ప్రజల మద్దతుతోనే అధికారంలోకి వస్తాం | bjp tamili psy Soundararajan confident on her victory | Sakshi
Sakshi News home page

ప్రజల మద్దతుతోనే అధికారంలోకి వస్తాం

Published Mon, Aug 28 2017 11:44 AM | Last Updated on Sun, Sep 17 2017 6:03 PM

ప్రజల మద్దతుతోనే అధికారంలోకి వస్తాం

ప్రజల మద్దతుతోనే అధికారంలోకి వస్తాం

తమిళిసై ధీమా
తిరువళ్లూరు:  తమిళనాడులో ప్రజల మద్దతుతోనే అధికారంలో వస్తామని, అధికారం కోసం అడ్డదారులు తొక్కబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ ధీమా వ్యక్తం చేశారు. తిరువళ్లూరు జిల్లా బీజేపీ యు వజన విభాగం అధ్యక్షుడు ఆర్య శ్రీని వాసన్‌ గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళిసై రాష్ట్రంలో బీజేపీ త్వరలోనే అధికారంలోకి వస్తుం దని, రాజకీయ మార్పు బీజేపీతోనే సా« ద్యమని ఆమె అన్నారు. బీజేపీ అధి కారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కుతోందని వస్తున్న ఆరోపణలపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి ద్రవిడ పార్టీలపై విసుగుతో తమ పార్టీలో చేరడానికి చాలా మంది వస్తున్నారని వివరించారు.

రాష్ట్రంలో పాగా వేయడమే లక్ష్యంగా పది వేల మంది కార్యకర్తలతో సెప్టెంబర్‌ ఐదు నుంచి 25 వరకు ప్రతి బూత్‌ పరిధి లోనూ నూతన సభ్యత్వ నమోదు, పార్టీ జెండాను ఎగురవేయడం బీజేపీ ప్రభు త్వ పథ«కాలను ప్రజలకు వివరించడం లాంటి కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ప్రస్తుతం ఎన్నికలు అవసరం లేదని, సంక్షేమం అందించే సుస్థిరమైన పార్టీ మాత్రమే అవసరమని గుర్తు చేశారు.

రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని తొలగించే సామర్థ్యం గవర్నర్‌కు ఉంద ని, అలాగే చట్టసభల వ్యవహారాలను స్పీకర్‌ చూసుకుంటారని, ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్దాంతం చేయడం మానుకోవాలని హితవు పలికారు. చట్టసభల్లో నియమ నిబంభనలను అతిక్రమించే వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు  ఉందన్న ఆమె తప్పు చేసిన వారు తప్పించుకోలేరని అన్నారు. తమిళిసై వెంట పార్టీ నేతలు బాలాజీ, కరుణాకరన్, రాజ్‌కుమార్, రఘురామన్, ఆర్య శ్రీనివాసన్,  పార్టీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement