గోదావరిలో మార్మోగిన సమైక్య నినాదాలు
రాజమండ్రి: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లాలో సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న డిమాండ్‌తో వివిధ రకాలు ఆందోళనలు, నిరసన, ధర్నాలతో జిల్లా దద్దరిల్లుతోంది. సమైక్యాంధ్ర వర్థిలాలి అంటూ సమైక్యవాదులు రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో వినూత్న నిరసన చేపట్టారు. నడుంలోతు నీళ్లలోకి దిగి సమైక్య నినాదాలు చేశారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా బొమ్మూరు జాతీయరహదారిపై మాజీ సర్పంచ్ మత్యే్సటి ప్రసాద్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి విద్యార్ధులకు బూట్లు పాలిష్ చేస్తూ నిరసన తెలిపారు. మోరంపూడి జాతీయరహదారిపై యుటిఎఫ్ రూరల్ మండలశాఖ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు 30వరోజుకు చేరుకున్నాయి.
సమైక్యాంధ్ర క్రై స్తవ జేఏసి అధ్యక్షలు డాక్టర్ రెవ.మత్తాబత్తుల విజయకుమార్, ప్రధానకార్యదర్శి టివి వర్తమానికులు సువార్తరాజులు ఆధ్వర్యంలో క్రై స్తవులు మోరంపూడి సెంటర్‌లో శాంతి ర్యాలీ, చేపట్టారు. 16వ నెంబరు జాతీయ రహదారిపై సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు.