రాజమండ్రి : గోదావరి పుష్కరాల చివరి రోజైన శనివారం నాడు ఉభయగోదావరి జిల్లాల పుష్కర ఘాట్లు భక్తుల తాకిడితో పోటెత్తాయి. పన్నెండవ రోజు పుష్కరాలు ముగిసిపోతాయి కనుక కేవలం ఈ ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్లో 45.5 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఏపీలో మొత్తంగా 4.5 కోట్లకు పైగా భక్తులు పుష్కరాలకు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు సహా ఇతర ఘాట్లలో కూడా బాగా రద్దీ కనిపించింది. ఈ పుష్కరాలకు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా అధిక సంఖ్యలో తరలిరావడం విశేషం.