శివయ్యా.. నీకెన్నాళ్లీ కోటింగ్
కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : తూర్పుగోదావరి జిల్లా కోటిలింగాల ఘాట్ లో ఏర్పాటు చేసిన భారీ ఈశ్వరుడు విగ్రహానికి ఇంకా మోక్షం లభించలేదు. పుష్కరాల నాలుగో రోజైన శుక్రవారం కూడా శివుని విగ్రహానికి మెరుగులు దిద్దుతూనే ఉన్నారు. ఇంకెప్పటికీ ఈ పనులు పూర్తిచేస్తారో వేచిచూడాల్సిందే మరి..
అలలపై ‘మెయిల్’ తెప్ప..
పుష్కర కల్చరల్ (కొవ్వూరు) : భారతీయ సంస్కృతిలో మరణానంతరం వారి ఆత్మీయులు నిర్వర్తించే విధులెన్నో! వాటిలో ఒకటే మైలతెప్ప. కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఏడాదిలోపు వారి ఆత్మశాంతి కోసం నదిలో మైలతెప్ప వదల డం రివాజు. పుష్కరాల సందర్భంగా.. వెదురు కర్రముక్కలతో తయారుచేసిన తెప్పలాంటి దానిపై దీపాలు ఉంచి పసుపు, కుంకుమలు వేసి నదిలో వదిలే వారి సంఖ్య ఎక్కువే. ఆ తెప్ప అలలపై ఊగుతూ అలా పయనించిపోతుంటే.. పైలోకంలో ఉన్న తమ వారికి గోదారి ద్వారా ‘మెయిల్’ (సందేశం) పంపుతున్నట్టుంటుంది.