మైక్రోసాఫ్ట్‌తో గోడాడీ జట్టు | GoDaddy and Microsoft will help your business go online in 30 minutes at Rs 99 per month | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్‌తో గోడాడీ జట్టు

Published Thu, Feb 5 2015 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM

మైక్రోసాఫ్ట్‌తో గోడాడీ జట్టు

మైక్రోసాఫ్ట్‌తో గోడాడీ జట్టు

మధ్య తరహా పరిశ్రమలకు ఐటీ సేవలు లక్ష్యంగా...
హెదరాబాద్: చిన్న తరహా వ్యాపారాలకు సాంకేతిక సేవలందించే గోడాడీ సంస్థ  గోడాడీ గెట్ ఆన్‌లైన్ టుడే సేవలను అందుబాటులోకి తెస్తోంది. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహకారంతో ఈ సేవలను అందిస్తున్నామని గో డాడీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. గోడాడీ గెట్ ఆన్‌లైన్ టుడే ప్యాకేజీలో ఒక డొమైన్, వెబ్‌సైట్, ఆఫీస్ 365 ఈ మెయిల్ తదితర ఫీచర్లుంటాయని, ఇవన్నీ కలిపి నెలకు రూ.99 మాత్రమేనని పేర్కొంది.

ఐటీ వినియోగం వల్ల చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల ఆదాయం వృద్ధి చెందుతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) అధ్యయనంలో వెల్లడైందని వివరించింది. అందుకే చిన్న, మధ్య తరహా సంస్థలకు ఐటీ సేవలందిండచం ద్వారా ఆయా సంస్థల పురోభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడగలమని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement