భారత్‌లో అంతే.. | Only 5% Of Adult Indians Establish own Business: Survey | Sakshi
Sakshi News home page

భారత్‌లో అంతే..

Published Mon, Mar 19 2018 10:27 AM | Last Updated on Mon, Mar 19 2018 7:27 PM

Only 5% Of Adult Indians Establish own Business: Survey  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని వయోజనుల్లో కేవలం 5 శాతం మందే సొంత వ్యాపారాలకు మొగ్గుచూపుతున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే 5 శాతం ఎంట్రప్రెన్యూర్‌ రేట్‌ అతితక్కువ కావడం గమనార్హం. ఇక వ్యాపారాన్ని అర్థంతరంగా నిలిపివేయడం భారత్‌లో 26.4 శాతంగా నమోదైంది. దేశం‍లో వ్యాపార కార్యకలాపాలను అంచనా వేసేందుకు 18 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్కులను దాదాపు 3,400 మందిని పైగా ఈ సర్వే పలుకరించింది. దేశంలో 11శాతం మంది తమ తొలినాళ్లలోనే సొంత వ్యాపార కార్యకలాపాల్లో అడుగుపెడుతున్నారని ఎంట్రెప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఈడీఐ)కు చెందిన గ్లోబల్‌ ఎంట్రెప్రెన్యూర్‌షిప్‌ మానిటర్‌ (జెమ్‌) నివేదికలో పేర్కొంది. వీరిలో ఏడు శాతం మంది వ్యాపారవేత్తలు మూడున్నర ఏళ్ల కిందటి నుంచి వ్యాపారాలను నడిపిస్తున్నారు.

నాలుగు శాతం మంది యజమానులుగా లేదా సహ యజమానులుగా ఇటీవల వ్యాపారాలను చేపట్టారని నివేదిక తెలిపింది. ఇక సొంత వ్యాపారం చేపట్టి 42 నెలలుగా స్ధిరంగా కొనసాగిస్తున్న వారు కేవలం 5 శాతమేనని, మిగిలిన ప్రపంచంతో పోలిస్తే ఇది అత్యల్పమని నివేదిక పేర్కొంది. బ్రిక్స​ దేశాల్లో సొంతంగా వ్యాపారాలు చేపట్టే వారి సంఖ్య అత్యధికంగా 17 శాతం కాగా, దక్షణాప్రియా 3 శాతంతో అత్యల్ప స్ధానం దక్కించుకుంది. భారత్‌, రష్యా 5 శాతం ఎంటర్‌ప్రెప్యూర్ల జాబితాలో సంయుక్తంగా నిలిచాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement