
అమ్మాయే అమ్మైంది...
కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : అమ్మాయే తన అమ్మకు అమ్మగా మారిన ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దర్శనమిచ్చింది. తల్లీబిడ్డల పుష్కర స్నానం పూర్తయింది. తల్లి బిడ్డకు తలదువ్వి జడ వేసింది. ఆ తల్లి తన జడ తానే అల్లుకోగలదు. కానీ, జనసమ్మర్దంలో అందుకు వీలు కాకపోవడంతో అమ్మాయే అమ్మ డ్యూటీ చేస్తూ తల్లికి ఇలా జడ అల్లింది.