
సాక్షి, అమరావతి: ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎంట్రప్రెన్యూర్స్‌తో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తాడికొండకు చెందిన మైక్రో ఎంట్రప్రెన్యూర్ వీర వర్ధిణి మాట్లాడుతూ.. ‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’ పథకం కింద అందించే సబ్సిడీ పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో హెచ్‌పీసీఎల్ ఎల్‌పీజీ ట్యాంకర్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే దీనికి రూ. 44 లక్షల వరకు ఖర్చు అయినట్లు పేర్కొన్నారు. అయితే యూనియన్ బ్యాంక్ నుంచి రూ. 38 లక్షల వరకు లోన్ పొందినట్లు చెప్పారు. కాగా ఇందులో సబ్సిడీ కింద రూ.19.75 లక్షల ప్రభుత్వం నుంచి అందించినట్లు పేర్కొంది. ఈ విధమైన పోత్రాహకాలు అందిచడం, ఎస్సీ, ఎస్టీ మహిళలను ప్రభుత్వం ప్రోత్సహించడం సంతోషంగా ఉందన్నారు.
చదవండి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందాలి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment