IT services
-
టీసీఎస్ అరుదైన ఘనత: రెండో గ్లోబల్ ఐటీ సర్వీస్ బ్రాండ్‌గా రికార్డ్
టెక్ దిగ్గజం 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS).. గ్లోబల్ ఐటి సేవలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ వంటి వాటిలో గ్లోబల్ లీడర్‌గా ఎదిగిన ఈ బ్రాండ్ విలువ 21.3 బిలియన్లను చేరింది. 2010లో 2.3 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న కంపెనీ.. 15 సంవత్సరాలలో 826 శాతం వృద్ధి చెందింది.ఈ సందర్భంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ 'అభినవ్ కుమార్' మాట్లాడుతూ.. మా బ్రాండ్ ఈ ప్రధాన మైలురాయిని అధిగమించి అగ్ర శ్రేణిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. 15 సంవత్సరాలుగా మా బ్రాండ్, విలువలో దాదాపు తొమ్మిది రెట్లు పెరిగింది. ఆవిష్కరణలలో అగ్రగామిగా, ప్రపంచంలోని అత్యంత సంక్లిష్టమైన సాంకేతిక పనిని అందించగల సామర్థ్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ప్రసిద్ధి చెందిందని అన్నారు.మార్కెటింగ్ ఎక్సలెన్స్‌పై టీసీఎస్ దృష్టి బ్రాండ్ విజిబిలిటీ & గ్లోబల్ రీచ్‌ను మెరుగుపరిచింది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 14 ప్రధాన ఎండ్యూరెన్స్ రన్నింగ్ రేసులను స్పాన్సర్ చేస్తుంది. వీటిలో ఐదు ప్రతిష్టాత్మకమైన అబాట్ వరల్డ్ మారథాన్ మేజర్స్ (న్యూయార్క్, లండన్, బోస్టన్, చికాగో, సిడ్నీ) ఉన్నాయి. ఇందులో ప్రతి ఏటా 6,00,000 మంది రన్నర్లు పాల్గొంటున్నాయి.ఫ్యూచర్ అథ్లెట్ ప్రాజెక్ట్ వంటి కార్యక్రమాల ద్వారా TCS పనితీరును పర్యవేక్షించడానికి, అథ్లెట్ పనితీరును మెరుగుపరచడానికి అధునాతన డిజిటల్ ట్విన్ టెక్నాలజీని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యం, వెల్నెస్, కమ్యూనిటీ డెవలప్మెంట్ పట్ల దాని నిబద్ధతను బలోపేతం చేస్తుంది.టీసీఎస్.. జాగ్వార్ టీసీఎస్ రేసింగ్‌తో కూడా భాగస్వామిగా ఉంది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి ఆల్ ఎలక్ట్రిక్ రేసింగ్ సిరీస్. ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడుతుంది. ఈ సహకారం స్థిరమైన సాంకేతికతలలో.. ఎలక్ట్రిక్ మొబిలిటీ పురోగతిలో డ్రైవింగ్ ఆవిష్కరణకు కంపెనీ అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. గత కొన్నేళ్లుగా.. ఫ్లాగ్షిప్ కస్టమర్ సమ్మిట్లు, ఇండస్ట్రీ ట్రేడ్ షోలు.. టెక్నాలజీ భాగస్వాముల ద్వారా.. వ్యాపారాలు నేటి డైనమిక్ వాతావరణంలో మెరుగ్గా స్వీకరించడంలో సహాయపడటానికి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది కస్టమర్లతో TCS నిమగ్నమై ఉంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్లో లోతైన పరిశోధన, అధ్యయనాలను రూపొందించడం ద్వారా టీసీఎస్ మరింత ముందుకు సాగనుంది. ఇందులో భాగంగానే కంపెనీ ఫ్యూచర్ రెడీ ఈమొబిలిటీ స్టడీ 2025 రవాణా భవిష్యత్తును రూపొందించే ట్రెండ్లను హైలైట్ చేస్తుంది. -
వేతనాల్లో..ఐటీ కన్నా జీసీసీలే మిన్న!
విదేశీ కంపెనీలు భారత్‌లో పొలోమంటూ ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు).. అదిరిపోయే వేతన ప్యాకేజీలతో టెక్ సిబ్బందిని ఆకర్షిస్తున్నాయి. భారీ విస్తరణ బాట నేపథ్యంలో టెక్ నిపుణులకు జీసీసీల నుంచి డిమాండ్ పెరుగుతోంది. మరోపక్క, జీతాల విషయంలో జీసీసీలతో పోలిస్తే సంప్రదాయ ఐటీ సేవల కంపెనీలు వెనుకబడుతుండటం గమనార్హం.దేశంలో ప్రస్తుతం 1,600కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటిలో 16.6 లక్షల మందికి పైగానే నిపుణులు పనిచేస్తున్నారు. ఐటీ కంపెనీల్లోని టెకీలతో పోలిస్తే అవే విధుల్లో పనిచేస్తున్న జీసీసీ ఉద్యోగులకు 12–20 శాతం మేర అధిక వేతనాలు లభిస్తున్నాయి. అంతేకాదు, టెక్నాలజీ యేతర కంపెనీల్లో పనిచేస్తున్న నిపుణులతో పోల్చినా కూడా జీసీసీల్లోనే భారీ వేతన ప్యాకేజీలు దక్కుతుండం విశేషం. టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్–ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్క్ అడ్మిని్రస్టేషన్, డేటా మేనేజ్మెంట్–ఎనలిటిక్స్, క్లౌడ్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ తదితర విభాగాల్లో ఎంట్రీ, మిడ్, సీనియర్ స్థాయిల్లో కూడా జీసీసీలు ప్యాకేజీల్లో ‘టాప్’లేపుతున్నాయి. మెరుగైన జీతాల నేపథ్యంలో జీసీసీల్లోకి వలసలు కూడా భారీగా పెరిగేందుకు దారితీస్తోంది. ఉదాహరణకు సాఫ్ట్వేర్ డెవలపర్, ఏఐ/ఎంఎల్ ఇంజినీర్స్ జాబ్స్నే తీసుకుంటే, జీసీసీల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగి వార్షిక వేతనం రూ.9.7 లక్షలు కాగా, సీనియర్ లెవెల్ సిబ్బంది ప్యాకేజీ రూ.43 లక్షల్లో ఉంది. ఐటీ కంపెనీలను పరిశీలిస్తే, అవే విధులకు గాను ఎంట్రీ లెవెల్ ప్యాకేజీ రూ.5.7 లక్షల నుండి సీనియర్లకు గరిష్టంగా 17.9 లక్షలుగా ఉండడటం గమనార్హం.చిన్న నగరాల్లోనూ నిపుణులకు డిమాండ్ జీసీసీలు టెకీలకు భారీగా వేతన ప్యాకేజీలు ఇస్తున్న నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గురుగ్రా మ్, హైదరాబాద్, చెన్నై వంటివి ఉన్నాయి. అయితే, జైపూర్, ఇండోర్, కోయంబత్తూరు తదితర ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా జీసీసీలు, డేటా సెంటర్లు శరవేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో అక్కడ డే టా సైన్స్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, డే టా ఇంజినీరింగ్ నిపుణులకు డిమాండ్ భారీగా ఉందని పరిశ్రమ చెబుతోంది. ‘జీసీసీలు ప్రధానంగా జెన్ ఏఐ, ఏఐ/ఎంఎల్, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాలపై ఫోకస్ చేస్తున్నాయి. దీంతో డిజిటల్ మార్పులకు దన్నుగా నిలవడంతో పాటు నవకల్పనల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాయి’ అని టీమ్‌లీజ్ డిజిటల్ వైస్–ప్రెసిడెంట్ కృష్ణ విజ్ పేర్కొన్నారు. సాంప్రదాయ ఐటీ కంపెనీలతో పోలిస్తే జీసీసీల్లో 12–20 శాతం అధిక ప్యాకేజీలు, డిజిటల్ స్కిల్స్‌కు ఎంత డిమాండ్ ఉందనేదుకు నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు. విస్తరణ జోరు.. 2025 నాటికి జీసీసీల సంఖ్య 1900కు పెరగనుంది. సిబ్బంది 20 లక్షలను మించుతారని అంచనా. ముఖ్యంగా జెనరేటివ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ), మెషిన్ లెరి్నంగ్/ఏఐ, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాల్లో భారీగా నిపుణుల అవసరం ఉంటుందని టీమ్‌లీజ్ చెబుతోంది. గ్లోబల్ టెక్ హబ్‌గా భారత్ ప్రాధాన్యత అంతకంతకూ పెరుతుండటంతో వచ్చే 5–6 ఏళ్లలో ఏకంగా 800 కొత్త జీసీసీలు భారత్‌లో కొలువుదీరే అవకాశం ఉంది. ఇవి కేవలం మెట్రోలు, బడా నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరించే సన్నాహల్లో ఉండటం పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టే టెకీలకు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
బ్యాంకు సర్వీసులను అప్డేట్ చేయట్లేదు.. బీసీజీ నివేదిక
గ్లోబల్ బ్యాంకులతో పోలిస్తే భారతీయ బ్యాంకులు ఐటీ సర్వీసులకు తక్కువ ఖర్చు చేస్తున్నాయని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంకులు సాధారణంగా తమ ఆదాయంలో 7-9% వరకు ఐటీ ఖర్చులు చేస్తుండగా, భారతీయ బ్యాంకులు 5 శాతమే కేటాయిస్తున్నాయని నివేదిక పేర్కొంది.బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ విడుదల చేసిన ‘ది పోస్టర్ చైల్డ్’ నివేదికలో వివరాల ప్రకారం..2026 ఆర్థిక సంవత్సరంలో లావాదేవీలు, రుణాలు మొత్తం 75 శాతం డిజిటల్ రూపంలో జరుగుతాయి. థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 25% కొత్త డిజిటల్ ఖాతాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం బ్యాంకులకు సమకూరే మొత్తం ఆదాయంలో ‘చేంజ్ ది బ్యాంక్ (సీటీబీ)’తో పోలిస్తే దాదాపు 80% ఐటీ బడ్జెట్ ‘రన్ ది బ్యాంక్ (ఆర్టీబీ)’ కోసం ఖర్చు చేస్తున్నారు. భారతీయ బ్యాంకులు కోర్ బ్యాంకింగ్ సేవలను మెరుగుపరిచేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దాంతో ఐటీ కేటాయింపులు తగ్గుతున్నాయి. గ్లోబల్ బ్యాంకులు మాత్రం బ్యాంకింగ్ ఐటీ సేవల అప్డేట్లకు ప్రాధాన్యమిస్తున్నాయి.సుమారు 10 బిలియన్ డాలర్ల(రూ.83 వేలకోట్లు) కంటే ఎక్కువ నికర ఆదాయాన్ని ఆర్జించే గ్లోబల్ బ్యాంక్‌లు 9.1% ఐటీ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి ఖర్చు చేస్తున్నాయి. అదే భారతీయ బ్యాంకులు వాటి ఆదాయంలో కేవలం 3.2% మాత్రమే ఇందుకు కేటాయిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లు (రూ.8 వేలకోట్లు) నుంచి రూ.83 వేలకోట్లు మధ్య నికర ఆదాయాన్ని సంపాదించే బ్యాంకులు సరాసరి 7.2 శాతం ఐటీ బడ్జెట్‌కు ఖర్చు చేస్తున్నాయి. భారతీయ బ్యాంక్‌ల్లో ఈ వాటా 3 శాతంగా ఉంది.ఇదీ చదవండి: టాటా స్టీల్..2,800 ఉద్యోగాల కోత2022, 2023లో ఆర్బీఐ అంబుడ్స్‌మన్ పరిధిలో 40,000 కంటే ఎక్కువ మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి. కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించాలంటే మరింత సమర్థమైన ఐటీ సేవలందించాలి. దాంతో ఫిర్యాదులు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ విధానాల్లో మార్పులు వస్తున్నాయి. ఏటా యూపీఐ, నగదు రహిత చెల్లింపులు పెరుగుతున్నాయి. కొవిడ్ తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. మార్కెట్లో కొత్త ఫిన్‌టెక్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఆ పోటీని తట్టుకోవాలంటే బ్యాంకులు అవి అందించే ఐటీ సర్వీసులను అప్డేట్ చేసుకోవాలని నివేదిక సూచిస్తుంది. -
AP: సాగర తీరంలో ఐటీ వెలుగులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఐటీ సేవల హబ్‌గా మారేందుకు విశాఖపట్నానికి అన్ని అవకాశాలు, సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖలో ఇన్ఫోసిస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. టైర్ 1 సిటీగా విశాఖ రూపాంతరం చెందేందుకు ఇన్ఫోసిస్ రాక దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు 20 వేల మంది నేవీ ఉద్యోగులతో తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా కూడా నిలిచిందని గుర్తు చేశారు. ఇక్కడ ఇప్పటికే రెండు పోర్టులున్నాయని త్వరలోనే మూడో పోర్టు సమీపంలోని శ్రీకాకుళంలో రానుందని తెలిపారు. మరో రెండేళ్లల్లో పూర్తిస్థాయి అంతర్జాతీయ పౌర విమానాశ్రయం కూడా సిద్ధం కానుందని చెప్పారు. పరిశ్రమలకు ఏ సహాయం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటామని పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. సోమవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన సందర్భంగా విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. ఫార్మా కంపెనీల నాలుగు యూనిట్లకు ప్రారంభోత్సవాలు, రెండు యూనిట్లకు శంకుస్థాపనలు నిర్వహించారు. మొత్తం రూ.1,646 కోట్ల విలువైన ఐటీ కార్యాలయాలు, ఫార్మా యూనిట్ల ఏర్పాటుతో 3,450 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. విశాఖలో సముద్ర తీరం శుభ్రత కోసం జీవీఎంసీ సిద్ధం చేసిన ఆరు బీచ్ క్లీనింగ్ యంత్రాలను కూడా ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో సీఎం జగన్ ఏమన్నారంటే.. విశాఖకు విశేష సామర్థ్యం.. విశాఖ నగరానికి విశేషమైన సామర్ధ్యం ఉంది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తరహాలో విశాఖపట్నం కూడా ఐటీ హబ్‌గా మారబోతోంది. ఆ స్ధాయిలో ఈ నగరానికి సహకారాన్ని అందిస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తరహా మెట్రో నగరం ఆంధ్రప్రదేశ్‌లో లేదు. ఐటీ, ఐటీ సేవలకు సంబంధించిన పరిశ్రమలు గతంలో విశాఖలో ఏర్పాటు కాలేదు. వాస్తవానికి ఆ కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం నగరానికి ఉన్నప్పటికీ అవన్నీ అప్పటి రాజధాని హైదరాబాద్‌లోనే ఏర్పాటయ్యాయి. ఏపీలో విశాఖ అతిపెద్ద నగరం. టైర్ 1 సిటీగా ఎదగడానికి కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం ఈ నగరానికి ఉన్నాయి. ప్రథమశ్రేణి నగరంగా ఎదగడానికి అవసరమైన తోడ్పాటును ఇన్ఫోసిస్ అందించగలదని నేను బలంగా నమ్ముతున్నా. దాదాపు 3.28 లక్షల మంది ఉద్యోగులు, 18.5 బిలియన్ డాలర్ల రెవెన్యూ సామర్ధ్యం కలిగిన ఇన్ఫోసిస్‌తో పాటు టీసీఎస్, విప్రో లాంటి సంస్ధలు నగర ఐటీ స్వరూపాన్ని, ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి వేస్తాయి. విశాఖకు ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది. రానున్న రోజుల్లో మిగిలిన ఐటీ కంపెనీలు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి. విశాఖలో ఆదానీ డేటాసెంటర్ కూడా రాబోతుంది. సబ్‌మెరైన్ ఇంటర్నెట్ కేబుల్ మనకు ప్రత్యేకంగా సింగపూర్ నుంచి వస్తుంది. రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ రానుంది. క్లౌడింగ్‌తో పాటు ఐటీ రంగంలో చాలా మార్పులు రానున్నాయి. ఇవన్నీ సాకారం కానున్నాయి. నీలాంజన్, నీలాద్రిప్రసాద్, సురేష్, రఘు లాంటి ఐటీ నిపుణులతో మాట్లాడిన తర్వాత వీరంతా విశాఖ ఐటీలో కచ్చితంగా ఒకరోజు అద్భుతాలు సృష్టిస్తారని బలంగా విశ్వసిస్తున్నా. నాకు ఆ నమ్మకం ఉంది. ఇవాళ 1,000 మందితో ఇక్కడ ప్రారంభమైన ఇన్ఫోసిస్ రానున్న రోజుల్లో మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ఇన్ఫోసిస్‌తో కలసి ఐటీ రంగంలో విశాఖ బహుముఖ ప్రగతిని సాధిస్తుందన్న విశ్వాసం నాకుంది. రానున్న రోజుల్లో విశాఖలో పెట్టుబడులకు అనేక మంది ముందుకొచ్చే అవకాశాలున్నాయి. అందుకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్ విశాఖలో ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు ఏర్పాటయ్యాయి. 14 ఇంజనీరింగ్ కాలేజీలు, 8 యూనివర్సిటీలు, 4 మెడికల్ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీలతో విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా ఉంది. ఇక్కడి నుంచి ఏటా దాదాపు 12 వేల నుంచి 15 వేల మంది ఇంజనీర్లు డిగ్రీ పూర్తి చేసుకుని వస్తున్నారు. వీటితో పాటు ఐఐఎం, నేషనల్ లా యూనివర్సిటీ లాంటి అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు కూడా విశాఖలో ఉన్నాయి. ఇదీ విశాఖ సామర్ధ్యం. ఇక్కడే ఐవోసీతోపాటు తూర్పు నౌకా దళం ప్రధాన కేంద్రం కూడా ఉంది. విశాఖ, గంగవరం లాంటి రెండు బలమైన పోర్టులు కూడా ఉన్నాయి. వీటితో పాటు శ్రీకాకుళంలో మూడో పోర్టు వస్తోంది. మధురవాడ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్ గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ తొలుత మధురవాడ ఐటీ హిల్స్‌లో రూ.35 కోట్లతో ఏర్పాటైన ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్‌ని ప్రారంభించారు. సంస్థ ప్రాంగణమంతా పరిశీలించారు. అనంతరం గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సముద్రతీర ప్రాంత శుభ్రత కోసం రూ.15 కోట్లతో ఏర్పాటు చేసిన 6 బీచ్ క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించారు. క్లీనింగ్ యంత్రాలపైకి ఎక్కి అవి ఎలా పనిచేస్తాయన్న వివరాలను ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆ తరువాత పరవాడ చేరుకుని రూ.500 కోట్లతో ఫార్మాసిటీలో 19.34 ఎకరాల్లో ఏర్పాటైన అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ యూజియా స్టెరిలైజ్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ ఏటా 420 మిలియన్ సామర్థ్యం కలిగిన జనరల్ ఇంజెక్టబుల్స్‌ను తయారు చేయనుంది. అనంతరం అచ్యుతాపురంలో లారస్ సంస్థ రూ.440 కోట్లతో నిర్మించిన ఫార్ములేషన్ బ్లాక్‌ను, రూ.191 కోట్లతో ఏర్పాటైన యూనిట్–2ను సీఎం ప్రారంభించారు. లారస్ రూ.240 కోట్లతో 450 మందికి ఉపాధి కల్పించేలా నిర్మించనున్న యూనిట్–3తో పాటు మరో రూ.240 కోట్లతో ఇదే సంస్థ పరవాడ వద్ద నిర్మించనున్న యూనిట్–7కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఫార్మా ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా పరిపాలన రాజధానిగా శరవేగంగా ముస్తాబవుతున్న విశాఖకు అక్టోబర్‌కే తరలి వెళ్లాల్సి ఉన్నా కార్యాలయాలు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడం, విస్తృత భద్రతా కారణాల దృష్ట్యా అధికారుల సూచనల మేరకు డిసెంబర్లో వెళ్లే అవకాశం ఉందని సీఎం సమావేశంలో చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్, వైస్ ప్రెసిడెంట్ నీలాద్రి ప్రసాద్ మిశ్రా, లారస్ సీఈవో సత్యనారాయణతో పాటు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, విడదల రజని, మేయర్ హరివెంకటకుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా.సత్యవతి, గొడ్డేటి మాధవి, ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, కలెక్టర్ డా.మల్లికార్జున, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 40 శాతం మహిళా ఉద్యోగులే 1981లో ఏర్పాటైన ఇన్ఫోసిస్ భవిష్యత్తు డిజిటల్ సేవలు, కన్సల్టింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉంది. 56 దేశాలలో 274 చోట్ల సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డీలర్స్ ఆటోమేటెడ్ కొటేషన్స్ (నాస్డాక్) జాబితాలో భారత తొలి ఐటీ కంపెనీగా ఇన్ఫోసిస్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 71.01 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇన్ఫోసిస్‌లో ప్రపంచవ్యాప్తంగా 3,50,000 మంది ఉద్యోగులు పని చేస్తుండగా వీరిలో 40 శాతం మంది మహిళా ఉద్యోగులే కావడం గమనార్హం. 2023లో ప్రపంచంలో అత్యంత నైతికత (ఎథికల్) సంస్థలలో ఒకటిగా ఇన్ఫోసిస్ గుర్తింపు పొందింది. టైమ్ మ్యాగజైన్ టాప్ 100 ప్రపంచ అత్యుత్తమ సంస్థలు 2023 జాబితాలో ఉన్న ఏకైక భారతీయ సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది. గ్లోబల్ టాప్ ఎంప్లాయర్ 2023 సర్టిఫికేషన్‌ను సొంతం చేసుకుంది. అలల ప్రేరణతో కార్యాలయం టాలెంట్ స్ట్రాటజీలో భాగంగా ప్రతిభా కేంద్రాలకు దగ్గరగా డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్ నిర్దేశించుకుంది. మంగళూరు, మైసూర్, త్రివేండ్రం, నాగ్‌పూర్, ఇండోర్, జైపూర్, హుబ్లీ, చండీగఢ్, భువనేశ్వర్, కోయంబత్తూర్ లాంటి టైర్ 2 నగరాల్లో డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తాజాగా విశాఖలో సేవలను ప్రారంభించింది. మధురవాడలోని ఐటీ హిల్ నం.2లో ఉన్న సిగ్నిటివ్ టవర్స్‌లో లీజుకు తీసుకున్న బిల్డ్ అప్ స్థలంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. విశాఖకు సహజ అందాలను తీసుకొచ్చిన సముద్రపు అలల ప్రేరణతో కార్యాలయంలోని ఇంటీరియర్ డిజైన్ రూపొందించారు. జావా, జే2ఈఈ, శాప్, డేటాసైన్స్, డేటా అనలటిక్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ – యుటిలిటీ, రిటైల్ సహా బహుళ పరిశ్రమలకు ప్రపంచవ్యాప్తంగా క్లెయింట్స్ సేవలను ఈ కేంద్రం నుంచి అందిస్తారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులలో సింహభాగం విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. కాగా మరింత మంది నియామకం కోసం విశాఖలోని వివిధ కళాశాలలతో ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ రాక విశాఖలో ఐటీ పరిశ్రమ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఉన్న బీపీవో/కేపీవో పరిశ్రమలతో పాటు కోర్ ఐటీ కంపెనీలతో కలసి ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్‌గా విశాఖ అడుగులు వేసేందుకు దోహదం చేయనుంది. -
క్యూ2 నుంచి ఐటీకి జోష్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సర్వీసుల దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో అంతంతమాత్ర ఫలితాలు సాధించినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది(2023–24) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లోనూ ఈ ప్రభావం కనిపించే వీలున్నట్లు తెలియజేశాయి. అయితే రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్) నుంచి తిరిగి ఐటీ సేవలకు డిమాండ్ పుంజుకునే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డాయి. గతేడాది క్యూ4లో ఐటీ దిగ్గజాలు అంచనాలకు దిగువన ఫలితాలు ప్రకటించాయి. మందగమన పరిస్థితుల నేపథ్యంలో ప్రధానంగా యాజమాన్యం అప్రమత్తంగా స్పందించాయి. భవిష్యత్ ఆర్జనపట్ల ఆచితూచి అంచనాలు వెల్లడించాయి. యూఎస్ నుంచి బీఎఫ్ఎస్ఐ, టెక్నాలజీ సర్వీసులు, తదితర కొన్ని విభాగాలలో కస్టమర్లు డీల్స్ విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టుల ఆలస్యం అనుకోనివిధంగా కొన్ని ప్రాజెక్టులు తగ్గిపోవడం, కాంట్రాక్టులు కుదుర్చుకోవడంలో క్లయింట్ల వెనకడుగుపట్ల ఇన్ఫోసిస్, టీసీఎస్ యాజమాన్యాలు క్యూ4 ఫలితాల విడుదల సందర్భంగా స్పందించిన సంగతి తెలిసిందే. గత క్యూ4 ప్రభావం ఈ ఏడాది క్యూ1పై కనిపించవచ్చని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టీవీ మోహన్‌దాస్ పాయ్ పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది క్యూ3 నుంచి పరిస్థితులు సర్దుకుంటాయని అంచనా వేశారు. రెండు, మూడు త్రైమాసికాలు మందగించినప్పటికీ అక్టోబర్, నవంబర్‌కల్లా యూఎస్‌లో తిరిగి వృద్ధి ఊపందుకుంటుందని అభిప్రాయపడ్డారు. దేశీ ఐటీ పరిశ్రమ 200 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వెరసి దేశీ ఐటీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, ప్రభావం చూప గలదని వివరించారు. కొన్ని త్రైమాసికాలపాటు ఐటీ దిగ్గజాల ఫలితాలు మందగించవచ్చని ఐసీఆర్ఐఈఆర్ చైర్‌పర్శన్, జెన్‌ప్యాక్ట్ వ్యవస్థాపకులు ప్రమోద్ భాసిన్ పేర్కొన్నారు. ఆపై తిరిగి వృద్ధి బాట పట్టే వీలున్నట్లు తెలియజేశారు. -
ఏపీ: నకిలీ, నాసిరకం మందుల నియంత్రణకు సరికొత్త విధానం
సాక్షి, అమరావతి: నకిలీ, నాసిరకం మందుల నియంత్రణకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. మందుల అమ్మకాలు, నమూనాల సేకరణ, నమూనాల పరిశీలన వంటి వాటి విషయంలో ఐటీ ఆధారిత సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఔషధ నియంత్రణ శాఖ ప్రత్యేక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన యాప్‌లను అందుబాటులోకి తెచ్చి రాష్ట్రంలో మందుల పరిశీలన విధానాన్ని సులభతరం చేయనుంది. ఇకపై అలా ఉండదు.. రాష్ట్రంలో సుమారు 30 వేల వరకూ రిటైల్ మందుల షాపులు, 23 మాన్యుఫాక్చర్ సంస్థలు, 1,200కు పైగా హోల్‌సేల్ షాపులున్నాయి. మనకు వస్తున్న మందులు 90 శాతం ఇతర రాష్ట్రాలవే. ఇలా బయటి నుంచి వస్తున్న మందులు నాసిరకమా, నకిలీవా, జీఎంపీ(గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్) కలిగి ఉన్నాయా.. లేదా వంటివన్నీ పరిశీలించేందుకు ఐటీ ఆధారిత సేవలను వినియోగించుకుంటారు. కొత్తగా సీఏఎస్ఐ(కంప్యూటర్ ఎయిడెడ్ సెలక్షన్ ఆఫ్ ఇన్స్పెక్షన్), పాడ్స్(ప్రివెంటివ్ యాక్షన్ త్రూ డ్రగ్ సర్వైలెన్స్) అనే రెండు ఐటీ అప్లికేషన్లను ఔషధ నియంత్రణ శాఖ అమల్లోకి తెస్తోంది. (చదవండి: వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్) సీఏఎస్ఐ ప్రకారం.. ఎలాంటి మందులను పరిశీలించాలన్న దానిని మానవాధారిత ప్రమేయం లేకుండా ప్రత్యేక కంప్యూటర్ పరిజ్ఞానంతో ఎంపిక చేస్తారు. ఇప్పటి వరకూ డ్రగ్ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో ఏదో ఒక టాబ్లెట్‌ను ఎంపిక చేసుకుని నమూనాలు సేకరించేవారు. ఇకపై అలా ఉండదు. ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని ఇకపై డిజిటల్ రికార్డుల్లో నమోదు చేస్తారు. సీఏఎస్ఐ సాఫ్ట్‌వేర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి డ్రగ్ ఇన్స్పెక్టర్కు, అసిస్టెండ్ డైరెక్టర్లకు ప్రత్యేక లాగిన్, పాస్వర్డ్లు ఇస్తారు. మందుల నమూనాలను ఎలా ఎంపిక చేయాలన్న దానిపై ఔషధ నియంత్రణ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షణ ఉంటుంది. దేశంలోనే తొలిసారి.. ఇకపై ఇంటెలిజెంట్ శాంపిలింగ్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. దేశంలోనే తొలిసారి మందుల నమూనాల సేకరణలో ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెడుతున్నారు. ఎక్కడో నాలుగు శాంపిళ్లు తీసుకురావడం, వాటిని పరీక్షించడం.. వంటి మూస పద్ధతికి స్వస్తి చెప్పి ఇంటెలిజెంట్ శాంపిలింగ్ చేస్తారు. అది ఎలా ఉంటుందంటే.. పదే పదే నాసిరకం అని తేలిన కంపెనీపై నిఘా ఉంచడం, మార్కెట్లో అతి తక్కువ రేటుకు అమ్మడం, లేదా రేటు ఎక్కువగా ఉండటం, లేబిలింగ్‌పై తేడాలు గమనించడం ఇలాంటి కొన్ని అనుమానాల నేపథ్యంలో వాటిని సేకరిస్తారు. ముఖ్యంగా మాన్యుఫాక్చరర్స్, డీలర్స్, హోల్‌సేలర్స్ లావాదేవీలన్నీ ట్రేస్ అండ్ ట్రాక్ విధానంలో పెట్టడం వంటివి చేస్తారు. ప్రివెంటివ్ యాక్షన్ త్రూ డ్రగ్ సర్వైలెన్స్(పాడ్స్) ప్రకారం డీలర్, డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, రీటెయిలర్ ఇలా లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఔషధ నియంత్రణ శాఖ లాగిన్, పాస్వర్డ్ ఇస్తుంది. దీన్ని ఔషధ నియంత్రణశాఖ పోర్టల్‌కు అనుసంధానిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మందుల కంపెనీల లైసెన్స్‌లను పరిశీలిస్తారు. లైసెన్స్‌లు, రెన్యువల్స్ పరిశీలనకు అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఉంటారు. దీనివల్ల ఏ కంపెనీ లేదా స్టాకిస్ట్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే వీలుంటుంది. -
ఐటీరంగంలో భారీ ఎత్తున ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు
కరోనా కారణంగా స్తబ్దుగా ఉన్న ఐటీ రంగం ఊపందుకుంది. ఐటీ రంగానికి చెందిన ఆరు విభాగాల్లో భారీ ఎత్తున ఉద్యోగుల అవసరం ఉందని సిబ్బంది సేవల సంస్థ ఎక్స్‌ఫెనో తెలిపింది. ఎక్స్‌ఫెనో తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీ సెక్టార్లో ప్రాడక్ట్, సర్వీస్ విభాగాల్లో వేలల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఇండియన్ ఐటీ సర్వీసులు, స్టార్ట్ అప్‌లతో పాటు ఇతర ప్రాడక్ట్ బేస్డ్ కంపెనీలు ఉద్యోగుల్ని ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపింది. ఆరు విభాగాల్లో ముఖ్యంగా ఫుల్ స్టాక్ డెవలపర్స్, డేటా ఇంజనీర్లు, రియాక్ట్ నెగిటీవ్ డెవలపర్స్, డెవలపర్స్, బ్యాకెండ్ ఇంజినీర్స్, మెషిన్ లెర్నింగ్‌లో ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని ఎంపిక చేసే పనిలో పడ్డాయని చెప్పింది. ఈ ఆరు విభాగాల్లో మొత్తం 70 వేలు, అంతేకంటే ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉందన్న ఎక్స్‌ఫెనో.. ఎవరైతో ఈ ఉద్యోగాల్లో రాణిస్తారో వారికి అనుభవాన్ని బట్ట 50నుంచి 60శాతం హైక్ ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. గతేడాది ఇదే విభానికి చెందిన 3నుంచి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్యోగులకు 20-25 శాతం శాలరీల్ని హైక్ ఇచ్చాయి. కరోనా కారణంగా ప్రాడక్ట్, సర్వీస్ బేస్డ్ రంగాల్లో వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల, శాలరీల విషయంలో ఐటీ కంపెనీలు వెనకడుగు వేయడం లేదని ఎక్స్ఫెనోమ ప్రతినిధులు వెల్లడించారు. అంతేకాదు గతేడాది ప్రముఖ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ 3వేల మంది ఉద్యోగుల్ని నియమించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఉద్యోగుల అవసరం పెరిగి 18వేల నుంచి 32వేల మంది ఉద్యోగుల ఎంపిక చేసినట్లు యాక్సెంచర్ సీఈఓ జూలీస్వీట్ ఓ ప్రకటనలో తెలిపింది. కాబట్టి నిరుద్యోగులు ఈ ఆరురంగాల్లో నిష్ణాతులై ఉండాలని ఐటీ నిపుణులు చెబుతున్నారు. -
విప్రో లాభం రూ. 2,465 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 2,465 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ప్రకటించిన రూ. 2,553 కోట్లతో పోలిస్తే లాభం 3.4 శాతం క్షీణించింది. మరోవైపు, ఆదాయం దాదాపు గత క్యూ2 స్థాయిలోనే రూ. 15,114 కోట్లుగా నమోదైంది. ఇక డిసెంబర్ క్వార్టర్లో ఐటీ సేవల విభాగం ఆదాయం 202.2–206.2 కోట్ల డాలర్ల స్థాయిలో ఉండొచ్చని, సీక్వెన్షియల్‌గా చూస్తే 1.5–3.5 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా వేస్తున్నట్లు విప్రో తెలిపింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 199.24 కోట్ల డాలర్లుగా నమోదైంది. సీక్వెన్షియల్‌గా చూస్తే 3.7 శాతం వృద్ధి సాధించింది. ‘ఆదాయాలు, మార్జిన్లపరంగా ఈ త్రైమాసికం అద్భుతంగా గడిచింది. మా ముందు అనేక ఆసక్తికరమైన వ్యాపారావకాశాలు ఉన్నాయి‘ అని విప్రో సీఈవో థియెరి డెలాపోర్ట్ తెలిపారు. ప్రాధాన్యతా రంగాలు, మార్కెట్లపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. కన్జూమర్, ఆర్థిక సేవల విభాగాలు మెరుగైన పనితీరు కనబపర్చగలవని డెలాపోర్ట్ తెలిపారు. సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్తగా 3,400 మంది సిబ్బందిని తీసుకోవడంతో ఉద్యోగుల సంఖ్య 1,85,243కి చేరింది. అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రేటు 11 శాతంగా ఉంది. ఎగ్జిమియస్ డిజైన్ కొనుగోలు.. అమెరికాకు చెందిన ఇంజనీరింగ్ సేవల సంస్థ ఎగ్జిమియస్ డిజైన్‌ను కొనుగోలు చేయనున్నట్లు విప్రో వెల్లడించింది. ఇందుకోసం సుమారు 8 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 586.3 కోట్లు) వెచ్చించనున్నట్లు వివరించింది. తమ ఇంజనీరింగ్‌ఎన్‌ఎక్స్‌టీ విభాగం అందించే సేవలకు ఎగ్జిమియస్ మరింత విలువ చేకూర్చగలదని విప్రో పేర్కొంది. వీఎల్ఎస్ఐ, సిస్టమ్ డిజైన్ సర్వీసుల మార్కెట్లో విప్రో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు, కొత్త విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరించేందుకు తోడ్పడగలదని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హర్మీత్ చౌహాన్ తెలిపారు. 2020 డిసెంబర్ 31తో ముగిసే త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కాగలదని వివరించారు. విప్రోతో చేతులు కలపడం తమ కస్టమర్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఎగ్జిమియస్ డిజైన్ సీఈవో జయ్ ఆవుల తెలిపారు. 2013లో అమెరికాలో ఏర్పాటైన ఎగ్జిమియస్ డిజైన్‌కు భారత్‌తో పాటు మలేసియాలో కూడా డిజైన్ సెంటర్లు ఉన్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో సొల్యూషన్స్ అందిస్తోంది. కంపెనీలో 1,100 మంది ఉద్యోగులు ఉండగా, 2019లో 3.52 కోట్ల డాలర్ల ఆదాయం నమోదు చేసింది. బుధవారం బీఎస్ఈలో విప్రో షేరు స్వల్పంగా అర శాతం క్షీణించి రూ.375.75 వద్ద ముగిసింది. బైబ్యాక్ రేటు రూ. 400.. మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ తరహాలోనే విప్రో కూడా షేర్ల బైబ్యాక్ ప్రణాళిక ప్రకటించింది. ఇందుకోసం రూ. 9,500 కోట్ల దాకా వెచ్చించనుంది. షేరు ఒక్కింటికి రూ. 400 ధరను నిర్ణయించింది. సుమారు 23.75 కోట్ల దాకా షేర్లను కొనుగోలు చేయనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. సెప్టెంబర్ 30 ఆఖరు నాటికి గల పెయిడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో ఇది దాదాపు 4.16 శాతమని వివరించింది. మంగళవారం బీఎస్ఈలో విప్రో షేరు ముగింపు ధర రూ. 375.75తో పోలిస్తే బైబ్యాక్ రేటు సుమారు 6% అధికం. షేర్హోల్డర్లకు నిలకడగా రాబడులు అందించాలన్న తమ సిద్ధాంతానికి అనుగుణంగా కంపెనీ షేర్ల కొనుగోలు చేపట్టినట్లు విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ తెలిపారు. విప్రో గతేడాది రూ. 10,500 కోట్లు, 2017లో రూ. 11,000 కోట్లు, 2016లో రూ. 2,500 కోట్లతో షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ కంపెనీలు కూడా తాజా బైబ్యాక్‌లో పాల్గొంటాయని విప్రో వివరించింది. షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 9నాటి గణాంకాల ప్రకారం ప్రమోటర్, ప్రమోటరు గ్రూప్‌నకు కంపెనీలో 74.02 శాతం వాటాలు ఉన్నాయి. -
ఇన్ఫోసిస్‌కు వ్యాన్‌గార్డ్.. భారీ డీల్!
దేశీ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్.. యూఎస్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం వ్యాన్‌గార్డ్ నుంచి భారీ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు తెలుస్తోంది. డీల్ విలువ 1.5 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,500 కోట్లు)గా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పదేళ్ల కాలంవరకూ సర్వీసులను పొడిగించే వీలున్నట్లు తెలియజేశాయి. తద్వారా 2 బిలియన్ డాలర్లకు కాంట్రాక్ట్ విలువ చేరనున్నట్లు వెల్లడించాయి. ఇన్ఫోసిస్ ఇటీవలే క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలను విడుదల చేసింది. క్యూ1లో 1.7 బిలియన్ డాలర్ల డీల్స్‌ను కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. అయితే వ్యాన్‌గార్డ్ డీల్ వీటిలో లేదని విశ్లేషకులు తెలియజేశారు. పోటీ అధికమే వ్యాన్గార్డ్తో కుదుర్చుకున్న డీల్ ఇన్ఫోసిస్ చరిత్రలో అతిపెద్ద కాంట్రాక్టుగా నిపుణులు భావిస్తున్నారు. తొలుత బిలియన్ డాలర్లుగా అంచనా వేసినట్లు తెలియజేశారు. గత వారం షేరు దూకుడుకు ఈ డీల్‌పై అంచనాలు కొంత కారణమైనట్లు చెబుతున్నారు. అయితే కంపెనీ ఈ అంశంపై స్పందించకపోవడం గమనార్హం! కాగా.. వ్యాన్‌గార్డ్ డీల్ కోసం ఐటీ దిగ్గజాలు టీసీఎస్, యాక్సెంచర్, విప్రోలతో ఇన్ఫోసిస్ పోటీపడినట్లు తెలుస్తోంది. డీల్‌లో భాగంగా బీపీఎం సర్వీసులతోపాటు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సేవలను ఇన్ఫోసిస్ అందించనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాన్‌గార్డ్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్వహించే రికార్డ్ కీపింగ్ సర్వీసులకు మద్దతివ్వనున్నట్లు వివరించారు. ఎలక్ట్రానిక్ సిటీలో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో 3,000 మందితో పనిచేయగల యూనిట్‌ను వ్యాన్‌గార్డ్ డీల్ కోసం ఇన్ఫోసిస్ ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తొలుత 300-400 మంది సిబ్బందితో సేవలు ప్రారంభించి తదుపరి దశలో డీల్‌కు అనుగుణంగా పెంచే యోచనలో ఉన్నట్లు తెలియజేశాయి. కాగా.. వివిధ ఫండ్స్ ద్వారా ఇన్ఫోసిస్‌లో 3 శాతం వాటాను వ్యాన్‌గార్డ్ కలిగి ఉంది. రిటైర్మెంట్ సర్వీసుల విభాగంలో ఇన్ఫోసిస్‌కు మంచి పట్టున్నదని, యూఎస్‌లో ఇలాంటి టాప్ -20 కంపెనీలలో సగంవరకూ సేవలను అందిస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు 2 శాతం ఎగసి రూ. 920 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 924ను అధిగమించింది. గత గురువారం రూ. 955ను అధిగమించడం ద్వారా ఇన్ఫోసిస్ షేరు 52 వారాల గరిష్టానికి చేరిన విషయం విదితమే. -
పని ఈజీ.. ఆదాయం డబుల్
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాంకేతికంగా మెరుగుపడింది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నది. పనిని సులభతరం చేసుకుని ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. ఇదివరకు ఎప్పుడూ సర్వర్ల మొరాయింపు, నెట్వర్క్ సమస్యలతో సతమతమయ్యే ఈ శాఖలో గత ఏడాది కాలంగా అవరోధాలు లేకుండా అమలవుతున్న సేవలు ఆదాయాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా 2017 చివర్లో రెయిల్‌టెల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా మెరుగైన సేవలు రిజిస్ట్రేషన్ల ఆదాయంలో వృద్ధికి కారణమవుతున్నాయని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్ సొంత నెట్వర్క్.. ఆ తర్వాత అప్‌గ్రేడ్ తెలంగాణ ఏర్పాటైన మూడేళ్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్తోనే కలసి రిజిస్ట్రేషన్ల నెట్వర్క్ ఉండేది. స్టేట్‌వైడ్ ఏరియా నెట్వర్క్(స్వాన్) పేరుతో ఉండే దీని ద్వారానే తెలంగాణలోని 141, ఆంధ్రప్రదేశ్‌లోని 270 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయవిక్రయ లావాదేవీలు జరిగేవి. దీంతో నెట్‌వర్క్‌లో ట్రాఫిక్ బిజీ ఏర్పడి తరచూ సేవలకు అంతరాయం కలిగేది. ఈ నేపథ్యంలో రెయిల్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సొంతంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. ఈ నెట్వర్క్ ద్వారా 2 ఎంబీపీఎస్ ద్వారా మల్టీప్రోటోకాల్ లేబుల్ స్విచింగ్ (ఎంపీఎల్ఎస్) వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీని కోసం ఏటా రూ.1.2 కోట్లను