
దాదాపు మూడు దశాబ్దాల క్రితం కేవలం 20 మిలియన్ డాలర్లుగా ఉన్న ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఆదాయం ప్రస్తుతం 250 బిలియన్ డాలర్ల(రూ.21.57 లక్షల కోట్లు) స్థాయిని అధిగమించినట్లు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ తెలిపారు. ఇందులో 200 బిలియన్ డాలర్ల ఆదాయం ఎగుమతుల నుంచే వచ్చిందని పేర్కొన్నారు. 1992–93లో ఐటీ–ఐటీఈఎస్ రెవెన్యూ కేవలం 20 మిలియన్ డాలర్లని ఇండియాసాఫ్ట్ 2025, ఇండియా ఎల్రక్టానిక్స్ ఎక్స్‌పో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివరించారు.
ఇదీ చదవండి: చమురుపై ఇక విండ్‌ఫాల్ ట్యాక్స్‌లు ఉండవు
ఎగుమతులను ప్రోత్సహించడంలో ఎల్రక్టానిక్స్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కీలకంగా వ్యవహరిస్తోందని అరవింద్ కుమార్ వివరించారు. దేశీయంగా టెక్నాలజీ వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. 1,58,000 స్టార్టప్‌లు నమోదు చేసుకోగా, వీటిలో 78,000 అంకురాలు టెక్నాలజీ రంగానికి చెందినవేనని అరవింద్ కుమార్ వివరించారు. ఎస్‌టీపీఐతో పాటు వివిధ శాఖలు.. అంకుర సంస్థలను ప్రోత్సహిస్తున్నాయన్నారు. 50 శాతం పైగా స్టార్టప్‌లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఉంటున్నాయని, అంకుర సంస్థల వ్యవస్థాపకు లు లేదా డైరెక్టర్లలో సగం మంది పైగా మహిళలు ఉంటున్నారని అరవింద్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment