
లండన్: ప్రతిష్టాత్మక లండన్ మేయర్ పదవికి భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు పోటీ పడనున్నారు. మే 2వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలో వీరిద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో, 2016 నుంచి లండన్ మేయర్‌గా కొనసాగుతున్న పాక్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. ఢిల్లీలో జన్మించిన తరుణ్ గులాటి(63) స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా లండన్‌లో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో భారత్ పర్యటన సమయంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అదేవిధంగా, ప్రాపర్టీ వ్యాపారి శ్యామ్ భాటియా(62) మేయర్ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తాజాగా ప్రకటించారు. గులాటి ఎన్నికల ట్యాగ్ లైన్ ‘విశ్వాసం–అభివృద్ధి’కాగా, భాటియా ‘అంబాసిడర్ ఆఫ్ హోప్’ట్యాగ్‌లైన్‌తో ముందుకు వెళ్తున్నారు.
చదవండి: ఎవరీ ఎర్రసముద్రపు హౌతీలు!
Comments
Please login to add a commentAdd a comment