రాజమండ్రి (తూర్పుగోదావరి) : ప్రధాన పుష్కర ఘాట్లలో ఉచిత వైఫై సేవలందిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. నిజమేననుకుని పుష్కర భక్తులు సంబరపడిపోయారు. కానీ ఎక్కడా ఈ సేవలు అందుబాటులోకి రాలేదు సరికదా ఫోన్‌లో మాట్లాడితే తరచూ కట్ అయిపోతోంది. అమలు చేయలేనప్పుడు ఇలాంటి ప్రకటనలెందుకని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇది తమను తప్పుదోవ పట్టించడమేనంటున్నారు.