
వంద దాటినోళ్లూ ఊయలలో బిడ్డలే..
పుష్కరఘాట్ (రాజమండ్రి): నిండు నూరేళ్లు దాటిన పండు ముదుసలుల నుంచి పొత్తిళ్లలోని పాపాయిల వరకూ అందరినీ తన ఒడిలో బిడ్డల్లా చల్లగా లాలిస్తున్న ఆ గోదారమ్మ.. తన గుండెల్లో నిండుతున్న ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తుంది? బహుశా.. అలల మిలమిలలే ఆ తల్లి చెక్కిళ్ల సంతోషపు తళుకులేమో! మంగళవారం పుష్కరఘాట్లో 9వ సారి గోదావరి పుష్కరస్నానం చేసిన అంబాజీపేట మండలం వ్యాఘ్రేశ్వరానికి చెందిన 103 ఏళ్ల నరిమెళ్ల కోటేశ్వరరావును, 8వసారి పుష్కరస్నానం చేసిన శ్రీకాకుళం జిల్లా మందగోడికి చెందిన బత్తుల లక్ష్మివేణిని చిత్రాల్లో చూడొచ్చు.