ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా రాణిస్తున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు | From Being Social Media Influencers To Entrepreneurs | Sakshi
Sakshi News home page

ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా రాణిస్తున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు

Published Wed, Nov 29 2023 10:53 AM | Last Updated on Wed, Nov 29 2023 11:27 AM

From Being Social Media Influencers To Entrepreneurs - Sakshi

‘ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించడం అంటే మాటలా?’ అన్నది ఒకప్పటి మాట. మాటల మాంత్రికులైన యువ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు కలర్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ కలలు కంటున్నారు. ‘వ్యాపారం అంటే మాట్లాడినంత తేలిక కాదు’ అనే విమర్శను దాటి ఇన్‌ఫ్లూయెన్సర్‌లుగా తమ అనుభవాన్ని ఉపయోగించి  ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా గెలుపు జెండా ఎగరేస్తున్నారు.

బ్రాండ్స్‌ ద్వారా గుర్తింపు పొందిన యంగ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌లు ఆ తరువాత తామే ఒక బ్రాండ్‌గా మారుతున్నారు. మాసివ్‌ ఆన్‌లైన్‌ ఫాలోయింగ్‌తో ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా మారుతున్నారు. ఫ్యాషన్, బ్యూటీ అండ్‌ లైఫ్‌స్టైల్‌ యూ ట్యూబర్‌ జ్యోతీ సేథీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అడుగులు వేస్తోంది. కొన్ని నెలల క్రితం ‘అభారి’ పేరుతో శారీ బ్రాండ్‌ను లాంచ్‌ చేసింది. వివిధ ప్రాంతాలలో ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేసింది. తక్కువ సమయంలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా సక్సెస్‌ అయింది.‘సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేయడం కంటే ముందు వివిధ ప్రాంతాలలో ఎగ్జిబిషన్‌లను ఏర్పాటు చేయడం వల్ల కస్టమర్‌ల పల్స్‌ తెలుసుకోగలిగాను. వారి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ నాకు ఎంతో ఉపయోగపడింది’ అంటుంది జ్యోతి సేథీ.

ముంబైకి చెందిన సంజయ్‌ ఖీర్‌ ఆరో తరగతిలోనే వంట చేయడం నేర్చుకున్నాడు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదువుకున్న సంజయ్‌ ఫుడ్‌కు సంబంధించి యూట్యూబ్‌ చానల్‌ ‘యువర్‌ ఫుడ్‌ ల్యాబ్‌’ ప్రారంభించాడు. 13 మిలియన్‌ల ఫాలోవర్‌లతో దూసుకు΄ోయాడు. మూడు నెలల క్రితం కిచెన్‌ అండ్‌ హోమ్‌ అప్లయెన్స్‌ బ్రాండ్‌ ‘వైఎఫ్‌ఎల్‌ హోమ్‌’ను స్టార్ట్‌ చేశాడు. ‘ఒక వీడియోను రూపొందించడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఒక బ్రాండ్‌ను నిర్మించడానికి మాత్రం నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఇది పెద్ద సవాలు. ఆ సవాలును ఓపికతో మాత్రమే స్వీకరించాలి. కంటెంట్‌ క్రియేటర్‌గా నాకు అడ్వాంటేజ్‌ ఉండొచ్చు. అయితే ప్రొడక్ట్‌ మాట్లాడాలి’ అంటున్నాడు సంజయ్‌ ఖీర్‌.

ఇన్‌ఫ్లూయెన్సర్‌గా తనకు ఉన్న పది సంవత్సరాల అనుభవంతో రెండు సంవత్సరాల క్రితం ‘వియరీఫెడ్‌’ అనే బ్యూటీ బ్రాండ్‌ను స్టార్ట్‌ చేసి సక్సెస్‌ అయింది అనమ్‌ చష్మావాలా. తన స్కిన్‌ టోన్‌కు మ్యాచ్‌ అయ్యే లిప్‌స్టిక్‌ గురించి ఎంత వెదికినా ఎక్కడా కనిపించలేదు. ఈ నిరాశ నుంచే బ్రాండ్‌ ఆలోచన చేసింది. అయిదు సంవత్సరాల రీసెర్చ్‌ తరువాత తన బ్రాండ్‌ను పట్టాలకెక్కించింది. 26 సంవత్సరాల హిమాద్రి పటేల్‌ ఇన్ఫోసిస్‌లో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారింది. ఇన్‌ఫ్లూయెన్సర్‌గా సక్సెస్‌ అయిన తరువాత ఎత్నిక్‌ క్లాతింగ్‌ బ్రాండ్‌ ‘డ్రై బై హిమాద్రి’ స్టార్ట్‌ చేసింది. కంటెంట్‌ క్రియేటర్‌గా ప్రయాణం ప్రారంభించిన రణ్‌వీర్‌ అల్హబాదియా పాడ్‌కాస్ట్‌ షో ‘ది రణ్‌వీర్‌ షో’తో డిజిటల్‌ ప్రపంచంలో సుపరిచితుడయ్యాడు.

కాలేజి ఫ్రెండ్‌ విరాజ్‌ సేథ్‌తో కలిసి ‘మాంక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ కంపెనీ ప్రారంభించి విజయం సాధించాడు. ఫ్యాషన్‌ సెన్స్, ఫన్‌–లవ్‌ కంటెంట్‌తో కంటెంట్‌ క్రియేటర్‌గా పేరు తెచ్చుకున్న దీక్షా ఖురానా ‘డీక్లాతింగ్‌’ పేరుతో క్లాతింగ్‌ బ్రాండ్‌ను స్టార్ట్‌ చేసి సక్సెస్‌ అయింది. ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పేరు తెచ్చుకున్నవారికి ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలదొక్కుకోవడం అంత తేలిక కాదు.‘సక్సెస్‌ఫుల్‌ బ్రాండ్‌లను క్రియేట్‌ చేయడానికి మౌలిక సదుపాయాల కొరత ఇన్‌ఫ్లూయెన్సర్‌లకు అడ్డంకిగా ఉంది’ అంటున్నాడు ఇన్‌ఫ్లూయెన్సర్‌ మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘వన్‌ ఇంప్రెషన్‌’ సీయీవో అపాక్ష్‌ గుప్తా అంతమాత్రాన ‘ఇది మన స్పేస్‌ కాదు’ అనుకోవడం లేదు, అధైర్యపడడం లేదు యువ ఇన్‌ఫ్లూయెన్సర్‌లు. ఒక్కో అడుగు వేసుకుంటూ నడకలో వేగం పెంచుతున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా విజయం సాధిస్తున్నారు.
 
కలా నిజమా అనుకున్నాను
నా బ్రాండ్‌కు ఆర్డర్లు  మొదలై, పెరుగుతూ పోతున్న క్రమంలో ‘ఇది కలా నిజమా?’ అనుకున్నాను. ఈ విజయం నాకు బాగా ఉత్సాహాన్ని  ఇచ్చింది. ‘ఇంకా ఏం చేయవచ్చు’ అని రక రకాలుగా ఆలోచించేలా చేసింది. ఇన్‌ఫ్లూయెన్సర్‌తో పోల్చితే ఎంటర్‌ప్రెన్యూర్‌గా బాగా కష్టపడాలి.
– అనమ్‌ చష్మవాలా, బ్యూటీ బ్రాండ్‌ ‘వియరీఫెడ్‌’ ఫౌండర్‌

ఆ కష్టమే ఇక్కడ కూడా...
 వ్యాపారరంగంలోకి అడుగు పెట్టాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అయితే ముందుగా ఇన్‌ఫ్లూయెన్సర్, కంటెంట్‌ క్రియేటర్‌గా నాకంటూ పేరు తెచ్చుకోవాలనుకున్నాను. ఆ తరువాత వ్యాపారం వైపు అడుగులు వేశాను. యూట్యూబ్‌ ద్వారా ఒక కంపెనీ ఎలా మొదలు పెట్టాలి? జీఎస్‌టీ నంబర్‌ అంటే ఏమిటి... మొదలైన విషయాలను తెలుసుకున్నాను. మొదట్లో కొన్ని పొరపాట్లు జరిగాయి. అయితే వాటి నుంచి విలువైన విషయాలు నేర్చుకున్నాను. ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పేరు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. అలాంటి కష్టమే వ్యాపారంలో పెడితే విజయం సాధిస్తాను అని నమ్మాను. ప్రజల నమ్మకాన్ని చూరగొనడం అనేది అది పెద్ద విజయం.
– జ్యోతి సేథీ, క్లాత్‌ బ్రాండ్‌ ‘అభారీ’ ఫౌండర్‌


ట్రెండ్‌ సెట్‌ చేయాలి
ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌ స్టైల్‌కు సంబంధించి సుపరిచిత బ్రాండ్‌లతో కలిసి పనిచేయడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోగలిగాను. ఆ తరువాత సొంతంగా ‘డీక్లాతింగ్‌’ క్లాతింగ్‌ బ్రాండ్‌ను స్టార్ట్‌ చేశాను. బ్రాండ్‌ స్టార్ట్‌ చేయడానికి ముందు ‘నా బ్రాండ్‌ ట్రెండ్‌ సెట్‌ చేయాలి’ అనుకున్నాను. అందరిలో ఒకరిగా కాకుండా మనదైన ప్రత్యేకతను సృష్టించుకున్నప్పుడు మాత్రమే మార్కెట్‌లో నిలదొక్కుకోగలం.
 – దీక్షా ఖురానా, క్లాతింగ్‌ బ్రాండ్‌ ‘డీక్లాతింగ్‌’ ఫౌండర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement