Soundararajan
-
'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్..
సాక్షి, సిటీబ్యూరో: గచ్చిబౌలిలోని సెల్ బే స్టోర్ వేదికగా గురువారం ప్రముఖ యాంకర్, సినీతార వర్షిణి సౌందరాజన్ నూతన షావోమీ 14 సీవీ మోడల్‌ను ఆవిష్కరించనున్నారు.మధ్యాహ్నం 2:30 గంటలకు నిర్వహించే ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సినీతార వర్షిణి సౌందరాజన్తో పాటు పలువురు ఫ్యాషన్ ఔత్సాహికులు పాల్గొంటారని స్టోర్ నిర్వాహకులు పేర్కొన్నారు.ఇవి చదవండి: కాఫీ పరిమళం..! ఎంతో పరవశం..!! -
5 వేలతో ప్రారంభమై అందరిని ఆశ్చర్యపరిచిన వ్యాపారం, ఇది!
మనిషి అనుకుంటే కొండలను సైతం పిండి చేయగలడు, అయితే జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణతో కూడా కృషి, పట్టుదల ఎంతో అవసరం. నిరంతరం శ్రమిస్తూ ఈ రోజు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యాపారవేత్తల్లో తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన బి సుందరరాజన్, జిబి సుందరరాజన్ కూడా ఉన్నారు. కేవలం రూ. 5,000తో చిన్న వ్యాపారం ప్రారంభించి ఈ రోజు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ కోట్లలో టర్నోవర్ చేస్తున్నారు. ఇంతకీ వీరి విజయగాథ వెనుక ఉన్న కష్టాలు ఏంటి? సక్సెస్ సాధించడానికి వారు ఎంచుకున్న మార్గాలేమిటనేది ఈ కథనంలో చూసేద్దాం.. చికెన్ తినే అందరికి సుగుణ చికెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఈ సంస్థ ఎలా పుట్టుకొచ్చిందనే విషయం మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. తమిళనాడుకు చెందిన ఇద్దరు సోదరుల ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే చాలా పాపులర్ అయింది. (ఇదీ చదవండి: అమ్మ బాబోయ్! నిరుద్యోగులుగా మారిన భారతీయులు అంత మందా?) చిన్నతనంలో చదువులో ముందుకు సాగని అన్నదమ్ములిద్దరూ పాఠశాల విద్యతోనే బడికి బై.. బై చెప్పేసారు. అయితే తండ్రి ఆజ్ఞ ప్రకారం వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు, వారికున్న 20 ఎకరాల భూమిలో ఇతర వ్యవసాయదారులకు భిన్నంగా కూరగాయలు పండించడం ప్రారంభించారు. కొంతకాలం ఇలాగే ముందుకు సాగి వ్యవసాయానికి వీడ్కోలు పలికేసారు. వ్యవసాయం వదిలేసిన తరువాత బంధువుల వ్యవసాయ మోటార్ తయారీ కంపెనీలో పని చేయడం ప్రారభించారు. ఆ తరువాత అన్నదమ్ములిద్దరూ కలిసి ఏదైనా చేయాలని ఆలోచిస్తూ రూ. 5,000 పెట్టుబడితో సుగుణ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలుపెట్టారు. 1990లో మూడు ఫామ్‌లతో మొదలైన కోళ్ల పెంపకం ఇప్పుడు పదికంటే ఎక్కువ రాష్ట్రాలకు విస్తరించింది. (ఇదీ చదవండి: మహీంద్రా థార్ ప్రత్యర్థికి క్రేజు మామూలుగా లేదు! విడుదలకు ముందే..) సుగుణ ఫుడ్స్ ప్రారంభమైన మొదట్లో ఎంతోమంది ఇది సక్సెస్ కాదని ఎగతాళి చేశారు. కానీ ఈ రోజు ఈ సంస్థ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది. కంపెనీ ప్రారంభించిన ఏడు సంవత్సరాల్లోనే 7 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్ సుమారు రూ. 12 వేల కోట్ల కంటే ఎక్కువ సమాచారం. -
బతుకమ్మ వేడుకలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ఎమ్మెల్సీ కవిత
-
సౌందరరాజన్‌కు సీఎం కేసీఆర్ సన్మానం
సాక్షి, హైదరాబాద్ : ద్రోణాచార్య పురస్కారానికి ఎంపికైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భర్త డాక్టర్ సౌందరరాజన్‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. ఈమేరకు శుక్రవారం రాజ్‌భవన్‌ను సందర్శించిన సీఎం.. ఆయనకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. మూత్రపిండాల వైద్య విభాగం (నెఫ్రాలజీ)లో 35 ఏళ్ల పాటు బోధనలు, పరిశోధనలు, వైద్య సేవలు అందించినందుకుగాను ‘సీనియర్ ఢిల్లీ నెఫ్రాలజిస్టుల ఫోరం’ఆయనకు ఇటీవల ఈ పురస్కారాన్ని ప్రకటించిన విష యం తెలిసిందే. సౌందరరాజన్ సాధించిన విజయాలు యావత్ తెలంగాణ సమాజానికి గర్వకారణమని ఈ సందర్భంగా సీఎం ప్రశంసించారు. సౌందరరాజన్ తమిళనాడు వైద్య కాలేజీలో వైద్య అధ్యాపకుడిగా 15 ఏళ్లు, రామచంద్రా వైద్య కాలేజీలో 20 ఏళ్ల పాటు నెఫ్రాలజీ విభాగాధిపతిగా సేవలందించారు. తన సర్వీసులో 1,200 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. అలాగే ప్రపంచంలోనే తొలిసారిగా పాముకాటుతో మరణించిన వ్యక్తి నుంచి సేకరించిన మూత్రపిండాలను విజయవంతంగా మార్పిడి చేశారు. రజినీకాంత్, జానకి, ఎంజీఆర్, కరుణానిధి వంటి ప్రముఖులకు వైద్య సేవలందించారు. జాతీ య, అంతర్జాతీయ స్థాయిలో 200కిపైగా వైద్య పరిశోధన పత్రాలను ప్రచురించారు. -
సాంకేతిక సవాళ్లు అధిగమించాలి
సాక్షి, బొల్లారం: దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సాంకేతిక సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్ తిరుమలగిరిలోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంసీఈఎంఈ) ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన 96వ స్నాతకోత్సవ వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో పట్టభద్రులైన అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో మరిన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. దేశ భద్రతకు సంబంధించి కాలాన్ని బట్టి ఆధునిక టెక్నాలజీని వినియోగించేలా ఎంసీఈఎంఈ మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. అణు దాడులు, సైబర్ నేరాల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దేశ రక్షణ కోసం త్రివిధ దళాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్యాపింగ్ లేని సెల్‌ఫోన్ వ్యవస్థ రావాలని, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించేలా సాంకేతిక పరిజ్ఞానం ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. కంప్యూటర్లు హ్యాక్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం 100వ డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సులో (డీఈ–100) అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కెప్టెన్ నరేంద్ర గోరాకు డీజీఈఎంఈ ట్రోఫీని, 32వ టెక్నికల్ ఎంట్రీ స్కీం కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లెఫ్టెనెంట్ బదూర్‌సింగ్‌తో పాటు 64 మంది అధికారులకు గవర్నర్ తమిళిసై ట్రోఫీ లను అందజేశారు. -
మీ ఆత్మవిశ్వాసానికి సెల్యూట్
సాక్షి, హైదరాబాద్: ‘ఆత్మవిశ్వాసం, చొరవ, సమర్థతతో వైకల్యాన్ని అధిగమించి సమాజానికి ఆదర్శంగా నిలిచిన మీ అందరికీ నా సెల్యూట్. మిమ్మల్ని ప్రశంసించడానికి నా దగ్గర మాటల్లేవు. మీ ప్రతిభతో మీరు అద్భుతాలు సాధిస్తున్నారు’అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దివ్యాంగులపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజ్‌భవన్ దర్బార్‌హాల్‌లో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ఆమె మాట్లాడారు. రాజ్‌భవన్‌లో దివ్యాంగుల దినోత్సవం నిర్వహించడం ఇదే తొలిసారని జాతీయ పురస్కార గ్రహీతలైన పలువురు దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేశారు. అంధత్వాన్ని జయించి గత 18 ఏళ్లుగా సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తున్న చంద్రాసుప్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ తొలి ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలిసారిగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ అధ్వర్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. పల్లెల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూపొందించిన 30రోజుల ప్రణాళిక ఓ మంచి కార్యక్రమమని కొనియాడారు. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో హైదరాబాద్ రికార్డు సృష్టిస్తోందన్నారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో గరిష్ట స్థాయిలో కృష్ణాజలాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
ప్రజల మద్దతుతోనే అధికారంలోకి వస్తాం
తమిళిసై ధీమా తిరువళ్లూరు: తమిళనాడులో ప్రజల మద్దతుతోనే అధికారంలో వస్తామని, అధికారం కోసం అడ్డదారులు తొక్కబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ధీమా వ్యక్తం చేశారు. తిరువళ్లూరు జిల్లా బీజేపీ యు వజన విభాగం అధ్యక్షుడు ఆర్య శ్రీని వాసన్ గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళిసై రాష్ట్రంలో బీజేపీ త్వరలోనే అధికారంలోకి వస్తుం దని, రాజకీయ మార్పు బీజేపీతోనే సా« ద్యమని ఆమె అన్నారు. బీజేపీ అధి కారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కుతోందని వస్తున్న ఆరోపణలపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి ద్రవిడ పార్టీలపై విసుగుతో తమ పార్టీలో చేరడానికి చాలా మంది వస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో పాగా వేయడమే లక్ష్యంగా పది వేల మంది కార్యకర్తలతో సెప్టెంబర్ ఐదు నుంచి 25 వరకు ప్రతి బూత్ పరిధి లోనూ నూతన సభ్యత్వ నమోదు, పార్టీ జెండాను ఎగురవేయడం బీజేపీ ప్రభు త్వ పథ«కాలను ప్రజలకు వివరించడం లాంటి కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ప్రస్తుతం ఎన్నికలు అవసరం లేదని, సంక్షేమం అందించే సుస్థిరమైన పార్టీ మాత్రమే అవసరమని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని తొలగించే సామర్థ్యం గవర్నర్‌కు ఉంద ని, అలాగే చట్టసభల వ్యవహారాలను స్పీకర్ చూసుకుంటారని, ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్దాంతం చేయడం మానుకోవాలని హితవు పలికారు. చట్టసభల్లో నియమ నిబంభనలను అతిక్రమించే వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉందన్న ఆమె తప్పు చేసిన వారు తప్పించుకోలేరని అన్నారు. తమిళిసై వెంట పార్టీ నేతలు బాలాజీ, కరుణాకరన్, రాజ్‌కుమార్, రఘురామన్, ఆర్య శ్రీనివాసన్, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
ఒంటరి పోరుకు సై
* తమిళిసై స్పష్టీకరణ * జవదేకర్ అదే వ్యాఖ్య సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఎన్నికల్ని ఒంటరిగానే ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. 234 స్థానల్లోనూ పోటీకి తాము రెడీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ స్పష్టం చేశారు. పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ జవదేకర్ వ్యాఖ్యలూ అదే తరహాలో ఉండడం గమనార్హం. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలన్న కమలనాథుల ఆశలు అడియాశలు అవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు కలిసి రాక పోవడంతో ఒంటరిగా మిగిలే పరిస్థితి చోటు చేసుకుంది. గతంలో వలే ఒంటరిగానే ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కమలనాథులు సైతం సిద్ధం అవుతూ, అందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. డీఎండీకే తమతో కలిసి వస్తుందన్న ఆశాభావం ఎక్కడో మిగిలి ఉన్నా, చివరకు అది కూడా గల్లంతైనట్టే అన్న భావన బయల్దేరి ఉన్నది. ఇందుకు తగ్గట్టుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ తిరునల్వేలిలో సోమవారం స్పందించారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనే బలం బీజేపీకి రాష్ట్రంలో ఉందని వ్యాఖ్యానించారు. 234 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టి సత్తాను చాటుకోగలమన్నారు. తమకు యాభై లక్షల మంది సభ్యులు ఉన్నారని, ప్రజాదరణ, ప్రధాని మోదీ ప్రభావంతో కమలం వైపు చూసే ఓటర్లు కోట్లాది మంది ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్రంలో ఏళ్ల తరబడి సాగుతూ వస్తున్న పాలనలకు స్వస్తి పలికి, మార్పు అన్నది తీసుకురావాలన్న కాంక్ష బీజేపీకి ఉందన్నారు. ఆ మార్పు అన్నది తమ ద్వారానే సాధ్యం అని, అందుకు తగ్గ ప్రయత్నాలు చేశామని, చేస్తున్నామని వ్యాఖ్యానించడం గమనార్హం. ఢిల్లీలో డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత తిష్ట వేసి బీజేపీ పెద్దలతో పొత్తు భేరాల్లో ఉన్నట్టుగా వచ్చిన వార్తల్ని రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్ ఖండించారు. డీఎండీకేతో పొత్తు ప్రయత్నాలేవి జరగ లేదని, ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న తనకు తెలియకుండా నేరుగా ఢిల్లీలో పార్టీ పెద్దల్ని కలిసేందుకు అవకాశాలు లేవన్నారు. ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామంటూ పొత్తు ప్రయత్నాలు బెడిసి కొడుతుండడంపై సంధించిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వడం గమనార్హం.