మనిషి అనుకుంటే కొండలను సైతం పిండి చేయగలడు, అయితే జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణతో కూడా కృషి, పట్టుదల ఎంతో అవసరం. నిరంతరం శ్రమిస్తూ ఈ రోజు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యాపారవేత్తల్లో తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన బి సుందరరాజన్, జిబి సుందరరాజన్ కూడా ఉన్నారు.
కేవలం రూ. 5,000తో చిన్న వ్యాపారం ప్రారంభించి ఈ రోజు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ కోట్లలో టర్నోవర్ చేస్తున్నారు. ఇంతకీ వీరి విజయగాథ వెనుక ఉన్న కష్టాలు ఏంటి? సక్సెస్ సాధించడానికి వారు ఎంచుకున్న మార్గాలేమిటనేది ఈ కథనంలో చూసేద్దాం..
చికెన్ తినే అందరికి సుగుణ చికెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఈ సంస్థ ఎలా పుట్టుకొచ్చిందనే విషయం మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. తమిళనాడుకు చెందిన ఇద్దరు సోదరుల ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే చాలా పాపులర్ అయింది.
(ఇదీ చదవండి: అమ్మ బాబోయ్! నిరుద్యోగులుగా మారిన భారతీయులు అంత మందా?)
చిన్నతనంలో చదువులో ముందుకు సాగని అన్నదమ్ములిద్దరూ పాఠశాల విద్యతోనే బడికి బై.. బై చెప్పేసారు. అయితే తండ్రి ఆజ్ఞ ప్రకారం వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు, వారికున్న 20 ఎకరాల భూమిలో ఇతర వ్యవసాయదారులకు భిన్నంగా కూరగాయలు పండించడం ప్రారంభించారు. కొంతకాలం ఇలాగే ముందుకు సాగి వ్యవసాయానికి వీడ్కోలు పలికేసారు.
వ్యవసాయం వదిలేసిన తరువాత బంధువుల వ్యవసాయ మోటార్ తయారీ కంపెనీలో పని చేయడం ప్రారభించారు. ఆ తరువాత అన్నదమ్ములిద్దరూ కలిసి ఏదైనా చేయాలని ఆలోచిస్తూ రూ. 5,000 పెట్టుబడితో సుగుణ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలుపెట్టారు. 1990లో మూడు ఫామ్‌లతో మొదలైన కోళ్ల పెంపకం ఇప్పుడు పదికంటే ఎక్కువ రాష్ట్రాలకు విస్తరించింది.
(ఇదీ చదవండి: మహీంద్రా థార్ ప్రత్యర్థికి క్రేజు మామూలుగా లేదు! విడుదలకు ముందే..)
సుగుణ ఫుడ్స్ ప్రారంభమైన మొదట్లో ఎంతోమంది ఇది సక్సెస్ కాదని ఎగతాళి చేశారు. కానీ ఈ రోజు ఈ సంస్థ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది. కంపెనీ ప్రారంభించిన ఏడు సంవత్సరాల్లోనే 7 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్ సుమారు రూ. 12 వేల కోట్ల కంటే ఎక్కువ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment