గన్‌ఫౌండ్రి: వికలాంగులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహా అన్నారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్‌రూమ్ పథకం, జి.ఓ.నెంబర్.10లో వికలాంగులకు 3శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా వికలాంగులందరికీ అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలని, దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్నారు, 6కిలోల బియ్యం నిబంధనను ఎత్తివేయాలని కోరారు. అనంతరం జేసీ భారతి హోళికేరికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వెంకటేష్, చుక్కయ్య, నాగమణి, శ్రీరాములు, ఆర్.పాండు, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.