
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలిసారిగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ అధ్వర్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. పల్లెల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూపొందించిన 30రోజుల ప్రణాళిక ఓ మంచి కార్యక్రమమని కొనియాడారు. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో హైదరాబాద్ రికార్డు సృష్టిస్తోందన్నారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో గరిష్ట స్థాయిలో కృష్ణాజలాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.