
టి-హబ్ ప్రారంభం రేపే
హైదరాబాద్: ఐటీ రంగంలో పరిశ్రమలను స్థాపించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి-హబ్‌ను గురువారం సాయంత్రం 4 గంటలకు టాటా గ్రూప్ సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రతన్‌టాటా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా గవర్నర్ నరసింహన్, మంత్రి కె.తారక రామరావు హాజరుకానున్నారని ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు.
యువత కలలు తీర్చే టి-హబ్..
ప్రదేశం గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణం
నిర్మాణ వ్యయం రూ. 40 కోట్లు
విస్తీర్ణం 70 వేల చదరపు అడుగులు
అవకాశం 200 స్టార్టప్ కంపెనీలకు చెందిన 800 మందికి..
ప్రత్యేకత దేశంలోనే అత్యుత్తమ ఇంక్యుబేటర్, ప్రపంచ స్థాయి ప్రమాణాలు
నిర్వహణ ప్రభుత్వ, ప్రైవేటు (మైక్రోసాఫ్ట్, గూగుల్, సైయంట్ తదితర సంస్థల) భాగస్వామ్యంతో
మెంటార్స్ ఐఎస్‌బీ, ఐఐటీహెచ్, ఐఐఐటీ, నల్సార్ లా యూనివర్సిటీ
ప్రధాన ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలను ఆకర్షించి హైదరాబాద్‌కు రప్పించడం