సాక్షి,న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణను 65 సంవత్సరాలకు పెంచింది. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన 10 ఎకరాల భూమిని బదలాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వామపక్ష ప్రభావిత జిల్లాలకు రూ 3వేల కోట్ల సాయం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈశాన్య రాష్ట్రాల పోలీస్ ఆధునీకరణకు రూ 100 కోట్ల కేటాయింపుకు పచ్చజెండా ఊపింది. ఇక దేశవ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు రూ 25వేల60 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.