రాజమండ్రి/ కొవ్వూరు : అమావాస్య కావడంతో 5 లక్షల మందికి పైగా పుష్కర స్నానాలకు వచ్చినట్లు అధికారులు అంచనావేశారు. అయినప్పటికీ, యాత్రికులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సులు సరిపోలేదు. 50 అదపపు బస్సులు ఏర్పాటుచేసినా భక్తులకు సరిపోకపోవడంతో కాలినడక తప్పలేదు. గోదావరి పుష్కరాల రెండో రోజు అమావస్య కావడంతో భక్తుల తాకిడి కొంత మేరకు తగ్గినట్లు కనిపిస్తోంది.
ఎండలు మండుతున్నప్పటికీ గంటల పాటు ఘాట్ వద్ద ఉండి పిండ ప్రదానాలు నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన 300 ఉచిత బస్సులు తొలిరోజు ఏ ఒక్కటీ అందుబాటులో లేకపోగా, రెండోరోజు మాత్రం బస్సుల కొరతతో భక్తులు పుష్కర ఘాట్లకు వెళ్లడానికి నానా అవస్థలు పడ్డట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో రెండోరోజు భక్తుల తాకిడి కొంత మేరకు తగ్గింది.
బస్సులు లేక భక్తుల పాట్లు..
Published Wed, Jul 15 2015 3:50 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement