విద్యార్ధిగా ఉన్నత చదువులు పూర్తి చేసుకొని చాలా మంది ఉపాధి వేటలో పడతున్నారు. అయితే వారిలో ప్రతి ఒక్కరికీ వ్యాపారం చేసి మరో నలుగురికి ఉపాధి కల్పించాలని ఉంటుంది. కానీ సరైన ఐడియా లేక, లేదంటే ఆర్ధిక ఇబ్బందులు, నష్ట భయంతోనో బిజినెస్ కాన్సెప్ట్‌ను పక్కన పెట్టి జాబ్ చేస్తుంటారు. 30ఏళ్లకు జాబ్‌లో సెటిలై, ఉద్యోగం చేయగా వచ్చిన జీతాన్ని పొదుపుగా వాడుకుంటూ 40ఏళ్లకు ఇల్లు కట్టుకుంటుంటారు.
వారిలో మరికొందరు అందుకు భిన్నంగా ఆలోచిస్తుంటారు. రోజూవారీ జీవితంలో తమకు ఎదురయ్యే సమస‍్యల్ని గుర్తించి వాటికి పరిష్కారం చూపిస్తారు. ఆ పరిష్కారమే నలుగురికి ఉపయోగపడేలా రేయింబవళ్లు కష్టపడి వ్యాపార సామ్రజ్యాన్ని విస్తరిస్తుంటారు. దీంతో 35 ఏళ్లు లేదంటే 40ఏళ్లలోపు వేలకోట్లు సంపాదించి ఆదర్శప్రాయంగా నిలుస్తుంటారు. అలాంటి వారిలో ఈ పదిమంది ప్రత్యేకమనే చెప్పుకోవాలి. 27ఏళ్ల నుంచి 40ఏళ్లలోపే రూ.1000కోట్ల లేదంటే అంతకంటే ఎక్కువగా సంపాదించి ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురూన్ ఇండియా 40 ఏళ్లలోపు సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ -2021 జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నారు.
'ఉద్యోగం అయితే జీవితం ఒక్కడిది. అదే వ్యాపారం అయితే జీవితం నలుగురిది' అని అనుకున్నారు. అందుకే వీళ్లు ఇప్పుడు భారత్‌లోనే సెల్ఫ్ మేడ్ బిలినియర్లుగా ఎదిగారు. ఇటీవల ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురూన్ ఇండియా 40 ఏళ్లలోపు సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ -2021 రిపోర్ట్‌ను విడుదల చేసింది.ఆ రిపోర్ట్ ప్రకారం రూ.1000 కోట్ల సంపాదించిన వారిలో ఈ 10మంది 'శ్రీమంతులు' ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం
► మీడియా.నెట్ అధినేత దివ్యాంక్ తురాఖియా 39ఏళ‍్ల వయస్సులో రూ.12,500 కోట్లు సంపాదించి హురూన్ జాబితాలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు.
► బ్రౌజర్ స్టాక్స్ కో ఫౌండర్ నకుల్ అగర్వాల్ రూ.12,400 కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
► బ్రౌజర్ స్టాక్స్ మరో కో-ఫౌండర్ రితేష్ అరోరా రూ.12,400 కోట్లతో 3 స్థానాన్ని దక్కించుకున్నారు.
► నేహా నార్ఖేడ్ అండ్ ఫ్యామిలీ - నేహా నార్ఖేడ్ కో-ఫౌండర్ నేహా నార్ఖేడ్ రూ.12,200 కోట్లతో 4 స్థానంలో ఉన్నారు.
► జెరోధా- 35ఏళ్ల నిఖిల్ కామత్ జెరోధా కో- ఫౌండర్‌గా దేశంలోనే అతిపెద్ద ట్రేడింగ్ నెట్ వర్క్‌ను నిర్వహిస్తున్నారు. రూ. 11,100 కోట్లతో 5 స్థానంలో ఉన్నారు.
► థింక్ అండ్ లెర్న్ స్లోగన్ పేరుతో బైజూస్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సంస్థను ప్రారంభించిన రిజు రవీంద్రన్ రూ.8,100 కోట్లతో 6స్థానంలో ఉన్నారు.
► ప్రముఖ దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కో-ఫౌండర్ బిన్నీ బన్సాల్ రూ.8వేల కోట్లతో 7స్థానాన్ని దక్కించుకున్నారు.
► ఫ్లిప్ కార్ట్ మరో కో-ఫౌండర్ సచిన్ బన్సాల్ రూ. 7,800 కోట్లతో 8వ స్థానంలో నిలిచారు.
► ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ అధినేత భువీష్ అగర్వాల్ (36) రూ.7,500 కోట్లతో 9వ స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా, ఓలా ఎలక్ట్రిక్ బైక్ అమ్మకాలతో ఈ ఏడాది ఆయన ఆస్థి 114శాతం పెరిగింది.
► వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021లో 27ఏళ్లతో అతి పిన్న వయస‍్కుడిగా ఉన్న ఓయో రూమ్ రితీష్ అగర్వాల్ రూ.6,300 ఆస్తుల్ని కలిగి ఉన్నారు. ఈ ఏడాది ఆయన ఆస్తులు 40శాతం పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment