ఏ పార్టీ ఆహ్వానించినా రాజమండ్రి నుంచి పోటీ: సహస్ర చిత్ర నటుడు అలీ | I will contest from Rajahmandry: Ali | Sakshi
Sakshi News home page

ఏ పార్టీ ఆహ్వానించినా రాజమండ్రి నుంచి పోటీ: అలీ

Published Mon, Mar 31 2014 9:03 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

సహస్ర చిత్ర హాస్య నటుడు అలీ - Sakshi

సహస్ర చిత్ర హాస్య నటుడు అలీ

చెన్నై: ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంకా  నిర్ణయం తీసుకోలేదని సహస్ర చిత్ర హాస్య నటుడు అలీ చెప్పారు. 1000 చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకళాసుధ అసోసియేషన్  ఆదివారం అలీని సాఫల్య అవార్డుతో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఇక్కడకు వచ్చిన అలీ విలేకరులతో మాట్లాడుతూ ఏ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చినా రాజమండ్రి నుంచి పోటీచేస్తానని చెప్పారు.  

అలీ రాజకీయాలలోకి రావడానికి గత కొంతకాలంగా ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఇంకా స్పష్టంలేదు.  ఏ పార్టీ నుంచైనా సొంత ప్రాంతమైన రాజమండ్రి నుంచే పోటీ చేయాలన్న కోరిక అలీకి బలంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement