంఘంలో కనీసం ఇద్దరిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణను సిద్ధంచేసింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 8.42 లక్షల పొదుపు సంఘాలు ఉండగా, ఒక్కో సంఘంలో ఆసక్తి, ఉత్సాహం ఉన్న ఇద్దరేసి చొప్పున మొత్తం 16,84,026 మంది మహిళలను గుర్తించి, వారిని పూర్తిస్థాయిలో వ్యాపారవేత్తలుగా తయారుచేసేలా ప్రణాళికను రూపొందించింది. ఇలా గుర్తించిన వారికి ‘రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఆర్యూడీఎస్ఈటీ)లో శిక్షణ పొందిన నిపుణుల ద్వారా ఆరు ప్రధాన అంశాలపై తర్ఫీదు ఇస్తారు. మహిళల్లో పూర్తిస్థాయి ఆర్థిక చైతన్యం కల్పించడం ద్వారా ఆయా కుటుంబాలకు సుస్థిర ఆదాయం కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. వైఎస్సార్ ఆసరా, చేయూత తదితర పథకాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు నేరుగా ఆర్థిక లబ్ధిని చేకూర్చి, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు పలు బహుళజాతి కంపెనీలతో ఒప్పందం కూడా చేసుకుంది. రూ.30 వేల కోట్ల రుణ లక్ష్యం ఇక సకాలంలో రుణాలు చెల్లించిన 5.34 లక్షల పొదుపు సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరోసారి రూ.30 వేల కోట్ల రుణం అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) లక్ష్యంగా నిర్ధేశించుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై బ్యాంకర్ల సంఘం ఆమోదం తెలిపింది. మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా చేరిన నాటి నుంచి ఇప్పటిదాకా రూ.9,800 కోట్లు దాకా పొదుపు చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న తమ డబ్బును మహిళలు నామమత్రం వడ్డీ వచ్చే పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ఉంచుకుని.. అదే బ్యాంకుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నాయి. కానీ, అలాకాకుండా మహిళలు తాము పొదుపు చేసుకున్న సొమ్మును అవసరాల మేరకు తీసుకుని ఆ తర్వాత అదనంగా అవసరమయ్యే మొత్తాన్ని బ్యాంకు రుణం పొందడం ద్వారా పెద్దగా అప్పుచేయాల్సిన అవసరం ఉండదని.. బ్యాంకులు ఇందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ బ్యాంకర్ల సమావేశంలో ప్రతిపాదించారు. ఇందుకు బ్యాంకులు సానుకూలంగా స్పందించాయని సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
ఆ విషయంలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి - రతన్ టాటా
గ్లోబల్ ఎకానమీగా ఎదిగేందుకు ఇండియా నిర్విరామంగా కృషి చేస్తోంది. ఫార్మా రంగంలో ప్రపంచానికి పెద్దన్నలా మారింది. చిన్న నగరాల నుంచి పెద్ద కంపెనీలు పుట్టుకొస్తున్నాయ్. మూడు పదుల వయసులోనే యంగ్ ఎంట్రప్యూనర్లు బిలియనీర్లుగా మారుతున్నారు. ఈ మార్పుకు సాక్షిగా నిలిచినవారిలో రతన్‌టాటా ఒకరు. ఓ సందర్భంగా దేశీయంగా వచ్చిన మార్పులను రతన్‌టాటా వివరించారు. దాన్ని ట్విటర్ ద్వారా మరో ఇండస్ట్రియలిస్టు హర్ష్ గోయెంకా మనకు షేర్ చేశారు. ఎంటర్‌ప్యూనర్‌షిప్ గురించి రతన్ టాటా మాట్లాడుతూ.. తాను యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక యువ ఉద్యోగి కొత్త ఐడియాతో తన బాస్ లేదా మేనేజర్‌ను సంప్రదిస్తే.. ‘ ముందు నువ్వు ఒక ఐదేళ్లు పని చేయ్. అప్పుడే ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకుంటావ్’ ‘ చేతులు పైకి మడిచి ఆఫీస్‌లో కష్టపడి పని చేయ్, ఆ తర్వాత ఐడియాల గురించి ఆలోచిద్దువు కానీ’ అనే సమాధానాలే వారికి వినిపించేవి. ఎక్కడా ప్రోత్సాహకర వాతావరణం ఉండేది కాదని రతన్ టాటా తెలిపారు. ఇదే అంశంపై మరింత వివరణ ఇస్తూ రతన్ టాటా ఇలా అన్నారు.. ‘ఇప్పుడయితే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. ఒక యంగ్ ఎంట్రప్యూనర్లకు మంచి ఐడియాలతో పాటు వాటిని ఎలా అమలు చేయాలో కూడా తెలుసు. వారు ఇరవైలలో ఉన్నా సరే తమ ఐడియాలను నిజం చేసుకోవడంలో ముందుంటున్నారు’ అని రతన్‌టాటా అన్నారు. పారిశ్రిమికంగా, కొత్త అవకాశాలను సృష్టించడంలో యాభై ఏళ్ల క్రితం దేశంలో పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు మధ్య ఉన్న తేడాను ఆయన వివరించారు. How decision making has changed over the years - Ratan Tata pic.twitter.com/hviSSqk2xc — Harsh Goenka (@hvgoenka) June 29, 2022 చదవండి: టాటా చేతికి ఎన్ఐఎన్ఎల్, మా లక్ష్యం అదే! -
మీ వెంటే ఉంటా.. ఈఎంసీ ప్రారంభోత్సవ సభలో పారిశ్రామికవేత్తలకు సీఎం వైఎస్ జగన్ భరోసా
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఏపీ కీలక కేంద్రం అవుతోంది. పలు గ్లోబల్ సంస్థలు రాష్ట్రంలో కంపెనీలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకు తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) వేదికగా మారింది. వీటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం పట్ల పారిశ్రామికవేత్తలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఒక్కో పరిశ్రమ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికీకరణ నిశ్శబ్ద విప్లవంగా కొత్తపుంతలు తొక్కుతోంది. యువత ఉపాధికి కొత్త దారులు చూపిస్తోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి / సాక్షి, తిరుపతి: ‘మీకు మాటిస్తున్నా.. మీ వెంటే ఉంటా.. ఒక్క ఫోన్ కాల్ చేయండి.. సమస్య ఎంతటిదైనా పరిష్కరిస్తాం’ అని ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపిస్తున్న పారిశ్రామికవేత్తలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం వికృతమాల పరిధిలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) వేదికగా మూడు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, మరో మూడు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పేడు, ఇనగలూరులో పారిశ్రామికవేత్తలు, శ్రీకాళహస్తి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎప్పుడు, ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా ఒక్క ఫోన్ కాల్ ద్వారా తనతో పంచుకోవచ్చని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల ప్రయాణం అత్యద్భుతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో భారీగా ఉపాధి – టీసీఎల్ సంస్థ ద్వారా రూ.1,230 కోట్ల పెట్టుబడితో టీవీ ప్యానల్స్, మొబైల్ డిస్ప్లే యూనిట్లు తయారు చేసే మంచి వ్యవస్థకు తిరుపతి కేంద్రం కావటం శుభ పరిణామం. దీని ద్వారా దాదాపు 3,200 మందికి ఉపాధి కలిగింది. అది ఈ రోజు (గురువారం) నుండే శ్రీకారం చుట్టడం అభినందనీయం. – రూ.1050 కోట్ల పెట్టుబడితో ఫాక్స్ లింక్ సంస్థ యుఎస్బీ కేబుళ్లు, సర్క్యూట్ బోర్డులు తయారు చేసే పరిశ్రమ పూర్తయ్యింది. దీని ద్వారా మరో 2 వేల మందికి ఉపాధి కలుగుతోంది. సన్నీ ఓపోటెక్ ద్వారా సెల్ఫోన్లలో కెమెరా లెన్స్ తయారు చేసే మరో సంస్థ రూ.280 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైంది. దీనిద్వారా 1200 మందికి ఉద్యోగాలు లభించాయి. – ఈ పరిశ్రమల ద్వారా నెల రోజుల్లోనే దాదాపు 6,400 మందికి ఉద్యోగాలు వస్తాయి. డిక్సన్ టెలివిజన్‌కు సంబం«ధించిన మరో సముదాయానికి శంకుస్థాపన చేశాం. దాదాపు రూ.110 కోట్ల పెట్టుబడితో సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించింది. ఏడాదిలో పనులు పూర్తి చేసి, 850 మందికి ఉద్యోగాలు ఇస్తుంది. – ఫాక్స్ లింక్ ఇండియా లిమిటెడ్ సంస్థ ద్వారా రూ.300 కోట్ల పెట్టుబడితో మరో ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభ దశలోకి రానుంది. తద్వారా 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మొత్తంగా ఎలక్ట్రానిక్స్ కంపెనీల రాక వల్ల రాష్ట్ర యువతకు భారీగా ఉపాధి లభిస్తుంది. 2023 సెప్టెంబర్ తర్వాత అపాచీలో 10 వేల కొలువులు – అక్క చెల్లెమ్మలకు హిల్‌టాప్ ఎస్ఈజెడ్ డెవలప్మెంట్ ఇండియా ప్రైవైట్ లిమిటెడ్(అపాచీ)లో 80 శాతం ఉద్యోగాలు కల్పిస్తాం. అపాచీ ప్రతినిధులకు అభినందనలు. అపాచీ గ్రూపు అంటే ఆడిదాస్ షూలు తయారు చేసే కంపెనీ. – మంచి ఉపాధి అవకాశాలు రావడమే కాకుండా సుమారు రూ.800 కోట్ల పెట్టుబడులతో ఇక్కడ నిర్మాణాలు ప్రారంభమవుతాయి. 2006లో నాన్నగారు (దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఇదే అపాచి, ఆడిదాస్ కంపెనీలను తడలో ఏర్పాటు చేయించారు. ఈ రోజు తడలో ఈ ఒక్క కంపెనీలోనే 15 వేల మంది పని చేస్తున్నారు. అందులో దాదాపు 60 శాతం మంది చెల్లెమ్మలే. ఉద్యోగాలకు మంచి కేంద్రంగా నిల్చింది. – ఆ తర్వాత ఇదే అపాచీ కంపెనీకి సంబంధించి.. ఇటీవల పులివెందులలో మరో 2 వేల మంది చెల్లెమ్మలకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన పనులకు శంకుస్థాపన చేశాం. మరో 9 నెలలల్లో పనులు పూర్తి చేసుకుని ప్రాజెక్టు ఉత్పత్తి ప్రారంభిస్తుంది. – ఇవాళ మనం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు మరో 15 నెలల్లోనే అంటే.. సెప్టెంబర్ 2023 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తుంది. దీనివల్ల 10 వేల మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇందులో 80 శాతం మంది చెల్లెమ్మలే ఉద్యోగులుగా ఉంటారు. ఈ ప్రాంతంలో కొత్త ఉషోదయం మొదలవుతుందని ఆశిస్తున్నా. అక్కడికక్కడే సమస్యల పరిష్కారం ఇనగలూరులో సభ అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రజల నుంచి అభ్యర్థనలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఆ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రులు కె.నారాయణస్వామి, సత్యనారాయణ, విద్యుత్, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఐటీ–పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నా«థ్, టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా, ఎంపీలు మిథున్‌రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, ఎడ్యుకేషన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రామ్‌కుమార్, ఏపీఐఐసీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ అవుల సుకన్య, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, అపాచీ వైస్ ప్రెసిడెంట్ సెర్గియాలీ, వైస్ జనరల్ మేనేజర్ ముత్తు గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల స్థాపనకు చక్కటి ప్రోత్సాహం వేగవంతంగా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా సహకరించారు. వెనువెంటే అనుమతులు ఇప్పించారు. అపాచీ పరిశ్రమలో అడిదాస్ షూలు, లెదర్ జాకెట్స్, బెల్టులు తదితర ఉత్పత్తులను తయారు చేస్తాం. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం చక్కటి ప్రోత్సాహం అందిస్తోంది. – టోనీటూ, అపాచీ సీఈవో, తైవాన్ ఈఎంసీ వేదికగా పలు ఒప్పందాలు – ఇనగలూరులో అపాచీ కంపెనీ భూమి పూజ సందర్భంగా భూసేకరణ, పరిశ్రమల నిర్వహణ, తయారీ, ఉద్యోగ కల్పన తదితర అంశాలపై తైవాన్ దేశానికి చెందిన అపాచీ సీఈవో టోనీటూతో పాటు పలువురు డైరెక్టర్లతో సీఎం జగన్ చర్చించారు. అనంతరం ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, అపాచీ సీఈవో టోనీటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో భూ కేటాయింపుల పత్రాలను మార్చుకున్నారు. అంతకు మందు సీఎం జగన్ అక్కడ ఓ మొక్కను నాటారు. – ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీతో స్మార్ట్ డీవీ టెక్నాలజీస్ ఒప్పందం కుదుర్చుకుంది. హై ఎండ్ వీఏఎల్ఎస్ఐ డిజైన్ టెక్నాలజీలో దాదాపు 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. రూ.100 కోట్ల పెట్టుబడి పెడుతోంది. హై ఎండ్ వీఏఎల్ఎస్ఐ డిజైన్ టెక్నాలజీ 10 వేల మంది యువతకు శిక్షణ కూడా ఇవ్వనుంది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. – టీసీఎల్ కార్పొరేషన్‌కు సంబంధించిన పీవోటీపీఎల్ ఎలక్ట్రానిక్స్ ప్రభుత్వంతో ఎంవోయు కుదుర్చుకుంది. తమ వ్యాపార విస్తరణలో భాగంగా పంపిణీ వ్యవస్థ అనుబంధ పరిశ్రమలను తీసుకొచ్చేందుకు ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. – దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్స్ రంగం అవసరాలు తీర్చేందుకు రాష్ట్రాన్ని తయారీ కేంద్రంగా మార్చేందుకు జెట్‌వర్క్ టెక్నాలజీస్ ఒక ఎంవోయూను కుదుర్చుకుంది. బ్రహ్మాండంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న యూనికార్న్ కంపెనీల్లో జెట్‌వర్క్ టెక్నాలజీస్ ఒకటి. – ఐటీ సేవల ఎగుమతి కోసం టీయర్ రెండు, మూడు నగరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఈఐటీఏతో టెక్‌బుల్స్ ఎంవోయూను కుదుర్చుకుంది. నాడు వైఎస్సార్.. నేడు జగన్ శ్రీకాళహస్తి మండలంలోని ఇనగలూరుకు సమీపంలో దాదాపు పాతిక కిలోమీటర్ల మేర ఇప్పటి వరకు ఒకే ఒక్క పరిశ్రమ ఉంది. అది కూడా 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విద్యుత్ ఉపకరణలకు చెందిన మన్నవరం ప్రాజెక్టును తీసుకొచ్చారు. దీంతో ఆ ప్రాంతంలోని భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజలు పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా వైఎస్సార్‌ను దేవుడిగా కొలుస్తుంటారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే బాటలో ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు అపాచీ పరిశ్రమను తీసుకురావడంతో స్థానికుల సంతోషానికి అవధులు లేవు. అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. జై జగన్ ప్ల కార్డులతో పెద్ద ఎత్తున అన్నదాతలు ట్రాక్టర్లలో వేలాదిగా తరలి వచ్చారు. పరిశ్రమకు చుట్టుపక్కల ఎటూ చూసినా జనమే కనిపించారు. ఆ ప్రాంతమంతా జై జగన్.. జై జగనన్న.. నినాదాలతో హోరెత్తింది. -
చూపు కోసం ఏఐ టెక్నాలజీ.. ఇండియన్ టెక్ నిపుణుల కొత్త ఆవిష్కరణ!
అంధులు, దృష్టి లోపం ఉన్న వారి కోసం ఇద్దరు యంగ్ ఇండియన్ ఎంట్రప్యూనర్లు రూపొందించిన సరికొత్త కళ్ల జోడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను అత్యంత సమర్థంగా ఉపయోగిస్తూ రూపొందించిన కళ్ల జోడు రాబోయే రోజుల్లో ఎంతో మంది కష్టాలను తీర్చనున్నాయి. చెన్నైకి చెందిన కార్తీక్ మహదేవన్, కార్తీక్ కన్నన్‌లు స్థానికంగా ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్‌లో ఉన్నప్పటి నుంచే కంప్యూటర్ విజన్, డిజైనింగ్ టూల్స్‌పై ఇద్దరికీ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. మాస్టర్స్ డిగ్రీ కోసం కార్తీక్ మహదేవన్ నెదర్లాండ్స్‌లోని డెల్ఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అయ్యాడు. అక్కడున్నప్పుడు చూపు లేని వాళ్లు, దృష్టి లోపంతో బాధపడుతున్న వారి కష్టాలను స్వయంగా చూశాడు. దీంతో టెక్నాలజీ సాయంతో వీరి సమస్యకు ఏమైనా పరిష్కారం చూపవచ్చా అనే ఆలోచనలో పడిపోయాడు. వెంటనే తన మిత్రుడు కార్తీక్ కన్నన్‌ని సంప్రదించాడు. ఇద్దరు మిత్రులు కలిసి నిర్విరామంగా పని చేశారు. చివరకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో పని చేసే సరికొత్త కళ్ల జోడుని రూపొందించారు. అనంతరం ఎన్విజన్ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఏఐతో పని చేసే కళ్ల జోళ్లను మార్కెట్లోకి తెచ్చారు. అనతి కాలంలోనే నెదర్లాండ్స్‌తో పాటు యూరప్‌లో ఈ కళ్లజోడు బాగా పాపులర్ అయ్యింది. ఎప్పటి నుంచో అంధులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపింది. ఇటీవల ఈ స్టార్టప్ గురించి ఫోర్బ్స్ పత్రిక సైతం కథనం ప్రచురించింది. ఎన్విజన్ కళ్లజోడులో 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా ఎదురుగా వచ్చే దృశ్యాలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుంది. మనకు ఏదైనా సమచారం కావాల్సి వచ్చినప్పుడు ఈ కళ్లజోడును చిన్నగా టచ్ చేస్తే చాలు ఎదురుగా ఉన్న వస్తువులు, విషయాలు, వార్తలు, అక్షరాలు అన్నింటిని నేరుగా వినిపిస్తుంది. దీని సాయంతో ఎవరి అవసరం లేకుండానే వంటలు చేయడం, నడవడం, ఫోన్లు చేయడం, అవసరాన్ని బట్టి వీడియో కాల్స్, చదవడం వంటి పనులన్నీ చేయోచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మరో మనిషి తోడు లేకుండానే అంధులు, దృష్టి లోపాలు ఉన్న వారు తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. ఎన్విజన్లో అత్యధునిక ఫీచర్లు ఉన్నాయి. వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ సపోర్ట్, ఏఐ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఆరు గంటల పాటు నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చు. ఈ కళ్లజోడు ధర 3,268 యూరోలు ( రూ.2.70 లక్షలు)గా ఉంది. చదవండి: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు బిగ్ షాక్.. గూగుల్ కీలక నిర్ణయం -
ఆటోనగర్లపై ప్రభుత్వ నిర్ణయం ఓ మంచి అవకాశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆటోనగర్లతో పాటు ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలు, ఎస్టేట్లలో దివాలా తీసిన పరిశ్రమలు, యూనిట్ల భూములను బహుళ అవసరాలకు వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కో–ఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీని పారిశ్రామికవేత్తలు స్వాగతిస్తున్నారు. గతంలో నగరాలు, పట్టణాల చివర్ల ఉన్న ఆటోనగర్లు, పారిశ్రామిక పార్కుల చుట్టూ ఇప్పుడు నివాస ప్రాంతాలు వచ్చేశాయి. దీంతో ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆటోనగర్లలోని యూనిట్ల దారుల నుంచి ఆ భూములను రెసిడెన్షియల్, వాణిజ్య అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. నగరం మధ్య యూనిట్లు నడపడం కష్టంగా ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. వీరు భూముల వినియోగ మార్పిడికి మార్కెట్ విలువలో 50 శాతం ఫీజుగా చెల్లించాలి, లేదా 50 శాతం భూమిని ఏపీఐఐసీకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ భూమిని ఇతర అవసరాలకు వినియోగించుకోవడానికి ఏపీఐఐసీ నిరభ్యంతర సర్టిఫికెట్ ఇస్తుంది. అదే సొంతంగా భూమిని కొనుగోలు చేసుకున్న పారిశ్రామిక యూనిట్ల భూ వినియోగ మార్పిడికి మార్కెట్ విలువలో 15 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు భూముల ధరలు భారీగా పెరగడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు. 50 శాతం ప్రభుత్వానికి చెల్లించినా లాభమే అని పేర్కొంటున్నారు. ఈ జీవోలు పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని, విశాఖ ఆటోనగర్ ఎ, బి, సి బ్లాకుల్లోని యూనిట్లకు చక్కటి అవకాశమని ఏపీఐఐసీ ఐలా ఆటోనగర్ చైర్మన్ కె.సత్యనారాయణరెడ్డి (రఘు) తెలిపారు. విశాఖ ఆటోనగర్‌లో తన రెండు యూనిట్లు నివాసప్రాంతాలకు ఆనుకొని ఉన్నాయని, ఇప్పుడు ఈ ఆ యూనిట్లను మార్చుకునే అవకాశం లభించిందని పారిశ్రామికవేత్త సీహెచ్ రవికుమార్ చెప్పారు. మరింత స్పష్టత రావాలి... రాష్ట్ర ఫ్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులపై మరింత స్పష్టత రావాల్సి ఉందని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పథకం కింద ఓ యూనిట్ మూసివేసి అక్కడ గృహ సముదాయాన్ని నిర్మిస్తే ఆ పక్కనే నడుస్తున్న యూనిట్ల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే మార్కెట్ విలువలో 50 శాతం కట్టమంటే చిన్న యూనిట్ దారులకు భారమవుతుందంటున్నారు. ఇప్పటికే ఈ ఉత్తర్వులపై ఏపీ చాంబర్స్ ప్రతినిధులు ఆటోనగర్ అసోసియేషన్‌తో సంప్రదింపులు జరిపామని, మరింత స్పష్టత కోసం త్వరలో ఏపీఐఐసీ అధికారులను కలవనున్నట్లు ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ (ఎలెక్ట్) పొట్లూరి భాస్కరరావు పేర్కొన్నారు. -
14 ఏళ్లకే అద్భుతం అనిపించిన ట్విన్ బ్రదర్స్.. ఇంతకీ ఏం చేశారంటే..?
ఎందుకు? ఏమిటి? ఎలా....అనే ఆసక్తి వీరిని రకరకాల శాస్త్ర,సాంకేతిక పుస్తకాలు చదివేలా చేసింది. కొత్తగా ఆలోచించేలా చేసింది. కొత్త మార్గంలో వెళ్లేలా చేసింది. చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకునేలా చేసింది... పద్నాలుగేళ్ల వయసులో పిల్లలు ఎలా ఉంటారు? సినిమాలంటే బోలెడు ఇష్టపడతారు. సంగీతం అంటే చెవి కోసుకుంటారు. వీరతాళ్లు మెడలో వేసుకొని వీడియో గేమ్స్ ఆడతారు. అయితే దిల్లీకి చెందిన ట్విన్ బ్రదర్స్ యశ్‌రాజ్ భరద్వాజ్, యువరాజ్ భరద్వాజ్ మాత్రం ఈ వయసులోనే తమ వయసుకు మించిన పనులు చేశారు. అద్భుతం అనిపించుకున్నారు. కాస్త వెనక్కి వెళితే.. అందరు పిల్లలలాగే ఈ కవల సోదరులకు క్రికెట్ అంటే చెప్పలేనంత ఇష్టం. చదువు మీద కంటే ఆట మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టేవాళ్లు. ‘ఇలా అయితే చదువు పూర్తిగా దెబ్బతింటుంది. మీరు కొంతకాలం క్రికెట్‌ను దూరం పెడితే మంచిది’ అని బుజ్జగింపు ధోరణిలో చెప్పాడు తండ్రి. ఇక అంతే...అప్పటి నుంచి క్రికెట్ జోలికి వెళ్లలేదు. చదువే వారి ప్రపంచం అయింది. చదవండి: టీచరమ్మ స్కూలు సేద్యం నేషనల్ జాగ్రఫిక్–డిస్కవరీ చానల్స్ చూడడం ద్వారా ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే జిజ్ఞాస పెరిగింది. తమ పుస్తకాలే కాకుండా పై తరగతి పుస్తకాలు చదివేవారు. సందేహాలు వస్తే సీనియర్లను అడిగేవారు. సైన్స్ ఫిక్షన్‌తో పాటు రిసెర్చ్ పేపర్స్, విజ్ఞానదాయకమైన బ్లాగ్స్ విరివిగా చదివేవారు. ప్రాజెక్ట్ మెనేజ్మెంట్ కన్సల్టెన్సీ, ట్రాన్స్ఫర్మెషన్ కన్సల్టింగ్, స్ట్రాటజిక్ స్టడీస్, ఫ్రాడ్ ఎనాలసిస్, డాటా ఎనాలటిక్స్...ఇలా రకరకాల విషయాల గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. రకరకాల జర్నల్స్ చదివి వాటి గురించి చర్చించుకునేవారు. రిసెర్చ్ ఐడియాలను రాసుకునేవారు. ఈ క్రమంలోనే సొంతంగా రిసెర్చ్ పేపర్స్ రాయడం నేర్చుకున్నారు. ఫరీదాబాద్(హరియాణా)లోని ‘మానవ్ రచన ఇంటర్నేషనల్ యూనివర్శిటీలో’ ఇంజనీరింగ్ పూర్తికాకముందే బ్రెయిన్–కంప్యూటర్ ఇంటర్ఫేస్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆల్–ఇన్–వన్ మెడికల్ అసిస్టెన్స్...ఇలా ఎనిమిది అంశాలలో పేటెంట్ పొందారు. ‘క్రికెట్ మానేసినప్పుడు మొదట్లో చాలా బాధ అనిపించింది. అయితే కొత్త విషయాల గురించి తెలుసుకోవడం, కొత్త విషయాల గురించి ఆలోచించడంలో క్రికెట్లో కంటే ఎక్కువ సంతోషం దొరికింది’ అంటాడు యువరాజ్. రకరకాల బహుమతులు, గ్రాంట్స్, ఫెలోషిప్స్ ద్వారా వచ్చిన డబ్బుతో ‘పెటోనిక్ ఇన్ఫోటెక్’ అనే కన్సల్టెన్సీ సర్వీస్‌ను ప్రారంభించారు. ఇది టెక్నాలజీ, ఫైనాన్స్, అగ్రికల్చర్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్‌కేర్...మొదలైన రంగాలలో కన్సల్టింగ్ సర్వీస్‌ను అందిస్తుంది. పేరు పొందిన కంపెనీలు కూడా వీరి క్లయింట్స్ జాబితాలో ఉన్నాయి. కోవిడ్ దెబ్బకు పెద్ద పెద్ద కంపెనీలు నష్టాల బాట పట్టాయి. ఇలాంటి క్లిష్ల సమయంలోనూ ‘పెటోనిక్ ఇన్ఫోటెక్’ దెబ్బతినలేదు. ‘ఒక విధంగా చెప్పాలంటే కోవిడ్ మా ముందు ఎన్నో సవాళ్లను పెట్టింది. ఎన్నో ద్వారాలు తెరవడానికి కారణం అయింది. మునపటి కంటే ఎక్కువ శక్తితో పనిచేశాం. ప్రతి చాలెంజ్ ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఉద్యోగుల సంఖ్యను పెంచుకోగలిగాము’ అంటాడు యశ్‌రాజ్ భరద్వాజ్.‘హుందాతనం నిండిన మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాం. చదువే మన ఆస్తి అని ఎప్పుడూ చెబుతుండేవారు నాన్న’ అంటాడు యువరాజ్ భరద్వాజ్. ఈ ఇద్దరిని ఒకేసారి చూస్తే ‘ఎవరు యశ్‌రాజ్?’ ‘ఎవరు యువరాజ్?’ అని వెంటనే పోల్చుకోవడం కష్టం కావచ్చుగానీ ‘ఎవరికి వారు సాటి’ అని మెచ్చుకోవడంలో ఎలాంటి అయోమయానికి తావు లేదు. -
అంబేడ్కర్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ లీగ్.. స్టార్లప్‌లకు కొత్త వరం
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాల విభాగంలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతిచ్చేందుకు ఐఎఫ్సీఐ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. అంబేడ్కర్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ లీగ్ పేరుతో త్వరలో తొలి దశను ప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ ఎస్.తోమర్ పేర్కొన్నారు. తద్వారా బిజినెస్ ఐడియాలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించనున్నట్లు తెలియజేశారు. ఐఎఫ్సీఐ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థే ఐఎఫ్సీఐ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. సంస్థ ప్రస్తుతం ఐదు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్‌ను నిర్వహిస్తోంది. వీటిలో రెండింటిని సామాజికంగా వెనుకబాటు, వెనుకబడిన కులాల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్కు మద్దతిచ్చేందుకు వినియోగిస్తోంది. 2020లో తొలుత షెడ్యూల్డ్ కులాల(ఎస్సీలు)కు చెందిన 1,000 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో మిషన్‌ను ప్రారంభించింది. తద్వారా అంబేడ్కర్ సోషల్ ఇన్నోవేషన్ ఇన్క్యుబేషన్ మిషన్ పేరుతో వినూత్న ఆలోచనలను ప్రోత్సహిస్తూ ఎస్సీల కోసం ఫండ్‌ను ఏర్పాటు చేసిననట్లు ఈ సందర్భంగా తోమర్ తెలియజేశారు. చదవండి: నవ్విస్తూ.. నేర్పిస్తూ.. ఇంటింటికి చేరువై.. లక్షల కోట్లకు అధిపతిగా -
CM YS Jagan: విప్లవం సృష్టిస్తున్నాం
సాక్షి, కడప/బద్వేలు/గోపవరం/అట్లూరు: వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక విప్లవం సృష్టిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా సుమారు 75 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. రాయలసీమ రూపురేఖలు మారుతాయని స్పష్టం చేశారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా తొలిరోజు గురువారం ఆయన ప్రొద్దుటూరు, గోపవరం, కొప్పర్తిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తొలుత రూ.515.90 కోట్లతో ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత గోపవరం మండలంలో రూ.800 కోట్లతో ఏర్పాటు చేయనున్న సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. సాయంత్రం కడప సమీపంలోని కొప్పర్తిలో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎంఐహెచ్), వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, పలు కంపెనీల ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 540 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్, మరో 3,167 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ రెండింటిలో రూ.1,580 కోట్లతో వసతులు కల్పిస్తున్నామన్నారు. రోడ్లు, విద్యుత్ సరఫరా, ఫ్యాక్టరీ షెడ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇక్కడ నిర్మించిన నాలుగు షెడ్లలో ఇప్పటికే ఈఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ సంస్థ ఏర్పాటైందని, ఏప్రిల్ నాటికి 1800 మందికి ఉపాధి కల్పిస్తుందని స్పష్టం చేశారు. 50 మంది అక్క చెల్లెమ్మలకు జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చామని, వాళ్లంతా శిక్షణ పూర్తయ్యాక ఇక్కడే పని చేస్తారని చెప్పారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. మరెన్నో సంస్థలు ► మరో ఆరు ఎలక్ట్రానిక్ సంస్థలు గ్రౌండ్ బ్రేకింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మొదటిది ఈఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్. రెండవది డిజికాన్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ. మూడవది సెలకాన్ రెజుల్యూట్ సంస్థ. నాలుగవది చంద్రహాస్ ఎంటర్ప్రైజెస్, ఐదవది యూటీఎస్‌పీఎల్. ఆరవది డిక్సన్ రెండవ ప్లాంట్. ► ఈ ఆరు సంస్థలు దాదాపు రూ.600 కోట్ల పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించాం. ఈ పరిశ్రమల ద్వారా ఆరు నుంచి తొమ్మిది నెలల్లో దాదాపు 7,500 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ► వీవీడీఎన్ అనే మరో సంస్థ కూడా ఇక్కడ రూ.365 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది. ఈ ఒక్క సంస్థ ద్వారానే 6,400 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆరు నుంచి తొమ్మిది నెలల్లోనే ఇది కార్యరూపం దాలుస్తుంది. బ్లాక్ పెప్పర్, హార్మోనిసిటీ అనే మరో రెండు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఐఏటీ డివైజ్‌లు, ట్యాబ్లెట్స్ తయారీ ఈ పార్కులోనే జరగబోతోంది. కార్బన్ మెగా టౌన్షిప్ మాస్టర్ ప్లాన్‌ను సీఎంకు వివరిస్తున్న కంపెనీ ప్రతినిధులు రాయలసీమ రూపురేఖలు మార్చేలా.. ► వీవీడీఎన్ సంస్థ 5జీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, బిగ్‌డేటా, ఎనలిటిక్, ఒరిజినల్ డిజైన్, మ్యానిఫ్యాక్చరింగ్ చేయబోతోంది. ఇదే పార్కులో మరో 18 ఎంఎస్ఎంఈల ప్రారంభానికి కూడా శిలాఫలకాలు వేస్తున్నాం. ► రాయలసీమ ఎన్విరాన్‌కేర్, బీఎస్ ల్యాబొరేటరీ, స్వర్ణముఖి కాంక్రీట్ రూ.84 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. వీటి ద్వారా మరో 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిన తర్వాత ఇక్కడ 75 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ► చదువుకున్న మన పిల్లలకు మన జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు రావాలని, మొత్తం రాయలసీమ ప్రాంతానికి మంచి జరుగుతుందని అడుగులు ముందుకు వేస్తున్నాం. ఒకవైపు కొప్పర్తి, మరొకవైపు నెల్లూరు, చిత్తూరు సరిహద్దుల్లోని శ్రీసిటీ.. రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు ఉపయోగపడతాయి. వీటి వల్ల ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా. మీ అందరికీ అందుబాటులో ఉంటాం ► ఎలక్ట్రానిక్స్ ఎంఎస్ఎంఈ రంగంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు కొప్పర్తిని ఎంచుకున్నందుకు పారిశ్రామిక వేత్తలందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ మద్దతుగా ఉంటూ అన్ని విధాలా సహకారం అందిస్తాం. పరిశ్రమలు ఇక్కడికి రావడానికి పరిశ్రమల శాఖ నుంచి సుబ్రమణ్యం, నందకుమార్, జయలక్ష్మి చాలా కృషి చేశారు. వీరంతా మీకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ► సీఎంఓ నుంచి సోలోమన్ కూడా మీతో ప్రారంభం నుంచి సంప్రదింపులు చేస్తున్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది, కష్టం వచ్చినా ఒక్క ఫోన్‌కాల్ ద్వారా అందుబాటులో ఉంటాం. పరిశ్రమలు ఏర్పాటు చేసిన వారికి ఇస్తామని చెప్పిన ఇన్సెంటివ్స్ ఇచ్చాం. పారిశ్రామిక వేత్తలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ఇన్సెంటివ్‌ల గురించి పదేపదే చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రజలు సెంచురీ ఫ్లై వుడ్‌తో 6 వేల మందికి ఉపాధి ► వెనుకబడిన ప్రాంతమైన బద్వేలు నియోజకవర్గంలోని గోపవరంలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమతో యువతకు ఉపాధి, రైతుల ప్లాంటేషన్‌కు గిట్టుబాటు ధర లభిస్తుంది. దేశంలోనే అతి పెద్దదైన వుడ్ పరిశ్రమ బద్వేలులో ఏర్పాటు చేయడం చాలా సంతోషించ దగ్గ విషయం. ► దీంతో ప్రత్యక్షంగా రెండు వేల మందికి, పరోక్షంగా నాలుగు వేల మందికి ఉపాధి దొరుకుతుంది. వైఎస్సార్, ప్రకాశం, నెల్లూరు జిల్లా రైతులు సాగు చేస్తున్న సుబాబుల్ కర్రలకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. వ్యవసాయ హబ్‌తో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశముంది. తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగు పడతాయి. ► రైతులు సైతం తమ భూములు ఇచ్చి పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావడం గొప్ప విషయం. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సెంచురీ ఫ్లై బోర్డ్స్ లిమిటెడ్ (పీసీఐఎల్) యాజమానులు సజ్జన్ భజాంక, సంజయ్ అగర్వాల్‌కు కృతజ్ఞతలు. ► బద్వేలు నియోజకవర్గంలో ఇప్పటికే రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు ప్రస్తుతం రూ.6 కోట్లతో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేశాం. కాశినాయన మండల కేంద్రంలో నూతనంగా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో బద్వేలు ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుంది. లక్షాధికారులుగా రైతులు ► గోపవరం జాయింట్ ఫార్మింగ్ కో ఆపరేటివ్ సోసైటీ ప్రాజెక్టు భూముల్లో కొంత భాగాన్ని వ్యవసాయ–పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు తీసుకున్నారు. ఇందులో లీజు ద్వారా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ప్రస్తుతం రెండు ఎకరాల వంతున 201 మందికి పట్టాలు అందజేశారు. ► ఈ సందర్భంగా పట్టాలు అందుకున్న ఎస్సీ రైతులు దేవదాసు, మాతంగి పుట్టి, రవీంద్రబాబు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు పెద్ద పీట వేశారని సంతోషం వ్యక్తం చేశారు. భారీ పరిశ్రమకు సమీపంలో తమకు రెండు ఎకరాలకు పట్టా ఇచ్చి లక్షాధికారులుగా చేస్తున్నారన్నారు. ► ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజద్‌బాష, మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, శాసన మండలి వైస్ ఛైర్మన్ జకియాఖానం, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సీఎం విజన్‌తోనే ముందుకు వచ్చాం సీఎం వైఎస్ జగన్ గొప్ప దార్శనికత కలిగిన నాయకుడు. మేము మొదట సెంచురీ ప్లై్లౖవుడ్ కంపెనీని తమిళనాడు లేదా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకున్నాం. అయితే సీఎం జగన్ మమ్మల్ని ఒప్పించి, అనువైన ప్రాంతాన్ని చూపించి అన్ని రకాలుగా అండగా నిలుస్తుండటంతో గోపవరంలో ఏర్పాటు చేస్తున్నాం. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,600 కోట్లు కాగా, మొదటి విడతలో రూ.800 కోట్లు పెడుతున్నాం. ప్రత్యక్షంగా 2 వేలమందికి, పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి లభిస్తుంది. రైతులకు కనీసం 50 శాతం ఆదాయం పెరిగే అవకాశముంది.మొదటి దశలో ఎండీఎఫ్ వుడ్స్ తయారీ పరిశ్రమను రూ.600 కోట్లతో, లామినేటెడ్ వుడ్స్ పరిశ్రమను రూ.200 కోట్లతో చేపడతాం. ఎండీఎఫ్ను 18 నెలల్లో, లామినేటెడ్ వుడ్స్‌ను 15 నెలల్లో పూర్తి చేస్తాం. రెండో విడతలో రూ.200 కోట్లతో ప్లైవుడ్స్, రూ.600 కోట్లతో పార్టికల్ బోర్డ్ వ్యాపారాన్ని చేపడతాం. ఇవి 2024 డిసెంబర్ నాటికి పూర్తవుతాయి. – సజ్జన్ భజాంక, సంజయ్ అగర్వాల్, సెంచురీ ప్లైవుడ్ కంపెనీ యజమానులు -
Tanya Khanijow: ఎంట్రప్రెన్యూర్, ట్రావెల్ ఫిల్మ్‌మేకర్.. 8 లక్షల మంది సబ్స్క్రైబర్స్!
Tanya Khanijow is an Indian YouTuber, travel blogger, and a photographer: ఏ స్కూల్లోనైనా రెండేళ్లు చదివితే అక్కడి వాతావరణం, తోటి విద్యార్థులు మంచి స్నేహితులైపోతారు. అక్కడి నుంచి మారి వేరే స్కూల్లో చేరాలంటే బాధగా.. కొత్త వాతావరణానికి అలవాటు పడటం కష్టంగా అనిపిస్తుంది. అటువంటిది ఢిల్లీకి చెందిన తాన్య పదోతరగతి పాసయ్యేలోపు చాలా స్కూళ్లు మారింది... వెళ్లిన ప్రతిచోటా అక్కడి వాతావరణానికి సులభంగా అలవాటు పడడమే కాదు. అక్కడి వారితో ఇట్టే కలిసిపోయి స్నేహితులను సంపాదించుకునేది. తనకు అది నచ్చడంతో పెద్దయ్యాక ఏకంగా ట్రావెలింగ్‌నే కెరియర్‌గా మలచుకుంది. వివిధ ప్రదేశాల్లో పర్యటిస్తూ అక్కడి ఆసక్తికర అంశాలను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ లక్షలమందిని అలరిస్తూ, ట్రావెల్ బ్లాగర్, సోషల్ మీడియా ఎంట్రప్రెన్యూర్, ట్రావెల్ ఫిల్మ్‌మేకర్‌గా రాణిస్తోంది. ఢిల్లీలోని ఓ ఆర్మీ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి తాన్య ఖనీజో. ఇంట్లో తాన్యానే పెద్దమ్మాయి, తనకు టివేషా అనే చెల్లి ఉంది. నాన్న ఆర్మీలో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తుండేవారు. నాన్న ఉద్యోగ బదిలీ కారణంగా ప్రతి రెండేళ్లకు ఒక కొత్త ప్రదేశాన్ని చూడాల్సి వచ్చేది తాన్యకు. కుటుంబం మకాం మార్చిన ప్రతి ఊరిలో అక్కడి పరిస్థితులు, వాతావరణానికి అలవాటు పడటానికి కొంచెం ఇబ్బంది పడినప్పటికీ తొందరలోనే ఆ కొత్త ప్రదేశాన్ని ఇష్టపడేది. అలా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని తొమ్మిది రకాల స్కూళ్లలో పాఠశాల విద్యనభ్యసించింది. తరువాత ఢిల్లీ టెక్నాలాజికల్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివింది. హాస్టల్లో ఉండి చదువుకున్న తాన్యా ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా రకరకాల అడ్వెంచర్స్లో పాల్గొనేది. అంతేగాక కాలేజీ స్నేహితులతో కలిసి ట్రిప్స్‌కు వెళ్తుండేది. ఇలా తరచూ ఊర్లు మారడం, ట్రిప్‌లకు వెళ్తుండడంతో చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్‌పై తాన్యకు మక్కువ ఏర్పడింది. ఉద్యోగం వదిలేసి.. 2016లో ఇంజినీరింగ్ పూర్తైన వెంటనే ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో బిజినెస్ అనలిస్ట్‌గా చేరింది. ఉద్యోగంలో చేరినప్పటికీ ట్రావెలింగ్ మీద ఆసక్తి వదులుకోలేక ఉద్యోగం చేస్తూనే మరోపక్క సమయం దొరికినప్పుడల్లా ట్రిప్స్‌కు వెళ్లేది. ఇలా వెళ్లిన ప్రతిసారి అక్కడి ప్రదేశాల్లోని ఆసక్తికరమైన వాటిని ఫోటోలుగా, కొన్నింటిని వీడియోల రూపం లో భద్రపరచుకునేది. ఒకసారి వీటన్నింటిని సోషల్ మీడియా లో పెడితే బావుంటుందన్న ఆలోచన రావడంతో... ఒక బ్లాగ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ఓపెన్ చేసి దానిలో తన దగ్గర ఉన్న ఫోటోలు, వీడియోలు పోస్టు చేసేది. వాటికి మంచి స్పందన లభిస్తుండడంతో ఉద్యోగాన్ని వదిలేసి, ట్రావెలింగ్‌నే కెరియర్‌గా మలచుకోవాలనుకుంది. ఇందుకోసం జీతాన్ని పొదుపు చేసి డబ్బును జమ చేసుకుంది. తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి పూర్తి సమయాన్ని ట్రావెలింగ్కు కేటాయించింది. సోలో గర్ల్ ఇన్ పాండిచ్చేరి.. ఉద్యోగం మానేసిన వెంటనే తాన్యా ఖనీజో పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. తొలిసారి ఢిల్లీ నుంచి పాండిచ్చేరికి నాలుగురోజుల సోలో ట్రిప్ వీడియోను ‘సోలో గర్ల్ ఇన్ పాండిచ్చేరి’ పేరిట పోస్టుచేసింది. ఈ వీడియోకు మంచి స్పందన లభించడంతో ట్రావెల్ వీడియో లు వ్యూవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయని గ్రహించి, షూట్ చేసిన వీడియోలను మరింత నాణ్యంగా అందించేందుకు అర్థవంతంగా ఎడిట్ చేసి అప్లోడ్ చేసింది. వ్యూవర్స్ మరింతగా పెరిగారు. తొలినాళ్లలో ట్రావెల్ టిప్స్‌తోపాటు దియా, లైఫ్‌స్టైల్, ఫ్యాషన్‌కు సంబంధించిన అనేక అంశాలను పోస్టు చేసేది. తరువాత తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ ప్రదేశాలను ఎలా సందర్శించవచ్చు, వంటి అంశాలతో కూడా వీడియోలు పోస్టు చేసేది. ఇండియాలోనే తొలి మహిళా ట్రావెలర్ కావడంతో తాన్యా ఛానల్‌కు మంచి వ్యూస్ వచ్చేవి. దేశ విదేశాల్లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి విశేషాలను అర్థవంతంగా వివరిస్తుండడంతో.. ప్రస్తుతం తాన్య యూట్యూబ్ ఛానల్‌కు దాదాపు ఎనిమిది లక్షల మంది సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్ లో నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తన జీవితంలో అనుకోకుండా ఎదురైన పరిస్థితులను ఆనందంగా స్వీకరించడమేగాక, వాటినే కెరియర్‌గా మలుచుకునీ ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది తాన్య. చదవండి: Bipin Rawat Wife Madhulika: భర్తకు తగ్గ భార్య.. ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే -
పారిశ్రామిక ప్రగతికి పూర్తి సహకారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం, పారిశ్రామిక కార్యకలాపాలను పెంచడం, ఎగుమతుల వృద్ధి లాంటి అంశాల్లో తోడ్పాటు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్ బృందం బుధవారం ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలతో ఇష్టాగోష్టి నిర్వహించింది. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆథారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా రాష్ట్ర పారిశ్రామికవేత్తలను రాజీవ్ కుమార్ కోరారు. సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్)లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, నిబంధనలను మరింత సరళీకృతం చేయడం ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చని చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించిందన్నారు. సులభతర వ్యాపారానికి దాదాపు 1,300 నియమ, నిబంధనలు అడ్డుగా ఉన్నాయని, ఇందులో 397 నిబంధనలను పూర్తిగా లేదా సరళీకృతం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియచేసిందని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, సంఘాలు చేసిన సూచనలను తప్పకుండా పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాటిని క్రోడీకరించి నీతి ఆయోగ్‌కు అందచేస్తారని, వాటిని ఆయా మంత్రిత్వ శాఖలకు పంపి పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు ముఖ్యమంత్రి ప్రాధాన్యం వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్ తెలిపారు. కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలకు గత ఐదేళ్ల బకాయిలను చెల్లించడంతోపాటు వైఎస్సార్ నవోదయం ద్వారా రుణాలను పునర్వ్యవస్థీకరించి ఆదుకున్నారని గుర్తు చేశారు. ఈ చర్యలతో కోవిడ్ సమయంలో కూడా దేశ సగటు కంటే జీఎస్డీపీ, ఎగుమతుల్లో రాష్ట్రం అధిక వృద్ధి రేటు నమోదు చేసిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా వెనుకబడిన జిల్లాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా రాయితీలు ఇస్తున్నామన్నారు. విభజన హామీ ప్రకారం పెట్రోలియం కారిడార్ ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని కోరారు. ప్రభుత్వ సాయంతో నిలబడ్డాం పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని, కేంద్రం మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఆదుకోవాలని పారిశ్రామికవేత్తలు, సంఘాలు నీతి ఆయోగ్‌ను కోరాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాత బకాయిలను చెల్లించడంతో నిలదొక్కుకున్నామని, ఇందుకు ముఖ్యమంత్రి జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పైడా కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి నీతి ఆయోగ్ మిగిలిన వాటి కంటే ఎక్కువగా ఏపీని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ స్పెషల్ సెక్రటరీ కె.రాజేశ్వరరావు, ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, ఏపీఐఐసీ వీసీఎండీ జవ్వాది సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
వస్తే ఎర్రతివాచీతో స్వాగతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులతో వచ్చేవారికి ఎర్రతివాచీతో స్వాగతం పలుకుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. పారిస్ పర్యటనలో ఉన్న కేటీఆర్ నేతృత్వంలోని బృందం శనివారం పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో భేటీలు నిర్వహించింది. ‘యాంబిషన్ ఇండియా’ సదస్సులో అంతర్భాగంగా పలు భేటీలు జరిగాయి. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు తెలంగాణలో పర్యటించాల్సిందిగా ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలకు ఆహ్వానం పలికారు. కేటీఆర్ వెంట ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, ఏరో స్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం ఉన్నారు. కేటీఆర్ భేటీలు సాగాయిలా.. ► ఫ్రాన్స్‌లో రెండో అతిపెద్ద ఫార్మాసూటికల్ గ్రూప్ యాజమాన్యంతో మంత్రి కేటీఆర్ భేటీ అ య్యారు. తెలంగాణలో ఉన్న ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగ వాతావరణాన్ని వివరించడంతో పాటు పరిశ్రమలు, విద్యారంగం అనుసంధానానికి రీసెర్స్ అండ్ ఇన్నొవేషన్ సర్కి ల్ ఆఫ్ హైదరాబాద్ చూపుతున్న చొరవను ప్ర స్తావించారు. 2022లో జరిగే బయో ఏసియా స దస్సులో పాల్గొని పరస్పర భాగస్వామ్యానికి ఉ న్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా కోరారు. ► సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఇంజిన్స్ సీఈవో జీన్‌పాల్ అల్రే, భారత్‌లో ఫ్రాన్స్ మాజీ రాయబారి అలెగ్జాండర్ జిగెల్తోనూ కేటీఆర్ భేటీ అయ్యా రు. సాఫ్రాన్ ఇటీవల హైదరాబాద్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ తయారీ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణలో వైమానిక, రక్షణ రంగాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుపై సాఫ్రాన్ ప్రతినిధి బృందంతో చర్చించారు. ఫ్రాన్స్‌లో భారత రాయబార కార్యాలయం ఎయిర్అటాషెగా ఉన్న ఎయిర్ కమెడోర్ హిలాల్ అహ్మద్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ► 115 దేశాల్లో 4 వేలకుపైగా ప్రాజెక్టుల ద్వారా సుస్థిర అభివృద్ధి కోసం నిధులు సమకూరుస్తున్న ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎఎఫ్‌డీ) ఆసియా, మధ్యప్రాచ్యం వ్యవహారాల డైరెక్టర్ ఫిలిప్ ఓర్లియాంజేతోనూ కేటీఆర్ సమావేశమయ్యారు. రక్షణ, సైనిక, వైమానిక, అంతరిక్ష, రవాణా రంగాల్లో పనిచేస్తున్న థేల్స్ గ్రూప్ సీనియర్ ఉపాధ్యక్షులు మార్క్ డార్మన్, భారత్ సీఈవో ఆశిష్ సరాఫ్‌తో కేటీఆర్ బృందం భేటీ జరిపింది. హైదరాబాద్ మెట్రో నిర్వహణలో భాగస్వామిగా ఉన్న కియోలిస్ గ్రూప్ సీఈవో బెర్నార్డ్ తబరీతో భేటీ అయ్యారు. ఎనర్జీ, ఆటోమేషన్‌లో డిజిటల్ పరిష్కారాలు చూపే ష్నీడర్ ఎలక్ట్రిక్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు లుక్ రెమోంట్ తో సమావేశమయ్యారు. ► పారిస్‌లోని లక్సంబర్గ్ ప్యాలెస్‌లో రాష్ట్ర ప్రభుత్వం, బోర్డెక్స్ మెట్రోపోల్ నడుమ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. సుస్థిర నగరాలను అ భివృద్ధి చేసే లక్ష్యం తో పలు ప్రాజెక్టులపై తెలంగాణ, బోర్డెక్స్ మెట్రోపోల్ కలసి పనిచేస్తాయి. 2015 అక్టోబర్ 13న ఇరుపక్షాల నడుమ కుదిరిన ఒప్పందానికి కొనసాగింపుగా ఈ ఎంఓయూ కు దిరింది. ► పారిస్ పర్యటనలో ఉన్న కేటీఆర్‌ను నీలా శ్రీనివాస్ నేతృత్వంలోని ‘తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్రాన్స్’సభ్యులు, నారాయణరావు నేతృత్వంలోని ‘ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్’సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. -
నలభైలలో 'శ్రీమంతుల' జోరు ఇంకా తగ్గ లేదు
విద్యార్ధిగా ఉన్నత చదువులు పూర్తి చేసుకొని చాలా మంది ఉపాధి వేటలో పడతున్నారు. అయితే వారిలో ప్రతి ఒక్కరికీ వ్యాపారం చేసి మరో నలుగురికి ఉపాధి కల్పించాలని ఉంటుంది. కానీ సరైన ఐడియా లేక, లేదంటే ఆర్ధిక ఇబ్బందులు, నష్ట భయంతోనో బిజినెస్ కాన్సెప్ట్‌ను పక్కన పెట్టి జాబ్ చేస్తుంటారు. 30ఏళ్లకు జాబ్‌లో సెటిలై, ఉద్యోగం చేయగా వచ్చిన జీతాన్ని పొదుపుగా వాడుకుంటూ 40ఏళ్లకు ఇల్లు కట్టుకుంటుంటారు. వారిలో మరికొందరు అందుకు భిన్నంగా ఆలోచిస్తుంటారు. రోజూవారీ జీవితంలో తమకు ఎదురయ్యే సమస్యల్ని గుర్తించి వాటికి పరిష్కారం చూపిస్తారు. ఆ పరిష్కారమే నలుగురికి ఉపయోగపడేలా రేయింబవళ్లు కష్టపడి వ్యాపార సామ్రజ్యాన్ని విస్తరిస్తుంటారు. దీంతో 35 ఏళ్లు లేదంటే 40ఏళ్లలోపు వేలకోట్లు సంపాదించి ఆదర్శప్రాయంగా నిలుస్తుంటారు. అలాంటి వారిలో ఈ పదిమంది ప్రత్యేకమనే చెప్పుకోవాలి. 27ఏళ్ల నుంచి 40ఏళ్లలోపే రూ.1000కోట్ల లేదంటే అంతకంటే ఎక్కువగా సంపాదించి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా 40 ఏళ్లలోపు సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ -2021 జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నారు. 'ఉద్యోగం అయితే జీవితం ఒక్కడిది. అదే వ్యాపారం అయితే జీవితం నలుగురిది' అని అనుకున్నారు. అందుకే వీళ్లు ఇప్పుడు భారత్‌లోనే సెల్ఫ్ మేడ్ బిలినియర్లుగా ఎదిగారు. ఇటీవల ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా 40 ఏళ్లలోపు సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ -2021 రిపోర్ట్‌ను విడుదల చేసింది.ఆ రిపోర్ట్ ప్రకారం రూ.1000 కోట్ల సంపాదించిన వారిలో ఈ 10మంది 'శ్రీమంతులు' ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం ► మీడియా.నెట్ అధినేత దివ్యాంక్ తురాఖియా 39ఏళ్ల వయస్సులో రూ.12,500 కోట్లు సంపాదించి హురూన్ జాబితాలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. ► బ్రౌజర్ స్టాక్స్ కో ఫౌండర్ నకుల్ అగర్వాల్ రూ.12,400 కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ► బ్రౌజర్ స్టాక్స్ మరో కో-ఫౌండర్ రితేష్ అరోరా రూ.12,400 కోట్లతో 3 స్థానాన్ని దక్కించుకున్నారు. ► నేహా నార్ఖేడ్ అండ్ ఫ్యామిలీ - నేహా నార్ఖేడ్ కో-ఫౌండర్ నేహా నార్ఖేడ్ రూ.12,200 కోట్లతో 4 స్థానంలో ఉన్నారు. ► జెరోధా- 35ఏళ్ల నిఖిల్ కామత్ జెరోధా కో- ఫౌండర్‌గా దేశంలోనే అతిపెద్ద ట్రేడింగ్ నెట్ వర్క్‌ను నిర్వహిస్తున్నారు. రూ. 11,100 కోట్లతో 5 స్థానంలో ఉన్నారు. ► థింక్ అండ్ లెర్న్ స్లోగన్ పేరుతో బైజూస్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సంస్థను ప్రారంభించిన రిజు రవీంద్రన్ రూ.8,100 కోట్లతో 6స్థానంలో ఉన్నారు. ► ప్రముఖ దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కో-ఫౌండర్ బిన్నీ బన్సాల్ రూ.8వేల కోట్లతో 7స్థానాన్ని దక్కించుకున్నారు. ► ఫ్లిప్ కార్ట్ మరో కో-ఫౌండర్ సచిన్ బన్సాల్ రూ. 7,800 కోట్లతో 8వ స్థానంలో నిలిచారు. ► ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ అధినేత భువీష్ అగర్వాల్ (36) రూ.7,500 కోట్లతో 9వ స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా, ఓలా ఎలక్ట్రిక్ బైక్ అమ్మకాలతో ఈ ఏడాది ఆయన ఆస్థి 114శాతం పెరిగింది. ► వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021లో 27ఏళ్లతో అతి పిన్న వయస్కుడిగా ఉన్న ఓయో రూమ్ రితీష్ అగర్వాల్ రూ.6,300 ఆస్తుల్ని కలిగి ఉన్నారు. ఈ ఏడాది ఆయన ఆస్తులు 40శాతం పెరిగాయి. -
అధిక ఉద్యోగాలిస్తే ప్రోత్సాహకాలు: సీఎం
శివాజీనగర: రాష్ట్రంలో ఉద్యోగ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు సీఎం బసవరాజ బొమ్మై చెప్పారు. సోమవారం నగరంలోని ప్యాలెస్ మైదానంలో పరిశ్రమల, వాణిజ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన పరిశ్రమల అదాలత్‌ను ప్రారంభించి మాట్లాడారు. విధానం సిద్ధమైందని, త్వరలోనే అమల్లోకి వస్తుందని, ఏ పారిశ్రామికవేత్త అధికంగా ఉద్యోగాలను ఇస్తారో వారికి ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రోత్సాహకాలను ఇస్తుందని తెలిపారు. దేశంలో కర్ణాటకను పరిశ్రమలకు అనుకూలమైన రాష్ట్రంగా చేయడానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. మాజీ సీఎం యడియూరప్ప మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో పరిశ్రమల రంగం ముందంజలో ఉందంటే ఇక్కడున్న ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కారణమన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి మురుగేశ్ నిరాణి సహా మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్యాన్‌కేక్ .. ఆ రుచి వెనుక కష్టాల కథ
ఎగిసిపడే అగ్నిని తలకిందులుగా పట్టుకున్నా జ్వాల పైకే లేస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయి చేరుకోవాలనే తపన ఉన్న వ్యక్తుల చుట్టూ వ్యతిరేక పరిస్థితులు ఎక్కువగా కాలం అడ్డుగా నిలవలేవు. సమయస్ఫూర్తి, పట్టుదల, ఓపిక ఉంటే చదువు, డబ్బుతో పని లేకుండా బిజినెస్‌లు చేయవచ్చు అనేందుకు వికేశ్ షా జీవితం ఓ ఉదాహారణ. పేరుతో ఆయన్ని గుర్తు పట్టడం కష్టం, కానీ 99 ప్యాన్‌కేక్ అంటే గుర్తు పట్టడం తేలిక. డిగ్రీ కూడా చేయని అతను దేశంలోనే ఓ ఫుడ్ ఫ్రాంచైజీకి యాజమాని స్థాయికి ఎలా ఎదిగాడు ? 99 Pancakes Founder Vikesh Shah Success Story: ముంబైకి చెందిన వికేశ్ షాది చిన్నప్పుడు కలిగిన కుటుంబమే. తండ్రి వజ్రాల వ్యాపారిగా బాగానే సంపాదించాడు, అయితే వికేశ్ పదో తరగతిలో ఉన్నప్పుడు తండ్రికి వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చింది. ఉన్న ఆస్తులన్నీ పోయాయి. రెండు గదుల ఇంటికి మారాల్సి వచ్చింది. ఆ దిగులుతో తండ్రి మంచం పట్టగా కుటుంబం గడవడం కోసం తల్లి ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. ఆ సంపాదన సరిపోక, ఇంటర్‌లోనే చదువుకి పులిస్టాప్ పెట్టి.. దగ్గరల్లో ఉన్న ఓ బేకరిలో బాయ్‌గా 1995లో వికేశ్షా చేరాడు. నెల జీతం రూ. 700 ఆ సమయంలో ఆ సంపాదన ఆ కుటుంబానికి ఎంతో అవసరం. బాయ్ టూ మేనేజర్ ఇంటర్‌తోనే చదువు ఆపేసినా చుట్టూ పరిస్థితులను అంచనా వేయడంలో వికేశ్ దిట్ట. బేకరీకి ఎలాంటి కస్టమర్లు వస్తున్నారు... ఏ ఐటమ్స్ ఎక్కువగా తింటున్నారు. అందులో వాళ్లకి ఏం నచ్చుతుందో పసిగట్టాడు. ఓనర్‌కి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండటంతో రెండేళ్లలోనే ఆ బేకరీలో బాయ్ నుంచి మేనేజర్‌గా ఎదిగాడు. కేటరింగ్ జీవితంలో పైకి ఎదగాలన్న తపన్న ఉన్న వాళ్లు చిన్న చిన్న విజయాలకే సంతృప్తి పడిపోరు. వికేశ్లో పైకి ఎదగాలన్న పట్టుదల ఎక్కువ. అందుకే మేనేజర్‌గా పని చేస్తుండగా ఉన్న పరిచయాలు ఆధారంగా చేసుకుని క్యాటరింగ్ సర్వీస్ ప్రారంభించాడు. బర్త్‌డేలు, కిట్టీ పార్టీలకు క్యాటరింగ్ ప్రారంభించారు. అలా పదేళ్లలో నాలుగు లక్షల రూపాయలు పోగేశాడు మరోమెట్టు కష్టపడే తత్వం, తన కాళ్లపై తాను నిలబడాలనే కోరిక బలంగా ఉన్న వికేశ్ స్వంతంగా బేకరీ ప్రారంభించాలని డిసైడ్ అయ్యాడు. తన దగ్గరున్న డబ్బులు బేకరీ స్టార్ట్ చేసేందుకు సరిపోకపోవడంతో స్నేహితులు, పరిచయస్తులను పార్టనర్లుగా చేర్చుకుని బిజినెస్ ప్రారంభిద్దామన్నాడు. నీకు బిజినెస్ ఎందుకురా? ‘నువ్వు కనీసం డిగ్రీ కూడా చేయలేదు. ఏదో కలుపుగోలుగా ఉన్నాం కదా అని బిజినెస్ అదీ అంటూ మాట్లాడకు. కేటగింగ్ ఏదో నడుస్తుంది కదా చూసుకో చాలు.. పెద్ద పెద్ద కలలు కనకు’ అంటూ వికేశ్ని నిరుత్సాహపరిచారు. ఆ సమయంలో ఆత్మ విశ్వాసం తప్ప వికేశ్కి తోడుగా ఎవ్వరూ నిలవలేదు. తీవ్ర సందిగ్ధం మధ్య తన డ్రీమ్‌ను నెరవేర్చుకోవాలనే డిసైడ్ అయ్యాడు. అలా బంధువులు, స్నేహితుల దగ్గర చేసిన అప్పుతో 2007లో హ్యాపినెస్ డెలీ పేరుతో బేకరీ ప్రారంభించాడు. నల్లేరు మీద నడక బేకరీ బాయ్‌గా ఉన్నప్పుడే కస్టమర్ల పల్స్ తెలుసుకున్న వికేశ్కి హ్యపినెస్ డెలీ బేకరీ నిర్వాహణ నల్లేరు మీద నడకే అయ్యింది. చూస్తుండగానే బేకరీ బిజినెస్ ఊపందుకుంది. జీవితంలో సకల సౌకర్యాలు ఒక్కొక్కటిగా సమకూరాయి. ఒకప్పటి ఆర్థిక సమస్యలు ఇప్పుడు లేవు. దీంతో వెకేషన్‌కి కుటుంబంతో కలిసి 2014లో యూరప్ టూర్‌కి వెళ్లాడు. తొలిసారి అక్కడే యూరప్ పర్యటనలో ఉండగా అక్కడ ప్యాన్‌కేక్ కాన్సెప్టు వికేశ్ని విపరీతంగా ఆకట్టుకుంది. వెస్ట్రన్ కంట్రీస్‌లో స్ట్రీట్ ఫుడ్ నుంచి మెయిన్ రెస్టారెంట్ల వరకు ప్యాన్‌కేక్‌లు విపరీతంగా అమ్ముడైపోవడం చూశాడు. ఇరవై ఏళ్లుగా బేకరీ ఫీల్డ్‌లో ఉన్న తనకీ వాటి రుచి నచ్చింది. ఆచరణలో ముంబైకి వచ్చిన వెంటనే బేకరీ ఫీల్డులో ఉన్న చెఫ్‌లను పిలిపించి పాన్ కేక్ కాన్సెప్టు చెప్పాడు. చాలా మంది ఇదిక్కడ సక్సెస్ కాదంటూ పెదవి విరిచారు. వాళ్ల మాటలు లెక్క చేయకుండా బేకరీలోనే పాన్ కేక్‌ను తయారు చేసి కస్టమర్లు అందించాడు. అందులో ఓ వెస్ట్రన్ లేడీ ‘ పాన్ కేక్ బాగుందని.. ఎక్స్‌క్లూజివ్‌గా ఓ స్టోర్ ఓపెన్ చేయమని’ సలహా ఇచ్చింది. నమ్మకంతో ఇండియాలో ప్యాన్‌కేక్ కాన్సెప్టు కొత్త .. ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ఓపెన్ చేస్తే జనాల ఆదరణ లభిస్తుందా లేదా అనే సందేహం. ఎందుకంటే ఒకప్పుడు వజ్రాల వ్యాపారిగా లక్షలు గడించిన తండ్రి ఒక్క దెబ్బతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. కుటుంబం రోడ్డు మీదికొచ్చిన పరిస్థితి కళ్ల ముందు కదలాడుతోంది. జీవితంలో అంతా బాగుంది అనుకునే సమయంలో రిస్క్ ఎందుకు అనే భయం మధ్య ఊగిలసాట ఏడాది పాటు కొనసాగింది, చివరకు కలను నిజం చేసుకునేందుకు రిస్క్ చేసినా పర్వాలేదనే నమ్మకంతో 99 ప్యాన్‌కేక్ పేరుతో ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ని 2017లో కాలాగోడా సెంటర్లో ఓపెన్ చేశాడు వికేశ్. ఒక్క కేక్ ధర రూ.99 కావడంతో 99 పాక్కేక్స్గా పేరు పెట్టారు. భయపడ్డట్టే పాన్ కేక్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లో తొలి వారం అమ్ముడైన కేకులు కేవలం రూ. 500లవే. ఆ తర్వాత రెండు వారాలు ఒక్క కేకు అమ్ముడు పోలేదు. ఇదే సమయంలో ఆ షాప్ ముందు ముంబై మున్సిపాలిటీ వాళ్లు మరమ్మత్తుల పేరుతో రోడ్డు తవ్వేయడంతో నెల రోజుల పాటు బిజెనెస్ డల్‌గా మారింది పట్టు వదల్లేదు ప్యాన్‌కేక్ అనే పేరు కొత్త, పైగా ఖాళీ కుర్చీలు కనిపిస్తుండటంతో కష్టమర్లు రావట్లేదని గమనించాడు. వెంటనే కష్టమర్లతో నిండిపోయినట్టుగా కనిపించేలా రోజు ప్యాన్‌కేక్ స్టోర్‌కి వచ్చి కూర్చోవాలంటూ తన స్నేహితులు, కుటుంబ సభ్యులను కోరాడు. వారికే ఆర్డర్లు సర్వ్ చేసేవాడు. ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యింది. వారం తిరిగే సరికి స్నేహితులు రావాల్సిన అవసరం తప్పింది. నెల రోజుల్లో టేబుల్స్ ఖాళీగా లేని స్థితికి చేరుకుంది. దేశవ్యాప్తంగా 2017లో వికేశ్ ఇండియాకు తీసుకువచ్చిన ప్యాన్‌కేక్‌లు మూడేళ్లు తిరిగే సరికి దేశవ్యాప్తంగా ఫేమస్ ఫుడ్ ఐటమ్‌గా మారిపోయాయి. ముంబైతో పాటు పద్నాలుగు సిటీల్లో 65 స్టోర్లు ఓపెన్ చేసే స్థితికి చేరుకుంది. హైదరాబాద్‌లో కూడా 99 ప్యాన్‌కేక్ స్టోర్ ఉంది. కేవలం రెండేళ్లలోనే రూ. 16 కోట్ల టర్నోవర్ సాధించే స్థితికి 99 ప్యాన్‌కేక్ చేరుకుంది. ఇరవై ఐదేళ్ల కిందట ఇంటర్ పూర్తి చేసి తప్పనిసరి పరిస్థితుల్లో బేకరీ బాయ్‌గా చేరిన వ్యక్తి నేడు కోట్లకు అధిపతి కావడమే కాకుండా ఎందరికో ఉపాధిని కల్పిస్తున్నాడు. సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం చదవండి : ఒంటరి మహిళల ఉమ్మడి శక్తి -
పారిశ్రామికవేత్తలకు అవార్డులతో ముఖ్యమంత్రి సత్కారం
సాక్షి, అమరావతి: గత రెండేళ్లలో రాష్ట్రంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది పారిశ్రామికవేత్తలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరించారు. రెండేళ్లలో రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడులు, నమోదు చేసిన వ్యాపార పరిమాణం, ఉద్యోగాల కల్పన ఆధారంగా ఇండస్ట్రీ చాంపియన్లుగా ఎనిమిది మందిని, ఎగుమతుల్లో కీలక భాగస్వామ్యం వహించిన ఏడుగురు ఎగుమతిదారులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ ఎంపిక చేసింది. విజయవాడలో మంగళవారం జరిగిన వాణిజ్య ఉత్సవ్‌లో వీరిని మెమెంటో, శాలువా, పుష్పగుచ్ఛాలతో ముఖ్యమంత్రి సత్కరించారు. ఇండస్ట్రీ చాంపియన్ అవార్డులు అందుకున్నవారు 1. పద్మశ్రీ అవార్డు గ్రహీత బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సయంట్ లిమిటెడ్ 2. కబ్ డంగ్ లే, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 3. అనిల్ చలమశెట్టి, ఎండీ, గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ 4. అవినాష్‌చంద్ రాయ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అదాని ఇంటర్నేషనల్ 5. ఇషాన్‌రెడ్డి ఆళ్ల, ప్రమోటర్ డైరెక్టర్, రామ్కీ గ్రూపు 6. సి.వి.రాజులు, వైస్ ప్రెసిడెంట్, ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 7. కె.మదన్‌మోహన్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అరబిందో ఫార్మా 8. జోష్ ఫగ్లర్, ఎండీ, రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా లిమిటెడ్ ఎక్స్పోర్ట్ అవార్డులు అందుకున్నవారు 1. సి.శరవణన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, బ్రాండిక్స్ ఇండియా అప్పరెల్ ప్రైవేట్ లిమిటెడ్ 2. లీ మి తేస్, జనరల్ మేనేజర్, అపాచీ ఫుట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 3. బి.వి.కృష్ణారావు, ఎండీ, పట్టాభి ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4. వంకా రాజకుమారి, ఎండీ, ఇండియన్ హైర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5. పాండవ ప్రసాద్, జీఎం, ఎస్ఎన్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ 6. సింగలూరి శారదాదేవి, పార్టనర్, ఆర్వీ కార్ప్ 7. కె.శ్రీనివాసరావు, ఎండీ, అమరావతి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ -
పెట్టుబడులు పెట్టండి.. రాష్ట్రంతో పాటు మీరూ వృద్ధి చెందండి: సీఎం జగన్
ఈ కష్టకాలంలో పారిశ్రామికవేత్తలు చూపి స్తున్న అంకితభావానికి, ఎగుమతి దారులు, వాణిజ్య మండళ్లు, శ్రమిస్తున్న కార్మికులందరికీ అభినందనలు. పారిశ్రామికవేత్తల్లో ఈ వాణిజ్య ఉత్సవ్ మరింత నమ్మకాన్ని కల్పిస్తుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా రాష్ట్రంతోపాటు అభివృద్ధి చెందేలా మరింత మందిని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందుబాటులో ఉంటాం. సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. మేం చేయాల్సినవి ఏమైనా ఉంటే సూచనలు చేయండి. కచ్చితంగా నెరవేరుస్తాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఎగుమతులు క్షీణించినప్పటికీ రాష్ట్ర ఎగుమతుల్లో మాత్రం వృద్ధి నమోదైందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సరైన మౌలిక వసతులు, చక్కటి విధానాలు అమలు చేస్తే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోగలమనేందుకు ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో నమోదవుతున్న వృద్ధి, జీడీపీ గణాంకాలే నిదర్శనమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎగుమతులు 330 బిలియన్ డాలర్ల నుంచి 290 బిలియన్ డాలర్లకు పడిపోగా అదే సమయంలో రాష్ట్ర ఎగుమతులు 14.1 బిలియన్ డాలర్ల నుంచి 16.8 బిలియన్ డాలర్లకు పెరిగాయని వివరించారు. 2020–21లో దేశ జీడీపీ 7.3 శాతం క్షీణించగా రాష్ట్ర జీఎస్డీపీ క్షీణత 2.58 శాతానికే పరిమితమైందన్నారు. ప్రస్తుతం దేశ ఎగుమతుల్లో 5.8 శాతంగా ఉన్న రాష్ట్ర వాటాను 2030 నాటికి పది శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుని సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా రెండు రోజుల ట్రేడ్ కార్నివాల్ ‘వాణిజ్య ఉత్సవ్’ను మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించి మాట్లాడారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్రంతో పాటు మీరు కూడా (పారిశ్రామికవేత్తలు) అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికను విడుదల చేయడంతో పాటు ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్పోర్ట్ ట్రేడ్ పోర్టల్, వైఎస్సార్ ఏపీ వన్ బిజినెస్ అడ్వైజరీ సర్వీసులను బటన్ నొక్కి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగం వివరాలివీ.. వాణిజ్య ఉత్సవ్–2021ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారం రోజులు మీతోనే... ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వచ్చిన వివిధ దేశాల దౌత్యాధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎగుమతి దారులు, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిళ్ల సభ్యులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రివర్గ సహచరులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇతర భాగస్వాములందరికీ స్వాగతం. విజయవాడలో రెండు రోజులపాటు వాణిజ్య ఉత్సవ్ అనంతరం నాలుగు రోజులపాటు జిల్లాల్లో కూడా జరుగుతాయి. వారం రోజులపాటు వాణిజ్య వర్గాలు, ప్రభుత్వం కలసి మెలసి పనిచేస్తాయి. సంక్లిష్ట సమయం.. గత రెండేళ్లలో పెను సవాళ్లను ఎదుర్కొన్నాం. తొలి ఏడాది మాంద్యం కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటే రెండో సంవత్సరం కోవిడ్ విపత్తును చూశాం. దీనివల్ల దేశవ్యాప్తంగా రెవెన్యూ వసూళ్లు 3.38 శాతం పడిపోయాయి. 2018–19లో దేశం మొత్తం రెవిన్యూ వసూళ్లు రూ.20,80,465 కోట్లు ఉంటే 2019–2020లో రూ.20,10,059 కోట్లకు పడిపోయాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 4 శాతానికి పడిపోయింది. 2020–21లో మరింత క్షీణించి 7.3 శాతానికి పడిపోయింది. దేశ ఎగుమతులు 330 బిలియన్ డాలర్ల నుంచి 290 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఎగుమతుల రంగానికి ఇది అత్యంత సంక్లిష్ట సమయం. 9 నుంచి 4కి ఎగబాకిన ర్యాంకు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రం ఎగుమతులు 19.4 శాతం వృద్ధి చెందాయి. రాష్ట్ర ఎగుమతులు 14.1 బిలియన్ డాలర్ల నుంచి 16.8 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇందులో సముద్రపు ఉత్పత్తులు 15 శాతం ఉండగా షిప్స్, బోట్ల నిర్మాణ రంగం 8.5 శాతం, ఫార్మా రంగం 7.3 శాతం, ఐరన్, స్టీల్ ఉత్పత్తులు 7.3 శాతం, నాన్ బాస్మతి రైస్ 4.8 శాతంతో ఎగుమతులకు దోహదపడ్డాయి. 2018–19లో ఎగుమతుల్లో రాష్ట్రం 9వ స్థానంలో ఉండగా 2019–20లో 7వ స్థానానికి చేరుకుంది. 2020–21లో నాలుగో స్థానానికి చేరుకున్నాం. రాష్ట్ర జీఎస్డీపీ కోవిడ్ సంవత్సరం 2020–21లో 2.58 శాతం క్షీణిస్తే దేశ జీడీపీ 7.3 శాతం క్షీణించింది. ఈ వివరాలు ఎందుకు చెబుతున్నామంటే.. సరైన మౌలిక వసతుల కల్పన, చక్కటి విధానాల ద్వారా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలమని మా గట్టి నమ్మకం. పారిశ్రామిక ప్రగతి, ఎగుమతుల వృద్ధికి ఈ రెండూ చాలా కీలకం. రెండేళ్లలో చాలా దూరం ప్రయాణం గత రెండేళ్లలో మేం చాలా దూరం ప్రయాణం చేశాం. రూ.5,204 కోట్లతో రాష్ట్రంలో 16,311 ఎంఎస్ఎంఈలు నెలకొల్పడం ద్వారా 1,13,777 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇది కాకుండా గత రెండేళ్లలో 68 అతి భారీ, భారీ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. రూ.30,175 కోట్ల పెట్టుబడులు ఈ పరిశ్రమల ద్వారా వచ్చాయి. 46,119 మందికి ఉపాధి లభించింది. మరో రూ.36,384 కోట్ల పెట్టుబడితో 62 భారీ, అతి భారీ పరిశ్రమలు నిర్మాణాన్ని పూర్తి చేసుకోబోతున్నాయి. 76,960 మందికి ఉద్యోగాలను కల్పించే సామర్థ్యం వీటికి ఉంది. గత ఏడాది కాలంలోనే రూ.26,391 కోట్లతో ఏర్పాటు కానున్న 10 మెగా ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాం. వీటివల్ల 55,024 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ – గెయిల్ స్థిరమైన పారిశ్రామిక ప్రగతి కోసం అవసరాలకు సరిపడా ఇంధన వనరులు అందుబాటులో ఉండడం చాలా కీలకం. సరిపడా గ్యాస్ లభ్యం కావాలి. పరిశ్రమలు, గృహ అవసరాల కోసం గ్యాస్ అందుబాటులో ఉంచడానికి గెయిల్ భాగస్వామ్యంతో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. అతి తక్కువ ఖర్చుతో ఇంధన వనరులను అందుబాటులోకి తేవడం దీని ఉద్దేశం. 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు నైపుణ్య లేమిని తీర్చడానికి ప్రపంచస్థాయిలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కోటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు తిరుపతి, విశాఖల్లో స్కిల్ వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక యూనివర్సిటీ పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టిపెడితే మరో వర్సిటీ ఐటీ రంగంలో నైపుణ్యాలను పెంపొందించటంపై దృష్టి సారిస్తుంది. ఇవి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచి ఉద్యోగాల కల్పన దిశగా నడిపిస్తాయి. కొత్త పోర్టుల నిర్మాణం... రాష్ట్రానికి 974 కి.మీ. సువిశాల తీర ప్రాంతం ఉంది. ఎగుమతులు వృద్ధి చెందడానికి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు పోర్టులను నిర్మిస్తోంది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు, ప్రకాశం జిల్లా రామాయపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టులను నిర్మిస్తోంది. పొరుగు రాష్ట్రాలకు కూడా ఈ పోర్టులు సమీపంలో ఉన్నాయి. మచిలీపట్నం పోర్టు తెలంగాణకు, రామాయపట్నం తమిళనాడుకు, భావనపాడు ఉత్తరాది రాష్ట్రాలకు సమీపంలో ఉన్నాయి. విదేశీ వాణిజ్యాన్ని పెంచడంలో ఈ పోర్టులు కీలక పాత్ర పోషిస్తాయి. పారిశ్రామికీకరణ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పోర్టుల వార్షిక నిర్వహణ సామర్థ్యం 254 మిలియన్ టన్నులు కాగా మూడు కొత్త పోర్టుల వల్ల తొలిదశలో మరో 65 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం వృద్ధి చెందుతుంది. 8 కొత్త ఫిషింగ్ హార్బర్లు వీటితోపాటు మరో 8 ఫిషింగ్ హార్బర్లను కూడా నిర్మిస్తున్నాం. ఏపీకి ఇంత పెద్ద సముద్ర తీర ప్రాంతం ఉన్నా హార్బర్లు లేకపోవడంల్ల మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండు విడతల్లో 8 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. ఇందుకోసం రూ.3,827 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీనివల్ల 76,230 మంది మత్స్యకారులు లబ్ధి పొందడమే కాకుండా మరో 35 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజీలు, చేపలు, రొయ్యల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి రావడం ద్వారా ఎగుమతులు పెరుగుతాయి. 25 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల రైతులకు మంచి ధరలు దక్కడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించడం వల్ల ఎగుమతులు పెరుగుతాయి. ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పలువురు వాణిజ్యవేత్తలు పాల్గొన్నారు. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లున్న ఏకైక రాష్ట్రం దేశంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. విశాఖ – చెన్నై, చెన్నై – బెంగళూరు, హైదరాబాద్– బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తిస్తాయి. ఈ కారిడార్లు ఆర్థిక వృద్ధి రేటును పెంచడమే కాదు పారిశ్రామికీకరణను పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్తాయి. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను అభివృద్ధి చేస్తోంది. 3,155 ఎకరాల్లో మల్టీ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నాం. నాణ్యమైన విద్యుత్తు, నీరు, ఎస్టీపీలు లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. రూ.20 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే దిశగా అడుగులేస్తున్నాం. దాదాపు లక్ష మందికిపైగా ఉపాధి కల్పించే సమర్థత ఈ పార్కుకు ఉంది. ఇదే ఇండస్ట్రియల్ పార్కులో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. 800 ఎకరాల్లో రూ.730 కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మిస్తున్నాం. దీనిద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. 25 వేల మందికి ఉద్యోగాల కల్పన సామర్థ్యం ఈఎంసీకి ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్టీల్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగిన దృష్ట్యా 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రూ.13,500 కోట్లతో కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీని నెలకొల్పుతున్నాం. ఆకట్టుకున్న ఎగ్జిబిషన్ స్టాల్స్ విజయవాడలో రెండురోజుల వాణిజ్య ఉత్సవ్‌లో రాష్ట్ర పరిశ్రమలశాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శకులతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అమితంగా ఆకర్షించింది. రాష్ట్రంలో ఎగుమతి అవకాశాలను తెలిపే విధంగా మొత్తం 29 స్టాల్స్‌తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న 15 ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. ఏపీ ఎక్స్పీరియన్స్ ఎరినా పేరుతో రాష్ట్రంలో మౌలిక వసతులు, వైఎస్సార్ వన్ ద్వారా అందించే బిజినెస్ అడ్వైజరీ సేవలు, రాష్ట్రంలో ఎగుమతులకు అవకాశం ఉన్న ఉత్పత్తులు, ఎగుమతులకు ప్రభుత్వం సహకారం తెలిపే విధంగా మూడు తెరలు ఏర్పాటు చేసి వీడియోలు చూసేలా టచ్ స్క్రీన్ కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 15 నిమిషాలపాటు ఆసక్తిగా ఎరినా, ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను సందర్శించారు. మానవ శిరోజాలను ఎగుమతిచేసే స్టాల్స్, టీ ఎగుమతులు, హస్తకళలు, ఎంపెడా ఏర్పాటు చేసిన అక్వేరియం చేపలు, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ, హస్తకళల స్టాల్స్‌ను సందర్శించి వ్యాపారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ స్టాల్స్‌లో చిన్న వేంకటేశ్వరస్వామి ప్రతిమను చూసి వీటిని పెద్దగా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అతిథులకు ఇచ్చే మెమెంటోగా వాడుకోవచ్చని సీఎం అధికారులకు సూచించారు. ఎగ్జిబిషన్ స్టాల్స్‌లో ఉత్పత్తులను తిలకిస్తున్న సీఎం జగన్ -
‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’ పథకంతో మా జీవితాల్లో వెలుగు
సాక్షి, అమరావతి: ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎంట్రప్రెన్యూర్స్‌తో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తాడికొండకు చెందిన మైక్రో ఎంట్రప్రెన్యూర్ వీర వర్ధిణి మాట్లాడుతూ.. ‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’ పథకం కింద అందించే సబ్సిడీ పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ ట్యాంకర్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే దీనికి రూ. 44 లక్షల వరకు ఖర్చు అయినట్లు పేర్కొన్నారు. అయితే యూనియన్ బ్యాంక్ నుంచి రూ. 38 లక్షల వరకు లోన్ పొందినట్లు చెప్పారు. కాగా ఇందులో సబ్సిడీ కింద రూ.19.75 లక్షల ప్రభుత్వం నుంచి అందించినట్లు పేర్కొంది. ఈ విధమైన పోత్రాహకాలు అందిచడం, ఎస్సీ, ఎస్టీ మహిళలను ప్రభుత్వం ప్రోత్సహించడం సంతోషంగా ఉందన్నారు. చదవండి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందాలి: సీఎం జగన్ గతంలో హడావుడి ఎక్కువ.. పని తక్కువ: సీఎం జగన్ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసిన సీఎం జగన్ -
ఆకాశం హద్దులు దాటించిన వ్యక్తి.. ఇప్పుడెక్కడ?
Deccan Aviations GR Gopinath దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. ఆ మాటల స్ఫూర్తికి వాస్తవ రూపం ఇచ్చినవారిలో జీఆర్ గోపినాథ్ ఒకరు. విమాన ప్రయాణం చేసే హక్కు సంపన్నులకే కాదు. ఈ దేశంలో ఉన్న సామాన్యులకు కూడా ఉందని చాటి చెప్పారు. ఒక్క రూపాయికే ఆకాశయానం కలిగించిన గొప్ప ఎంట్రప్యూనర్ గోపినాథ్. ఆకాశం నీ హద్దురా డైనమిక్ ఎంట్రప్యూనర్, సోషల్ రీఫార్మర్, దేశభక్తుడైన గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఆకాశం నీ హద్దురా అనే సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా అందరూ చూసే ఉంటారు. అయితే ఇప్పుడా గోపినాథ్ ఏం చేస్తున్నారు. తన దక్కన్ ఏవియేషన్ సంస్థ గురించి ఏం చెప్పారు. ఈ దేశ భవిష్యత్తు గురించి ఆయన కంటున్న కలలు ఏంటీ ? ఇటీవల మనీ కంట్రోల్ మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్య అంశాలు మీ కోసం.. మిస్ అవుతున్నా దక్కన్ ఏవియేషన్స్ సీఈఓగా ఉన్నప్పుడు సామాన్యులను విమానంలోకి ఎక్కించడం, టైర్ టూ సిటీల మద్య ఎయిర్ కనెక్టివిటీ కల్పించడం వంటి పనులు చేపట్టినప్పుడు ఒంట్లో కొత్త శక్తి ప్రవహించేది. ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఇప్పుడది మిస్ అవుతున్నాను. ఆ తప్పు చేయను పునర్జన్మలపై నాకు నమ్మకం లేదు, కానీ మళ్లీ జన్మంటూ ఉంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నా డెక్కన్ ఏవియేషన్‌ను విజయ్‌మాల్యాకు అమ్మను గాక అమ్మను. డెక్కన్ ఏవియేషన్‌ని అమ్మేయాలని నిర్ణయం తీసుకోవడం పొరపాటు. నేను నా మనసు మాట విని ఉండాల్సింది. కానీ అలా చేయకుండా డెక్కన్ ఏవియేషన్‌లో పెట్టుబడిదారుల అభిప్రాయం వైపుకే మొగ్గు చూపాను. డెక్కన్ ఏవియేషన్‌ని అమ్మేయడం వల్ల మాకు లాభాలు వచ్చాయనే మాట నిజమే. కానీ సామాన్యులకు విమానయానం దగ్గర చేయాలనే నా కల. కానీ అలా జరగలేదు. అయితే జరిగినదాని గురించి జరగబోయేదాని గురించి నాకు పెద్దగా బాధ అయితే లేదు. రాజకీయాల్లో... కింగ్‌ఫిషర్ ఓనర్ విజయ్ మాల్యాకు ఎయిర్ దక్కన్ని అమ్మేసిన తర్వాత ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో బెంగళూరు సౌత్ నియోకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాను. అయినా సరే నా ప్రయాణం అపకుండా అవినీతి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్నాను. ఆప్ పార్టీ పెట్టగానే దానిలో చేరాను. అయితే ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నియంత్రృత్వ పోకడలు నచ్చక ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేశాను. కానీ పార్టీ పెట్టిన తీరు, ఎన్నికల్లో గెలిపించిన వైనం, పరిపాలన చేస్తున్న విధానాల పరంగా అరవింద్ కేజ్రీవాల్ అంటే ఇప్పటికీ అభిమానం, గౌరవం ఉన్నాయి. రాజకీయాల్లో నూతన అధ్యాయాన్ని అరవింద్ కేజ్రీవాల్ ధైర్యంగా ప్రారంభించారనే నమ్ముతాను. అలాంటి నేతలు కావాలి బడా కార్పోరేట్ కంపెనీలు అన్ని కూడా పాలసీ తయారీలో కీలకంగా ఉండే వారితో దగ్గరి సంబంధాలు నెరుపుతున్నాయి. కార్పోరేట్ శక్తులకు మంచి నాయకులు కాదు మనకు కావాల్సింది. సామాజికంగా విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చే సృజనాత్మక ఐడియాలు కలిగిన ఎంట్రప్యూనర్లు ప్రోత్సహించేవారు కావాలి. అప్పుడే మన సమాజం వేగంగా మార్పులు వస్తాయి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి. వారిపైనే ఆశలు ఇప్పుడున్న ఎంట్రప్యూనర్లలో ఓలా భవీష్ అగర్వాల్, పేటీఎం విజయ్ శేఖర్ శర్మలు ఎక్కువగా నన్ను ఆకట్టుకున్నారు. ఇలా వ్యక్తులు మనకు వేలమంది కావాలి. వారంత విభిన్న రంగాల్లోకి చొచ్చుకుపోవాలి. తమకున్న ఐడియాలను ఆచరణలోకి తెచ్చి దేశ గతిని మార్చేయాలి. నా దృష్టిలో ఈ రోజుల్లో ఫ్రీడం ఫైటర్లు అంటే ఎంట్రప్యూనర్లే. వారే ఈ దేశ భవిష్యత్తును నిర్మించగలరు. అలా జరగడం లేదు నరేంద్రమోదీ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టగానే రెడ్టేపిజంలో మార్పులు వస్తాయని ఆశించాను. కానీ అలా ఏం జరగడం లేదు. రెట్రోట్యాక్స్ను రద్దు చేయడానికే ఏడేళ్లు సమయం తీసుకున్నారు. కొత్త ఎంట్రప్యూనర్లకు క్షేత్రస్థాయిలో అనవసరంగా ఎదురయ్యే అడ్డంకులు తొలగించాలి. ఐడియాలో సాధ్యమైనంత త్వరగా ఆచరణలోకి వచ్చే వెసులుబాటు ప్రభుత్వ పరంగా ఉండాలి. అప్పుడే మనం చైనాను దాటి అభివృద్ధిలో ముందుకు పోగలం. రిటైర్ అయ్యాక రిటైర్మెంట్ అంటూ ఏమీ లేదు. దక్కన్ ఏవియేషన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బిజిగానే ఉంటున్నాను. కర్నాటకలోని మా సొంతూరిలో వ్యవసాయం క్షేత్రంలో ఎక్కువ సేపు గడుపుతుంటా. దీంతోపాటు డెక్కన్ ఛార్టర్స్ అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా హోదాలో ఉన్నాను. ఈ సంస్థ ఆధీనంలో యాభై వరకు హెలికాప్టర్లు, జెట్ విమానాలు ఉన్నాయి. వీటి నిర్వాహణకు సంబంధించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను. ఇక రాజకీయాలు, భారత ఆర్థిక వ్యవస్థ, అవినీతి తదితర అంశాలపై గంటల తరబడి జరిగే చర్చాగోష్టీల్లో భాగమవుతాను. వర్తమాన అంశాలపై పుస్తకాలు కూడా రాస్తుంటాను. ఇప్పటికే సింపుల్ ఫ్లై, వన్ కనాట్ మిస్ ద ఫ్లైట్ అనే పుస్తకాలు అచ్చయ్యాయి. - సాక్షి , వెబ్‌డెస్క్ చదవండి: స్త్రీలు ఎగరేసిన విమానం -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సర్టిఫికెట్ కోర్సు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరుతో ఆన్లైన్లో సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నామని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ ఎస్కే షహాబుద్దీన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: పేదల వకీల్ తరిమెల బాలిరెడ్డి కన్నుమూత వ్యాపార ప్రణాళికలు, ఆర్థిక కార్యకలాపాలు విజయవంతంగా నిర్వహించడం, మార్కెటింగ్, బ్రాండింగ్, ప్రాజెక్ట్ సమగ్ర నివేదిక (డీపీఆర్), బ్యాంకుల స్కీంలు తదితర అంశాలపై ఆయా రంగాల్లోని నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, మహిళలు, యువతీ యువకులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ అందజేస్తామని తెలిపారు. వివరాలకు 80085 79624, 93914 22821నంబర్లలో సంప్రదించాలని కోరారు. చదవండి: AP: అరుదైన ఆలయం.. భారతమాతకు వందనం -
ఈ చాక్లెట్లో షుగర్ ఉందా, 200 మంది డాక్టర్లతో చర్చలు చివరికి ఇలా
స్వీట్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు! ముంబై కుర్రాడు హర్ష్ కేడియకు ఇంకాస్త ఎక్కువ ఇష్టం. అయితే ఆ అమితమైన ఇష్టానికి డయాబెటిస్ బ్రేక్ వేసింది. పన్నెండేళ్ల వయసులో హర్ష్ డయాబెటిస్ బారిన పడ్డాడు. ఇక అప్పటి నుంచి జీవనశైలి, అలవాట్లను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. పార్టీలకు... చెక్.. స్వీట్లకు... కట్ పార్టీలకు... చెక్..స్వీట్లకు.... కట్... ఇలా రకరకాల చెక్‌లతో జీవితం దుర్భరప్రాయంగా అనిపించింది. ఖైదీ జీవితానికి తన జీవితానికి తేడా ఏమిటి! అని కూడా అనిపించింది. నోరు కట్టేసుకోకుండా రుచి మొగ్గలను మళ్లీ హుషారెత్తించడానికి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ‘అసలు ఈ డయాబెటిస్ ఏమిటి?’ అని దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి భారీ కసరత్తే చేశాడు. చాక్లెట్లో షుగర్ ఎంత ఉందో తెలుసుకునేందుకు రెండు వందల మందికి పైగా వైద్యులను కలిసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. టీవీల్లో టూత్ పేస్ట్ యాడ్ లా.. ఈ చాక్లెట్ లో షుగర్ ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ‘ఏ డయాబెటిక్ చెఫ్’ మార్కెట్టులో ‘షుగర్–ఫ్రీ’ పేరుతో అందుబాటులో ఉన్న చాలా చాక్లెట్లలో ఎంతో కొంత షుగర్ కూడా ఉన్నట్లు తెలుసుకోగలిగాడు. ఈ నేపథ్యంలోనే ‘డయాబెటిక్ ఫ్రెండ్లీ చాక్లెట్’ అనే ఐడియా మదిలో మెరిసింది.పేరుకి ‘షుగర్–ఫ్రీ’ అని కాకుండా 100 శాతం షుగర్–ఫ్రీ చాక్లెట్ తయారీ కోసం ఆలోచించాడు. ఎన్నో పుస్తకాలు తిరగేశాడు. అంతర్జాల సమాచార సముద్రంలో దూకాడు. డాక్టర్లు, న్యూట్రీషనిస్ట్లు, ఫుడ్సైంటిస్టులను కలిశాడు. తన నుంచి ఒక చెఫ్ బయటికి వచ్చాడు. ప్రయోగాల్లోనే కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న హర్ష్ రకరకాల కంపెనీలలో పనిచేసి బిజినెస్ స్కిల్స్‌ను ఒంటబట్టించుకున్నాడు. తాను చేసిన పరిశోధన, వ్యాపార నైపుణ్యాలు, తల్లిదండ్రుల ఆశీస్సులు...అలా ముంబై కేంద్రంగా ‘ఏ డయాబెటిక్ చెఫ్’ అనే కంపెనీ మొదలుపెట్టాడు. ‘ఈ వయసులో ఇదొక దుస్సాహాసం’ అన్నవారు కూడా లేకపోలేదు. ‘సాహాసానికి వయసుతో పనేమిటి’ అని వెన్నుతట్టిన వారు కూడా లేకపోలేదు. ‘యంగ్ ట్రెండ్‌సెట్టర్’ టాప్ క్వాలిటీ ఇన్‌గ్రేడియంట్స్‌తో, రుచితో రాజీ పడకుండా, అయిదు రకాల ఫ్లేవర్లతో తయారుచేసిన ‘ఏ డయాబెటిక్’ చెఫ్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి టాక్ వచ్చింది. 24 సంవత్సరాల హర్ష్ చిన్న వయసులోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అండర్ 30–ఫోర్బ్స్ ‘యంగ్ ట్రెండ్‌సెట్టర్’ జాబితాలో చోటు సంపాదించాడు. మోటివేషనల్ స్పీకర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్న హర్ష్ కెడియ పేద డయాబెటిక్ పేషెంట్లకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. భవిష్యత్‌లో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా హర్ష్ కెడియ పుస్తకాలు చదువుతాడు. తన భావాలను కాగితాలపై పెడతాడు. రచన అతనికేమీ కొత్తకాదు.‘డయాబెటిస్ సమస్య నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా సాధించిన విజయం వరకు తన అనుభవాలకు పుస్తకరూపం ఇస్తే బాగుంటుంది కదా!’ అనేవాళ్లతో మనం కూడా గొంతు కలుపుదాం. ఒక ప్రాడక్ట్‌కు మార్కెట్లో మంచి టాక్ రావాలంటే...అది పేరుతోనే మొదలవుతుంది. ‘ఏ డయాబెటిక్ చెఫ్’ అనే పేరుతో తొలి అడుగులోనే మార్కులు కొట్టేసిన హర్ష్ కేడియ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా యువతకు స్ఫూర్తిని ఇస్తున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. పేదరోగులకు సహాయం చేస్తూ మంచిమనసును చాటుకుంటున్నాడు. -
పల్లెల నుంచి పారిశ్రామికవేత్తలు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారిని తగిన విధంగా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు కీలకం. ఈ రంగంలో కొత్త తరాన్ని ప్రోత్సహించేందుకు గానూ ఔత్సాహికులను గుర్తించే పనిని రాష్ట్ర పరిశ్రమల శాఖ చేపట్టింది. ఇందుకోసం ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఈడీపీ) పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి 2, 3 మండలాలకు కలిపి రెండుసార్లు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 320 సదస్సులు నిర్వహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. వ్యాపార రంగంలోకి దిగాలనుకునే 100 మంది ఔత్సాహికులను గుర్తించి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు తదితర అంశాలపై వారికి అవగాహన కలి్పస్తామని వివరించారు. ఇలా వచ్చిన వారిలో మండలానికి కనీసం ఒక ఐదు మందిని ఎంపిక చేసి.. ఇన్వెస్ట్మెంట్ మోటివేషన్ క్యాంపెయిన్(ఐఎంసీ) పేరుతో మూడు రోజుల పాటు పెట్టుబడి వ్యయం, ఫైనాన్సింగ్, భూమి కొనుగోళ్ల తదితర అంశాలపై పూర్తి స్థాయిలో శిక్షణ అందజేస్తామని వెల్లడించారు. అవకాశాలు మెండు.. రాష్ట్రంలో ఎల్రక్టానిక్స్, ఫార్మా, టెక్స్టైల్, బొమ్మలు, ఫర్నీచర్, రసాయనాలు వంటి రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక భారీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇలా పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పెద్ద సంస్థల ద్వారా అనేక ఎంఎస్ఎంఈలకు అవకాశాలేర్పడుతాయి. అలాగే ఒక జిల్లా–ఒక ఉత్పత్తి పేరిట కేంద్రం స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టింది. వీటి ద్వారా కూడా స్థానిక ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే అవకాశాలు పెరుగుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర కార్పొరేషన్ల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించనున్నారు. అలాగే పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసి సొంతంగా యూనిట్లు పెట్టుకునే వారిని గుర్తించి.. వారికి కూడా అవగాహన సదస్సులు నిర్వహించేలా పరిశ్రమల శాఖ కార్యక్రమాన్ని రూపొందించింది. రెండేళ్లలో 3,000 మంది పారిశ్రామికవేత్తలు.. కొత్త ఆర్ధిక సంవత్సరం రాగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. మూడు నెలల్లో సదస్సులు పూర్తి చేసి.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. వీరికి శిక్షణ పూర్తి చేసి ఏపీఐఐసీ, బ్యాంకుల నుంచి రుణాలిప్పించి రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభింపజేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విధంగా కనీసం 3,000 మంది కొత్త పారిశ్రామికవేత్తలను పరిచయం చేసినట్లవుతుందని పరిశ్రమల శాఖ భావిస్తోంది. -
వ్యాపారవేత్తలకు అవకాశాల సునామీ
ముంబై: ప్రైవేట్ రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ మరింత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో దేశీయంగా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవకాశాలు సునామీలా వెల్లువెత్తగలవని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా టెక్నాలజీలు అందుబాటులో ఉండటం కూడా ఇందుకు దోహదపడగలదని ఈవై ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ‘రాబోయే దశాబ్దాల్లో ప్రపంచంలోనే టాప్ 3 ఎకానమీల్లో ఒకటిగా నిల్చేందుకు భారత్‌కు పుష్కలమైన సామర్థ్యాలు ఉన్నాయి. పర్యావరణ అనుకూల ఇంధనాలు, విద్య, వైద్యం, బయోటెక్నాలజీ, సర్వీసులు వంటి వివిధ రంగాల్లో అసాధారణ స్థాయిలో అవకాశాలు ఉన్నాయి‘ అని అంబానీ తెలిపారు. భారత్ ఆర్థికంగా, ప్రజాస్వామ్యపరంగా, దౌత్య విధానాలపరంగా, సాంస్కృతిక కేంద్రంగా ముందుకు దూసుకెడుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. -
మహిళా సాధికారతకు గూగుల్ తోడ్పాటు
న్యూఢిల్లీ: బాలికలు, మహిళల సాధికారత కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు 25 మిలియన్ డాలర్ల మేర గ్రాంటు ఇవ్వనున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్‌లో భాగమైన గూగుల్డాట్ఓఆర్జీ వెల్లడించింది. లాభాపేక్ష లేకుండా నిర్వహించే స్వచ్ఛంద సంస్థలు మొదలైనవి దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ జాక్వెలిన్ ఫుల్లర్ తెలిపారు. ఎంపికయ్యే సంస్థలకు ఒకోదానికి దాదాపు 2 మిలియన్ డాలర్ల దాకా నిధులు లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు, భారత్‌లో తాము నిర్వహిస్తున్న ఇంటర్నెట్ సాథీ డిజిటల్ అక్షరాస్యత శిక్షణా కార్యక్రమంతో గణనీయ సంఖ్యలో మహిళలు లబ్ధి పొందినట్లు జాక్వెలిన్ వివరించారు. గడిచిన కొన్నేళ్లుగా భారత్‌లో ఔత్సాహిక వ్యాపారవేత్తలు, నవకల్పనల ఆవిష్కర్తలు, లాభాపేక్ష లేని సంస్థలకు తోడ్పాటు అందించేందుకు దాదాపు 40 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశామని ఆమె వివరించారు. ఇంటర్నెట్ సాథీ ప్రోగ్రాం అనుభవాలతో ’ఉమెన్ విల్’ పేరిట వెబ్ ప్లాట్‌ఫాంని రూపొందించినట్లు గూగుల్ ఇండియా సీనియర్ కంట్రీ మార్కెటింగ్ డైరెక్టర్ సప్నా చడ్ఢా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు తోడ్పాటు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. టైలరింగ్, బ్యూటీ సర్వీసులు, హోమ్ ట్యూషన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన హాబీలను ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకునే మహిళలకు అవసరమైన సహాయ సహకారాలు దీని ద్వారా అందగలవని ఆమె చెప్పారు. -
టీచర్, బ్యాంకు ఉద్యోగాలు వదిలేసి ఇప్పుడీ స్థాయిలో..
కాంచన్ పరులేకర్.. వయసు 70... బ్యాంకు మేనేజర్ ఉద్యోగం... కెరీర్లో ఉన్నతస్థాయి పదవి. ఆ పదవిని వద్దనుకున్నారు. నలుగురికీ ఉపయోగపడాలనుకున్నారు. ఒక మహిళగా పేదరికాన్ని, అడ్డంకులను దాటుకుంటూ, టీచర్ స్థాయి నుంచి బ్యాంక్ మేనేజర్ స్థాయికి ఎదిగిన కాంచన్ చిన్నతనం నుంచి ఏదో ఒకటి సాధించాలని కలగన్నారు. మహిళలకు చేయూత ఇవ్వాలనుకున్నారు. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనుకున్నారు. తన కలను సాకారం చేసుకోవటం కష్టమని తెలిసినా, చిన్న విషయంగానే భావించిన కాంచన్ ప్రయాణం... 1950–60 ప్రాంతంలో... కాంచన్ తల్లిదండ్రులు సాంఘిక సంస్కరణలు చేపట్టడంలో ముందుండేవారు. వారిది మహారాష్ట్రలోని కొల్హాపూర్. కాంచన్ తల్లి టైలర్, తండ్రి సామాజికవేత్త. తల్లిదండ్రుల వారసత్వం అందుకున్న కాంచన్, తన పదకొండవ ఏటే ఒక పబ్లిక్ మీటింగ్‌లో ఉపన్యాసం ఇచ్చారు. ఆమె ఉపన్యాసానికి ముగ్ధులైన ప్రముఖ సంఘ సేవకుడు, ‘స్వయం సిద్ధ’ సంస్థ వ్యవస్థాపకుడు డా. వి. టి. పాటిల్ కాంచన్‌ను చేరదీసి చదివించారు. పాటిల్ మరణించాక ఆయన ఆశయాలను కొనసాగించాలనుకున్నారు కాంచన్. ఆ సంస్థ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయాలనుకున్నారు. గత 30 సంవత్సరాలుగా 6500 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా చేసి, తన కలను, తన తల్లిదండ్రుల ఆశయాలను, తనను పెంచిన తండ్రి ఆశలను సాకారం చేయగలిగారు కాంచన్. డబ్బు విలువ తెలుసు... తన చుట్టూ మంచినీటి కొరతను ఎదుర్కొంటున్నవారు, నిరుపేదలు, నిరక్షరాస్యులను కూడా చూసిన కాంచన్ మనసు కలత చెందింది. ‘‘బడుగు బలహీన వర్గాల వారు పేదరికం కారణంగా, కనీస అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నారు. ఇందుకు వ్యతిరేకంగా మా తల్లిదండ్రులు పోరాటం చేశారు. నేను కూడా వారి మార్గంలోనే నడుస్తూ, ఇటువంటి అభాగ్యులకు సరైన న్యాయం జరిగేవరకు పోరాటం చేయాలనుకుంటున్నాను. సెకండ్ హ్యాండ్ పుస్తకాలతో చదువు పూర్తి చేసిన నాకు డబ్బు విలువ బాగా తెలుసు’’ అంటారు కాంచన్. బ్యాంకు ఉద్యోగం వదిలేసి... తల్లిదండ్రులతో పాటు మీటింగులకి, ర్యాలీలకి వెళ్తూనే కాంచన్, ఎం. ఏ. డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. పది సంవత్సరాల పాటు టీచర్‌గా పనిచేశాక, బ్యాంకులో ఉద్యోగం రావటంతో అక్కడికి మారారు. అక్కడ 14 సంవత్సరాలు పనిచేశాక, బ్యాంకు మేనేజర్ స్థాయికి ఎదిగారు. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకు వారు నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలలో కాంచన్ పాల్గొనేవారు. అయినప్పటికీ ఇంకా తన సేవలు అవసరంలో ఉన్నవారికి విస్తృతంగా అందించాలనుకున్నారు. చేస్తున్న బ్యాంకు ఉద్యోగం విడిచిపెట్టేసి, 1992లో స్వయంసిద్ధలో పనిచేయటానికి పూనుకున్నారు. రెండు చోట్లా రెండు రకాలుగా.. కాంచన్‌కు ఇప్పుడు రెండు విభాగాలలో పనిచేయాల్సిన అవసరం కనిపించింది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు. నగరాలలో నివసించే మహిళలు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు డబ్బు కట్టవలసి ఉంటుంది, గ్రామీణులకు ఉచితంగా నేర్పుతారు. కాంచన్ వార్తాపత్రికలో, ‘ఇంటి దగ్గర ఉండే మహిళలు ఆర్థిక స్వాతంత్య్రంతో జీవించండి’ అంటూ ప్రకటన వేశారు. ఆ ప్రకటన చూసి 130 మంది మహిళలు కాంచన్‌ను కలిశారు. వారికి ఏయే రంగాలలో ఆసక్తి ఉందో అడిగి తెలుసుకున్నారు. ‘‘ఆహారం దగ్గర నుంచి హస్త కళల వరకు వివిధ రంగాలలో వారికి ఉన్న ఆసక్తి కనపరిచారు. వారి అభిరుచికి తగ్గట్టుగా శిక్షణ ఇచ్చాం. ఒక సంవత్సరం తరవాత ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాలలో కూడా అమలుచేశాం.. కాని అక్కడ వారికి ఉచితంగానే శిక్షణ ఇచ్చాం. కోల్హాపూర్ జిల్లాలోని చిన్న చిన్న గ్రామాలలో కోళ్ల ఫారమ్, తేనెటీగల పెంపకం, సేంద్రియ వ్యవసాయం వంటివి నేర్పించాం. మహిళలకు ఋణసదుపాయం కూడా కల్పించాం’’ అంటారు కాంచన్. వ్యాపారం కూడా తెలియదు.. ‘‘బేకరీల నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ వరకు, బ్యాగుల తయారీ యూనిట్స్ నుంచి బ్యూటీ పార్లర్లు, హస్త కళల వరకు అన్ని వ్యాపారాలను మహిళలు ప్రారంభించారు. మహిళలు వారి సొంత సంస్థలు స్థాపించుకునేవరకు వారికి శిక్షణ ఇస్తుంటాం. వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుంటాం. కిందటి సంవత్సరం 3.5 కోట్ల బిజినెస్ చేశాం’’ అంటారు కాంచన్. ఇందులో చాలామంది మహిళలకు ఏ విధంగా వ్యాపారం చేయాలో కూడా తెలియదు. అందుకనే ‘స్వయం సిద్ధ’లో ‘స్వయం ప్రేరక’ అనే సహకార సంస్థను స్థాపించి, వారం వారం నిర్వహించే సంతలో ప్రదర్శన పెట్టి, ఆ వస్తువులను విక్రయించటం అలవాటు చేశారు. ‘‘ఇలా ఎంతో మంది మహిళలు, ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. స్వయంగా వారిని వారు ముందకు తీసుకువెళ్తున్నారు. నెలకు అరవై వేలు సంపాదించుకునేంత ఎత్తుకు ఎదుగుతున్నారు’’ అంటూ ఆనందంగా చెబుతారు కాంచన్. -
స్పైస్ మనీ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్
సాక్షి, న్యూఢిల్లీ: డిజిస్పైస్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ, స్పైస్ మనీకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు సోనూ సూద్ వ్యవహరించనున్నారు. డీల్‌లో భాగంగా సోనూ సూద్‌కు చెందిన సూద్ ఇన్పోమేటిక్స్ (సీఐఎల్) సంస్థకు స్పైస్ మనీలో 5 శాతం వాటాను కేటాయిస్తారు. సోనూ సూద్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్‌గా నియమిస్తారు. కరోనా కల్లోలం చెలరేగినప్పు డు, లాక్డౌన్ కాలంలో ఆపన్నులకు అండగా నిలిచిన సోనూ సూద్ కార్యక్రమాల్లో కొన్నింటిని కొనసాగిస్తామని స్పైస్ మనీ తెలిపింది. కోటి మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలను డిజిటల్‌గా, ఆర్ధికంగా శక్తివంతం చేసే లక్ష్యంతో ఉన్నామని స్పైస్ మనీఫౌండర్ దిలీప్ మోడీ వెల్లడించారు. ఇదే లక్ష్యంతో భాగస్వామిగా సోను సూద్‌లో ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. గ్రామీణులు తమ ఇళ్లను, కుటుంబాలను విడిచిపెట్టకుండా స్వతంత్ర జీవనోపాధిని సంపాదించేందుకు అవసరమైన సాంకేతిక శక్తిని అందిస్తామని ‘భారత్’ ప్రతి మూలలో స్వావలంబన, వ్యవస్థాపకత, ఆర్థిక పరిపుష్టికి ప్రోత్సహించనున్నామని తెలిపారు. ఆత్మనీర్భర్ భారత్ కోసం , ప్రతీ గ్రామాన్ని డిజిటల్‌గా బలోపేతం చేయడం కోసం స్పైస్ మనీతో తన అనుబంధం ఉపయోగపడనుందని విశ్వసిస్తున్నానని ఈ సందర్భంగా సోనూ సూద్ తెలిపారు. -
42,313 ఎకరాల్లో 5 పారిశ్రామిక పార్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అన్ని రకాల వసతులు ఒకేచోట కల్పించే విధంగా అయిదు భారీ పారిశ్రామిక పార్కులను ఆంధ్రప్రదేశ్ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్లలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్‌డిట్) నిధులతో అయిదు మల్టీ ప్రొడక్ట్ పార్కులను అభివృద్ధి చేసే విధంగా ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. మూడు పారిశ్రామిక కారిడార్లలో వీటిని అభివృద్ధి చేస్తున్నారు. విశాఖ–చెన్నై ఇండ్రస్టియల్ కారిడార్ (వీసీఐసీ)లో ఏడీబీ రుణంతో చేపడుతున్న ప్రాజెక్టులకు అదనంగా మూడు పార్కులు, చెన్నై–బెంగళూరు కారిడార్, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లలో ఒక్కొక్కటి వంతున అభివృద్ధి చేస్తున్నారు. విసీఐసీలో నక్కపల్లి, శ్రీకాళహస్తి, కొప్పర్తి, చెన్నై–బెంగళూరు కారిడార్‌లో కృష్ణపట్నం, హైదరాబాద్–బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులను 42,313 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. దీన్లో తొలిదశగా 13,292 ఎకరాల్లో మల్టీ ప్రొడక్ట్ పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసేందుకు నిక్‌డిట్ సూత్రప్రాయం అంగీకారం తెలిపింది. కృష్ణపట్నం పార్కులో 2,500 ఎకరాల్లో అభివృద్ధికి రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికకు ఆమోదం తెలపడమే కాకుండా రూ.1,314 కోట్లు మంజూరు చేసింది. త్వరలోనే కృష్ణపట్నం పార్కు పనులకు టెండర్లు పిలవనున్నట్లు ఏపీఐఐసీ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అదేవిధంగా శ్రీకాళహస్తిలో 2,500 ఎకరాల్లో, కొప్పర్తిలో 2,596 ఎకరాల్లో, నక్కపల్లిలో 3,196 ఎకరాల్లో పార్కులను అభివృద్ధి చేయడానికి నిక్‌డిట్ నిధులతో మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నట్లు, ఓర్వకల్లుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేస్తున్నట్లు వివరించారు. 24 గంటలూ నీరు నాణ్యమైన విద్యుత్, నీరు అందిస్తే ఎంత ధరైనా చెల్లించడానికి పారిశ్రామికవేత్తలు ముందుకువస్తున్నారు. రాయితీల కంటే మౌలికవసతులు ప్రధానమని సీఐఐ, ఐఎస్బీ, అసోచామ్ వంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ పారిశ్రామిక పార్కుల్లో ఉమ్మడి మౌలిక వసతుల కల్పనతోపాటు నాణ్యమైన విద్యుత్, నీరు నిరంతరాయంగా అందించే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కొప్పర్తి, శ్రీకాళహస్తి పారిశ్రామిక పార్కులకు సోమశిల జలాశయం నుంచి, ఓర్వకల్లుకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి, విశాఖపట్నంలోని పరిశ్రమలకు పోలవరం ద్వారా నీరందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పారిశ్రామిక పార్కులను జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ అంతర్గత రహదారుల అభివృద్ధి, ఉమ్మడి మురుగునీటి శుద్ధి వంటి ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. -
హరూన్ ఇండియా జాబితాలో బెజవాడ కుర్రోడు
చిన్న వయసులోనే దండిగా సంపాదించడం కొందరికే సాధ్యమవుతుంది. ఉన్నత విద్య తర్వాత సాదా సీదా ఉద్యోగంతో సంతుష్టి పడక.. సొంతంగా స్టార్టప్ ఆరంభించి తన లాంటి వందల మందికి ఉపాధి కల్పించడంలో సంతప్తిని వెతుక్కునే వారు పెరిగిపోతున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్, హరూన్ ఇండియా సంపన్నుల జాబితాను పరిశీలిస్తే ఇటువంటి విజయవంతమైన వ్యాపారవేత్తలు తారసపడతారు. అత్యంత చౌక రేట్లకు బ్రోకరేజీ సేవలను అందిస్తూ బ్రోకరేజీ పరిశ్రమలోనే అత్యధిక కస్టమర్లను సంపాదించుకున్న ‘జెరోదా’ వ్యవస్థాపకుడు నితిన్ కామత్, నిఖిల్ కామత్ రూ.24,000 కోట్ల సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. మరీ ముఖ్యంగా మన బెజవాడ కుర్రోడు, శ్రీహర్ష మాజేటి రూ.1,400 కోట్ల సంపదతతో ఈ జాబితాలో 15వ స్థానంలో నిలిచి అందరి దష్టిని మరోసారి ఆకర్షించారు. టైర్2 పట్టణం నుంచి చోటు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి కూడా ఇతడే. బిట్స్ పిలానీ పూర్వవిద్యార్థి అయిన శ్రీహర్ష, నందన్ రెడ్డితో కలసి 2013లో బండ్ఎల్ టెక్నాలజీస్ ను ఏర్పాటు చేశారు. స్విగ్గీ హోల్డింగ్ కంపెనీ ఇది. స్విగ్గీలో దిగ్గజ ఇన్వెెస్ట్ మెంట్ సంస్థలు టెన్సెంట్ హోల్డింగ్స్, నాస్పర్స్ లిమిటెడ్, డీఎస్ టీ గ్లోబల్ తదితర సంస్థలు వాటాదారులుగా ఉన్నాయి. స్విగ్గీ మార్కెట్ విలువ 3 బిలియన్ డాలర్లుగా (రూ.22వేల కోట్లు) ఉంటుంది. ఇంటర్నెట్ వేదికగా విస్తరణ 40 ఏళ్ల వయసు అంతకంటే తక్కువ వయసున్న వ్యాపావేత్తలు 16 మంది వద్ద ఉమ్మడిగా రూ.44,900 కోట్ల సంపద ఉన్నట్టు ‘ఐఐఎఫ్ఎల్ వెల్త్ అండ్ హరూన్ ఇండియా సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ 2020 ఆఫ్ ఎంటర్ ప్రెన్యుర్స్ అండర్ 40’ నివేదిక తెలియజేసింది. కనీసం రూ.1,000 కోట్ల నెట్ వర్త్ (నికర సంపద విలువ)ను జాబితాకు ప్రామాణికంగా తీసుకున్నారు. వీరిలో అధికులు ఇంటర్నెట్ వేదికగా స్టార్టప్ పెట్టి జాక్ పాట్ కొట్టినవారే. కరోనా కాలంలోనూ వీరిలో కొద్ది మందిని మినహాయిస్తే మిగిలిన వారి సంపద వద్ధి చెందడం గమనార్హం. నివేదికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జెరోదా వ్యవస్థాపకులు తమ సంపదను ఈ ఏడాది ఏకంగా 58 శాతం పెంచుకున్నారు. నివేదికలో తొమ్మిదో స్థానంలో ఉన్న ‘ఓయో’ రితేష్ అగర్వాల్ సంపద 40 శాతం ఈ ఏడాది పడిపోయింది. కరోనాతో పర్యాటక, ఆతిథ్య రంగాలు కుదేలవడం రితేష్ సంపదకు చిల్లుపెట్టింది. జాబితాలో పిన్నవయస్కుడు రితేషే. వీయూ టెక్నాలజీస్ (వూ బ్రాండ్) దేవిత సరాఫ్ సంపద కూడా 33 శాతం తగ్గింది. 16 మందితో కూడిన జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా వ్యాపారవేత్త దేవిత సరాఫ్. ‘‘కొందరు తమ స్టార్టప్ ల నుంచి పూర్తిగా వైదొలిగితే, కొందరు పాక్షికంగా తప్పుకుని ఇన్వెస్ట్ మెంట్ ఫండ్స్ ను ప్రారంభించారు. అలాగే, యువ వ్యాపారవేత్తలకు వెన్నుదన్నుగా నిలిచారు. ఇది భారత ఔత్సాహిక వ్యాపారవేత్తల ఎదుగుదలపై ఎన్నోరెట్ల ప్రభావం చూపించింది’’అని హరూన్ ఇండియా ఎండీ అనాస్ రెహమాన్ పేర్కొన్నారు. -
జగన్ పాలనపై 100% సంతృప్తి
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలు 100 శాతం సంతృప్తిని వ్యక్తం చేశారని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తెలిపారు. గత నాలుగేళ్ల నుంచి కేంద్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వాణిజ్యం) ర్యాంకులను ప్రకటిస్తోందని చెప్పారు. తొలిసారిగా సంస్కరణల వల్ల లబ్ధి పొందుతున్న స్టేక్ హోల్డర్ల నుంచి అభిప్రాయాలను తీసుకొని ర్యాంకులను ప్రకటించారని అన్నారు. ఈ సర్వే ఈ ఏడాది మార్చి వరకు జరిగిందని ‘సాక్షి’కి వెల్లడించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సులభతర వాణిజ్యానికి సంస్కరణల అమలుకు సంబంధించిన వివరాలను 2019, ఆగస్టులో కేంద్రానికి ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలపై స్టేక్ హోల్డర్లు సంతృప్తి వ్యక్తం చేయడం వల్లే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచామన్నారు. పారిశ్రామిక రంగంతో నేరుగా సంబంధం ఉన్న పెట్టుబడిదారులు, ఆడిటర్లు, లాయర్లు, ఆర్కిటెక్చర్లు వంటి స్టేక్ హోల్డర్ల నుంచి వివరాలు సేకరించినట్లు తెలిపారు. 10 రోజుల్లోనే పరిశ్రమలకు అవసరమైన భూమి ► పరిశ్రమల శాఖ మంత్రిగా మేకపాటి గౌతమ్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు కరికాల వలవన్ తెలిపారు. ► పరిశ్రమలకు అవసరమైన భూమిని 10 రోజుల్లోనే కేటాయిస్తుండటమే కాకుండా తొలిసారిగా పరిశ్రమలకు కీలకమైన నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. ► సులభతర వాణిజ్యంతోపాటు పెట్టుబడి వ్యయాలను తగ్గించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు. ► కోవిడ్ వల్ల కష్టాల్లో ఉన్న పరిశ్రమలను రీస్టార్ట్ ద్వారా ఆదుకున్నామన్నారు. ► పరిశ్రమల అవసరాలను తెలుసుకోవడానికి దేశంలోనే తొలిసారిగా సమగ్ర పరిశ్రమ సర్వే నిర్వహిస్తుండటమే కాకుండా పరిశ్రమలన్నింటికీ ఆధార్ నంబర్ కేటాయిస్తున్నామని వివరించారు. ► ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి ర్యాంకు సాధించడం, రాష్ట్రంలో పటిష్టమైన ప్రభుత్వం ఉండటంతో మరిన్ని కొత్త పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
హైటెక్ వ్యవ‘సాయం’!
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలకు, టెక్నాలజీని ప్రవేశపెట్టేవారికి, స్టార్టప్‌లకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ముందుకు వచ్చే వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర సర్కారు రూ.లక్ష కోట్లతో అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. మౌలిక సదుపాయాలు, రవాణా వసతుల కోసం ఏర్పాటయ్యే రైతు గ్రూపులకు కూడా ఈ నిధి కింద రుణ సాయం అందుతుంది. కరోనా వైరస్ తర్వాత కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి తాజాగా ప్రకటించిన రూ.లక్ష కోట్ల నిధి అదనం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ థోమర్ మీడియాకు తెలిపారు. చరిత్రాత్మకమైన ఈ నిర్ణయం వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ పదేళ్ల పాటు 2029 వరకు అమల్లో ఉంటుంది. సాగు అనంతరం పంట ఉత్పత్తుల విక్రయం వరకు వసతుల నిర్వహణ (శీతల గోదాములు, గోదాములు, గ్రేడింగ్, ప్యాకేజింగ్ యూనిట్లు, ఈ మార్కెటింగ్, ఈ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు తదితర), సామాజిక సాగు తదితరాలకు దీర్ఘకాల రుణ సాయం పొందొచ్చు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా ఈ రుణాలను మంజూరు చేస్తారు. రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) కేంద్రం రూ.10,000 కోట్లను సమకూరుస్తుంది. తదుపరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.30,000 కోట్ల చొప్పున ఏర్పాటు చేస్తుంది. గరిష్టంగా రూ.2 కోట్ల రుణానికి 3 శాతం వడ్డీ రాయితీని ఇవ్వనున్నట్టు మంత్రి తోమర్ చెప్పారు. ఈపీఎఫ్ చెల్లింపుల పథకం ఆగస్టు వరకు చిన్న సంస్థల తరఫున ఈపీఎఫ్ చెల్లింపుల పథకాన్ని ఆగస్టు వరకు కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. 100 వరకు ఉద్యోగులు కలిగిన సంస్థల్లో 90 శాతం మంది రూ.15,000లోపు వేతనం కలిగి ఉంటే.. ఉద్యోగుల చందాతోపాటు, వారి తరఫున ఆయా సంస్థల చందా (చెరో 12 శాతం)ను కేంద్రమే చెల్లించనుంది. లాక్డౌన్ కారణంగా చిన్న, మధ్య స్థాయి సంస్థలు చాలా వరకు మూతపడడంతో.. వాటికి వెసులుబాటునిస్తూ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకం కింద ఈ భారాన్ని తాను భరించనున్నట్టు కేంద్రం లోగడ ప్రకటించింది. తొలుత మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన చందాలను చెల్లించాలని నిర్ణయించింది. జూన్, జూలై, ఆగస్టు నెలలకూ ఈపీఎఫ్ చందాలను తానే చెల్లించాలని కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు మరింత వేతనాన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చని, సంస్థలపైనా భారం తగ్గుతుందని కేంద్ర మంత్రి జవదేకర్ పేర్కొన్నారు. మూడు బీమా సంస్థలకు రూ.12,450 కోట్లు ప్రభుత్వరంగంలోని మూడు సాధారణ బీమా సంస్థ లు.. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు రూ.12,450 కోట్ల మూలధనసాయాన్ని అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో 2019–20లో అందించిన రూ.2,500 కోట్లు కలసి ఉంటుందని మంత్రి జవదేకర్ తెలిపారు. ఈ మూడు కంపెనీలను విలీనం చేసి, స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలన్నది కేంద్రం ప్రణాళికగా ఉంది. -
పరిశ్రమల సమస్యలపై డీజీపీకి టిఫ్ వినతి
సాక్షి, హైదరాబాద్: సుమారు 50 రోజుల తర్వాత పరిశ్రమలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) శుక్రవారం డీజీపీ మహేందర్‌రెడ్డికి విన్నవించింది. పరిశ్రమలు నడిచేందుకు వీలుగా అనుబంధ సంస్థలు, ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. అనుబంధ సంస్థలు, ఇతర దుకాణాలు తెరిచేందుకు చర్యలు తీసుకుంటామని డీజీపీ వారికి హామీ ఇచ్చారు. జంట నగరాల పరిధిలోని పరిశ్రమలు రాణిగంజ్ మీద ఆధారపడిన నేపథ్యంలో జీహెచ్ఎంసీతో సంప్రదిస్తామన్నారు. లాక్డౌన్ మూలంగా ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులు తిరిగి హైదరాబాద్‌కు వచ్చేందుకు పాస్‌లు జారీ చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. పారిశ్రామిక వాడలోని స్పేర్‌పార్టులు, రిపేరింగ్ షాపులు, ఇతరత్రా ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీలకు కూడా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. పారిశ్రామికవాడల్లో కాకుండా ఇతర వాణిజ్య సముదాయాల్లో చిన్న చిన్న వ్యాపారాలు నడిచే శోభన కాలనీ, బాలానగర్, గీతానగర్, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు డీజీపీ అంగీకరించినట్లు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య వెల్లడించింది. డీజీపీని కలిసిన వారిలో తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య అధ్యక్షులు కొండవీటి సుధీర్‌రెడ్డి, కార్యదర్శి మిరుపాల గోపాల్‌రావు, పారిశ్రామికవేత్త షేక్ మదర్ సాహెబ్, బల్క్ డ్రగ్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ జానీమియా, జీడిమెట్ల ఐలా చైర్మన్ సదాశివరెడ్డి తదితరులు ఉన్నారు. -
కష్టకాలంలో కొండంత ధైర్యమిచ్చారు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ లాక్డౌన్ కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కరోనావల్ల ప్రభుత్వోద్యోగులకు పూర్తిగా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా పారిశ్రామిక రంగాన్ని ఆదుకునేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో సర్కారు తమకు కొండంత అండ ఇచ్చినట్లుగా ఉందన్నారు. ఎంఎస్ఎంఈలకు గత ప్రభుత్వం బకాయిపడ్డ రాయితీల మొత్తం రూ.905 కోట్లు కూడా విడుదల చేయడం.. ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రూ.188 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మాఫీ చేయడం, రుణాలు పుట్టని వేళ వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.200 కోట్లు కేటాయించడం, జీఎస్టీ, ఇతర పన్ను మినహాయింపులను కోరుతూ ప్రధానికి లేఖ రాయడం చూస్తుంటే పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రికి ఉన్న శ్రద్ధను తెలియజేస్తోందన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తల స్పందన వారి మాటల్లోనే.. చిన్న సంస్థలకు పెద్ద సాయం క్లిష్ట సమయంలో చిన్న సంస్థలను ఆదుకునేలా ప్రభుత్వం భారీ సాయాన్ని ప్రకటించింది. పాత బకాయిలను విడుదల చేయడం ద్వారా కార్మికులకు జీతాలు చెల్లించే వెసులుబాటు కల్పించింది. రూ.200 కోట్ల రుణాలకు గ్యారంటీ ఇవ్వడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి పెద్ద ధైర్యాన్ని ఇచ్చింది. – డి.రామకృష్ణ, చైర్మన్, సీఐఐ ఏపీ చాప్టర్ సంక్షోభ సమయంలో చేయూతనందించారు లాక్‌డౌన్‌తో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ రంగానికి సీఎం వైఎస్ జగన్ చేయూతనందించారు. ఈ స్థాయిలో భారీ ఆర్థిక మద్దతు అందించడాన్ని అభినందిస్తున్నాం. సీఎం నేతృత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి, అధికారులు విశేష కృషిచేశారు. – మనోహర్‌రెడ్డి, కో–చైర్మన్ ఫిక్కీ ఏపీ స్టేట్ కౌన్సిల్ బకాయిలు తీర్చడం మామూలు విషయం కాదు గత పదేళ్లుగా రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. గత ప్రభుత్వ బకాయిలను తీర్చడం మామూలు విషయం కాదు. ఒక పారిశ్రామికవేత్తగా ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు సీఎంకు తెలియబట్టే కీలక నిర్ణయాలు తీసుకోగలిగారు. విద్యుత్ చార్జీలను మాఫీచేసే ధైర్యం ఏ రాష్ట్రం చేయలేదు. రాష్ట్ర పారిశ్రామిక రంగం 6 నెలల్లో కోలుకుంటుంది. – ఏపీకే రెడ్డి, జాతీయ అధ్యక్షుడు, ఎఫ్‌ఎస్‌ఎంఈ కచ్చితంగా మేలు జరుగుతుంది ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇదో మంచి చేయూతగా పరిశ్రమల సీఈవోలు భావిస్తున్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల ద్వారా శ్రీసిటీలోని ఎంఎస్ఎంఈ యూనిట్లకు ఈ నిర్ణయం కచ్చితంగా మేలు చేస్తుంది. సీఎం వైఎస్ జగన్, పరిశ్రమల మంత్రి గౌతమ్‌రెడ్డికి శ్రీసిటీ తరఫున కృతజ్ఞతలు. – రవీంద్ర సన్నారెడ్డి, శ్రీసిటీ ఎండీ పరిశ్రమలు గాడిలోకి.. మూడు నెలల విద్యుత్ డిమాండ్ చార్జీలు రద్దుచేయడం, బకాయిలు విడుదల చేయడం, వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.200 కోట్లు కేటాయించడంతో పరిశ్రమలు గాడిలో పడటానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రధానికి సీఎం లేఖ రాయడం ఆనందదాయకం. – వాసిరెడ్డి మురళీకృష్ణ, అధ్యక్షుడు, ఫ్యాప్సియా ఇది నిజంగా ‘రీస్టార్టే’ రూ.905 కోట్ల పాత బకాయిలను విడుదల చేయడం.. విద్యుత్ భారాన్ని రద్దుచేయడం వంటి నిర్ణయాలు చిన్న సంస్థలకు పెద్ద చేయూతను అందిస్తాయి. లాక్డౌన్ తర్వాత పరిశ్రమలకు అనుకూలంగా మరిన్ని చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. – కేవీఎస్ ప్రకాశరావు, అధ్యక్షుడు, ఏపీ చాంబర్స్ -
కొలువంతా బంగారం
నవరాత్రుల బొమ్మల కొలువుకు తమిళనాట అధిక ప్రాధాన్యత ఉంది. చెన్నైలోని ప్రముఖ పారిశ్రామికవేత్త అభిరామి రామనాధన్ అయితే ఏటా తన నివాసంలో ఏకంగా బంగారు బొమ్మల్ని కొలువు తీరుస్తారు! వాటిల్లో కాంస్య విగ్రహాలు బంగారు తాపడంతో ఉంటాయి. వాటికి బంగారు నగలు అలంకరించి ఉంటాయి. అన్నపూర్ణాదేవి ప్రధానాంశంగా అన్నీ బంగారు తాపడంతో చేసిన విగ్రహాలనే కొలువులో ఉంచటం, వాటికి బంగారు ఆభరణాలను అలంకరించటం వాళ్లింటి ప్రత్యేకత. ఐదు వరుసలలో కొలువుదీరి బంగారు వర్ణంతో తళతళ మెరుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ విగ్రహాలు గతవారం రోజులుగా సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. మైలాపూరులోని తమ నివాసంలో రామనాధన్ సతీమణి నల్లమ్మై రామనాధన్ కొలువు దీర్చిన ఈ విగ్రహాలకు మరో ప్రత్యేకతా ఉంది. ఇవి నిత్యం వాళ్ల పూజా మందిరంలో పూజలు అందుకునే ఉత్సవ విగ్రహాలే. ఏడాదికి ఒక బంగారు తాపడంతో కూడిన కాంస్య విగ్రహాన్ని కొనుగొలు చేసి ఏటా ఇలా బొమ్మల కొలువులో ప్రత్యేక అలంకారాలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు ఈ దంపతులు. ఈ ఏడాది నాలుగు వరుసల్లో వివిధ రకాల దేవతా మూర్తులు ఇక్కడ కొలువుదీరారు. నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు అందుకునే ఈ బొమ్మల కొలువు చెన్నైలో ఇప్పుడు అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. -
వ్యాపార సంస్కరణల అమల్లో రాష్ట్రం ముందంజ
సాక్షి, అమరావతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) ర్యాంకుల్లో కీలకమైన వ్యాపార సంస్కరణల అమల్లో రాష్ట్రం ముందంజలో నిలిచింది. 2019 ఈవోడీబీ ర్యాంకులకు సంబంధించి వ్యాపార సంస్క రణల కార్యాచరణ ప్రణాళిక (బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్–బీఆర్ఏపీ)లోని మొత్తం 187 సంస్కరణల అమలు తీరును ఆధారంగా రాష్ట్రాల ర్యాంకులను నిర్ణయిస్తారు. రాష్ట్రాల్లో ఆయా సంస్కరణల అమలు తీరును కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని ‘డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్’ విభాగం పరిశీలించి వాటికి ఆమోదం తెలుపుతుంది. ఆ మేరకు ఏపీకి సంబంధించి శుక్రవారం నాటికి 186 సంస్కరణలకు ఆమోదం లభించింది. మరో సంస్కరణకు అదనపు సమాచారం అడిగారని, దీనికి కూడా 15 రోజుల్లో సమాధానం ఇవ్వనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. వ్యాపార సంస్కరణలు ఆమోదం పొందడంలో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక వెనుకంజలో ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ఇంకా 56 సంస్కరణలకు, కర్ణాటకలో 34 సంస్కరణలకు ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది. గతేడాది ఈవోడీబీ ర్యాంకుల్లో ఆంధ్రా, తెలంగాణ తర్వాత మూడో స్థానంలో నిలిచిన హర్యానా సంస్కరణల ఆమోదంలో మన రాష్ట్రంతో గట్టిగా పోటీపడుతోంది. హర్యానాకు సంబంధించి ఇప్పటికే 183 సంస్కరణలకు ఆమోదం లభించగా, నాలుగు సంస్కరణలకే ఆమోదం లభించాల్సి ఉంది. మొత్తంగా ఈ 187 సంస్కరణలను ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత కమిటీ ఆమోదం తెలుపుతుంది. వీటి ఆధారంగా ఈవోడీబీ ర్యాంకులు నిర్ణయమవుతాయి. సులభతర వ్యాపారానికి అనుకూలమైన రాష్ట్రాన్ని ఈ ర్యాంకులు సూచిస్తాయి. ఈ ర్యాంకుల ఆధారంగానే ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నదానిపై పారిశ్రామికవేత్తలు నిర్ణయం తీసుకుంటారు. ఫీడ్‌బ్యాకే కీలకం... ఈసారి ఈవోడీబీ ర్యాంకుల్లో పారిశ్రామిక ప్రతినిధుల నుంచి తీసుకునే ఫీడ్‌బ్యాక్ కీలక పాత్ర పోషించనుంది. మొత్తం 187 సంస్కరణలకుగాను 80 సంస్కరణల అమలు తీరుకు సంబంధించి నేరుగా వ్యాపారవేత్తల నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటారు. ఒక్కో రంగం నుంచి కనీసం 20 మందిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి అభిప్రాయాలు సేకరిస్తారు. ఇందులో కనీసం 14 మంది సంస్కరణల అమలుపై అనుకూలంగా చెపితేనే పాయింటు వస్తుంది. గతేడాది రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోపాటు పరిశ్రమల ప్రతినిధుల ఫీడ్ బ్యాక్‌ను తీసుకున్నారు. ఈసారి పూర్తిగా పరిశ్రమల ప్రతినిధుల నుంచే తీసుకోనున్నారు. అలాగే ఈ సర్వే ఎప్పుడు, ఎలా చేస్తారో అన్నది బయటకు తెలియదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పరిశ్రమల శాఖ ‘ఔట్ రీచ్’ పేరిట అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తూ స్థానిక పారిశ్రామికవేత్తల సందేహాలు, సమస్యలను పరిష్కరిస్తోంది. ఈ సదస్సులకు మంచి స్పందన వస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థజైన్ తెలిపారు. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో సదస్సులు నిర్వహించామని, మిగిలిన జిల్లాల్లోనూ ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్టు చెప్పారు. -
హాచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో ముఖ్యమంత్రి జగన్
-
డల్లాస్‌లో ప్రవాసాంధ్రులతో సీఎం వైఎస్ జగన్
-
పెట్టుబడులకు అనుకూలం
వాషింగ్టన్ డీసీ: నీతివంతమైన పాలన, కాంట్రాక్టుల్లో పారదర్శక విధానాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు కృత నిశ్చయంతో కట్టుబడి ఉన్నామని, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ శ్రింగ్లా వాషింగ్టన్ డీసీలో ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 60 మందికిపైగా సీనియర్ అధికారులు, వ్యాపార, వాణిజ్యవేత్తలను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని అంశాలను ఒకేచోట సుహృద్భావ వాతావరణంలో కల్పిస్తామని చెప్పారు. కొత్త అవకాశాలున్నాయ్... రెండు అతి పెద్ద ప్రజాస్వామిక దేశాల మధ్య వివిధ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం పరిఢవిల్లేలా అమెరికాలోని భారతీయ అధికారులు గట్టి పునాదులు వేశారని వైఎస్ జగన్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారాలు, పెట్టుబడులకు కొత్త అవకాశాలున్నాయన్నారు. ఏపీ, అమెరికాల మధ్య సంబంధాలను ఇవి మరింత పెంచడమే కాకుండా వ్యాపార, వాణిజ్య, ఇంధన రంగంలో సహకారం, సాంస్కృతిక రంగాల్లో పరస్పరం భాగస్వామ్యాలకు ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన మానవ వనరులు రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో అభివృద్ధి పథంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ దూరదృష్టి, స్థిర సంకల్పం, పారదర్శక విధానాలు ఏపీని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నాయని, పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వ పటిమను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఈ విందులో పాల్గొన్న అమెరికా ప్రభుత్వ సీనియర్ డైరెక్టర్(ప్రభుత్వ వ్యవహారాలు) క్లాడియో లిలిన్ ఫీల్డ్ మాట్లాడుతూ వ్యర్థ పదార్థాల నిర్వహణ, పట్టణాభివృద్ధి, నగర ప్రణాళికలు, జల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పరిశ్రమల్లో విద్యుత్ సామర్థ్యం పెంపు, వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఉద్యానవన పంటలు తదితర రంగాల్లో తాము పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. స్మార్ట్ సిటీలు, లైటింగ్ ఉత్పత్తులతో సహా పలు రంగాల్లో సహాయ సహకారాలు అందించేందుకు వ్యాపారవేత్తలు సంసిద్ధత వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను కలుసుకున్నారు. హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిచర్డ్స్ రీఫ్ మ్యాన్, భారత్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ థామస్ ఎల్ వాజ్దా, గ్లోబల్ సస్టెయినబిలిటీ అండ్ ఇండస్ట్రీ వైస్ ప్రెసిడెంట్ క్లే నెస్లర్ సహా పలువురిని సీఎం కలిశారు. డల్లాస్‌కు చేరుకున్న సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మధ్యాహ్నం 2.11 గంటలకు (భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు డల్లాస్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హచ్‌సన్ కన్వెన్షన్ సెంటర్లో ప్రముఖులతో తేనీటి విందులో పాల్గొననున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటలకు) ఇక్కడే నార్త్ అమెరికా తెలుగు వారితో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో జగన్ పాల్గొననున్నారు. -
ఒక్క దరఖాస్తుతో.. సింగిల్‌విండోలో అనుమతులు
సాక్షి, అమరావతి: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా 30కిపైగా దేశాల రాయబారులు, హై కమిషనర్లు, కాన్సుల్ జనరల్స్‌తో శుక్రవారం విజయవాడలో నిర్వహించిన డిప్లొమాటిక్ ఔట్ రీచ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. దక్షిణ కొరియా, బ్రిటన్, సింగపూర్, పోలండ్, బల్గేరియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇండోనేషియాలతోపాటు మొత్తం 15 దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖాముఖి చర్చలు జరిపారు. షెడ్యూల్ కంటే అదనంగా మరో గంటకుపైగా సమయం కేటాయించి విదేశీ ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమని, పరిశ్రమలు పెట్టేవారికి పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. పరిశ్రమలు స్థాపించేవారికి జిల్లా స్థాయిలోనే సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తున్నామని, ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయదలచినవారు కేవలం ఒకే ఒక దరఖాస్తు చేస్తే సరిపోతుందన్నారు. అనుమతుల కోసం సుదీర్ఘంగా వేచి చూడాల్సిన అవసరంలేదని, ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తామని, అనుమతులపై ముఖ్యమంత్రి కార్యాలయం స్వయంగా పర్యవేక్షించి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఎల్ఈడీ ప్లాంట్ ఏపీలో.. పోలండ్ రాయబారి ఆడం బురాకోవిస్కి సీఎంతో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. ఎల్ఈడీ బల్బుల తయారీకి పోలండ్ ప్రసిద్ధి చెందిందని వివరించారు. ఏపీలో ప్లాంట్ నెలకొల్పడానికి ముందుకు రావాలని సీఎం కోరారు. ఇ–గవర్నన్స్‌లో పెట్టుబడులు డెన్మార్క్ తరఫున బెంగళూరులోని కాన్సులేట్ జనరల్ జెట్టీ బెర్రూం ముఖ్యమంత్రితో చర్చించారు. పోర్టులు, లాజిస్టిక్స్, తీర ప్రాంతాల అభివృద్ధి, ఇ గవర్నెన్స్ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నామని తెలిపారు. ఏపీలోని నగరాలతో భాగస్వామ్య ఒప్పందాలకు సిద్ధమని చెప్పారు. పీపీపీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుకే విద్యుత్ ఇండోనేషియా తరఫున కాన్సులేట్ జనరల్ అదే సుకేందర్ సీఎంతో ముఖాముఖి చర్చలు జరిపారు. తమ దేశంలో బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నాయని తెలిపారు. ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును సరఫరా చేస్తే తక్కువ ఖర్చుకే విద్యుత్ వస్తుందని, ప్రాజెక్టుల్లో భాగస్వామ్యాన్ని కూడా పొందవచ్చని సీఎం వారికి సూచించారు. బంధాల బలోపేతం దిశగా.. సింగపూర్ హైకమిషనర్ లిమ్ థాన్ బృందం సీఎంతో ముఖాముఖి చర్చల్లో పాల్గొంది. వివిధ రంగాల్లో ఇప్పటికే రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టామని, థర్మల్, సోలార్, వైమానిక రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు బృందం తెలిపింది. ఏపీతో సంబంధాలు బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొనగా రాష్ట్రం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆసక్తి దక్షిణ కొరియా రాయబారి షిన్, కాన్సులేట్ జనరల్ క్యుంగ్సూ కిమ్ ముఖ్యమంత్రి జగన్‌తో మొదట ముఖాముఖి చర్చలు జరిపారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి కంపెనీ పోస్కో ఏపీలో ప్లాంట్ పెట్టేందుకు ఆసక్తిగా ఉందని దక్షిణ కొరియా బృందం ముఖ్యమంత్రికి తెలిపింది. కడపలో ప్లాంటు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వారికి విజ్ఞప్తి చేశారు. కియా కార్ల తయారీ ప్లాంట్ ఉన్న ప్రాంతంలో విడిభాగాల తయారీ, అనుబంధ పరిశ్రమలను నెలకొల్పడానికి సంపూర్ణ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చైనాలో కొన్ని సమస్యల కారణంగా అక్కడున్న కంపెనీలను తరలించే ఆలోచనలో ఉన్నట్లు కొరియా బృందం ముఖ్యమంత్రికి తెలిపింది. అనంతపురం జిల్లాను పరిశీలించాల్సిందిగా సీఎం వారిని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఆసక్తిగా ఉన్నట్లు యునైటెడ్ కింగ్డమ్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ సీఎంకు చెప్పారు. రాష్ట్రంలో డీజిల్ బస్సుల స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం తెలిపారు. బ్రాండెక్స్ విస్తరణ బ్రాండెక్స్ విస్తరణపై పరిశీలించాలని శ్రీలంక హైకమిషనర్ ఆస్టిన్ ఫెర్నాండో సీఎంని కోరారు. పరిశోధక రంగాల్లో సహకారం బల్గేరియా రాయబారి ఎలనోరా దిమిత్రోవా సీఎం జగన్‌తో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. ఏపీ విద్యార్థులకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, పరిశోధక రంగాల్లో సహకారం అందిస్తామని ప్రతిపాదించారు. ఏపీలో వ్యవసాయ ఉత్పత్తులు ఉండేలా తగిన సహకారం అందించాలని సీఎం బల్గేరియా రాయబారికి విజ్ఞప్తి చేశారు. పర్యాటకంపై చర్చ బౌద్ధ పర్యాటకం, వ్యవసాయ రంగంలో సహకారంపై మయన్మార్ రాయబారి మోయ్ అంగ్ సీఎం జగన్‌తో చర్చించారు. పరిశ్రమలకు సహకారం చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సుసాన్ గ్రేస్ ముఖ్యమంత్రితో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ ద్వారా పరిశ్రమలకు సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చెప్పారు. మాల్టా దేశానికి చెందిన ప్రతినిధులు కూడా సీఎంతో ముఖాముఖి చర్చలు జరిపారు. పెట్టుబడులకు సిద్ధం ఆస్ట్రియా అంబాసిడర్ బ్రిజెట్టి సీఎంతో ముఖాముఖి చర్చించారు. తమ దేశంలో దాదాపు 150 హైటెక్ ఇండస్ట్రీస్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నామని చెప్పారు. వ్యవసాయంలో పెట్టుబడులు వ్యవసాయం, ఎరువులు, టెక్స్టైల్స్ రంగాల్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు తుర్క్మెనిస్థాన్ రాయబారి షలర్ సీఎంకు తెలిపారు. మా దేశంలో పర్యటించండి తమ దేశంలో పర్యటించాల్సిందిగా దేశాధ్యక్షుడి తరపున కిర్గ్ రాయబారి అసేన్ ఇసయేవ్ ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానించారు. వ్యవసాయం, హార్టీకల్చర్‌పై కలసి పనిచేయడానికి తాము సిద్ధమన్నారు. అభయారణ్యాల పరిరక్షణలో సాయం బొగ్గు, వజ్రాల గనులకు తమ దేశం ప్రసిద్ధి చెందిందని ఆఫ్రికాలోని బోట్స్వానా హైకమిషనర్ లెసెగో ఇ మొట్సుమి సీఎం జగన్‌కు తెలిపారు. వజ్రాల పాలిషింగ్ యూనిట్ల దిశగా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. అభయారణ్యాల పరిరక్షణలో సహకారం అందిస్తామని చెప్పారు. ఏపీలో ఉన్న నిపుణులైన వైద్యుల సేవలు తమ దేశానికి చాలా అవసరమని సీఎంకు నివేదించారు. -
పారదర్శక పాలన మాది.. పెట్టుబడులతో రండి
కేంద్ర ప్రభుత్వ మద్దతు మాకుంది. తోటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో, పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడుతోనూ మంచి సంబంధాలుండడం మాకున్న బలాల్లో ఒకటి. – సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే పరిశ్రమలపై విధిస్తున్న కరెంటు చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిపై ఇంకా భారం వేసే పరిస్థితి లేదు. అలా చేస్తే పరిశ్రమలను ఆకట్టుకునే విషయంలో మేం పోటీలో లేకుండా పోతాం. చార్జీల భారం మోపితే పెట్టుబడులను ఎలా ఆకర్షించగలుగుతాం.? మీరు పరిశ్రమకు శంకుస్థాపన చేసేలోపు ఏయే రంగాల్లో నిపుణులైన మానవ వనరులు అవసరమవుతాయో ఒక జాబితా ఇవ్వండి. ఎలాంటి అర్హతలున్న వారు కావాలో చెప్పండి. ఈ జాబితా ఇవ్వగానే నైపుణ్యం ఉన్న మానవ వనరులను అభివృద్ధి చేయడానికి మేం కలిసి పనిచేస్తాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీని దత్తత చేసుకుని, దాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తయారు చేస్తాం. దీనికి మీరు నిధులు సమకూర్చాల్సిన పని లేదు. మా పిల్లలకు నైపుణ్యత నేర్పడానికి అవసరమయ్యే నిధులను మేమే ఖర్చు చేస్తాం. సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన వాతావరణం కల్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్రంలో నిజాయతీ, పూర్తి పారదర్శకతతో కూడిన పరిపాలన అందిస్తున్నామని చెప్పారు. ప్రతి లావాదేవీలోనూ పారదర్శకత తప్పనిసరిగా ఉండాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు చేపట్టామని పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధుల (డిప్లొమాటిక్ ఔట్రీచ్) సదస్సులో జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేశారు. దాదాపు అరగంట పాటు ఆయన మాట్లాడారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమన్వయంతో ఈ సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ కీలక రంగాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని విదేశీ ప్రతినిధులను, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. కలిసి పనిచేద్దామని సూచించారు. పరిశ్రమలకు ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. డిప్లొమాటిక్ ఔట్రీచ్ సదస్సులో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘‘దేశ రాజధాని ఢిల్లీ వెలుపల ఇంత పెద్ద స్థాయిలో విదేశీ రాయబారులు, హైకమిషనర్లు, కాన్సులేట్ జనరల్‌లు సమావేశం కావడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. సదస్సుకు 25 దేశాల నుంచి 50 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. అందులో 16 దేశాల రాయబారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి మీ అందరికీ తెలుసు. ఇది బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రమని, వడ్డించిన విస్తరి అని చెప్పలేను. మాది పేద రాష్ట్రం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి పెద్ద నగరాలు మాకు లేవన్నది వాస్తవం. కానీ, వారసత్వంగా మాకు అనేక బలాలున్నాయి. 972 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం, 4 నౌకాశ్రయాలు, 6 విమానాశ్రయాలు ఉండటమే మా బలాలు. వీటికి తోడు ఇంకో బలం కూడా ఉంది. దేశవిదేశాల నుంచి భారీగా పెట్టుబడులను ఆకర్షించే సుస్థిరమైన పరిపాలన ఇక్కడ ఉందని సగర్వంగా చెప్పగలను. ప్రజలు మాకు బ్రహ్మాండమైన తీర్పునిచ్చారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను, 86 శాతం సీట్లను ప్రజలు మాకు కట్టబెట్టారు. 151 స్థానాల్లో గెలిపించారు. ఎంపీ సీట్ల విషయంలో మాది లోక్‌సభలో నాలుగో పెద్ద పార్టీ అని చెప్పడానికి గర్విస్తున్నా. కేంద్ర ప్రభుత్వ మద్దతు మాకుంది. తోటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో, పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడుతోనూ మంచి సంబంధాలుండడం మాకున్న బలాల్లో ఒకటి. అవినీతి రహిత పాలనను అందించడానికి, పారదర్శక విధానాలను అమలు చేయడానికి ఈ రోజుల్లో ప్రభుత్వాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అవినీతి రహిత పాలనను అందించడానికి, పారదర్శక విధానాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. మేం ఏం చేసినా నిజాయతీతో చేశాం.. పెట్టుబడులను ఆకర్షించాలంటే నిజాయతీతో కూడిన విధానాలు చాలా అవసరం. వీటిని అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు, ఈ విషయంలో ఇతరులకు ఆదర్శంగా (రోల్‌మోడల్) నిలుస్తాం. ఉత్తమ పారదర్శక విధానాల కోసం దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర అసెంబ్లీలో కొన్ని చట్టాలు చేశాం. ప్రతి లావాదేవీలోనూ పారదర్శకత తప్పనిసరిగా ఉండాలనే లక్ష్యంతో ఈ చట్టాలు తీసుకొచ్చాం. మా ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు చేపట్టాం. ఇవి కాస్త వివాదాస్పద అంశాలు కూడా. అవి ఏమిటన్నది మీ మదిలో ఉండే ఉంటాయి. మీలో విశ్వాసం, నమ్మకం కల్పించడానికి వీటి గురించి కొన్ని విషయాలు చెప్పదల్చుకున్నా. ఎవరైనా మా పట్ల విశ్వాసం చూపించాలంటే మేం చేసే పనుల్లో నిజాయతీ, చిత్తశుద్ధి, అంకితభావం ఉండాలి. మేం వాటిని చూపించకపోతే ఎవరూ మమ్మల్ని విశ్వసించరు. మాపై నమ్మకం ఉంచరు. మేం ఏం చేసినా నిజాయతీతో చేశాం. మీరు దినపత్రికల్లో చదివిన అంశాలు ఒకవైపు మాత్రమే ఉన్నాయి. శుక్రవారం విజయవాడలో జరిగిన సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు ఆ కథనాల్లో అన్ని విషయాలు చెప్పారో లేదో నాకు తెలియదు. కానీ, మేము తీసుకున్న నిర్ణయాల్లో రెండోవైపు కోణాన్ని, రెండోవైపు కథనాన్ని మీకు వివరించదల్చుకున్నా. అందులో ఒకటి విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష. ప్రైవేట్ సంస్థల నుంచి ఎక్కువ ధరలకు కరెంటు కొనుగోలు చేసేలా కుదుర్చుకున్న ఒప్పందాలను(పీపీఏ) పునఃసమీక్షించాలన్నదే మా నిర్ణయం. ఇది కాస్త వివాదాస్పదం అయినా ఇందులో ఉన్న కీలక అంశాన్ని చెప్పదల్చుకున్నా. విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కం) కరెంటు కంపెనీలకు బకాయిలు చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల ఏం ప్రయోజనం? నేను సీఎం అయి 2 నెలలే అయింది. ఈ పదవిలోకి రాగానే రాష్ట్రంలో విద్యుత్ రంగంపై, డిస్కంల పరిస్థితిపై సమీక్ష చేశాను. రూ.20 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు చెప్పారు. గత ప్రభుత్వం ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంగా విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు బిల్లులు చెల్లించలేదని చెప్పారు. అలాంటప్పుడు ఈ పీపీఏలతో ఏం చేసుకోవాలి? వీటికి ఎలాంటి విలువా ఉండదు. డిస్కంలు పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేమేం చేయాలి? వివాదాస్పదం అయినప్పటికీ కచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఉభయతారకంగా ఉండాలని నిర్ణయించాం. విద్యుత్ రంగంలో అంతర్జాతీయ సంస్థలు, వాటికి రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఉన్నాయని తెలుసు. వాటికి నమ్మకం, విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకే ఉభయతారకంగా ఉండేలా పీపీఏలను పునఃసమీక్షించాలని నిర్ణయించాం. అందుకే కంపెనీలకు వాస్తవ పరిస్థితులను తెలియజేశాం. ఆదాయాలు తక్కువగా ఉన్నాయి, మరోవైపు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయి. శుక్రవారం విజయవాడలో జరిగిన డిప్లొమాటిక్ ఔట్రీచ్ సదస్సుకు హాజరైన వివిధ దేశాల దౌత్యవేత్తలు, ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు ఇలాంటి పరిస్థితుల్లో డిస్కంల మనుగడ కష్టమవుతోందని చెప్పాం. ఏ డిస్కం కూడా బతికి బట్ట కట్టలేదని వివరించాం. మరోవైపు బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులతో సహా మరికొన్ని రంగాలకు సబ్సిడీపై కరెంటు ఇస్తున్నాం. ఈ రంగాలు పెద్దగా చార్జీలు చెల్లించే పరిస్థితుల్లో లేవు. విద్యుత్ రంగంలో ఆదాయాలు ఏమైనా వస్తున్నాయంటే అవి పరిశ్రమల నుంచి మాత్రమే. ఇప్పటికే పరిశ్రమలపై విధిస్తున్న కరెంటు చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిపై ఇంకా భారం వేసే పరిస్థితి లేదు. అలా చేస్తే పరిశ్రమలను ఆకట్టుకునే విషయంలో మేం పోటీలో లేకుండా పోతాం. చార్జీల భారం మోపితే పెట్టుబడులను ఎలా ఆకర్షించగలుగుతాం? అందుకే మేం ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగాలు వస్తాయనే విశ్వాసం కల్పించాలి పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కేటాయిస్తూ చేసిన చట్టంపై వచ్చిన కథనాల్లో సంపూర్ణంగా అన్ని విషయాలూ చెప్పడం లేదు. అమెరికా లాంటి దేశంలో కూడా అక్కడి ప్రభుత్వం ప్రస్తుతం లోకల్ జాబ్స్ గురించి మాట్లాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఉంది. ఏ పరిశ్రమ అయినా, ఎక్కడ వచ్చినా సరే ఎంతో కొంత కాలుష్యం ఉంటోంది. తక్కువ, ఎక్కువ స్థాయిలో కావచ్చు. ఉద్యోగాలు వస్తాయనే ఆశ లేనçప్పుడు ఎవరైనా పరిశ్రమల కోసం ఎందుకు భూములు ఇస్తారు? అందుకే పరిశ్రమలకు అనుకూలమైన దిశలోనే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. భూములిచ్చిన వారికి ఉద్యోగాలు దొరుకుతాయనే విశ్వాసం కల్పించినప్పుడు మాత్రమే వారు పరిశ్రమలను మనస్ఫూర్తిగా స్వాగతించి సానుకూలంగా ఉంటారు. విజయవాడలోని గేట్ వే హోటల్లో డిప్లొమాటిక్ ఔట్రీచ్ సదస్సును ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో మరో నాలుగు పోర్టులు మా రాష్ట్రంలోని 972 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 4 నౌకాశ్రయాలు(పోర్టులు) ఉన్నాయి. 13 జిల్లాల్లో 6 జిల్లాలకు విమానాశ్రయాలు ఉన్నాయి. ఇప్పుడున్న పోర్టుల సంఖ్య పెంచుతాం. ఈ ఐదేళ్లు పూర్తయ్యే సరికి మరో నాలుగు కొత్త పోర్టులు వస్తాయి కనుక వాటి సంఖ్య ఎనిమిదికి చేరుకుంటుంది. నదుల అనుసంధానం ఆవశ్యకం నదులకు మేం చివరి భాగంలో ఉన్నాం. రాష్ట్రంలో నదులను అనుసంధానించాల్సిన ఆవశ్యకత ఉంది. సాగునీటి స్థిరీకరణకు, తాగు నీటికి గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం అవసరం. ఈ ప్రాజెక్టు విషయంలో కలిసి రావాలని కోరుతున్నాం. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలన్నది మా అభిమతం. ఇందులో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయి. పరిశోధక యూనివర్సిటీలు, సీ పోర్టులు, విశాఖపట్నం, విజయవాడ–గుంటూరులో మెట్రోరైల్ ప్రతిపాదనలు ఉన్నాయి. మేము ప్రవేశపెట్టిన వినూత్న సంక్షేమ పథకాల్లో మీ సహకారం సైతం కోరుతున్నాం. నైపుణ్యం ఉన్న మానవ వనరులను తయారు చేస్తాం పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం గల మానవ వనరులు రాష్ట్రంలో ఉన్నాయా? ప్రతిభ ఉందా? అనే ప్రశ్నలు మీ దగ్గరి నుంచి వస్తాయి. దీనికోసం ఒక స్పష్టమైన విధానంతో ఉన్నాం. మీరు పరిశ్రమ పెట్టేముందు, శంకుస్థాపన చేసే లోపు ఏయే రంగాల్లో నిపుణులైన మానవ వనరులు అవసరమవుతాయో ఒక జాబితా ఇవ్వండి. ఎలాంటి అర్హతలున్న వారు కావాలో చెప్పండి. ఈ జాబితా ఇవ్వగానే నైపుణ్యం ఉన్న మానవ వనరులను అభివృద్ధి చేయడానికి మేం కలిసి పనిచేస్తాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీని దత్తత చేసుకుని, దాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తయారు చేస్తాం. దీనికి మీరు నిధులు సమకూర్చాల్సిన పని లేదు. మా పిల్లలకు నైపుణ్యత నేర్పడానికి అవసరమయ్యే నిధులను మేమే ఖర్చు చేస్తాం. సదస్సులో దక్షిణ కొరియా, సింగపూర్, బోట్స్వానా దేశాల ప్రతినిధులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి నైపుణ్యతను నేర్పించే విషయంలో బోధనా సహకారం మీ నుంచి ఉంటే సరిపోతుంది. మీకు అన్ని స్థాయిల్లోనూ అంగీకారమయ్యే రీతిలో మా పిల్లలను తయారు చేస్తాం. పరిశ్రమలు పెట్టే ప్రాంతాల్లోని ప్రజల గురించి ఆలోచించకపోతే అక్కడ అలజడే కనిపిస్తుంది. మీరు ఫ్యాక్టరీ పెట్టాక అలజడి ఉంటే, ప్రజల నుంచి సహకారం లభించకపోతే దానివల్ల ఫలితం ఏముంటుంది? ఈ పరిస్థితి ఒక్క ఈ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ఉంది. ప్రతి రాష్ట్రం ఈ చిక్కును ఎదుర్కొంటోంది. అందుకే ఈ అంశాలపై దృష్టి సారించాలి. మేం తీసుకున్న నిర్ణయాల్లో నిజాయతీ ఉంది కనుక మీ సహకారం చాలా అవసరం. ఆర్థిక వనరుల సమీకరణకు పెద్ద ఎత్తున ఆలోచనలు చేస్తున్నాం ఆక్వా, ఆహార రంగాల్లో రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఉత్పత్తులు వస్తున్నాయి. ఈ రంగాల్లో మీ సహకారం చాలా అవసరం. ఈ రెండు రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకురావాల్సి ఉంది. ఇప్పుడున్న ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి కనుక మీ సహాయం కోరుతున్నాం. మీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ముందుకు రావాలి. రాష్ట్రంలో పంటల దిగుబడులు చాలా తక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో సగటున 2,500 కిలోల కాఫీ వస్తే వియత్నాంలో 7,000 నుంచి 8,000 కిలోల వరకూ వస్తోంది. మెరుగైన ఆలోచనలు, విధానాల ద్వారా ఉత్పత్తిని పెంచుకోవడానికి మీ సహాయ సహకారాలు అవసరం. పోర్టులు, రిఫైనరీలు, ఉక్కు కర్మాగారాలు, నీటి యాజమాన్య పద్ధతుల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం మేం చాలా పెద్ద ఎత్తున ఆలోచనలు చేస్తున్నాం. పరిపాలనలో ఒక ప్రమాణాన్ని నెలకొల్పుతాం దేశంలో నిరక్షరాస్యత 26 శాతం అయితే, ఏపీలో 33 శాతం. గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తి (జీఈఆర్) రష్యాలో 81 శాతం ఉంటే చైనాలో 48 శాతం ఉంది. బ్రెజిల్లో 50 శాతం ఉంటే భారత్‌లో 25 శాతం మాత్రమే ఉంది. అందుకే అనేక సంక్షేమ పథకాలు చేపట్టాం. ఈ అంశాలన్నింటిలోనూ మీ సహకారం కోరుకుంటున్నాం. మాది వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. 62 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. రైతుల జీవన ప్రమాణాలు పెంచాలని మేం గట్టిగా ప్రయత్నిస్తున్నాం. పాఠశాలలు, ఆసుపత్రుల ఆధునీకరణ పనులు ప్రారంభించాం. ఈ కార్యక్రమాల్లో మీరు సముచిత పాత్ర పోషించాలని కోరుతున్నాం. మీతో కలిసి పని చేయడానికి మేం చిత్తశుద్ధితో ఉన్నాం. నిజాయతీ గల ప్రభుత్వం మాది. అత్యంత సానుకూలత ఉన్న బృందం మాది. అవినీతి రహిత, పారదర్శక పరిపాలన విషయంలో మేము కచ్చితంగా ఒక ప్రమాణాన్ని నెలకొల్పుతాం’’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. -
రూ.లక్ష కోట్ల ఉద్దీపనలు కావాలి
న్యూఢిల్లీ: పెట్టుబడుల క్రమాన్ని వేగవంతం చేసేందుకు, క్షీణిస్తున్న ఆర్థిక రంగ వృద్ధి పునరుత్తేజానికి రూ.లక్ష కోట్లకు పైగా ఉద్దీపనలు అవసరమని దేశీయ పరిశ్రమల సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి సూచించాయి. త్వరలోనే ఆర్థిక వృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీనిచ్చినట్టు పారిశ్రామిక వేత్తలు సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రస్తుత మందగమన వాతావరణంలో వెంటనే పరిష్కారాలు అవసరమని అసోచామ్ ప్రెసిడెంట్ బీకే గోయంకా పేర్కొన్నారు. ‘‘ఉద్దీపనల ప్యాకేజీ ద్వారా ఆర్థిక రంగానికి సత్వర పరిష్కారం కావాలి. రూ.లక్ష కోట్లకు పైగా ప్యాకేజీని మేము సూచించాం’’ అని గోయంకా తెలిపారు. కుంగిన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని తీసుకొచ్చేందుకు, ఇబ్బందికర అంశాలపై మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ అధికారులు పరిశ్రమల నేతలతో చర్చించారు. పరిశ్రమల పునరుత్తేజానికి అతి త్వరలోనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు, ఆర్థిక శాఖ నుంచి సానుకూల అభిప్రాయాలు వచ్చినట్టు జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్ తెలిపారు. స్టీల్, ఎన్బీఎఫ్సీ, వాహన రంగాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పిన ఆయన వీలైనంత త్వరలోనే పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు చెప్పారు. లిక్విడిటీ సమస్య లేదు... పరిశ్రమలకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకులు పునరాలోచిస్తున్న విషయం సహా పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు పిరమల్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ అజయ్ పిరమల్ తెలిపారు. ‘‘బ్యాంకుల్లో లిక్విడిటీ లేకపోవడం కాదు, కానీ రుణ వితరణే జరగడం లేదు. ఆర్థిక రంగంలో ఎన్బీఎఫ్సీ పరంగా సమస్య నెలకొని ఉంది’’ అని సమావేశం అనంతరం మీడియాతో అజయ్ పిరమల్ వెల్లడించారు. ఎన్బీఎఫ్సీ రంగ సమస్యలు ఆటోమొబైల్, హోమ్‌లోన్, ఎంఎస్ఎంఈలపైనా ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే చర్యలు ఉంటాయని ప్రభుత్వం తెలిపిందని, వాటి కోసం తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. సీఎస్ఆర్ విషయంలో ఎటువంటి శిక్షాత్మక చర్యలు ఉండకూడదని ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు అజయ్ పిరమల్ వెల్లడించారు. దేశ ఆర్థిక రంగ వృద్ధి పునరుద్ధరణకు అవసరమైన తదుపరి ఉద్దీపనల విషయంలో ప్రభుత్వం తమ అభిప్రాయాలను కోరినట్టు సీఐఐ వైస్ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ తెలిపారు. సమావేశంలో ఎన్నో అంశాలు చర్చించినట్టు పేర్కొన్నారు. ఆటోమొబైల్ రంగంలో మాంద్యం స్టీల్ రంగంపైనా ప్రభావం చూపుతోందన్నారు. సెంట్రల్ బ్యాంకు రేట్ల కోతను బ్యాంకులు వినియోగదారులకు బదలాయించడం అతిపెద్ద అంశమని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని అభిప్రాయపడ్డారు. ‘‘రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు తప్పనిసరిగా వినియోగదారులు, రుణ గ్రహీతలకు బదలాయించాలి. తదుపరి రేట్ల కోతపైనా ఆశావహంగా ఉన్నాం. ఆర్బీఐ ఇప్పటి వరకు 110 బేసిస్ పాయింట్లు తగ్గించడం ఉత్సాహాన్నిచ్చేదే’’ అని సోమాని తెలిపారు. -
యూబీఐలో రూ.12 కోట్లు మాయం
కరీంనగర్‌క్రైం: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుంచి రూ.12 కోట్లు మాయమవడం కలకలం రేపింది. పారిశ్రామికవేత్తలమని పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులను అప్పనంగా డబ్బులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆడిటింగ్‌లో భాగంగా గురువారం తనిఖీలు నిర్వహించడంతో ఇది వెలుగుచూసింది. కరీంనగర్ యూబీఐ బ్రాంచ్ మేనేజర్‌గా సురేష్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. సురేష్‌కుమార్‌కు కామారెడ్డికి చెందిన రాజుతో పరిచయం ఉంది. అతని ద్వారా ముంబైకి చెందిన సౌమిత్ రంజన్ జైన్, మధ్యప్రదేశ్‌లోని జగదల్పూర్కు చెందిన మనోజ్‌కుమార్ శుక్లాలు వ్యాపారవేత్తలుగా మేనేజర్‌తో పరిచయం చేసుకున్నారు. కొన్నిరోజుల తర్వాత రంజన్‌జైన్ తనకు డబ్బులు అవసరం ఉందని, బ్యాంక్ నుంచి రూ.5 కోట్లు ఇస్తే.. అదనంగా కలిపి ఇస్తానని చెప్పాడు. దీంతో ఆశపడిన మేనేజర్.. 2018 అక్టోబర్‌లో మొదటి దఫా రూ.5 కోట్లు ఇచ్చాడు. ఫిబ్రవరిలో రెండో వ్యక్తి మనోజ్ శుక్లా కూడా తనకూ అవసరం ఉందని అడగడంతో అతనికి మరో రూ.7 కోట్లు తీసుకొని వెళ్లి అప్పగించారు. అనంతరం వారు పత్తా లేకుండా పోయారు. ఆడిటింగ్‌లో భాగంగా ఈ నెల 11న హైదరాబాద్ నుంచి వచ్చిన తనిఖీ బృందం పరిశీలించగా.. లెక్కల్లో తేడాలు రావడంతో అనుమానం వచ్చింది. దీంతో అన్ని రకాల రికార్డులు పరిశీలించగా.. రూ. 12 కోట్లకు సంబంధించిన సమాచారం లేదు. బ్యాంక్ మేనేజర్‌ను విచారించగా తాను ఇద్దరికి.. రూ.12 కోట్లు ఇచ్చినట్లు తెలిసింది. అన్నీ అనుమానాలే.. కరీంనగర్ యూనియన్ బ్యాంక్‌లో 28 బ్రాంచ్‌లకు చెందిన నగదు నిల్వలను పర్యవేక్షిస్తుంది. ఇక్కడ పనిచేస్తున్న సురేష్‌కుమార్ చాలా కాలంపాటు బ్యాంకింగ్ రంగంలో ఉన్నారు. అలాంటి వ్యక్తి కేవలం కొద్ది రోజుల క్రితం పరిచయమైన ఇద్దరికి తాను రూ.12 కోట్లు ఇచ్చానని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సీబీఐ అధికారులు రంగంలోకి దిగారని తెలిసింది. ఈ విషయమై బ్యాంక్ అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
గతం గతః.. మరో కొత్త అధ్యాయం
సాక్షి, బెంగళూరు : ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులలో ఒకడైన బిన్నీ బన్సల్ (37) ఎట్టకేలకు మౌనం వీడారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా వైదొలగిన మూడు నెలల అనంతరం తొలిసారిగా ఆయన తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. గతం గతః..ఇక ముందుకే..తన జీవితంలో మరో అధ్యాయనాన్ని ప్రారంభించనున్నట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తన పాత సహచరుడు సాయి కిరణ్ కృష్టమూర్తితో కలిసి స్థాపించిన ఎక్స్ టూ 10 ఎక్స్ టెక్నాలజీ అనే స్టార్టప్‌పై దృష్టిపెట్టనున్నట్టు వెల్లడించారు. తద్వారా 10 స్టార్టప్ కంపెనీలకు ఊతమివ్వాలని నిర్ణయించామంటూ తన ఫ్యూచర్ ప్లాన్లను ప్రకటించారు. నిజానికి వీటి ద్వారా సుమారు 10 వేలకుపైగా మధ్యతరగతి వ్యాపారవేత్తలకు సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే బృందంతోపాటు ఒక కార్యాలయాన్నికూడా ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు కొంతమంది ప్రముఖ స్టార్టప్ వినియోగదారులను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. కాగా గ్లోబల్ ఈ కామర్స్ దిగ్గజం వాల్‌మార్ట్ 1600 కోట్ల డాలర్లు చెల్లించి ఫ్లిప్‌కార్ట్‌ను టేకోవర్ చే సిన సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు అనంతరం ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్లు ఒకరుసచిన్ బన్స్ల్ తన వాటాను మొత్తం విక్రయించు సంస్థను వీడగా, లైంగిక వేధింపుల ఆరోపణలతో బిన్నీ బన్సల్ ఫ్లిప్‌కార్ట్ సీఈవో పదవిగా రాజీనామా చేశారు. బన్సల్‌పై 'తీవ్ర వ్యక్తిగత దుష్ప్రవర్తన' ఆరోపణలపై ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లభించనప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో లోపాలు, వివిధ సందర్భాలకు తగినట్లు స్పందించకపోవడం, పారదర్శకత లేమి బయటపడ్డాయని, అందుకే ఆయన రాజీనామాను ఆమోదించామని ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్‌లు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. 4శాతం వాటాను కలిగి వున్నబిన్సీ బన్సల్ ఫ్లిప్‌కార్డ్ బోర్డులో ఇంకా కొనసాగుతున్నారు. -
పెట్టుబడులతో రండి
సాక్షి, అమరావతి: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో అనుకూల వాతావరణం ఉందని, ఇందుకు అమరావతి అభివృద్ధి బాండ్ల ద్వారా పెట్టుబడులే తాజా ఉదాహరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్(బీఎస్ఈ)లో సీఆర్డీఏకి చెందిన అమరావతి బాండ్ల లిస్టింగ్ బెల్ మోగించిన సీఎం చంద్రబాబు.. పలువురు ఇన్వెస్టర్లు, పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులతో హోరెత్తించాలని పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. హైదరాబాద్‌లో తాను చేసిన అభివృద్ధి ద్వారా మంచి పేరు తెచ్చి పెట్టగలిగామని, అలాగే అమరావతిని పెద్దఎత్తున అభివృద్ధి చేయతలపెట్టామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బీఎస్ఈ అధికారులను చంద్రబాబు కోరారు. సృజనాత్మక విధానాలదే భవిష్యత్ అని, దాని ద్వారానే అనేక కొత్త కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తూ జ్ఞాన భూమిగా మారుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పాలనలో రియల్ టైం గవెర్నెన్స్ కీలక భూమిక పోషిస్తోందన్నారు. సమర్థ ఆర్థిక నిర్వహణ, ఈ–ఆఫీస్, కంటెంట్ కార్పొరేషన్ వంటి వినూత్న ఆవిష్కరణలు రాష్ట్ర పరిపాలనలో ఒక కొత్త ఒరవడి సృష్టించాయని వివరించారు. బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ మాట్లాడుతూ.. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అమరావతిపై ప్రజెంటేషన్ అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబు ముంబై తాజ్ పాలెస్లో పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉండాలని, 2050 నాటికి ప్రపంచంలో బెస్ట్ డెస్టినేషన్‌గా ఉండాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి చేసిన భూ బ్యాంకు అందుబాటులో ఉందని, భవిష్యత్‌లో విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పారు. పారిశ్రామిక వేత్తలకున్న ఇబ్బందులను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వనరులకు సంబంధించిన సమాచారం అంతా సిద్ధంగా ఉందన్నారు. వాటిని వినియోగించుకుని పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు. రాష్ట్రంలో పర్యాటక పరంగా అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాజధానికి రైతులు ఇచ్చిన భూమిలో కొంత భాగాన్ని పెట్టుబడులకు కేటాయించి అమరావతిని ఆర్థిక వనరుల కేంద్రంగా మార్చనున్నట్లు తెలిపారు. టాటా గ్రూప్ భాగస్వామ్యం కావాలి ఆంధ్రప్రదేశ్‌లో హోటల్, పర్యాటక శాఖ, ఎలక్ట్రికల్ బస్సు రవాణా వంటి రంగాల్లో భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు టాటా గ్రూప్‌ను ఆహ్వానించారు. టాటా సంస్థ మాజీ చైర్మన్ రతన్ టాటాతో కలిసి సీఎం ముంబైలో టాటా ఎక్స్పిరియన్స్ సెంటర్‌ను సందర్శించారు. టాటా గ్రూప్ సామాజిక పరంగా చేపట్టిన మహిళా సాధికారత వంటి కార్యక్రమాలపై ప్రాజెక్టులను టాటా అధికారులు వివరించారు. వెల్స్పన్ గ్రూపు చైర్మన్ బాలకృష్ణ గోయెంకాతోనూ సీఎం భేటీ అయ్యారు. సేంద్రియ పత్తి సాగులో ఆంధ్రప్రదేశ్‌తో ఉమ్మడిగా పని చేయడానికి ఆయన ఆసక్తిని వ్యక్తం చేశారు. రైతులకు కనీస మద్దతు ధర కన్నా 33 శాతం అధిక ఆదాయం పొందేలా తమ వద్ద ప్రణాళికలున్నాయని గోయెంకా వివరించారు. దీనిపై ప్రతిపాదనలతో రావలసిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు. విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు, పెట్టుబడులు, మౌలిక సౌకర్యాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, సీఎం ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్, రాష్ట్ర ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈవో జె.కృష్ణ కిశోర్, రియల్ టైం గవెర్నెన్స్ సీఈవో బాబు అహ్మద్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారు. -
రాహుల్ పారిశ్రామికవేత్తల భేటీకి టీడీపీ పారిశ్రామికవేత్తలు
-
రాహుల్ సమావేశానికి నారా బ్రాహ్మణి!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో జరిగిన ఈ భేటీ పలు ఆసక్తికర రాజకీయ సమీకరణాలకు తెరతీసింది. ఈ భేటీకి టీడీపీ వ్యాపారవేత్తలు క్యూ కట్టడం గమనార్హం. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణితోపాటు ఎంపీ టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్, జేసీ తనయుడు పవన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. దగ్గుబాటి సురేశ్‌తోపాటు టీడీపీ అనుకూల పారిశ్రామికవేత్తలు కూడా ఈ సమావేశానికి వచ్చారు. ఫొటో: రాహుల్‌తో భేటీకి హాజరైన పారిశ్రామికవేత్తలు... గత కొంతకాలంగా కాంగ్రెస్-టీడీపీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లు కాపురం చేసిన బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా దూరం జరగడంతో.. రానున్న ఎన్నికల్లో కొత్త మిత్రుల కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారు. నాలుగేళ్ల పాలనలో అవినీతి, అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తడం, ప్రజావ్యతిరేకత భారీగా పెరగడంతో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లేందుకు బాబు సిద్ధపడటం లేదు. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌తో జోడీ కట్టేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా టీడీపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనూ ఈ రెండు పార్టీలు అన్యోన్యంగా వ్యవహరించాయి. రాజ్యసభ పీఏసీ సభ్యుని ఎన్నికలో టీడీపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వగా.. డిప్యూటీ ఛైర్పర్సన్ ఎన్నికలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతునిచ్చింది. కర్ణాటక సీఎం కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు నాయుడు చేతులు చేయ్యేసి ఫొటోలకు ఫోజుచ్చారు. అటు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఏపీలో ఏమంతా మెరుగుపడలేదు. విభజనకు కారణమైన పార్టీగా ఏపీలో కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. విభజనకు, ఏపీని వెనుకబడిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని నిత్యం నిందించే చంద్రబాబు.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో చెట్టపట్టాలకు సిద్ధమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఊరు మారింది
గుజరాత్ రాష్ట్రంలోని బార్డోలి తాలూకాలో ఓ కుగ్రామం.. హాల్పట్టి. ఆదివాసీలు నివసించే గ్రామం అది. గవర్నమెంట్ స్కూల్లో టీచర్ పాఠం చెబుతోంది. ఓ నలుగురు పెద్ద మనుషులు వచ్చారు. వాళ్లలో ఒకతడి కంఠం ఖంగుమంది ‘వీళ్లకు పాఠాలు చెప్పడం ఆపెయ్. వీళ్లంతా చదువరులైతే రేపు మా పొలాల్లో పనులు చేసేదెవరు’ అని హుంకరించాడతడు. హాల్పట్టి పొలాలన్నీ జమీందారుల చేతుల్లోనే ఉన్నాయి. చిన్న రైతులు, ఆదివాసీల పొలాలు కూడా వాళ్ల చేతుల్లోకే వెళ్లిపోయాయి. పంటలు సరిగ్గా పండక, పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు పెరిగిపోవడంతో పొలాలు అప్పులోకే జమయ్యాయి. ఆ రైతులు తమ పొలాల్లోనే కూలీలయ్యారు. అప్పుడొచ్చింది సౌమ్య! హాల్పట్టి గ్రామంలోని ఆదివాసీ మహిళలకు కొడవలి చేతపట్టి పొలం పనులు చేయడమే కాదు, అదే చేతుల్తో రోజూ ఇంట్లో చేసే పనులతోనే కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చనే కొత్త ఆలోచనకు బీజం వేసింది సౌమ్య. ఆమెది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్. ఢిల్లీలో హిందూ కాలేజ్ నుంచి కామర్స్‌లో డిగ్రీ చేసింది. అనేక స్టార్టప్ కంపెనీలకు మార్కెటింగ్ చేసింది. మార్కెటింగ్ రంగంలో మంచి సంపాదన ఉంది. మార్కెటింగ్ కంటే దానికి మూలమైన ఉత్పత్తి రంగం మీద ఆసక్తి పెరిగిందామెకు. అలా మొదలైందామె ప్రయాణం. గుజరాత్‌లోని బార్డోలి తాలూకా, హాల్పట్టి ఆదివాసీ తండా ఆమె కార్యక్షేత్రమైంది. స్థానిక మహిళలను చైతన్యవంతం చేసింది. అగాఖాన్ రూరల్ సపోర్టు ప్రోగ్రామ్ ద్వారా ఇరవై వేల రూపాయలతో వారికి గ్రైండర్, తిరుగలి తీసిచ్చింది. ఇద్దరే ముందుకొచ్చారు ఆ మహిళలు చేయాల్సింది కొత్తగా ఏమీ లేదు, రోజూ ఇంటి కోసం చేసుకునే మసాలాలనే ఎక్కువ మొత్తంలో చేసి ప్యాక్ చేయాలి. ఎండు మిర్చితో కారం, పసుపు కొమ్ములను ఎండబెట్టి పసుపు పొడి చేయడం వంటివే. పని చేయడానికైతే అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఒక బ్రాండ్ పేరుతో వ్యాపారం మొదలు పెట్టడానికి వెనుకడుగు వేశారు. ముప్పై మందిలో వ్యాపారం మొదలు పెట్టడానికి ధైర్యం చేసింది పాతికేళ్ల సోనమ్ బెన్, శోభన్‌బెన్‌లు మాత్రమే. తేజ్ మసాలా పేరుతో తయారు చేసి, తమ ఉత్పత్తులను తామే విక్రయించుకుంటున్నారు. పంచాయితీ భవనమే ఫ్యాక్టరీ ఈ మహిళలు అంతా కలిసి పని చేయాలనైతే అనుకున్నారు కానీ ఎక్కడ చేసుకోవాలి? ఒక చోట కూర్చుని పని చేసుకోవడానికి ఎవరివీ అంత విశాలమైన ఇళ్లు కాదు. ముడిసరుకు నిల్వ చేయడానికి అనువైనవి కూడా కాదు. ఎంత కరకుగా ఉన్న ఊరి పెద్దలయినా సరే... ఆడపిల్లలు ముందుకొచ్చి పని చేసుకుంటామంటే ముచ్చటపడతారు. అలాగే ఊరిపెద్ద గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఒక గది ఇచ్చాడు. కారం, పసుపు, గరం మసాలా, మసాలా చాయ్ పౌడర్, చికెన్‌మసాలా, కొత్తిమీర– జీలకర్ర మసాలా, పావ్‌భాజీ మసాలా, పులావ్ మసాలాలు తయారయ్యాయి. 50, 100 గ్రాములు తూకం వేసి, ప్యాకింగ్ మెషీన్‌తో ప్యాక్ చేయడం కూడా నేర్చుకున్నారు. ఇక హైవే మీద ఒక గుడారం వేసి టేబుల్ వేసుకున్నారు. అదే వారి దుకాణం. నెలకు పాతిక కిలోల వరకు అమ్ముడవుతున్నాయి. ఈ దుకాణంతోపాటు వారం వారం సంతలకు కూడా వెళ్తారు. తేజ్ మసాలా హైవే మీద ప్రయాణించే దూరప్రాంతాల వాళ్లను చేరింది, కానీ ఉన్న ఊళ్లో ఇళ్ల నుంచి బయటకు రాని మహిళలకు తెలియడానికి చాలా రోజులు పట్టింది. ఆదివాసీ మహిళలు ఇంటింటికీ వెళ్లి తమను పరిచయం చేసుకున్నారు. ‘ఒకసారి వాడి చూద్దాం’ అని తీసుకున్న వాళ్లు వీటికి మంచి మార్కులు వేయడంతో డోర్ టు డోర్ మార్కెటింగ్ కూడా మంచి ఫలితాలనే ఇస్తోంది. ఐదు నెలల పాటు తాజాదనం తగ్గని క్వాలిటీ కూడా డిమాండ్ పెరగడానికి ఓ ప్రధాన కారణం. ‘ఉత్పత్తిని ఇంకా పెంచాలి’ నెలకు నలభై కిలోల మసాలాలు తయారవుతున్నాయిప్పుడు హాల్పట్టిలో. ఒక్కొక్కరికి నెలకు నికరంగా ఐదు వేల రూపాయలు మిగులుతున్నాయి. డిమాండ్ ఉంది. కాబట్టి నెలకు 80 కిలోలకు పెంచడం ఇప్పుడు వారి లక్ష్యం. వ్యాపార విస్తరణలో మరో ముందడుగు వేస్తున్నారిప్పుడు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో మార్కెట్ జోన్ కనిపించింది. బ్లాక్ డెవలప్మెంట్ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు వీరి ఉత్పత్తులను కొనడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మార్కెట్ తమ సొంతమైతే పరిశ్రమను విస్తరించడానికి మరెంతో సమయం పట్టదని ధీమాగా చెప్తున్నారు. అవకాశం వస్తే తన ఉనికిని చాటు కోవడానికి మహిళలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులలో బతుకీడుస్తున్నా సరే, చిన్న అవకాశాన్ని పట్టుకుని ఎదిగి తీరుతారు. – మంజీర -
భారత్‌లో అంతే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని వయోజనుల్లో కేవలం 5 శాతం మందే సొంత వ్యాపారాలకు మొగ్గుచూపుతున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే 5 శాతం ఎంట్రప్రెన్యూర్ రేట్ అతితక్కువ కావడం గమనార్హం. ఇక వ్యాపారాన్ని అర్థంతరంగా నిలిపివేయడం భారత్‌లో 26.4 శాతంగా నమోదైంది. దేశంలో వ్యాపార కార్యకలాపాలను అంచనా వేసేందుకు 18 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్కులను దాదాపు 3,400 మందిని పైగా ఈ సర్వే పలుకరించింది. దేశంలో 11శాతం మంది తమ తొలినాళ్లలోనే సొంత వ్యాపార కార్యకలాపాల్లో అడుగుపెడుతున్నారని ఎంట్రెప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఈడీఐ)కు చెందిన గ్లోబల్ ఎంట్రెప్రెన్యూర్‌షిప్ మానిటర్ (జెమ్) నివేదికలో పేర్కొంది. వీరిలో ఏడు శాతం మంది వ్యాపారవేత్తలు మూడున్నర ఏళ్ల కిందటి నుంచి వ్యాపారాలను నడిపిస్తున్నారు. నాలుగు శాతం మంది యజమానులుగా లేదా సహ యజమానులుగా ఇటీవల వ్యాపారాలను చేపట్టారని నివేదిక తెలిపింది. ఇక సొంత వ్యాపారం చేపట్టి 42 నెలలుగా స్ధిరంగా కొనసాగిస్తున్న వారు కేవలం 5 శాతమేనని, మిగిలిన ప్రపంచంతో పోలిస్తే ఇది అత్యల్పమని నివేదిక పేర్కొంది. బ్రిక్స దేశాల్లో సొంతంగా వ్యాపారాలు చేపట్టే వారి సంఖ్య అత్యధికంగా 17 శాతం కాగా, దక్షణాప్రియా 3 శాతంతో అత్యల్ప స్ధానం దక్కించుకుంది. భారత్, రష్యా 5 శాతం ఎంటర్‌ప్రెప్యూర్ల జాబితాలో సంయుక్తంగా నిలిచాయి. -
అవకాశాలకు జీఈఎస్
(రమణమూర్తి మంథా) అవును! ఇక్కడ పెట్టుబడులకు తగిన అవకాశాలు ఉంటాయేమోనని వచ్చాం. తగిన సామర్థ్యమున్న పారిశ్రామికవేత్తలను చూశాం. కొందరితో మాట్లాడుతున్నాం. వాతావరణమైతే బాగుంది.. – ఇది పెట్టుబడిదారుల మాట. మా ఆలోచనలను కంపెనీలుగా మార్చాం. మాకు ఎదగటానికి మరిన్ని నిధులు, కాస్త మద్దతు కావాలి. ఇక్కడికొచ్చి ఇతర సంస్థలను చూసి, ఇన్వెస్టర్లతో మా ఆలోచనలు పంచుకున్నాక ఆశలు పెరిగాయి.. – ఇది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మాట ...ఈ రెండు వర్గాలను ఒకచోటికి చేర్చడానికే ఈ వేదికను సృష్టించామని, ఇది మున్ముందు దేశంలో పారిశ్రామికవేత్తల సంఖ్యను భారీగా పెంచి, మరింత మందికి ఉపాధినిచ్చే దిశగా వెళుతుందనేది నిర్వాహకుల మాట. మొత్తంగా హైదరాబాద్‌లో జరుగుతున్న జీఈఎస్–2017పై అటు నిర్వాహకులు, ఇటు డెలిగేట్లు అందరూ సంతృప్తితో కూడిన ఆశలనే వ్యక్తం చేశారు. నిజానికి జీఈఎస్ సదస్సు ఏ లక్ష కోట్లో, వేల కోట్లో పెట్టుబడులను కుమ్మరిస్తున్నట్లుగా బడా కంపెనీలు ప్రకటించేసి.. ఎంఓయూలు కుదుర్చుకుని మరిచిపోయే ఫక్తు వ్యాపార సదస్సు కాదు. పెద్ద పెద్ద పరిశ్రమలేవీ ఈ వేదికపై భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించే అవకాశమూ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా స్టార్టప్‌ల వ్యవహారం. కొత్త ఆలోచనలతో సంస్థలు ప్రారంభించి, తగిన మార్గదర్శకత్వం కోసం, అవసరమైన నిధుల కోసం చూస్తున్న స్టార్టప్‌లకు తగిన వనరులు వెతుక్కునే వేదిక ఇది. భారీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలతో పాటు చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టే వ్యక్తిగత ఇన్వెస్టర్లూ ఇందులో పాల్గొన్నారు. వచ్చినందుకు ప్రయోజనం దక్కుతోందని ఆశాభావమూ వ్యక్తం చేస్తున్నారు. ‘‘నేను మా దేశంలో రియల్ ఎస్టేట్‌లో, మైక్రోఫైనాన్స్‌లో పెట్టుబడులు పెట్టా. అమెరికాలోనూ కొంత పెట్టుబడులు పెట్టా. ఇక్కడ పారిశ్రామిక వాతావరణం ఎలా ఉంటుందో, కొత్త ఆవిష్కరణలు ఏం వస్తున్నాయో, ఏ రంగాలైతే మంచివో చూడటానికి వచ్చా. నా శ్రమ వృథా పోలేదు. చాలా మందిని కలుసుకున్నా.. చాలా తెలుసుకున్నా..’’ అని కంబోడియా మహిళ నందా పోక్ ‘సాక్షి’తో పేర్కొనడం గమనార్హం. తమ దేశంలో మంచి నాణ్యమైన మిరియాలు పండుతాయని, వాటిని దిగుమతి చేసుకోవటానికి కొందరు తనతో మాట్లాడారని.. ఆ చర్చలు కొనసాగుతున్నాయని ఆమె చెప్పారు. ఈమె కంబోడియా విమెన్ బిజినెస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కూడా. వాతావరణం బాగుందన్న ఇన్వెస్టర్లు నిజానికి ఏ పరిశ్రమకైనా పెట్టుబడులే కీలకం. ఈ సదస్సులో ‘ఓవర్సీస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్’తో పాటు టీవీఎస్ క్యాపిటల్, వెంచర్ ఈస్ట్, కలారి క్యాపిటల్, కార్లైల్ ఇండియా అడ్వయిజర్స్, లెట్స్ వెంచర్, ఐవీక్యాప్ వెంచర్స్, విలేజ్ క్యాపిటల్, ఎండియా పార్ట్నర్స్, స్పార్క్‌రైజ్.. ఇలా పెద్ద సంఖ్యలో ఇన్వెస్ట్మెంట్, క్రౌడ్ ఫండింగ్ కంపెనీలు పాల్గొన్నాయి. వివిధ దేశాల నుంచి చిన్న ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు, వ్యక్తిగత ఇన్వెస్టర్లు కూడా పాల్గొన్నారు. ‘‘మాకైతే ఇప్పుడు పెట్టుబడులు పెట్టే ఉద్దేశం లేదు. కానీ ఇక్కడి వాతావరణాన్ని చూడటానికి, కొన్ని నెట్వర్కింగ్ పరిచయాల కోసం వచ్చాం. ఫండింగ్ కోసం చాలా మంది నాకు ఫోన్లు చేశారు. వారు మిగతా వారితో కూడా మాట్లాడుతున్నట్లు చెప్పారు. మొత్తంగా చూస్తే ఇక్కడ ఆశావహ వాతావరణమే ఉంది..’’ అని వెంచర్ ఈస్ట్ క్యాపిటల్‌కు చెందిన సనా అన్సారీ చెప్పారు. అంచనాలు తగ్గట్లే ఉందన్న పారిశ్రామికవేత్తలు సదస్సుకు ఇక్కడి సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ యజమానులు హాజరయ్యారు. తమ చుట్టుపక్కల ఉన్న అవకాశాలనూ వారు ఈ వేదికపై తెలుసుకోగలిగారు. మునగ రైతులతో కలసి పనిచేసే బెలీజ్ దేశ సంస్థ మెరింగా బెలీజ్ది ఇలాంటి కథే. మునగాకు, విత్తనాలు విక్రయించే ఈ సంస్థ ఐదు వేల బెలీజ్ డాలర్లతో మొదలై ప్రభుత్వ ఫండింగ్‌తో యంత్రాలు కొని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ‘‘జీఈఎస్‌లో మెంటార్స్‌ను, విదేశీ ప్రతినిధులను కలిసే అవకాశం దక్కింది. మునగ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉండే బ్రిటన్ వాసులతో పరిచయాలు కలిగాయి. త్వరలోనే బ్రిటన్‌కి కూడా ఎగుమతులు ప్రారంభిస్తాం. ఆ రకంగా జీఈఎస్‌తో నేను హ్యాపీ..’’ అని మెరింగా బెలీజ్ వ్యవస్థాపకురాలు ఆండ్రియా చెప్పారు. అమెరికాలో ఇన్వెస్టర్లు, ఎంట్రప్రెన్యూర్స్‌ని ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రారంభమైన బ్లాక్ గర్ల్ వెంచర్స్ సంస్థ కూడా జీఈఎస్ సదస్సు ద్వారా ఇన్వెస్టర్లు పరిచయమయ్యారని, నిధులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. మరిన్ని కార్యక్రమాలు కూడా.. స్టార్టప్‌లు ఎదగటానికి తగిన ‘అనుకూల వ్యవస్థ’ను సృష్టించాలన్న లక్ష్యానికి జీఈఎస్ సదస్సు ఉపయోగపడుతోందని అటు నీతీ ఆయోగ్, ఇటు అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడ్డాయి. ‘‘తగిన అనుకూల వ్యవస్థ ఇక్కడ ఉంది. అది అద్భుతంగా పనిచేస్తోంది. కొన్ని సమస్యలున్నా వాటిని పరిష్కరించటానికి నిరంతరం మా కాన్సులేట్లతో కలసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తాం..’’ అని అమెరికా యువజన వ్యవహారాల గ్లోబల్ అడ్వైజర్ ఆండీ రబెన్స్ అభిప్రాయపడ్డారు. ఇక ‘‘పారిశ్రామికవేత్తలుగా ఎదగాలంటే చదువుకునే దశ నుంచీ కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తి ఉండాలి. అందుకే నీతి ఆయోగ్ ఆధ్వరంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా స్కూళ్లు, యూనివర్సిటీల్లో ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నాం. స్టార్టప్‌ల మధ్య ఛాలెంజ్‌లు నిర్వహించి సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు భారీ బహుమతులిస్తున్నాం. ఇది ఇంకా ముందుకెళుతుంది..’’ అని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి ఆర్.రమణన్ చెప్పారు. ఈ వేదిక కల్పించిన అవకాశాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయన్నది వ్యక్తుల సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటుందనే విషయంలో మాత్రం ఇద్దరిదీ ఏకాభిప్రాయమే. కొంత పెట్టుబడులు రావచ్చు : షెల్లీ బెల్, బ్లాక్ గర్ల్ వెంచర్స్, అమెరికా ‘‘బ్లాక్గర్ల్ వెంచర్స్‌తో ఇటు పెట్టుబడిదారులు, అటు ఎంట్రప్రెన్యూర్స్‌ని ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రధానంగా నల్లజాతి మహిళా ఎంట్రప్రెన్యూర్స్ తమ ఐడియాలను బాస్ అప్ పేరిట నిర్వహించే పిచ్ కాంపిటీషన్లో బీజీవీ సభ్యుల ముందుంచుతారు. కమ్యూనిటీ ఓటింగ్‌లో విజేతలైన వారికి వ్యాపారాన్ని ప్రారంభించుకునేందుకు సీడ్ ఫండింగ్‌తో పాటు అకౌంటింగ్, లీగల్ కన్సల్టేషన్ మొదలైన వాటిపరంగా కూడా తోడ్పాటు లభిస్తుంది. ఇదీ మా సంస్థ నేపథ్యం. మా కార్యకలాపాలు విస్తరించే క్రమంలో విదేశీ ఎంట్రప్రెన్యూర్లు, ఇన్వెస్టర్లతో నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయని ఈ జీఈఎస్‌కు వచ్చా. మా సంస్థ సీడ్ ఫండింగ్ స్థాయిలో ఉంది. ఆశించిన ప్రయోజనాలు కొంత కనిపించాయి. కొందరు ఇన్వెస్టర్లతో పరిచయమైంది. పెట్టుబడులు రాగలవని ఆశిస్తున్నా..’’ ఇన్వెస్టర్లను కలిసే అవకాశం వచ్చింది : నిషిత మన్నె, సీఈవో, వీవ్స్మార్ట్ ‘‘మేం ప్రధానంగా చేనేతకారులకు డిజిటల్ ప్లాట్‌ఫాం కల్పిస్తున్నాం. వారికి ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం కల్పించే దిశగా వీవ్స్మార్ట్ పోర్టల్‌ని ఏర్పాటు చేశాం. దేశవ్యాప్తంగా 4,000 మంది పైచిలుకు వీవర్స్‌తో చేతులు కలిపాం. వీరిలో సుమారు 1,500 మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. మూడేళ్ల క్రితం మా సొంత నిధులతోనే ప్రారంభించాం. ప్రభుత్వం కూడా మా సేవలను గుర్తించి ప్రోత్సహిస్తోంది. జీఈఎస్‌లో ప్రధానంగా ఇతర ఇన్వెస్టర్లు, ఎంట్రప్రెన్యూర్లతో పరిచయాలు లభిస్తాయనే ఉద్దేశంతో హాజరయ్యాను. అనుకున్నట్లే కొందరితో కలిసే అవకాశం లభించింది..’’ కొత్త అవకాశాలను చూస్తున్నాం : బిభూటి న్యూపాన్, అంతర్పేరన (నేపాల్) ‘‘నేపాల్‌లో మేం దాదాపు 10 సంస్థల్లో ఇన్వెస్ట్ చేశాం. భారత్‌లో ఇంకా నేరుగా పెట్టుబడులు పెట్టలేదు. కానీ వేరే సంస్థలతో కలసి కొన్ని పెట్టుబడులున్నాయి. ఇక్కడ ఎలాంటి అవకాశాలున్నాయో తెలుసుకోవటానికి సదస్సు ఉపకరిస్తుందని భావించి వచ్చా. వచ్చినందుకు చాలా అవకాశాలు కనిపించాయి. ఇక రాబోయేది ఆవిష్కరణల శకం. కొత్త ఆవిష్కరణలతో వచ్చే సంస్థల హవా కొనసాగుతుంది. పెట్టుబడులు అవసరమైన ముగ్గురు పారిశ్రామికవేత్తలు నాతో మాట్లాడారు. కాకపోతే పెట్టుబడి అనేది ఒకరోజులో అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం కాదు. అన్నీ పరిశీలించాల్సి ఉంది..’’ ‘ఏఐ’ సంస్థలపై దృష్టి పెట్టాం : సారా విట్లీబ్, మ్యునిక్ ఎయిర్‌పోర్టు సంస్థ ‘‘మేం ప్రధానంగా ఎయిర్పోర్ట్, ఏవియేషన్ రంగాల్లోనే పెట్టుబడులు పెడుతున్నాం. అలాంటి అవకాశాల కోసం ఇక్కడకు వచ్చాం. అయితే ఇక్కడ కొత్త టెక్నాలజీలను చూశాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలకు చెందిన నాలుగైదు సంస్థల ప్రతినిధులు మాతో మాట్లాడారు. ఇంకా అవకాశాలను పరిశీలిస్తున్నాం. వీటన్నిటినీ తదుపరి దశలకు తీసుకెళ్లటానికి చర్చలు కొనసాగిస్తాం..’’ నవభారత నిర్మాణం దిశగా ప్రభుత్వం కృషి : నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ సాక్షి, హైదరాబాద్: పేదరికం, అవినీతి, ఉగ్రవాదం, కులం, మతతత్వ ప్రభావం లేని నవభారతాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో బుధవారం జరిగిన ‘న్యూ ఇండియా ఎట్ ది రేట్ ఆఫ్ 2022’కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యారు. 92వ ఫౌండేషన్ కోర్సు శిక్షణలో ఉన్న అఖిల భారత సర్వీస్, కేంద్ర సర్వీసు లకు చెందిన అధికారు లనుద్ధేశించి ఆయన మాట్లాడా రు. అభివృద్ధి పథంలో దేశాన్ని ఉన్నత శిఖరాల్లో నిలిపేందుకు సివిల్ సర్వెంట్లు ముందుం డాలని పిలుపునిచ్చారు. -
ఒక ఫ్యాషన్... ఒక ప్యాషన్!
ఆలోచనల్లో క్రియేటివిటీ మనల్ని కొత్తగా నిలబెడుతుంది! పనిలో ఆర్ట్.. మనల్ని గొప్పగా పరిచయం చేస్తుంది! ఈ రెండు ఏకమై పెట్టుబడిని తోడు తెచ్చుకుంటే ఎంట్రప్రెన్యూర్షిప్ సాధ్యమవుతుంది! ప్రస్తుతం అదే షిప్లో ప్రయాణం చేస్తున్నారు విదిత, సునీత! ఒకరిది ఫ్యాషన్... ఇంకొకరిది ప్యాషన్! ఎవరు వీళ్లు? ఆ జర్నీ ఏంటీ? ఈ ఇద్దరూ సిలికాన్ వ్యాలీకి ఐకాన్స్ అని చెప్పొచ్చు ఒక్క మాటలో! (స్టాన్‌ఫర్డ్ నుంచి సరస్వతి రమ) అమెరికాలోని కాలిఫోర్నియా.. అందునా సిలికాన్ వ్యాలీ.. తెలుగు టెక్ వ్యాలీ అనొచ్చు! ఆ రాష్ట్రంలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో అయితే అచ్చంగా మన అమ్మాయిలదే హవా! బిజినెస్ మేనేజ్మెంట్ చదివి ఏ మల్టీనేషనల్ కంపెనీల్లోనో ఉద్యోగం వెతుక్కోకుండా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనే సాహస వనితలు! ఈ నెల 28న హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమ్మిట్..పూర్తిగా మహిళా పారిశ్రామికవేత్తలదే! ఈ సందర్భంగా స్టాన్ఫర్డ్లోని, సిలికాన్ వ్యాలీలో మన మహిళా పారిశ్రామిక వేత్తల పరిచయంలో భాగంగా విదిత, సునీతల గురించి ఈ ఇండ్రక్షన్.. ఇండో ఫ్యాబ్రిక్ .. వెస్ట్రన్ డిజైన్ విదితాసుబ్బారావు స్వస్థలం హైదరాబాద్. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలోని బిజినెస్ స్కూల్లో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతూనే ఇంకో పక్క ఎంట్రప్రెన్యూర్‌గా ఎదగడానికి కృషి చేస్తోంది. జోఫీ ఫ్యాషన్ పేరుతో ఆన్లైన్ సంస్థను నడుపుతోంది. బనారస్, కంచి, పోచంపల్లి వంటి మన సంప్రదాయ ఫ్యాబ్రిక్స్‌తో వెస్ట్రన్ డిజైన్స్‌ను రూపొందించడమే జోఫీ ఫ్యాషన్స్ ప్రత్యేకత. ఆ రకంగా మన ఫ్యాబ్రిక్స్‌ను ప్రపంచానికి అందిస్తోంది విదిత. వస్త్రవ్యాపారమే కాక మధుబని వంటి ఫ్యాబ్రిక్ పెయింట్‌ను సంరక్షించే బాధ్యతనూ చేపట్టింది. మన చేనేత కార్మికులకు చేతినిండా పనికల్పిస్తూ వారి నేత నైపుణ్యాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేస్తోంది. ఇప్పుడు వెస్ట్రన్ డిజైనర్స్తోనే డిజైన్స్ చేయిస్తున్నా త్వరలోనే నిట్, నిఫ్ట్ వంటి మన ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్ విద్యార్థులతో కలిసి పనిచేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది. అంతేకాదు దేశంలోని ఏ ప్రాంతంలో ఏ ప్రత్యేక నేతకళ ఉన్నా చేయూతనిచ్చి దానికి అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఉంది విదిత. ‘‘నేను ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి కారణం మా అమ్మ (సరళా సుబ్బారావు) తను వృత్తిరీత్యా సైంటిస్ట్ అయినా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ప్రాణం. ఇండియన్ ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్‌తో వెస్ట్రన్ డిజైన్ అనేది అమ్మ ఐడియానే. ఎంట్రప్రెన్యూర్ కావాలనే నా యాంబిషన్కు అమ్మ ఐడియాను జోడిస్తే జోఫీ ఫ్యాషన్స్‌గా క్రియేట్ అయింది. ప్రస్తుతం మా బ్రాండ్‌తో 12 రకాల డిజైన్స్ మార్కెట్లో ఉన్నాయి. వాటికి చాలా డిమాండ్ ఉంది. ఇప్పటికీ మా మార్కెట్ ఆన్లైనే. వెంచర్ క్యాపిటల్ కోసం ఎవరినీ రిక్వెస్ట్ చేయలేదు. నా సొంతంగానే ఈ సంస్థను స్టార్ట్ చేశాను. డూయింగ్ వెల్. సవాళ్లుండవని అనను. ఆ మాటకొస్తే ఏ రంగంలోనైనా చాలెంజెస్ ఉంటాయి. వాటిని అధిగమించి వెళ్లడమే సక్సెస్ కదా! నేను అదే పోరాటంలో ఉన్నా. సిలికాన్ వ్యాలీ.. కొత్త ఆలోచనలను, ఇన్నోవేషన్స్‌ను ఆదరిస్తుంది. ఐడియాలుండాలే కాని అవకాశాలకేం కొదవలేదు. ధైర్యంగా ముందుకెళ్లడమే. ఇక్కడికి రావాలనుకునే వారికి నా సలహా ఒక్కటే. సమస్యలు ఎక్కడైనా ఉంటాయి. అధిగమించడం నేర్చుకోవాలి’’ అని చెప్తుంది యంగ్ ఉమన్ ఎంట్రప్రెన్యూర్ విదితాసుబ్బారావు. లాఫింగ్ బుద్ధా గేమ్స్ సిలికాన్ వ్యాలీలోని ఇంకో లేడీ ఎంట్రప్రెన్యుయన్ ఎఫర్ట్ ఇది. ఆమె పేరు సునీతా గిరీష్. స్వస్థలం కేరళ. అమెరికాకు వచ్చి దాదాపు పదేళ్లయింది. వాళ్ల కుటుంబంలో అమెరికాకు వచ్చిన తొలి మహిళే కాదు.. తొలి వ్యక్తి కూడా ఆమే. ఇంగ్లీష్‌లో లిటరేచర్ చేయడానికి వచ్చి అది పూర్తయ్యాక అందులో ఉపాధి అవకాశాలు దొరక్క.. సిలీకాన్ వ్యాలీ టెక్నికల్ క్వాలిటీస్కే ప్లేస్ ఇస్తుందని గ్రహించి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ తీసుకుంది. గొడ్డు చాకిరే తప్ప స్టాఫ్ ఆలోచనలను ఆదరించే అధికార సిబ్బంది ఉండరని అర్థమై సొంతంగా ఏదైనా చేయాలనుకుంది. ఈలోపే పెళ్లి, పిల్లలు. అమెరికాలాంటి చోట... ఫ్యామిలీ సపోర్ట్ సిస్టం లేని దేశంలో ఇటు ఉద్యోగం, అటు పిల్లల పెంపకం.. చాలా కష్టం. ఈ బాధ్యతలతో ఉద్యోగ వేళలను అందుకోవడం దుర్లభం. అందుకే తనకు నచ్చిన ఆలోచనను. తనకు సౌకర్యంగా ఉన్నప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయడం మంచిదని నిర్ణయించుకుంది. పిల్లలకు గేమ్స్ తయారు చేసే వర్క్ అయితే బాగుంటుందని ఆ రంగంలోకి దిగింది. లాఫింగ్ బుద్ధా గేమ్స్ పేరుతో. ఇదొక స్టార్టప్ కంపెనీ అయినా సేల్స్ బాగా ఉన్నాయి. ఆటల ద్వారా పిల్లలకు పాఠాలు బొధించడమే లాఫింగ్ బుద్ధా గేమ్స్ ప్రత్యేకత. ఈ గేమ్స్ కంపెనీ పెట్టడానికి ఇంకో కారణం సునీత పెద్ద కొడుకు. ఆ అబ్బాయి స్పెషల్లీ చాలెంజ్డ్. ఆటిజం చైల్డ్. ఎంత స్పెషల్ స్కూల్లో వేసినా... రాని మార్పు.. గేమ్స్ మాడ్యూల్స్ ద్వారా రావడంతో సునీతకు ఈ తలపు తట్టింది.. అందుకే సాధారణ పిల్లలతో పాటు స్పెషల్లీ చాలెంజ్డ్ పిల్లల కోసమూ ఈ గేమ్స్‌ను తయారు చేస్తోంది. ఈ మాడ్యూల్స్ ద్వారా వాళ్లకు పాఠాలు చెప్పేలా. వీటికి అమెరికాలో చాలానే డిమాండ్ ఉంది. ఇదీ ఆన్లైన్ మార్కెటే. ప్రస్తుతం ఆసియా దేశాల వైపూ దృష్టి సారించింది సునీత. మన దగ్గరా విద్యాశాఖ, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో సంప్రదించి ఆ స్కూళ్లకూ తమ మాడ్యూల్స్‌ను సరఫరా చేసేందుకు చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ముంబైలాంటి చోట్ల కొన్ని స్కూళ్లోతో ఒప్పందం జరిగింది. దీనికి మన దేశంలోనే కాదు పశ్చిమాసియాలోని చాలా చోట్ల లాఫింగ్ బుద్ధా గేమ్స్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ‘పిల్లలకు ఒత్తిడి లేకుండా ఆడుతూపాడుతూ.. మెంటల్ ఎక్సర్‌సైజ్‌తోపాటు ఫిజికల్ యాక్టివిటీనీ జతచేసి పిల్లలకు పాఠాలు నేర్పాలి. పిల్లలూ ఇలాంటి మెథడ్స్నే ఇష్టపడ్తారు. మొక్కుబడిగా కాకుండా ఆసక్తిగా నేర్చుకుంటారు. అందుకే లాభాపేక్ష కన్నా సృజనాత్మకతకు ఇంపార్టెన్స్ ఇస్తూ గవర్నమెంట్ స్కూల్స్‌కి, ఫిజికల్లీ చాలెంజ్డ్ పిల్లలకు ‘మా లాఫింగ్ బుద్ధా గేమ్స్’ బేసిక్ మాడ్యూల్స్‌ను ఉచితంగా ఇస్తున్నాం. మన దేశంలోని అన్ని మెయిన్ సిటీస్ స్కూళ్లతో టై అప్ అయి ఆ తర్వాత నెమ్మదిగా గ్రామాలకూ విస్తరించాలనేది మా లక్ష్యం’ అంటుంది లాఫింగ్ బుద్ధా గేమ్స్ అధిపతి సునీతా గిరీష్. ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఎన్నో... ఎందరో... సిలికాన్ వ్యాలీలో మన మహిళలు వ్యాపార దక్షతను చూపిస్తూ.. సామాజిక బాధ్యత మరవని పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. వీళ్ల పరిచయం, అనుభవం.. హైదరాబాద్ జీఈఎస్‌కు హాజరయ్యే మన మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణ, స్ఫూర్తి!