ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు, నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా తోడుగా నిలుస్తోంది. ఇందులో భాగంగానే స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఎస్‌వీఈపీ) అనే కార్యక్రమం ప్రారంభించింది.
స్వయం సహాయక సంఘాల్లోని (ఎస్హెచ్జీలు) ఔత్సాహికులైన మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ అంత్యోదయ యోజన - నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఈ ఎస్‌వీఈపీ కార్యక్రమం ప్రారంభించింది. ఔత్సాహికులైన మహిళలు దేశవ్యాప్తంగా 3,13,464 చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకుని.. వాటి ద్వారా వారు ఎదగడమే కాకుండా, మరికొంతమందికి ఉపాధి చూపుతున్నారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకారం.. అత్యధిక ఎంటర్‌ప్రైజెస్‌తో కేరళ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 3,45,69 మంది వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత స్థానంలో ఉత్తరప్రదేశ్ (28,904 మంది), మధ్యప్రదేశ్ (28,318 మంది), ఆంధ్రప్రదేశ్ (27,651 మంది), ఝార్ఖండ్ (25,991 మంది), బీహార్ (24,892 మంది), ఛత్తీస్‌గఢ్ (21,016 మంది) రాష్ట్రాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment