కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే అంగిటపల్లి చిన ఎరుకల రెడ్డి (ఏసీవై రెడ్డి) అనారోగ్యంతో మృతి చెందారు.
రాజమండ్రి : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే అంగిటపల్లి చిన ఎరుకల రెడ్డి (ఏసీవై రెడ్డి) అనారోగ్యంతో మృతి చెందారు. ఏసీవై రెడ్డి వయస్సు 80 సంవత్సరాలు. కిడ్నీవ్యాధితో 15 రోజుల క్రితం ఓ ప్రై వేట్ ఆస్పత్రిలో చేరిన ఆయనను రెండు రోజుల క్రితం ఇంటికి తరలించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు.
ఏసీవై రెడ్డి రాష్ట్ర డ్రెయినేజీ బోర్డు చైర్మన్‌గా, రాజమండ్రి మునిసిపల్ కౌన్సిల్ చైర్మన్‌గా, రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా పనిచేశారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా కూడా సేవలు అందించారు. 1989లో కాంగ్రెస్ టికెట్‌పై రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందారు.