సాక్షి, రాజమండ్రి : ఓ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చేరిన ఓ గర్భిణీ మహిళకు హెచ్‌ఐవీ లేకున్నా ఉందంటూ వైద్యులు రిపోర్టు ఇచ్చారు. ఊహించని రిపోర్టు రావడంతో బాధిత కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఐతే వైద్యుల రిపోర్టుపై నమ్మకం లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లో మరోసారి పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో మహిళకు హెచ్‌ఐవీ లేనట్లు తేలింది. దీంతో ఊపిరి పీల్చుకున్న మహిళ.. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ బాధిత కుటుంబం ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగింది.
ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఇలా ఎంతమందికి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారో అంటూ ఆసుపత్రి వర్గాలపై మండిపడుతున్నారు. కాగా ఘటనతో రోగులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే తీవ్ర భయాందోళనకు గురైతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment