
సాక్షి, హైదరాబాద్: ‘ఆత్మవిశ్వాసం, చొరవ, సమర్థతతో వైకల్యాన్ని అధిగమించి సమాజానికి ఆదర్శంగా నిలిచిన మీ అందరికీ నా సెల్యూట్. మిమ్మల్ని ప్రశంసించడానికి నా దగ్గర మాటల్లేవు. మీ ప్రతిభతో మీరు అద్భుతాలు సాధిస్తున్నారు’అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దివ్యాంగులపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజ్‌భవన్ దర్బార్‌హాల్‌లో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ఆమె మాట్లాడారు. రాజ్‌భవన్‌లో దివ్యాంగుల దినోత్సవం నిర్వహించడం ఇదే తొలిసారని జాతీయ పురస్కార గ్రహీతలైన పలువురు దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేశారు. అంధత్వాన్ని జయించి గత 18 ఏళ్లుగా సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తున్న చంద్రాసుప్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment