free buses
-
మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. జూన్ నుంచి వారికి ఉచిత బస్సు ప్రయాణం
బెంగళూరు: కర్ణాటక మహిళలకు ఊరట లభించింది. కొత్తగా కొలువు తీరిన సిద్ధరామయ్య ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించింది. జూన్ 1 నుంచి మహిళలందరూ టికెట్టు కొనుగోలు చేయకుండానే బస్సుల్లో ప్రయాణించవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆర్టీసీ ఎండీలతో సమావేశమైన అనంతరం మీడియా సమక్షంలో మంగళవారం ప్రకటించారు. నో అబ్జెక్షన్స్.. రాష్ట్రంలోని మహిళలందరూ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.. ఇందుకు ఎలాంటి షరతులు లేవని మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో మేనిఫెస్టోలోనూ తాము ఎలాంటి షరతులు లేకుండానే ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. కేబినెట్ సమావేశం బుధవారం నిర్వహించి చర్చిస్తామని తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన ఖర్చులను సీఎంకు సమర్పించనున్నట్లు చెప్పారు. సీఎం సిద్ధరామయ్య కూడా రవాణా శాఖ ప్రధాన కార్యదర్శితో ఇప్పటికే ఈ అంశంపై చర్చించినట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో భాగంగా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకా ప్రజలు గణవిజయాన్ని అందించారు. ఈ మేరకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి:పతకాలను గంగలో కలిపేస్తామంటూ హెచ్చరిక.. హరిద్వార్‌కు చేరుకున్న రెజ్లర్లు -
మెట్రో ప్రయాణీకులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. నగర వాసుల మెట్రో ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ ఉచిత షటిల్ బస్సు సర్వీసులను ఎల్అండ్టీ మెట్రో సంస్థ ప్రారంభించనుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ కనెక్టివిటీలో భాగంగా స్టేషన్ల నుండి ఆఫీసులవరకు కనెక్టివిటీ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా దుర్గం చెరువు మెట్రో స్టేషన్ నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలిలోని వివిధ ఐటీ కంపెనీలకు షటిల్ బస్సు సర్వీసులు అందుబాటులో తీసుకొచ్చారు. -
ఉచిత బస్సులేమయ్యాయి..?
అధికారులపై మంత్రి మహేందర్‌రెడ్డి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: పుష్కర ఘాట్లకు దూరంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినందున అక్కడ వాహనాలు నిలిపి, నది వద్దకు వెళ్లేందుకు భక్తులకు ఉచితంగా బస్సులను ఏర్పాటు చేయటంలో ఆర్టీసీ విఫలమైన నేపథ్యంలో అధికారులపై రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సులు లేవని భక్తుల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లోని రంగాపూర్ పుష్కర ఘాట్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. పుష్కర స్నానం అనంతరం ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు. పార్కింగ్ స్థలాల నుంచి నది వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసి భక్తులను తరలించాల్సిందేనని ఆదేశించారు. పుష్కరాల్లో 20 ల క్షల మంది భక్తులను ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 4 లక్షల మందిని తరలించినట్లు వెల్లడించారు. -
'పుష్కరాలకు 31,400 మంది పోలీసులతో భద్రత'
విజయవాడ: కృష్ణా పుష్కరాలకు 31, 400 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. ఇందులో భాగంగా 30 మంది ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిపారు. విజయవాడలో రూ. 20 కోట్లతో కమాండ్ కంట్రోల్.. 1300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. చెన్నై- కోల్‌కతా- హైదరాబాద్ జాతీయ రహదార్లపై ట్రాఫిక్ పర్యవేక్షణ బాధ్యతలు ఐజీలు రామకృష్ణ, సంజయ్ జైన్‌కు అప్పగించినట్టు తెలిపారు. విజయవాడలో భక్తుల కోసం 65 చోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. విజయవాడ, గుంటూరులో 740 ఉచిత బస్సులును ఏర్పాటుచేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. -
సొంతూళ్లకు వెళ్లేందుకు ఉచిత బస్సులు
చెన్నై: భారీ వర్షాలతో అల్లాడుతున్న చెన్నై నగరంలో తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసింది. చెన్నై నుంచి సొంత ఊర్లకు వెళ్లేవారి కోసం ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించింది. అదేవిధంగా నగరంలో నాలుగురోజులపాటు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. మరోవైపు ఐటీ కంపెనీలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఐటీ దిగ్గజం విప్రో చెన్నై నుంచి ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వంద బస్సులను రంగంలోకి దింపింది. కోయంబెడు బస్టాప్ నుంచి ఉదయం 7 నుంచి 8.30 గంటల మధ్య వంద బస్సుల్లో ఉచితంగా ప్రజలను తరలించేందుకు విప్రో ఏర్పాట్లు చేసింది. మరోవైపు చెన్న విమానాశ్రయంలో పాక్షిక విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి టెక్నికల్ విమానాలు వెళ్లేందుకు వీలు కల్పించారు. పూర్తిస్థాయిలో వాణిజ్య విమానాలు నడిపేందుకు మరో రెండురోజుల సమయం పడుతుందని కేంద్రమంత్రి మహేశ్ శర్మ తెలిపారు. -
ఇక్కడ ఖాళీ.. అక్కడ రద్దీ
సాక్షి, రాజమండ్రి : గోదావరి పుష్కరాలకు దేశం నలుమూల నుంచీ రాజమండ్రి తరలివస్తున్న యాత్రికులు రాత్రి బస చేయడంలో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నగర శివార్లలో ఏర్పాటు చేసిన పుష్కర నగర్ల నుంచి ఘాట్లకు దూరం ఎక్కువగా ఉంటోంది. అంత దూరం నడిచి వెళ్లడానికి వారు ఇక్కట్లు పడుతున్నారు. దీంతో దూరప్రాంతంలోని పుష్కర నగర్లు ఖాళీగా ఉంటున్నాయి. కానీ స్నానఘట్టాలకు దగ్గరగా ఉన్న రైల్వే వెయిటింగ్, ప్రైవేటు వసతి ప్రదేశాలు మాత్రం కిక్కిరిసిపోతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్లోనూ అవి ముగిసిన తర్వాత అక్కడే కుర్చీల్లో భక్తులు సేద తీరుతున్నారు. అయితే ఇక్కడ వారికి ఎలాంటి సదుపాయాలూ లభించడం లేదు. కనీసం తాగునీరు కూడా దొరకడం లేదు. ఆర్ట్స్ కళాశాల, లూథర్ గిరి, రైల్వే గూడ్స్ షెడ్, సాంస్కృతిక కళాశాల మైదానాల్లో ప్రధాన పుష్కర నగర్లు ఉన్నాయి. ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పుకొచ్చారు. అక్కడినుంచి పుష్కర ఘాట్లకు వెళ్లేందుకు ఆర్టీసీ ఉచిత బస్సులను అందుబాటులో ఉంచారు. కానీ పుష్కర నగర్‌లకు జనం వెళ్లకపోవడంతో ఉచిత బస్సులు యాత్రికులకు సగమే ఉపయోగపడుతున్నాయి. దీనికి పూర్తి భిన్న పరిస్థితులు రైల్వే స్టేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాల్లో కనిపిస్తోంది. గోదావరి రైల్వే స్టేషన్ పుష్కర్ ఘాట్‌కు అతి సమీపంలో ఉండటంతో రైలు దిగిన యాత్రికులు ఇక్కడే ఉంటున్నారు. వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేసినప్పటికీ వాటిలో ఫ్యాన్లు, పడుకోవడానికి కార్పెట్లవంటివి లేవు. దీంతో భక్తులు మట్టిలోనే పడుకుంటున్నారు. కొందరు రైల్వే బ్రిడ్జి కింద పిండప్రదానాల కోసం వేసిన టెంట్లలోనే సేద తీరుతున్నారు. పక్కనే వందలాది టాయిలెట్లు ఉండటంతో దుర్గంధంతో పాటు దోమల బెడదతో నరకం చవి చూస్తున్నారు. సుబ్రహ్మణ్య మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత యాత్రికులు అక్కడే కుర్చీల్లో పడుకుంటున్నారు. వారిని పట్టించుకున్న నాథుడే లేడు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన పుష్కర నగర్లను కనీస ప్రణాళిక లేకుండా దూరప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో ఆ నిధులు నిరుపయోగమైనట్టు అయింది. కనీసం ఘాట్ల దగ్గర్లో సేద తీరే భక్తుల బాగోగులు పట్టించుకుంటే కొంతలో కొంత ఊరట లభిస్తుంది. -
బస్సులు లేక భక్తుల పాట్లు..
రాజమండ్రి/ కొవ్వూరు : అమావాస్య కావడంతో 5 లక్షల మందికి పైగా పుష్కర స్నానాలకు వచ్చినట్లు అధికారులు అంచనావేశారు. అయినప్పటికీ, యాత్రికులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సులు సరిపోలేదు. 50 అదపపు బస్సులు ఏర్పాటుచేసినా భక్తులకు సరిపోకపోవడంతో కాలినడక తప్పలేదు. గోదావరి పుష్కరాల రెండో రోజు అమావస్య కావడంతో భక్తుల తాకిడి కొంత మేరకు తగ్గినట్లు కనిపిస్తోంది. ఎండలు మండుతున్నప్పటికీ గంటల పాటు ఘాట్ వద్ద ఉండి పిండ ప్రదానాలు నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన 300 ఉచిత బస్సులు తొలిరోజు ఏ ఒక్కటీ అందుబాటులో లేకపోగా, రెండోరోజు మాత్రం బస్సుల కొరతతో భక్తులు పుష్కర ఘాట్లకు వెళ్లడానికి నానా అవస్థలు పడ్డట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో రెండోరోజు భక్తుల తాకిడి కొంత మేరకు తగ్గింది. -
అందుబాటులో లేని 300 ఉచిత బస్సులు
రాజమండ్రి సిటీ: పుష్కరాల కోసం వచ్చే భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ 300 సిటీ బస్సులను సిద్ధం చేసింది. కానీ, రాజమండ్రి పట్టణంలో పుష్కరాల తొలిరోజు మంగళవారం ఒక్కటంటే ఒక్క బస్సు కూడా భక్తులకు అందుబాటులో లేకుండా పోయింది. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పట్టణంలో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో బస్సులను నడిపే పరిస్థితి లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు వాటిని నిలిపివేశారు. బస్సులు లేకపోవడంతో భక్తులు కొంత దూరం ఆటోలలో, మిగతా దూరం కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు ఎండ వేడిమికి తట్టుకోలేక భక్తులు దాహంతో అలమటించిపోయారు. పుష్కర ఘాట్లలో మినహా పట్టణంలో మరెక్కడా మంచినీటి సరఫరా జరగ్గపోవడంతో నీటి కోసం పట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
ఆటో వాలాల ఒత్తిడితో ఆగిన ఉచిత బస్సు
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: భక్తుల కోసం శ్రీకాళహస్తి దేవస్థానం ఏర్పాటు చేసిన ఉచిత బస్సును ఆటోవాలాల ఒతిళ్లకు తలొగ్గి నిలిపేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు ఇబ్బందులు పడుతున్నా ఆలయాధికారులు స్పందించడంలేదు. భక్తుల నుంచి ఆటోవాలాలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. అయితే ఆలయ ఇంజినీరింగ్ విభాగం ఈఈ, దేవస్థానం బస్సు నిర్వాహకులు రామిరెడ్డి వాదన మరోలా ఉంది. ఆటోవాలాల వత్తిళ్లకు తలొగ్గలేదని బస్సు 10 రోజుల క్రితం మరమ్మతుకు గురైందని మరో నాలుగు రోజుల్లో బాగుచేస్తామని ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. బస్సు, రైలులో వచ్చే భక్తుల సౌకర్యార్థం ఓమిని బస్సు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా స్టేషన్ నుంచి వచ్చే భక్తులను మాత్రమే బస్సులో దేవస్థానానికి తరలిస్తున్నారు. అయి తే ఇటీవల వత్తిళ్లకు తలొగ్గి బస్సును ఆలస్యంగా స్టేషన్ కు తీసుకెళ్లడం లేదా పూర్తిగా ఆలయం వద్దనే బస్సును ఉంచుతున్నట్లు విమర్శలున్నాయి. సమైక్యాంధ్ర ఉద్య మం నేపథ్యంలో బస్సులు నడవకపోవడంతో భక్తులు రైళ్లద్వారా వస్తున్నారు. స్టేషన్ నుంచి ఆలయం వద్దకు సాధారణంగా ఆటోలో రూ.30 నుంచి రూ.50 వరకు వసూ లు చేస్తుంటారు. అయితే ఉద్యమం నేపథ్యంలో రూ.60 నుంచి రూ.100 వరకు వసూళ్లు చేస్తున్నారు. బస్సు నిర్వాహకులు వత్తిళ్లకు తలొగ్గి బస్సు మరమ్మతుకు గురైందని మూల పడేశారు. భక్తులకు ఆటోలే దిక్కయ్యాయి. భక్తు ల నుంచి ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. ఆల యాధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.