ప్రభుత్వం ఆ సంస్థకు చెల్లిస్తోంది. రూ.72 కోట్లతో విస్సెన్ ఇన్ఫోటెక్ అనే సంస్థతో అప్పట్లోనే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 7–9 కొత్త కంప్యూటర్లతోపాటు స్కానర్లు, ప్రింటర్లు, బయో మెట్రిక్ పరికరాలు, సీసీ కెమెరాలు, ఐరిస్ రీడర్లు, మోడెమ్‌లను ఆ సంస్థ సరఫరా చేసి ఐదేళ్లపాటు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి 5 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఒక ఇంజనీర్‌ను కూడా నియమించుకుని రోజువారీ రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కొత్త పరికరాలు, రెయిల్‌టెల్ సహకారంతో ఏర్పాటు చేసుకున్న 7 వేల టెరాబైట్ల సామర్థ్యం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నెట్వర్క్, సెంట్రల్ సర్వర్ల ఏర్పాటుతో లావాదేవీల్లో వేగం పెరిగింది. గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల అప్లోడ్, డాటా ఎంట్రీ, ఫోటో క్యాప్చర్ లాంటి ప్రక్రియల కోసం ఒక్కో లావాదేవీకి కనీసం గంట సమయం తీసుకునేది. కానీ, ఇప్పుడు సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఈ లావాదేవీ సమయాన్ని పావుగంట వరకు తగ్గించగలిగామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‘గతంలో సర్వర్లలలో సాంకేతికంగా అనేక సమస్యలు వస్తుండేవి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సగంలో ఆగిపోయేది. ఒక గంట తర్వాత మళ్లీ వచ్చి ఓ పది నిమిషాల్లో కట్ అయ్యేది. దీంతో గంటలో పూర్తి కావాల్సిన ప్రక్రియ ఒక్కోసారి 3,4 గంటలు పట్టేది. ఒక్కోసారి రోజుల తరబడి సర్వర్లు పనిచేసేవి కావు. ఇప్పుడు ఈ సమస్య ఉండటం లేదు.’అని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాది గణనీయంగా లావాదేవీలు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 33 శాతం లావాదేవీలు పెరిగాయి. 2017–18 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 12 రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో మొత్తం 11,36,372 లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది 15,12,468 లావాదేవీలు జరగడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 2017–18 మార్చిలో1,16,928 క్రయవిక్రయ లావాదేవీలు జరిగితే 2018–19 మార్చిలో 1,65,464 లావాదేవీలు జరిగాయి. ఇది గత ఏడాది కన్నా 41 శాతం ఎక్కువని రిజిస్ట్రేషన్ గణాంకాలు చెపుతున్నాయి. ఈ ఏడాది ముఖ్యంగా నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 37% కన్నా ఎక్కువ సంఖ్యలో లావాదేవీల వృద్ధి కనిపించడం గమనార్హం. -
టీసీఎస్.. ప్రపంచంలో టాప్–3
న్యూఢిల్లీ: ఐటీ సేవల్లో భారత కంపెనీలు ప్రతిభ మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఈ రంగంలో టీసీఎస్ ప్రపంచంలోనే మూడో అత్యంత విలువైన బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను యాక్సెంచర్, ఐబీఎం మొదటి రెండు స్థానాల్లో నిలవగా, టీసీఎస్ మూడో స్థానంలో ఉన్నట్టు ‘బ్రాండ్ ఫైనాన్స్’ రిపోర్ట్ తెలియజేసింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ఈ నివేదికను విడుదల చేసింది. భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో సైతం టాప్–10లో చోటు సంపాదించుకోవడం గమనార్హం. 26.3 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో యాక్సెంచర్ మొదటి స్థానంలో నిలిచింది. క్రితం ఆర్థిక సంవత్సరం నివేదికలో ఐబీఎం మొదటి స్థానంలో ఉండగా, దాన్ని వెనక్కి నెట్టి యాక్సెంచర్ మొదటి స్థానానికి చేరుకుంది. 20.4 బిలియన్ డాలర్లతో ఐబీఎం రెండో స్థానానికి పరిమితమైంది. 12.8 బిలియన్ డాలర్లతో టీసీఎస్ మూడో స్థానం దక్కించుకుంది. సంస్థ మార్కెట్ విలువ క్రితం నివేదికతో పోలిస్తే 23 శాతం పెరిగినట్టు బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక తెలిపింది. జపాన్ మార్కెట్లో విజయం సాధించిన తొలి భారత ఐటీ కంపెనీ టీసీఎస్ అని ప్రస్తావించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ ఆటోమేషన్ సహా అన్ని రకాల కస్టమర్ సేవలను అందించడంలో లీడర్‌గా నిలిచినట్టు వివరించింది. టాప్–10లో తొలిసారిగా విప్రో విప్రో తొలిసారి ఈ జాబితాలో టాప్–10లో చోటు దక్కించుకుంది. డిజిటల్ సామర్థ్యాల పెంపు, కీలకమైన కొనుగోళ్లపై కంపెనీ చేసిన గణనీయమైన పెట్టుబడులతో ఈ విభాగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మూడో కంపెనీగా విప్రో నిలిచినట్టు పేర్కొంది. అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ (8.7 బిలియన్ డాలర్లు) నాలుగు, ఇన్ఫోసిస్ (6.5 బిలియన్ డాలర్లు) ఐదో స్థానంలో నిలిచాయి. క్యాప్‌జెమిని, డీఎక్స్‌సీ టెక్నాలజీ, ఎన్టీటీ డేటా టాప్–10లో నిలిచిన ఇతర సంస్థలు. నైపుణ్య ఉద్యోగులు, ప్రపంచ స్థాయి సదుపాయాలు, వసతులు వంటివి భారత్‌ను ఆకర్షణీయమైన ప్రదేశంగా, ప్రపంచానికి చోదకంగా నిలుపుతున్నాయని బ్రాండ్ ఫైనాన్స్ సీఈవో డేవిడ్హేగ్ పేర్కొన్నారు. -
అమెరికాలో టాప్ ఎంప్లాయర్‌గా టీసీఎస్
ముంబై: దేశీ దిగ్గజ ఐటీ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) తాజాగా అమెరికాలో టాప్ ఎంప్లాయర్‌గా అవతరించింది. ఐటీ సర్వీసెస్ రంగానికి సంబంధించి ఉపాధి కల్పనలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. టీసీఎస్ గత ఐదేళ్లలో (2012–2016) 12,500 మందికి పైగా అమెరికన్లకు ఉపాధి కల్పించింది. ఇదే సమయంలో అమెరికా ఉద్యోగి వృద్ధిలో 57 శాతం వాటాతో టాప్‌లో దూసుకెళ్తోంది. కేంబ్రిడ్జ్ గ్రూప్ నివేదిక ప్రకారం.. ఐటీ సర్వీసెస్ నిపుణుల నియామకం ఈ ఏడాది గత గణాంకాలకు సమానంగా లేదా ఎక్కువగా ఉండొచ్చని టీసీఎస్ అంచనా వేస్తోంది. -
ఐపీఓ పత్రాలను సమర్పించిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్
న్యూఢిల్లీ: ఎల్ అండ్ టీ ఐటీ సేవల అనుబంధ కంపెనీ ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ త్వరలో ఐపీఓకు రానున్నది. ఐపీఓ సంబంధిత ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ఈ సంస్థ సోమవారం సమర్పించింది. జీఎన్ఏ యాక్సిల్స్: ఈ కంపెనీ ఐపీఓ ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. నారాయణి స్టీల్స్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నారాయణి స్టీల్స్ కంపెనీ, ముంబైకు చెందిన గంగా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫారమ్‌లో లిస్ట్ కావడానికి సంబంధిత పత్రాలను బీఎస్ఈకి సమర్పించాయి. నారాయణి స్టీల్స్ కంపెనీ రూ.11.52 కోట్లు సమీకరించనున్నదని సమాచారం. -
విప్రో లాభం 2,188 కోట్లు
క్యూ1లో 4 శాతం వృద్ధి... ♦ సీక్వెన్షియల్‌గా మాత్రం 3.7% తగ్గుదల ♦ ఆదాయం రూ. 12,895 కోట్లు; 10.5% అప్ బెంగళూరు : దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో.. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2015-16, క్యూ1)లో రూ.2,188 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,103 కోట్లతో పోలిస్తే 4 శాతం వృద్ధి చెందింది. అదేవిధంగా ఆదాయం కూడా 10.5 శాతం పెరిగి రూ.11,669 కోట్ల నుంచి రూ.12,895 కోట్లకు చేరింది. అయితే, గతేడాది ఆఖరి తైమాసికం(మార్చి క్వార్టర్)తో పోలిస్తే(రూ.2,272 కోట్లు) సీక్వెన్షియల్‌గా లాభం 3.7 శాతం తగ్గడం గమనార్హం. కీలకమైన ఐటీ సేవల విషయానికొస్తే.. క్యూ1లో డాలర్ల రూపంలో కంపెనీ 1.79 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. మార్చి క్వార్టర్‌తో పోలిస్తే సీక్వెన్షియల్‌గా 1.1 శాతం వృద్ధి నమోదైంది. రూపాయల్లో చూస్తే ఆదాయం రూ.11,577 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్‌గా 3 శాతం పెరిగింది. కంపెనీ గెడైన్స్(అంచనా, 1.76-1.79 బిలియన్ డాలర్లు)కు అనుగుణంగానే డాలర్ ఆదాయం నమోదైంది. కాగా, మార్కెట్ విశ్లేషకులు ఐటీ సేవల విభాగం నుంచి క్యూ1లో రూపాయి ప్రాతిపదికన రూ11,331 కోట్ల ఆదాయాన్ని, డాలర్ల రూపంలో 1.78 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేశారు. దీనికంటే మెరుగ్గానే కంపెనీ పనితీరును ప్రదర్శించింది. ఇదిలాఉంటే.. ప్రస్తుత రెండో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో ఐటీ సేవల ఆదాయం 1.82-1.85 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది. జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఇది 1.5-3.5 శాతం వృద్ధి కింద లెక్క. కాగా, క్యూ1 ఆదాయ వృద్ధిలో టీసీఎస్(3.5 శాతం), ఇన్ఫోసిస్(4.4 శాతం) కంటే విప్రో వెనుకబడటం గమనార్హం. ఇతర ముఖ్యాంశాలివీ... ►ఐటీ ఉత్పత్తుల రంగం నుంచి ఆదాయం జూన్ క్వార్టర్లో రూ.817 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.766 కోట్లతో పోలిస్తే 6.7 శాతం పెరిగింది. క్యూ1లో విప్రో 36 క్లయింట్లను జతచేసుకుంది. ► ఐటీ సేవల విభాగంలో నికరంగా 3,572 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో జూన్ చివరినాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 1,61,789కి చేరింది. మార్చి చివరికి సిబ్బంది సంఖ్య 1,58,217గా ఉంది. ► అమెరికా ఆదాయాల్లో 2.8 శాతం వృద్ధి నమోదైంది. యూరప్ వ్యాపారం మాత్రం 1.9 శాతం తగ్గగా.. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి ఆదాయాలు 1 శాతం పెరిగాయి. ► విప్రో షేరు ధర గురువారం బీఎస్ఈలో 0.5 శాతం నష్టపోయి రూ.588 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. డీల్స్‌ను చేజిక్కించుకోవడంలో పోటీ అంతకంతకూ పెరుగుతోంది. ఆటోమేషన్‌పై మరింత దృష్టి పెడుతున్నాం. మరోపక్క, క్లయింట్లు డిజిటల్ సర్వీసుల కోసం మరింతగా ఆసక్తి చూపుతున్నారు క్యూ2లో వృద్ధి పుంజుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలో పనితీరు మరింత బాగుంటుంది. - టీకే కురియన్, విప్రో సీఈఓ -
మైక్రోసాఫ్ట్‌తో గోడాడీ జట్టు
మధ్య తరహా పరిశ్రమలకు ఐటీ సేవలు లక్ష్యంగా... హెదరాబాద్: చిన్న తరహా వ్యాపారాలకు సాంకేతిక సేవలందించే గోడాడీ సంస్థ గోడాడీ గెట్ ఆన్లైన్ టుడే సేవలను అందుబాటులోకి తెస్తోంది. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహకారంతో ఈ సేవలను అందిస్తున్నామని గో డాడీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. గోడాడీ గెట్ ఆన్లైన్ టుడే ప్యాకేజీలో ఒక డొమైన్, వెబ్సైట్, ఆఫీస్ 365 ఈ మెయిల్ తదితర ఫీచర్లుంటాయని, ఇవన్నీ కలిపి నెలకు రూ.99 మాత్రమేనని పేర్కొంది. ఐటీ వినియోగం వల్ల చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల ఆదాయం వృద్ధి చెందుతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) అధ్యయనంలో వెల్లడైందని వివరించింది. అందుకే చిన్న, మధ్య తరహా సంస్థలకు ఐటీ సేవలందిండచం ద్వారా ఆయా సంస్థల పురోభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడగలమని తెలిపింది. -
వలస పేరును చెరిపేద్దాం
►అభివృద్ధిలో భాగస్వాములు కండి ►పాలమూరు ప్రాజెక్టులకు పెద్దపీట ►పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక ►మారుమూల పల్లెలకు ఐటీ సేవలు ►తాగునీటి అవసరాలు తీర్చేందుకు గ్రిడ్ ►నవంబర్ నుంచి పెంచిన పింఛన్లు ►స్వాతంత్య్రదిన వేడుకల్లో మంత్రి కేటీఆర్ సాక్షి, మహబూబ్‌నగర్/పాలమూరు: ఎంతోమంది త్యాగాల ఫలితంగా సిద్ధించిన ప్రత్యేక రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, బంగారు తెలంగాణ నిర్మాణానికి పాటుపడదామని రాష్ట్ర పంచాయతీరాజ్, సమాచార సాంకేతికశాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. పాలమూరు పేరు వినగానే ప్రతిఒక్కరికీ వలసలు గుర్తుకొస్తుంటాయని, ఇక నుంచి ఆ ముద్రను చెరపడం కోసం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లా ప్రగతికి అధికారులు సమష్టిగా కృషిచేయాలని కోరారు. 68వ స్వాతంత్య్ర దినవేడుకలను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయజెండాను ఆవి ష్కరించిన అనంతరం మంత్రి కేటీఆర్ జిల్లా ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలకిచ్చిన హామీలను అమలుచేసేందుకు ప్రజాసంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకే ఈనెల 19న సమగ్ర కుటుంబసర్వేను చేపట్టినట్లు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను మంత్రి కోరారు. వలసలకు స్వస్తి చెబుతాం పాలమూరు పేరు వినగానే ప్రతిఒక్కరికీ వలసలు గుర్తుకొస్తుంటాయి. ఇక నుంచి వాటి ముద్ర చెరపడం కోసం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇప్పటికే జిల్లాలో 30,097 ఎకరాల భూమిని గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు అదనంగా మరో రెండు మెగా పరిశ్రమలు, 78 చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రతిపాదనలు వచ్చాయని వీటి ద్వారా 73,800 మందికి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే జిల్లాలో ఐటీరంగాన్ని కూడా విస్తరించనున్నట్లు మంత్రి వివరించారు. ఐటీ సాంకేతిక ఫలాలను తీసుకెళ్లేందుకు ప్రభుత్వ సేవలను మరింత మెరుగ్గా ప్రజలకు చేరువ చేసేందుకు ఈ- పంచాయితీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ‘తెలంగాణ హరితహారం’ పేరిట ప్రతి నియోజకవర్గంలో 40లక్షల మొక్కల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా పెంచాలని నిర్ణయించామని, అందులో భాగంగానే జిల్లాలో 6.20 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్లు మంత్రి వెల్లడించారు. సాగు,తాగునీటికి ప్రాధాన్యం మహబూబ్‌నగర్ జిల్లాలో తాగు, సాగునీటికి అధికప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జిల్లాలోని ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని వివరించారు. సురక్షిత తాగునీటి కోసం జిల్లాలో 792 సింగిల్ విలేజ్ స్కీమ్‌లకు రూ.57.48 కోట్లతో చేపట్టిన 213 పనులు పూర్తయ్యాయని, 48 సమగ్ర మంచినీటి పథకాలను 927 నివాస ప్రాంతాల్లో రూ.767 కోట్లతో చేపట్టినట్లు తెలిపారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 4 మంచినీటి గ్రిడ్లను ఏర్పాటు చేస్తున్నామని, అందులో మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా గ్రిడ్ ఏర్పాటుచేసి 5 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు ఉపయోగించనున్నట్లు మంత్రి వెల్లడించారు. బీడుభూములను సాగునీరు అందించేందుకు చేపట్టిన మహాత్మాగాంధీ, కోయిల్‌సాగర్, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా వంటి భారీ ఎత్తిపోతల పథకాలను చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. ఎత్తిపోతల పనులు దాదాపు 80శాతం అయ్యాయని, మిగతా 20శాతం పనులు త్వరతగతిన పూర్తిచేసి ఆయకట్టు రైతాంగానికి నీరందిస్తామని చెప్పారు. అలాగే జిల్లాలోని 6055 చిన్న, పెద్ద చెరువుల ద్వారా దాదాపు 2.60 లక్షల ఎకరాలకు ఆయకట్టు సాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. గ్రామీణ విత్తనోత్పత్తి, నూనె గింజల అభివృద్ధి, ఆర్కేవీవై, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాలను అమలుచేసేందుకు ఈఏడాది రూ.1,659 లక్షలు కేటాయించినట్లు వివరించారు. జిల్లాలో మొత్తం 2,21,938 వ్యవసాయ కనెక్షన్లకు గాను 2,19,841 కనెక్షన్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 15 కొత్త సబ్స్టేషన్లను ఏర్పాటుచేస్తామన్నారు. జిల్లా ప్రణాళికకు రూ.2776 కోట్లు బీఆర్జీఎఫ్ ద్వారా 2014-15 ఆర్థిక సంవత్సరానికి 3,701 పనులను రూ.3,847 లక్షల అంచనాలతో జిల్లా ప్రణాళిక కమిటీ ద్వారా ఆమోదించి ప్రభుత్వానికి నివేదించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమంలో జిల్లాలోని 1331 పంచాయతీల్లో రూ.2776 కోట్ల అంచనాతో 9484 పనులు, 64 మండలాల్లో రూ.2028 కోట్ల అంచనా వ్యయంతో 640 పనులు, జిల్లాలో 50 పనులు రూ.2400 కోట్ల అంచనా వ్యయంతో గుర్తించినట్లు చెప్పారు. ‘మన ఊరు.. మన దవాఖానా’ ద్వారా 93,085 మంది రోగులు, 74,475 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా 2014-15 ఇప్పటివరకు రూ.110 కోట్లతో 2,53,706 కుటుంబాల్లో 4,31,238 మంది కూలీలకు ఉపాధి క్పలించామని, 2014-15 సంవత్సరానికి 25,100 సంఘాలకు రూ.697.58 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటివరకు 3,617 సంఘాలకు రూ.95.19 కోట్లు, స్త్రీ నిధి పథకం ద్వారా 249 గ్రూపులకు రూ.125లక్షల రుణ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.169 లక్షల ఉపకార వేతనాలు మంజూరు చేశామని, పేద దళిత, గిరిజన ఆడపిల్లల పెళ్లికి ఒక్కొక్కరికీ రూ.50వేల ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ‘కల్యాణ లక్ష్మి’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. నవంబర్ నుంచి పింఛన్లు పెంపు జిల్లాలో మొత్తం 4.65 లక్షలమంది పింఛన్‌దారులకు సామాజిక భద్రత ఫించన్ల ద్వారా ప్రతినెల రూ.13.13 కోట్లు అందజేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వృద్ధులు, వితంతువులకు నెలకు వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్‌ను నవంబర్ నుంచి అందజేస్తామన్నారు. చదువులకు పెద్దపీట పేద విద్యార్థుల చదువుల భారాన్ని భరించేందుకు ఫాస్ట్ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 2013-14 పదోతరగతి ఫలితాల్లో 94శాతం ఉత్తీర్ణతతో మహబూబ్‌నగర్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి రూ.25 లక్షలు, కోచ్‌లకు క్రీడాకారులతో సమానంగా నగదు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎవరెస్టు విజేతలు గిరిజన, దళితబిడ్డలు పూర్ణ, ఆనంద్‌లకు చెరో రూ.25 లక్షల నగదు పారితోషికం అందించినట్లు వివరించారు. అలాగే జిల్లాలో 65 కేజీబీవీలకు ఈ ఏడాది 2014-15లో రూ.4,304లక్షలు కేటాయించినట్లు తెలిపారు. పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.6,518 లక్షలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.461 లక్షలు, తాగునీటి వసతి కల్పించేందుకు రూ.13 లక్షలు, మరమ్మతుల కోసం రూ.65 లక్షలు మంజూరైనట్లు వివరించారు. అమరుల కుటుంబాలను ఆదుకుంటాం.. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు భూమి, గృహం, వారి పిల్లలకు ఉచితవిద్య, వైద్యం అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లను అందజేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలను పెంచడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. గల్ఫ్ బాధితులకు కేరళ తరహా ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం ఇవ్వనుందని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించామన్నారు. నిరుద్యోగులకు చేయూత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన ఖాళీ పోస్టులను క్రమం తప్పకుండా నియామకాలు చేపడతామని, ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపుగా ప్రభుత్వం తరఫున శిక్షణ ఇచ్చి, సర్టిఫ్టికెట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, ఎస్పీ డీ నాగేంద్రకుమార్, జేసీ శర్మన్, ఏజేసీ రాజారాం, డీఆర్ఓ రాంకిషన్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఐటీ సేవల మార్కెట్ అంతంతే
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల మార్కెట్ ఆశించిన దానికంటే తక్కువ వృద్ధిని సాధిస్తోందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ పేర్కొంది. గత ఏడాది జూలై-డిసెంబర్ కాలానికి భారత ఐటీ సర్వీసుల మార్కెట్ 6.5 శాతం వృద్ధితో రూ.2.56 లక్షల కోట్లకు పెరిగిందని ఈ సంస్థ వెల్లడించింది. మౌలిక రంగంపై ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు తక్కువగా వ్యయం చేయడం, వివిధ వాణిజ్య సంస్థలు టెక్నాలజీ బడ్జెట్‌పై ఆచి తూచి వ్యవహరించడం దీనికి ప్రధాన కారణాలని వివరించింది. ఐడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం... గత ఏడాది రెండో అర్థ భాగంలో సపోర్ట్ సర్వీసులు 5.5 % వృద్ధి సాధించాయి. వివిధ కంపెనీలు వ్యయ నియంత్రణ పద్ధతులు పాటించడం వల్ల తక్కువ స్థాయి వృద్ధి నమోదైంది. సిస్టమ్ ఇంటిగ్రేషన్ 6.8 శాతం, ఐటీ కన్సల్టింగ్ సర్వీసులు 6.3 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. గత ఏడాది జనవరి-జూన్ కాలం వృద్ధితో పోల్చితే ఇది తక్కువే. అవుట్ సోర్సింగ్ సర్వీసుల మార్కెట్ వృద్ధి స్వల్పంగా తగ్గి 7.1 శాతానికే పరిమితమైంది. మేనేజ్డ్ సర్వీసుల మార్కెట్ స్వల్పంగా వృద్ధి సాధించింది. ఐటీ సర్వీసుల మార్కెట్లో 12 శాతం వాటాతో ఐబీఎం మొదటి స్థానంలో నిలిచింది. 7.4 శాతం మార్కెట్ వాటాతో విప్రో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది జూలై-డిసెంబర్ కాలంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, తయారీ, టెలికాం, ప్రభుత్వ రంగాలు... ఐటీ సర్వీసులపై పెద్ద ఎత్తున దృష్టి సారించాయి. -
ఆ ఉద్యోగిషేర్ల విలువ రూ.213 కోట్లు
బెంగళూరు: ఆయనో ఉద్యోగి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో 22 ఏళ్ల కిందట చేరారాయన. ప్రస్తుతం డెరైక్టర్లలో ఒకరు. ఆయన దగ్గర కంపెనీకి చెందిన 5,69,847 షేర్లున్నాయి. వాటి విలువ ప్రస్తుత లెక్కల ప్రకారం... దాదాపు రూ.213 కోట్లు. సోమవారం ఆయన తన షేర్లలో కొన్ని... అంటే జస్ట్ 20,000 షేర్లే విక్రయించారు. రూ.7.46 కోట్లు ఆయన చేతికొచ్చాయి. ఆయన పేరు శ్రీనాథ్ బట్ని. ఈ విషయాన్ని కంపెనీ సోమవారం ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. బట్ని ప్రస్తుతం కంపెనీకి డెలివరీ ఎక్స్‌లెన్స్ హెడ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన దగ్గర మిగిలిన షేర్లు... మొత్తం ఇన్ఫోసిస్‌లో 0.095%కి సమానం. 10 నెలల వ్యవధిలో ఇన్ఫీ షేరు రూ.2,200 నుంచి ప్రస్తుత ధర రూ.3,750కి చేరటంతో బట్ని కొన్ని షేర్లను సొమ్ము చేసుకున్నారు.