Samaikyandhra agitation
-
'అశోక్‌బాబు ఉద్యమాన్ని తాకట్టు పెట్టారు'
హైదరాబాద్ : కేవలం రాజ్యసభ సీటు కోసమే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అశోక్ బాబు తాకట్టు పెట్టారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ మండిపడ్డారు. జనవరి 3వ తేదీలోపు ప్రజా సంఘాలు, కుల సంఘాలతో సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మరోవైపు ఏపీ ఎన్జీవో నేతలు....అశోక్ బాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అశోక్ బాబు సమైక్య ఉద్యమాన్ని నీరుకారుస్తున్నారని బషీర్, సత్యనారాయణ, శ్రీనివాస్ మండిపడ్డారు. విభజనకు పూనుకున్న పార్టీలతో అఖిలపక్షం నిర్వహించి....సమైక్యవాణిని వినిపించేవారిని పక్కన పెట్టారని వారు అన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తాం, దిగ్విజయ్‌ని అడ్డుకుంటామని అశోక్ బాబు చెప్పిన మాటలు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నించారు. అశోక్ బాబు అసమర్థతను అన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. 66 రోజుల సమ్మె కాలాన్ని క్యాజువల్ లీవ్‌గా పరిగణించాలని కోరారు. -
ఉద్యమాన్ని తాకట్టు పెట్టే కుట్ర
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆగ్రహం * ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబుకు వేదిక కన్వీనర్ లక్ష్మణరెడ్డి సూటి ప్రశ్నలు * విభజనకు మద్దతిచ్చిన పార్టీలను ఏపీఎన్జీవో ‘వేదిక’కు ఆహ్వానించడమేంటి? * ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని నిర్ణయం తీసుకున్నది అధికార కాంగ్రెస్సే కదా? * తెలంగాణకు అనుకూలమని ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కు తీసుకున్నారా? * తీర్మానం తర్వాతే బిల్లు వస్తుందని మభ్యపెట్టిన సీఎం కిరణ్‌ను ఎలా విశ్వసిస్తాం? * మీ స్వార్థం కోసం కుట్రలు, కుతంత్రాల్లో సీమాంధ్ర ప్రజలు బలైపోవాలా? సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా ముందుకెళుతున్న సమయంలో మరింత ఉధృతంగా జరగాల్సిన సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చడానికి కుట్రలు జరుగుతున్నాయని.. కొందరి రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చటానికి ఉద్యమకారులే తోడ్పాటు అందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆందోళన వ్యక్తంచేసింది. సమైక్య ఉద్యమం కోసం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వివిధ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంపై రాష్ట్ర పరిరక్షణ వేదిక స్టేట్ కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు అంగీకరించిన పార్టీలను అఖిలపక్ష సమావేశానికి పిలవడంలోని ఆంతర్యమేమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈమేరకు లక్ష్మణరెడ్డి ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకోగా.. అంతకుముందే రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ‘‘అలాంటి పార్టీలను ఆహ్వానించడం వల్ల సమైక్యోద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నామా? లేక అలాంటి పార్టీలను కలుపుకుని విభజనకు సహకరిస్తున్నామా?’’ అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. సీమాంధ్రలో ముఖం చెల్లని పార్టీలను పిలవడం వెనుక ఎవరినో చాంపియన్ చేయాలన్న దురుద్దేశాలున్నాయని విమర్శించారు. ‘‘ఎవరి స్వార్థం కోసమో సీమాంధ్ర ప్రజలు తలదించుకోవాలా? మీ కుట్రలు, కుతంత్రాలకు సమైక్యోద్యమం బలైపోవాలా?’’ అని నిలదీశారు. ఉవ్వెత్తున ఎగసిన సీమాంధ్ర ప్రజల భావోద్వేగ ఉద్యమాన్ని చూసి తోక ముడవాల్సిన రాజకీయ పార్టీల ముందు మోకరిల్లాల్సిన అవసరం ఎందుకొచ్చింద న్నారు. సమైక్యవాదులందరినీ కలుపుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఈ కీలక సమయంలో ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు నిర్వహించిన అఖిలపక్షం సమావేశం తీరును ఎండగట్టారు. విభజనపై కేంద్రం చకచకా ముందుకు పోతున్న తరుణంలో సమైక్యవాదులను అదీ చిత్తశుద్ధితో సమైక్యం కోసం పనిచేస్తున్న రాజకీయ పార్టీలను మాత్రమే కలుపుకుని పోరాటం చేయాలే తప్ప.. ఎవరి ప్రయోజనాలనో నెరవేర్చడానికి ఐక్య వేదికలు ఏర్పాటు చేస్తే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతారని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక హెచ్చరించింది. సీమాంధ్రలోనే కాదు.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునే ప్రతి వ్యక్తీ అప్రమత్తం కావలసిన సమయమని, తెరవెనుక జరిగే కుట్రలు సాగనివ్వమని శపథం చేయాల్సిన తరుణమని పిలుపునిచ్చింది. అశోక్‌బాబు నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి.. దాని నిర్వాహకులను ఉద్దేశించి లక్ష్మణరెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. 1. రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్నదే కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ తరఫున ప్రతినిధులను సమైక్యాంధ్ర వేదికకు ఆహ్వానించడంలోని ఆంతర్యమేంటి? 2. ఆ వేదిక సమావేశంలో పాల్గొన్న మరో రాజకీయ పార్టీ టీడీపీ. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణకు కట్టుబడి ఉన్నామని కేంద్రానికి లేఖ ఇచ్చారు. ఇప్పటికీ ఆ లేఖకు కట్టుబడి ఉన్నామనే చెప్తున్నారు. అధికార పార్టీకి తోడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీ లేఖ ఇవ్వటంతో కేంద్రం విభజనపై ముందుకెళ్లిందనటంలో సందేహం లేదు. అలాంటి పార్టీని వేదిక సమావేశానికి ఎందుకు పిలిచినట్టు? 3. తెలంగాణకు అనుకూలమని చెప్తూ ఆ(టీడీపీ) పార్టీ ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకున్నారా? లేదే! ఆ లేఖ వెనక్కి తీసుకోకుండా.. తమ పార్టీ సమైక్యంకోసం కట్టుబడి ఉందని ఆ తర్వాతైనా ప్రకటించిందా? అలా చేయకుండానే ప్రాంతానికో వైఖరి ప్రదర్శిస్తున్న టీడీపీకి సమైక్య ఉద్యమంలో భాగస్వామ్యమయ్యే అర్హత లేదు. అలాంటప్పుడు అఖిలపక్ష భేటీకి ఎందుకు ఆహ్వానించారు? ముందు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసి ఆ పని పూర్తి చేశాకే చేర్చుకోవాలి. 4. ప్రాంతానికో మాట.. ప్రాంతానికో తీరుగా వ్యవహరించే పార్టీల బండారం బయటపడాలంటే అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను ఇలాంటి వేదికలకు ఆహ్వానించాలి. అలా కాకుండా ఆయా పార్టీలకు చెందిన ఒక ప్రాంత నాయకులను సమావేశానికి పిలవడం వల్ల సమైక్య ఉద్యమానికి ఏ రకంగా లాభం? 5. రెండు నాల్కల ధోరణితో వ్యవహరించే పార్టీలను ఆహ్వానించడం వల్ల ఉద్యమం చులకన కాదా? దీనివల్ల ఏం సాధించినట్టు? సీమాంధ్ర ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బకొట్టిన వాళ్లు కాదా? 6. చంద్రబాబునాయుడు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోరు. సమైక్యానికి అనుకూలంగా లేఖ రాయరు. పార్లమెంటులో నలుగురు ఎంపీలు అవిశ్వాస తీర్మానం ఇస్తారు. అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు అందుకు దూరంగా ఉంటారు. ఆ వైఖరిని నిలదీయాల్సిన అవసరం లేదా? అసెంబ్లీలో కూడా అదే పద్ధతి. కొందరు సభ్యులు తెలంగాణ కావాలంటారు. మరికొందరు సమైక్యమంటారు. మీ వైఖరేంటని పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబును ఎందుకు నిలదీయలేకపోయారు? 7. ఇంతచేసీ విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు స్పీకర్‌ను సభలోకి వెళ్లకుండా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటే.. తెలంగాణకు చెందిన డిప్యూటీ స్పీకర్ సభలోకి వెళ్లడం, దానిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి చర్చను ప్రారంభించడం.. ఇవన్నీ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను అడ్డుకోవడం వల్లే కదా సాధ్యమైంది. ఇలాంటి నేతలను సమావేశానికి ఆహ్వానించడంలో ఆంతర్యమేంటి? 8. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లోనే సమైక్యవాద పార్టీలైన సీపీఎం, ఎంఐఎం, వైఎస్సార్ కాంగ్రెస్‌లను కలుపుకుని ముందుకుపోయి ఉంటే.. ఆ ఉద్యమ తాకిడికి భయపడి మిగిలిన పార్టీలూ సమైక్యం బాట పట్టేవే కదా? అలా కాకుండా విభజన వాదాన్ని అంగీకరించిన పార్టీలను భుజాలకెత్తుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం? 9. విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకోవాలని దేశవ్యాప్తంగా పర్యటిస్తూ కీలకమైన అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదించినట్టు అన్ని పార్టీల అధ్యక్షులను పిలిచి చర్చిస్తే ఎవరేమిటన్నది బయటపడేది. ఆ పని ఎందుకు చేయలేకపోయినట్టు? 10. అసెంబ్లీ తీర్మానం చేసి పంపితేనే బిల్లు రూపొందుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పుకుంటూ వచ్చారే..! ముఖ్యమంత్రి చెప్పింది శుద్ధ అబద్ధమని ఇప్పుడు తేలిపోయింది కదా. విభజనపై అసెంబ్లీ తీర్మానం కోరకుండా కేంద్రం ముందుకు పోదని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడేం సమాధానమిస్తారు? తీర్మానం చేయకుండానే ముసాయిదా బిల్లు అసెంబ్లీకి పంపారు కదా? ఇంకా సీఎంను ఎలా విశ్వసిస్తాం? 11. అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు బీఏసీ మీటింగ్‌కు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రాలేదు? అసెంబ్లీకి వచ్చీ చంద్రబాబు బీఏసీ భేటీకి రాకపోవడంలోని ఆంతర్యమేంటి? 12. సీమాంధ్ర ప్రజల్లో.. వారికి తోడు అన్ని ఉద్యోగ సంఘాలు ఒక్కతాటిపై ఉద్యమం చేస్తున్న సమయంలో ఏం చెప్పారు? ఈ ఉద్యమంలోకి రాజకీయ పార్టీలు రావొద్దన్నారు. కానీ ఇప్పుడు.. అది కూడా విభజనకు అనుకూలంగా ఉన్న పార్టీలను పిలిచి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలనే ప్రయత్నాల వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? 13. సీమాంధ్ర ప్రజల ముందు ముఖాలు చూపించే స్థాయి లేక.. ముఖం చెల్లకుండా పోయిన పార్టీలను, నాయకులను ఆహ్వానించి.. రేపటి రోజున వారిని సీమాంధ్ర ప్రజల్లో తిరిగేట్టు చేయడానికే ఈ రకంగా చేస్తున్నారన్న అనుమానాలున్నాయి. దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? 14. వారేమైనా తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చారా? లేక వారేమైనా విభజనకు అనుకూలంగా ఉన్న వారి సొంత పార్టీలకు రాజీనామాలు చేసి మీ ముందుకు వచ్చారా? లేదే..! మరలాంటప్పుడు వారినెందుకు భుజాన మోస్తున్నారు? ఏమిటీ పద్ధతి? 15. సీమాంధ్ర ప్రజల్లో ముఖం చెల్లకుండా పోయిన నేతల రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వేదిక ద్వారా ఎందుకు అవకాశం కల్పిస్తున్నట్టు? దీని వెనుక ఉన్న మతలబేంటి? -
సమైక్యవాదుల సహనాన్ని పరీక్షించవద్దు
-
'సోనియాగాంధీ బర్త్ డే ఆంధ్రప్రదేశ్‌కు డెత్ డే'
అనంతపురం: రాష్ట్ర విభజనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా సమైక్యవాదులు సోమవారం అనంతపురం జిల్లాలో బ్లాక్ డే గా పాటిస్తున్నారు. జిల్లాలో సమైక్య ఉద్యమాలు కొనసాగుతున్నాయి. మరోవైపు గుంటూరు జిల్లాలోనూ సమైక్యవాదులు నిరసనలు తెలుపుతున్నారు. సోనియాగాంధీ బర్త్ డే ఆంధ్రప్రదేశ్‌కు డెత్ డే అంటూ ప్లకార్డులతో సమైక్యవాదులు తెనాలిలో తమ నిరసనలు తెలియచేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డిసెంబర్ 9వ తేదీని బ్లాక్ డే గా కర్నూలు జిల్లా వాసులు పాటిస్తున్నారు. మరోవైపు సోనియా జన్మదినాన్ని తెలుగు జాతి విద్రోహదినంగా పాటిస్తూ ఆటో కార్మికుల జేఏసీ నగరంలో నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. -
'సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగిస్తాం'
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. వంద రోజుల నుంచి ప్రజలు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగించాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ తీర్మానం చేసింది. ఈ నెల 23 వరకు విధుల్ని బహిష్కరించాలని ఆందోళన చేయాలని నిర్ణయించారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహదారులను దిగ్భంధించిన సంగతి తెలిసిందే. సీమాంధ్రలో ఇటీవల సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. -
బాబుది నయామోసం: వాసిరెడ్డి పద్మ
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఢిల్లీ కాంగ్రెస్ సూచన మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నయా మోసానికి పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకే చంద్రబాబు వంద రోజుల్లో ఎన్నికలంటూ కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వంద రోజులుగా ఉద్యమిస్తున్న ప్రజలను గందరగోళపరుస్తున్నారని ధ్వజమెత్తారు. 2009 తర్వాత ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్కటీ గెలవకపోగా డిపాజిట్లు కోల్పోయిన టీడీపీ, వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని చంద్రబాబు చెప్పడం చూస్తే ఆయన మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. ఐఎంజీ భారత కేసులో విచారణ జరిగితే ఊచలు లెక్కించాల్సి వస్తుందని భయపడిన చంద్రబాబు.. సోనియాముందు మోకరిల్లారని చెప్పారు. అందుకే విభజనలో కాంగ్రెస్‌కు అండదండలందిస్తున్నారని తెలిపారు. సోనియా సూచనల మేరకే చంద్రబాబు, వారి గ్యాంగ్ తమ పార్టీ అధినేత జగన్‌పై దుష్ర్పచారం చేస్తున్నారని ఆమె తప్పుబట్టారు. -
విశాఖ వన్డేపై గంటా, పసుపులేటి మాటల యుధ్దం
విశాఖపట్టణం: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈనెల 24న వైజాగ్‌లో జరగనున్న వన్డే మ్యాచ్‌పై రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి. బాలరాజు మాటల యుద్ధం మొదలు పెట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్‌ను అడ్డుకుంటామని గంటా చెబుతుండగా, పటిష్ట భద్రతతో షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ నిర్వహిస్తామని బాలరాజు అంటున్నారు. సీమాంధ్ర ప్రజలందరూ రోడ్డుమీదకు వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని, క్రికెట్‌ను ఆస్వాదించడానికిది సమయం కాదని గంటా పేర్కొన్నారు. ఈ మేరకు బీసీసీఐకి లేఖ కూడా రాసినట్టు చెబుతున్నారు. ఉద్యమాలతో అట్టుడుకుతుంటే క్రికెట్ మ్యాచ్ ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే గంటా వ్యాఖ్యలను బాలరాజు తప్పుబట్టారు. ఇక్కడ మ్యాచ్ నిర్వహిస్తే వైజాగ్ ఇమేజ్ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. భారత్, విండీస్ వన్డే ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మ్యాచ్‌ను అడ్డుకోవద్దని గంటాను కోరారు. సమైక్య ముసుగులో గంటా రాజకీయ ప్రయోజనం కోసం పాకులాడుతున్నారన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇద్దరు మంత్రుల రాజకీయాల నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందో, లేదోనని క్రికెట్ అభిమానులు కంగారు పడుతున్నారు. భారత్, విండీస్ జట్ల మధ్య ఈ నెల 24న రెండో వన్డే జరగాల్సివుంది. -
సమైక్య పోరుకు వంద రోజులు
మహోగ్ర సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయి నేటికి 100 రోజులు. తెలుగు జాతిని ముక్కలు చేయాలన్న కుట్రకు వ్యతిరేకంగా జరుగుతున్న సమైక్య పోరాటం వంద రోజులుగా నిర్విరామంగా జరుగుతోంది. యావత్ సీమాంధ్ర ఉద్యమాలతో హోరెత్తింది. తెలుగు జాతిని విడదీయొద్దంటూ నినదించింది. అన్ని వర్గాల వారు ఉద్యమంలోకి ఉరికారు. రైతులు, రైతు కూలీలు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, చిన్నారులు సహా సమస్త సీమాంధ్ర ప్రజానీకం విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా ప్రజలే ముందుండి వంద రోజులుగా పోరాటాన్ని నడుపుతున్నారు. ఓట్లు, సీట్లు కోసం అడ్డగోలు రాష్ట్రాన్ని విభజించవద్దంటూ ఉద్యమిస్తున్నారు. వంద రోజులుగా ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్నా దున్నపోతు మీద వర్షం చందంగా కేంద్రం ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరవయింది. సమైక్య ఉద్యమకారులు తమ జీవితాలను పణంగా పెట్టి ఉద్యమిస్తున్నా పాలకులకు పట్టకపోవడం శోచనీయం. జనమంతా రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తున్నా ఏలికలు ఏమాత్రం స్పందించకపోవడం దారుణం. విభజనపై చర్చోపచర్చలు సాగిస్తున్న కేంద్రం తమ మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలన్న సీమాంధ్రుల డిమాండ్ అరణ్య రోదనయింది. అయితే ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం సాగుతుందని సమైక్యవాదులు అంటున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు కానీయబోమని స్పష్టం చేస్తున్నారు. తెలుగు జాతిని కలిసి ఉంచేందుకు ఎంతవరకైనా పోరాడతామని ప్రతిన బూనారు. -
సోనియా, బాబు, కిరణ్, కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం
-
వేమన వేషంలో సీఐ 'సమైక్య' నిరసన
రాజమండ్రి: ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. శాంతి, భద్రతలు కాపాడే అధికారి. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ నిరసనలు తెలుపుతున్న ఉద్యమకారులపై ఆయన లాఠీ ఎత్తలేదు, మెడ పట్టి ఈడ్చుకెళ్లలేదు. ఆయనే ఓ ఉద్యమకారుడు అయ్యాడు. తెలుగుజాతిని ఐక్యంగా ఉంచాలంటూ యోగి వేమన వేషధారణలో ఆయన నిరసన తెలుపుతున్నాడు. సమైక్య వేమనను చూడాలంటే మనం తూర్పు గోదావరి జిల్లా వెళ్లాల్సిందే. రాజమండ్రి అర్బన్ పరిధిలో విధులు సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న యార్లగడ్డ జగదీశ్వరరావు వేమన అవతారంతో నిరసన చేపట్టారు. యోగి వేమన విగ్రహం ఎదుట అచ్చం వేమనలానే కూర్చుని నిరసన తెలిపారు. కడియం మండలం వేమగిరి కొండపై బుద్ధ విహార్ తెలుగు పందిరిలో వేమన విగ్రహం దగ్గర ఆయన వేషధారణలోనే ధ్యానం చేస్తున్నారు. ఇంతటితో ఆగలేదు ఈ అభినవ వేమన. సమైక్య ఉద్యమంలో పాల్గొంటూ ప్రసంగాలు కూడా చేస్తున్నారు. రక్తదానం చేశారు. డిసెంబర్ 9 ప్రకటన చిదంబరం ప్రకటన సమయంలో జగదీశ్వరరావు మండపేట రూరల్ ఎస్ఐగా ఉన్నారు. రాష్ట్ర విభజన చేస్తే ప్రాణత్యాగం చేస్తానని అప్పట్లోనే ప్రకటించారు. దీంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తిరిగి 2010లో విధుల్లో చేరిన జగదీశ్వరరావు సీఐగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం రాజమండ్రి సీఐగా జగదీశ్వరరావు విధులు నిర్వహిస్తున్నారు. మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అన్న మాదిరిగానే సమైక్యాంధ్ర విషయంలో సీమాంధ్ర నేతల మాటలు ఉన్నాయంటారు ఈ అభినవ వేమన. -
వేమన వేషంలో సీఐ 'సమైక్య' నిరసన
-
సోనియా, బాబు, కిరణ్, కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం
హైదరాబాద్: నరక చతుర్థి సందర్భంగా వాడవాడల నరకాసుర దహనాలను నిర్వహించారు. అయితే పురాణకాలం నాటి నరకుడికి బదులుగా ఈసారి సోనియాగాంధీ, చంద్రబాబు, కిరణ్, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పండగ రోజు కూడా సమైక్య నినాదానే ప్రతిధ్వనించింది. నరక చతుర్థి రోజున నరాకసుర దహనానికి బదులుగా రాష్ట్ర విభజనకు కారకులైన వారి దిష్టిబొమ్మలకు నరకాసుర దహనం నిర్వహించారు. రాష్ట్ర విభజనకు పూనుకున్న సోనియాగాంధీ, అందుకు సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్, విభజనకు కారకుడైన కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో కిరణ్, సోనియా, చంద్రబాబు, దిగ్విజయ్, కేసీఆర్‌ల దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును గాలికొదిలి నరకాసురుల్లా విభజించ చూస్తున్నారని వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. నరకచతుర్దశి సందర్భంగా సత్తెనపల్లిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నరకాసురవధ నిర్వహించారు. నరకాసురిని బొమ్మతో పాటు రాష్ట్ర విభజనకు కారకులైన సోనియా, కిరణ్, చంద్రబాబు, కేసీఆర్ బొమ్మలను దహనం చేశారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతవరకైనా పోరాడతామని వైఎస్సార్ సీపీ నేతలు స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విద్యార్థులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని విడదీసేందుకు కుట్రపన్నుతున్న సోనియా గాంధీ కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలతో నరకాసురవధ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. -
సింహం నిద్రపోతుంది కదా అని...
గుడివాడ: సింహం నిద్రపోతుంది కదా ఏమీ చేయలేదులే అని పిచ్చి పనులు చేస్తే ఒక్క పంజాతో చంపేస్తుంది.. ఇదేదో కొత్తగా వచ్చిన సినిమాలో డైలాగ్ కాదు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న ఎపీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు నోటి నుంచి వెలువడిన వ్యాఖ్యలివి. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆయన సింహంతో పోల్చారు. ఉద్యమంలో విశ్రాంతి మాత్రమే తీసుకున్నామని, విరమించలేదని ఆయన స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా గుడివాడలో శుక్రవారం రాత్రి జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్టు అశోక్‌బాబు పరోక్షంగా వెల్లడించారు. తనను రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు, అవకాశవాద నాయకులను చూస్తుంటే రాజకీయాల్లోకి రావాలన్న ప్రజల సూచనను మన్నించాల్సి వస్తుందేమోనని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరక్కుండా అడ్డుకోవాల్సిన ఎంపీలు, రాజకీయ పార్టీల చేతకానితనం వలనే రైతుల కోసం, ప్రజల కోసం ఉద్యోగులు ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందని చెప్పారు. విభజన ప్రక్రియను తాము 2014 వరకు ఆపగలమని, తర్వాత అడ్డుకోవాల్సింది ప్రజలేనని చెప్పారు. ఈ నెల 5 తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అశోక్‌బాబు తెలిపారు. -
విభజనను వ్యతిరేకిస్తూ గ్రామసభల తీర్మానం
* వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సర్పంచ్ల పోరు * పార్టీ శ్రేణుల ఆందోళనలతో దద్దరిల్లిన సీమాంధ్ర సాక్షి నెట్వర్క్: దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ ప్రథమ పౌరులు ముందడుగు వేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో గత నెల 2వ తేదీ గాంధీ జయంతి నాటి నుంచి సమగ్ర కార్యాచరణతో ఉద్యమిస్తున్న వైఎస్సార్సీపీ శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సం నాడు విభజనను వ్యతిరేకిస్తూ వేలాది గ్రామసభల్లో ఏకగ్రీవతీర్మానాలు చేయించింది. పార్టీ పిలుపుమేరకు వేలాదిమంది సర్పంచ్‌లు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ ఆయా పంచాయతీల గ్రామసభల్లో తీర్మానాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానాలను రాష్ట్రపతి, ప్రధానమంత్రిలకు పంపనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. విశాఖ జిల్లావ్యాప్తంగా 335 గ్రామసభల్లో సమైక్యరాష్ట్రం కోరుతూ తీర్మానం చేయగా, శ్రీకాకుళం జిల్లాలో 367 గ్రామసభల్లో, విజయనగరం జిల్లాలో 218 గ్రామసభల్లో ఆ మేరకు తీర్మానం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 254 గ్రామసభల్లోనూ, వైఎస్సార్ జిల్లాలో 391, అనంతపురంలో 314, నెల్లూరు జిల్లాలోని 244 గ్రామసభల్లో సమైక్య తీర్మానాలు చేశారు. కర్నూలు, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ వందలాది గ్రామాల్లో సర్పంచ్‌లు సభలు నిర్వహించి రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ తీర్మానాలు చేశారు. సమైక్య రాష్ట్రం కోరుతూ పార్టీకి చెందిన విశాఖ జిల్లా జామిగుడ, గిన్నెలకోట సర్పంచ్‌లు కుమడ సుబ్బారావు, లకే దేవకుమారిలు శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేసి పత్రాలను జిల్లా అధికారులకు అందజేశారు. విభజన కారకుల దిష్టిబొమ్మల దహనం నరక చతుర్దశిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి వైఎస్సార్ సీపీ శ్రేణులు సీమాంధ్ర జిల్లాల్లో విభజన రాక్షస సంహార కార్యక్రమాన్ని చేపట్టాయి. రాజమండ్రి, జగ్గంపేటలలో సోనియా, కేసీఆర్, కిరణ్, చంద్రబాబుల దిష్టిబొమ్మలను విభజన నరకాసురులిగా కూర్చి దహనం చేశారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, గణపవరం, నిడదవోలు, కొవ్వూరు, నరసాపురం ప్రాంతాల్లోనూ వీరి దిష్టిబొమ్మలను దహనం చేశారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, జామి, ఎస్‌కోట ప్రాంతాల్లో కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కర్నూలు, డోన్లలో, వైఎస్ఆర్ జిల్లా రాజంపేట, కడపల్లో విభజన నరకాసుర వధ పేరిట దిష్టిబొమ్మల దహనాలు చేపట్టారు. విజయమ్మను అడ్డుకోవడంపై ఆగ్రహజ్వాలలు నల్లగొండలో వైఎస్ విజయమ్మ పర్యటనను అడ్డుకున్నందుకు నిరసనగా కృష్ణాజిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామంలో రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా గుమ్మంపాడు సర్పంచ్ పెన్మత్స రామరాజు 24 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. వాడవాడలా హోరెత్తిన నిరసనలు రాష్ర్ట విభజన జరిగితే విద్యార్థులు గొర్రెలు మేపి బతకాల్సి వస్తుందన్న సందేశంతో తిరుపతి నగర పరిధిలోని తిమ్మినాయుడుపాలెంలో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కాన్వొకేషన్ కోటు ధరించి, డిగ్రీ పట్టా నమూనాలను గొర్రెలకు తినిపించి నిరసన వ్యక్తం చేశారు. విభజన జరిగితే హైదరాబాద్‌కు పాస్‌పోర్టు తప్పదన్న సందేశంతో వైఎస్సార్ సీపీ చంద్రగిరి నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యవాదులు పాస్‌పోర్టుల కోసం దరఖాస్తులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ చౌక్ వద్ద రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పార్టీ నేతలు క్షీరాభిషేకాలు చేశారు. గుంటూరు నగరంలో పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు మానవ హారం నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో పార్టీ ఆధ్వర్యంలో 10 వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగు తల్లి విగ్రహాన్ని పట్టణంలో ఊరేగించారు. పూల అంగళ్ళ కూడలిలో తెలుగు తల్లికి రాష్ట్ర విభజన సెగ తగలకూడదంటూ 101 బూడిద గుమ్మడికాయలతో మహిళలు దిష్టి తీశారు. ఇక అక్టోబర్ 2 నుంచి సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గకేంద్రాల్లో పార్టీశ్రేణులు చేపట్టిన రిలే నిరశన దీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. -
తెలుగు వారి ఏకైక రాష్ట్రం ఒక్కటిగానే ఉండాలి
-
భీమవరంలో జేడీ శీలంను అడ్డుకున్న సమైక్యవాదులు
-
మూటలు మోసిన ఎమ్మెల్యే భూమన
తిరుపతి: రాష్ట్ర విభజన ద్రోహులు సీఎం కిరణ్, చంద్రబాబేనని వైఎస్సార్ కాంగ్రెస్ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ డైరెక్షన్లోనే చంద్రబాబు నడుచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతిలో మూటలు మోసి భూమన కరుణాకరరెడ్డి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న భూమన కరుణాకరరెడ్డి వినూత్న కార్యక్రమాలతో నిరసనలు తెలుపుతున్నారు. బూట్ పాలిష్ చేయడం, బుట్టలు అల్లడం, రిక్షా తొక్కడం, పశువులను కాపలా కాయడం, లాగేజీ మోయడం వంటి పనులు చేసి ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. సమైక్య ఉద్యమాలకు మద్దతు తెలుపుతూ బైకుపై ర్యాలీ కూడా చేశారాయన. తన నియోజకవర్గంలో ఎక్కడ సమైక్య ఆందోళనల్లోనూ ఆయన పాల్గొంటున్నారు. -
కేజీహెచ్‌లో మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య నిరసన
-
సోనియా కోవర్టు కిరణ్: వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నయవంచకుడిలా సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. రాష్ట్ర విభజనను సజావుగా జరిపించేందుకు సోనియాకు కిరణ్ కోవర్టుగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను సీఎంగా ఉండగా రాష్ట్ర విభజన జరగదని ఇన్నాళ్లూ బీరాలు పలికిన కిరణ్.. ఏం జరుగుతుందో చెప్పలేనంటూ ఇప్పుడు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఒక పథకం ప్రకారం హైకమాండ్‌పై తిరుగుబాటు చేస్తున్నట్లు ప్రజలకు భ్రమ కల్పించి.. ఉవ్వెత్తున ఎగిసిన సీమాంధ్ర ఉద్యమాన్ని క్రమక్రమంగా నీరుగార్చుతున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ‘‘ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతూ.. విభజన తీర్మానం అసెంబ్లీకి వస్తే ఓడిస్తామని చెబుతున్నారు. అసలు తీర్మానం అసెంబ్లీకి వస్తుందని కిరణ్ కచ్చితంగా చెప్పగలరా? ఢిల్లీలో కేంద్ర మంత్రులు రోజుకొక మాట మాట్లాడుతున్నారు. దిగ్విజయ్‌సింగ్ హోంమంత్రి షిండేతో మాట్లాడి అసెంబ్లీకి తీర్మానం వస్తుందో లేదో చెప్తానంటారు! అసెంబ్లీలో ఓటింగ్ జరిగే పరిస్థితి లేదు, కేవలం చర్చ మాత్రమే జరుగుతుందంటారు. తీర్మానం చేసే అవకాశం లేదని లోకమంతా కోడై కూస్తూంటే... కిరణ్ మాత్రం అసెంబ్లీలో ఓడిద్దామంటూనే ఉన్నారు. ఇంత నయవంచకంగా సమైక్య ఉద్యమానికి తూట్లు పొడుస్తున్న విభజనవాదిని చూస్తున్నాం’’ అని మండిపడ్డారు. కిరణ్ మేకవన్నె పులి రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం జరిగేటప్పుడు ఏమాత్రం నోరు మెదపకుండా... నిర్ణయం జరిగిన పదిరోజుల తర్వాత ఓ ప్రెస్‌మీట్ పెట్టి సమైక్యం గురించి గుండెలు బాదుకున్న రోజునే అదంతా డ్రామా అని తాము చెప్పామని పద్మ గుర్తు చేశారు. పైగా తాను గొప్ప బ్యాట్స్మెన్నంటూ, బ్రహ్మాస్త్రం సంధిస్తానంటూ ప్రగల్భాలు పలికారని ధ్వజమెత్తారు. సమైక్య ఉద్యమాన్ని తానే ముందుండి నడిపిస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చిన సీఎం.. ‘మేకపోతును బలివ్వడానికి మేపిన చందం’గా ఉద్యమాన్ని ప్రోత్సహించి ఇప్పుడు బలిపీఠమెక్కించారని దుయ్యబట్టారు. ఉద్యోగులను వెళ్లి కేంద్ర కేబినెట్ బృందానికి సమస్యలు చెప్పుకోమన్నారంటే... సీఎం విభజనకు అంగీకరించినట్లే కదా? అని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యమం పట్ల కిరణ్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. మూడురోజుల్లో అసెంబ్లీని సమావేశపరిచే అవకాశం ఉందని, కానీ, ఆయన ఆ ప్రయత్నం ఎందుకు చేయడంలేదని పద్మప్రశ్నించారు. -
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
* సమైక్యాంధ్రప్రదేశ్ కోసం చివరిదాకా పోరాడుతాం: వైఎస్ జగన్మోహన్రెడ్డి * మొన్నటిదాకా సమైక్యమన్న కేంద్ర మంత్రులంతా ఇవాళ ప్యాకేజీలంటూ మాట్లాడుతున్నారు * సోనియాగాంధీ చెప్పినట్లు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఆడుతున్నారు * సమైక్యానికి అనుకూలంగా ఉన్నది వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం మాత్రమే * ఇప్పటికైనా చంద్రబాబు, కిరణ్‌లు కలిసిరావాలి.. చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు * ఇప్పటికీ కళ్లు తెరవకుంటే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఎడారే * విభజన ముసాయిదా బిల్లు అసెంబ్లీకి రాకముందే సమైక్య తీర్మానం చేయాలి * ఈ నెల 26న హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం సభ నిర్వహిస్తున్నాం * ఈ వ్యవస్థలో నిజాయితీని తీసుకురావడానికి రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలిసిరావాలి * సమైక్య రాష్ట్రం కోసం ఉద్యోగులు సహా అందరినీ ఈ సభకు ఆహ్వానిస్తున్నాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదని, సమైక్యంగా ఉంచాలన్న గట్టి నినాదంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చడానికి అన్ని రకాల ప్రయత్నాలూ జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు శాసనసభను వెంటనే సమావేశపరిచేలా చూడాలని కోరుతూ గురువారం మరోసారి రాష్ట్ర గవర్నర్‌ను కలిసి విన్నవించిన అనంతరం జగన్మోహన్రెడ్డి లోటస్‌పాండ్‌లోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘కనీసం ఇప్పటికైనా రాష్ట్ర అసెంబ్లీకి ముసాయిదా బిల్లు రాకముందే సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం చేయాలని మళ్లీ అడుగుతున్నాం. ఇవాళ కొందరు ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి విభజించాలని ఏకంగా నిరాహార దీక్ష చేస్తారు. ఆ నెపంతో ఆయన ఎంతమందిని కలిశారో, ఎవరిని కలిశారో నాకైతే తెలియదుకానీ.. రాష్ట్రాన్ని విభజించాలని నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత వెనువెంటనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇక్కడ ఉద్యోగ సంఘాల వారందరినీ ఒక్కొక్కరినీ పిలుచుకుని వారిని భయపెట్టి ఉద్యమబాట నుంచి తప్పుకొనేలా చేస్తున్నారు. అంతటితో సరిపోదన్నట్లుగా సమైక్యానికి కట్టుబడి ఉన్నామని మొన్నటిదాకా చెప్పిన కేంద్ర మంత్రులంతా ఇవాళ సమైక్యాన్ని పక్కనపెట్టి ప్యాకేజీలు కావాలన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ల తీరు చూస్తుంటే అసలు మనుషులేనా అని అనిపిస్తోంది’’ అంటూ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా చెప్పినట్లు చేస్తున్నారు.. ‘‘సోనియాగాంధీ గారేమో తన కొడుకును ప్రధానమంత్రిని చేయాలని చెప్పి, ఇక్కడ మా అందరి జీవితాలు, మా పిల్లలందరి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సోనియాగాంధీకి తగుదునమ్మా అన్నట్లుగా చంద్రబాబు అడ్డగోలుగా విభజన చేయడానికి మద్దతిస్తున్నారు. ఇక కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే సోనియా గీత గీస్తే ఒక్క అడుగు కూడా పక్కకువేయకుండా తు.చ. తప్పకుండా పాటిస్తూ మద్దతునిస్తున్నారు. ఇప్పటికైనా చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని వీరందరినీ హెచ్చరించారు. సమైక్యానికి అనుకూలంగా ఉన్నది వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం.. ఈ మూడు పార్టీలు మాత్రమే. చంద్రబాబు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని మూడు పార్టీల వైపునకు రమ్మని చెబుతున్నాం. మూడు పార్టీలు కాస్తా నాలుగు పార్టీలు కావాలి. నాలుగు తర్వాత అయిదు పార్టీలు కావాలి. అందరమూ ఒక్కటైతేనే ఇది సాధ్యపడుతుంది. విభజన ఆగుతుంది’’ అని జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘చంద్రబాబు, కిరణ్‌కు ఒక్కటే చెప్పదల్చుకున్నా ఇద్దరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు. కనీసం ఇప్పటికైనా కళ్లు తెరవండి. కళ్లు తెరవకపోతే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా రాష్ట్రం ఎడారి అవుతుందన్న సంగతి మర్చిపోవద్దు. చదువుకున్న ప్రతి పేద పిల్లవాడు కూడా ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చినపుడు, ఆ హైదరాబాద్‌లో తనను పక్కనబెట్టినపుడు.. చంద్రబాబు, కిరణ్‌ను తిట్టుకునే పరిస్థితి వస్తుందని మర్చిపోవద్దు. ఇప్పటికైనా వీళ్లు కళ్లు తెరవాలి. అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలి. సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేయాలని వీరిద్దరినీ గట్టిగా డిమాండ్ చేస్తున్నా...’’ అని జగన్మోహన్రెడ్డి అన్నారు. సమైక్యమంటే మూడు ప్రాంతాలూ... గతంలో కూడా గవర్నర్‌ను కలిసి అసెంబ్లీని సమావేశపర్చాలని వినతిపత్రం ఇచ్చామని జగన్మోహన్రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రికి కూడా ఇదే విషయమై లేఖల మీద లేఖలు రాశామన్నారు. ‘‘కేబినెట్ నోట్ రావడానికి ముందే రాష్ట్ర శాసనసభను సమావేశపరచి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కోరాం. కానీ మేం చేసిన వినతి అరణ్యరోదనగానే మిగిలి పోయింది. ఆ తరువాత కేంద్రం ఓ అడుగు ముందుకు వేసింది. అందుకే మళ్లీ చెబుతున్నా... ముసాయిదా బిల్లు అసెంబ్లీకి రాకముందే ఇప్పటికైనా సమైక్య తీర్మానం చేయాలి’’ అని ఆయన కోరారు. ఈ నెల 26న హైదరాబాద్‌లో సభ జరుపుకోవడానికి పోలీసులు అనుమతినిచ్చారని, ఆ రోజున సమైక్య శంఖారావాన్ని పూరిస్తామని తెలిపారు. ‘‘సమైక్యం అంటే మళ్లీ మళ్లీ చెబుతున్నా.. సమైక్యం అంటే అందులో తెలంగాణ ఉంటుంది.. కోస్తాంధ్ర ఉంటుంది.. రాయలసీమ ఉంటుంది. అన్ని ప్రాంతాలనూ సమైక్యంగా ఉంచాలనేదే నా అభిమతం. ఈ మూడు ప్రాంతాలకూ న్యాయం చేస్తానని స్పష్టంగా చెబుతున్నా.. సమైక్యం అంటే మూడు ప్రాంతాలనూ కలిపి ఉంచాలి. మూడు ప్రాంతాలకు న్యాయం జరిగేలా నేను ముందుంటానని చెప్పడానికే ఈ సమైక్య శంఖారావం నిర్వహిస్తున్నాం. ఇవాళ అందరితో కూడా నేను ఒకటే విన్నపం మళ్లీ మళ్లీ చేస్తున్నాను. రాజకీయాలను పక్కన పెట్టండి. ఈ వ్యవస్థలో నిజాయితీని తీసుకురండి. అందరూ ఒక్కటి కవాల్సిన అవసరాన్ని పక్కనబెడితే మాత్రం చరిత్రహీనులుగా మిగిలి పోయే పరిస్థితి వస్తుంది. అందుకే చంద్రబాబు, కిరణ్‌లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.. అయ్యా చరిత్రహీనులుగా మిగిలిపోకండి, రండి.. కలిసిరండి అని విజ్ఞప్తి చేస్తున్నా...’’ అని అన్నారు. చివరిదాకా పోరాడుతాం.. సమైక్యాంధ్ర ఉద్యమం తగ్గిపోయిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా...‘‘మా ఖర్మ ఏంటంటే.. దిగ్విజయ్, సోనియాగాంధీ గారికి కుడి భుజమో.. ఎడమ భుజమో అర్థం కావడం లేదు కానీ ఆయన కుడి భుజం అయితే కిరణ్ ఆమెకు ఎడమ భుజం లాంటి వారు.. దిగ్విజయ్ ఉద్యమం తగ్గిపోయిందంటారు.. కిరణ్ దగ్గరుండి ఉద్యమబాట నుంచి ఒక్కొక్కరినీ తప్పించే కార్యక్రమం చేస్తారు.. విభజించండి అని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఏజెంట్‌గా ఏకంగా నిరాహారదీక్షలే చేస్తారు. నిజంగా ఇది మన ఖర్మ. అయినాగానీ నేనొక్కటైతే చెబుతాను. వీళ్లంతా మనుషులే! పైన దేవుడున్నాడు, కచ్చితంగా మేం మాత్రం ఉద్యమబాటను తీవ్రతరం చేస్తాం. చివరిదాకా పోరాటం గట్టిగా చేస్తాం’’ అని ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘న్యాయంగా మీరే గుండెల మీద చెయ్యేసుకుని అడగండి, ఎవరు నిజాయితీగా ఉన్నారో.. ఎవరు నిజాయితీగా లేరో? ఎవరు 16 నెలలు జైల్లో ఉన్నారు? బయట ఉండి రాజ్యసభలో ఎఫ్‌డీఐ ఓటింగ్ దగ్గర నుంచి ఏకంగా అసెంబ్లీలో విప్ జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడిందెవరో? మీ గుండెల మీద చెయ్యేసుకుని అడగండి. నేను లోపల ఉన్నా నిజాయితీగా రాజకీయాలు చేశాను. బయట ఉండి చంద్రబాబు చేసిందేమిటి కాంగ్రెస్‌ను కాపాడ్డం తప్ప’’ అని అన్నారు. సమైక్య శంఖారావం సభకు ఉద్యోగ సంఘాలను కూడా ఆహ్వానిస్తారా అని ప్రశ్నించినపుడు ‘‘ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నా.. ప్రతి ఒక్కరినీ మీడియా ముఖంగా ఆహ్వానిస్తున్నా.. సమైక్యమంటే అందరినీ కలవమనే చెబుతున్నా’’ అని అన్నారు. విలేకరుల సమావేశంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు, దేశాయి తిప్పారెడ్డి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎం.పి వి.బాలశౌరి, ఇతర నేతలు బి.జనక్‌ప్రసాద్, వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. అందరం రాజీనామాకు కట్టుబడి ఉన్నాం.. లోక్‌సభ సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాతోపాటు తమ పార్టీ ఎంపీలందరూ చేసిన రాజీనామాలను కూడా ఆమోదింప జేసుకుంటారని, ఆ మేరకు స్పీకర్ మీరాకుమార్‌పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘నేనొక్కడినే కాదు, మా రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, మా పార్టీలో ఎవరైతే ఉన్నారో వారు, మా పార్టీలో చేరబోతున్న వారు తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుంటారు. నేను స్పీకర్‌కు మళ్లీ ఒక లేఖను రాశాను. మీకు కూడా విడుదల చేస్తాను. కోర్టు ఆంక్షల వల్ల నేను ఢిల్లీకి రాలేకపోయినా, దయచేసి నా రాజీనామాను ఆమోదించండి అని రాశాను. రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి ఇద్దరూ శుక్రవారం ఢిల్లీకి నా లేఖ తీసుకుని వెళుతున్నారు. మా రాజీనామాలు కచ్చితంగా ఆమోదించండి అని స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తూనే ఉంటాం’’ అని ఆయన వివరించారు. -
బొత్స అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు
హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్న వారిపై బొత్స సత్యనారాయణ ప్రోద్భలంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు మహాసభ ప్రతినిధులు రవితేజ, వీరన్న చౌదరి, సదాశివరెడ్డి, వీఎస్ గాంధీలు గురువారం కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. సమైకాంధ్ర ఉద్యమాన్ని అణచివేసేందుకు పీసీసీ అధ్యక్షులు, మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బొత్స అనుచరులు దాడులు చేశారని, దీనిపై ఢిల్లీలో విశాలాంధ్ర ప్రతినిధులు బొత్సను ప్రశ్నించారని తెలిపారు. అప్పటి నుంచి సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న వారిపై, విశాలాంధ్ర మహాసభ జిల్లా కన్వినర్ మామిడి అప్పలనాయుడులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, అనేక మంది విద్యార్థుల అచూకీ లేదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద 200 మంది ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. సమైకాంధ్ర ఉద్యమాన్ని అణచివేయాలన్న కుట్రతోనే విజయనగరంలో కర్ఫూ విధించారని, ఇది ఉద్యమించే ప్రజల హక్కులను కాలరాయడమేనన్నారు. ఈనెల 5 నుంచి విజయనగరం ప్రజలను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలో వెంటనే కర్ఫూ ఎత్తివేసి ప్రజలను ఎటువంటి ఇబ్బందులకు గురిచేయకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీని వెంటనే ప్రభుత్వం ప్రకటించేలా చర్యలు చేపట్టాలని నివేదించారు. విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులను విజయనగరంలోకి అనుమతించడం లేదని, ఇది తమ హక్కులను హరించడమేనని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కమిషన్...ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నవంబర్ 19లోగా నివేదిక సమర్పించాలని విజయనగరం జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది. -
సమైక్యాంధ్ర నయవంచకుడు సీఎం కిరణ్: వాసిరెడ్డి పద్మ
సమైక్యాంధ్ర నయవంచకుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆరు కోట్ల సీమాంధ్రులను బలి పశువును చేశారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కిరణ్ సోనియా గాంధీ కోవర్టు అని వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్టు పొడిచిన విభజనవాది సీఎం కిరణ్ అని అన్నారు. సీఎంను చరిత్ర క్షమించదు అని అన్నారు. సీఎం కిరణ్ చేసిన ద్రోహాన్ని సీమాంధ్రులు ఎన్నడూ మరిచిపోరు అని అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సీఎం కిరణే నీరు గారుస్తున్నారు అని అన్నారు. మాయ మాటలు చెప్పి ఉద్యమాన్ని ఉద్యోగులకు నుంచి సీఎం తప్పిస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. రాష్ట్రాన్ని ముక్కలు చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపాడుతారని ధీమా వ్యక్తం చేశారు. -
సమైక్య ఉద్యమం తగ్గిపోతోంది: దిగ్విజయ్
* ఏపీఎన్జీవోలు కూడా సమ్మె విరమించాలని కోరుతున్నా * అన్ని పార్టీలూ సహకరిస్తే వచ్చే ఎన్నికల్లోపే తెలంగాణ * శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు యత్నిస్తున్నాం * అసెంబ్లీకి తీర్మానం పంపడంపై షిండేతో మాట్లాడాక స్పందిస్తా * హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామని నాడు పార్టీ సీమాంధ్ర ప్రాంత నేతలు చెప్పారు * రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చే ఆలోచన లేదు.. విభజనకు ఆయన సహకరిస్తారని భావిస్తున్నా * టీడీపీ అధినేత చంద్రబాబుకు విశ్వసనీయత లేదు సాక్షి, న్యూఢిల్లీ: గత కొంతకాలంగా అట్టుడుకుతున్న సీమాంధ్రలో ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, అక్కడ ఉద్యమాలు తగ్గుముఖం పట్టాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అభిప్రాయపడ్డారు. ఏపీ ఎన్జీవోలూ సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్లో ఇతర రాజకీయ పార్టీలన్నీ సహకరిస్తే 2014 ఎన్నికల్లోపే తెలంగాణ ఏర్పాటు జరుగుతుందనే ఆశాభావాన్ని దిగ్విజయ్ వ్యక్తం చేశారు. ఆయన బుధవారం సాయంత్రం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, మరో చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఈ వ్యాఖ్యలు చేశారు. తీర్మానంపై ఇంకా ఏమీ చెప్పలేం.. రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న తీర్మానాన్ని, ఆ తర్వాత తెలంగాణ బిల్లును రాష్ట్ర శాసనసభకు పంపుతామని గతంలో పలుమార్లు ప్రకటించిన దిగ్విజయ్‌సింగ్ తాజాగా కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేతో మాట్లాడేంతవరకూ తానేమీ చెప్పలేనని పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభలో తెలంగాణ అంశంపై ఒక్కసారి మాత్రమే, అది కూడా బిల్లుపై మాత్రమే చర్చ జరుగుతుందన్న హోం మంత్రి ప్రకటనను ప్రస్తావించినప్పుడు.. ‘‘హోంశాఖ తొలి ప్రతిపాదన ప్రకారం తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వెళ్లాలి. అయితే ఇప్పటి పరిస్థితి తెలియదు. ప్రస్తుతం తీర్మానాన్ని అసెంబ్లీకి పంపే విషయమై కేంద్ర హోంమంత్రితో మాట్లాడుతా. ఆతర్వాతే దీనిపై స్పందిస్తా’’ అని దిగ్విజయ్ బదులిచ్చారు. తెలంగాణ అంశం రాష్ట్ర శాసనసభలో రెండుసార్లు చర్చకు రాకపోవచ్చునని సూత్రప్రాయంగా అంగీకరించారు. సీమాంధ్ర నేతలందరూ కట్టుబడి ఉంటామన్నారు రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదని దిగ్విజయ్ అన్నారు. సీఎం కిరణ్ సమైక్యవాదాన్ని వినిపిస్తుండడంలో తప్పేమీ లేదని అన్నారు. క్రమశిక్షణ కల్గిన కాంగ్రెస్‌వాదిగా విభజనకు కూడా ఆయన సహకరిస్తారని ఆశిస్తున్నానన్నారు. ప్రత్యేక రాష్ట్రంపై నిర్ణయానికి ముందు సీమాంధ్ర కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ సంప్రదించామని, హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారని తెలిపారు. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో తనకు తెలియదని ఆయన అన్నారు. బాబుకు విశ్వసనీయత లేదు కాంగ్రెస్‌పార్టీ రాజకీయ లబ్ధికోసమే విభజన నిర్ణయం తీసుకొందన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణను ప్రస్తావించగా.. తెలంగాణ అంశంపై పదేపదే మాట మారుస్తున్న ఆయన వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదని దిగ్విజయ్‌సింగ్ అన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదన్నారు. టీఆర్ఎస్.. కాంగ్రెస్‌లో విలీనమయ్యే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి లేదని, ఆ పార్టీ నుంచి అలాంటి ప్రతిపాదనేదీ రాలేదని ఆయన వివరించారు. టీఆర్ఎస్ నుంచి ప్రతిపాదన వస్తే విలీనంపై ఆలోచిస్తామన్నారు. ఆంటోనీ అనారోగ్యం నుంచి కోలుకున్నాక కమిటీ భేటీ అవుతుందని, తాను వచ్చేవారం ఆంటోనీతో భేటీ అవుతానని మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ‘‘రాజకీయ ప్రయోజనాల కోసం విభజన నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. విభజనపై సీమాంధ్ర ప్రజల్ని ఒప్పించడానికి సాధ్యమైనంత కృషి చేస్తాను. ఉద్యోగ, వైద్య, విద్య అంశాలపై భద్రతకు భరోసా ఇస్తాం. జలవనరులతోసహా అన్ని అంశాల్ని పరిశీలిస్తాం. రాజీనామాలు చేసిన ఎంపీలతో మాట్లాడుతున్నాం’’ అని ఆయన చెప్పారు. పీసీసీ సమన్వయ కమిటీ భేటీ వాయిదా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశాన్ని తుపాను కారణంగా వాయిదా వేసినట్టు దిగ్విజయ్ తెలిపారు. సమావేశం మళ్లీ ఎప్పుడు ఉంటుందన్న ప్రశ్నకు ఆయన జవాబివ్వలేదు. ప్రాంతాలనే విభజించమన్నాం కానీ ప్రజలను కాదంటూ బీజేపీ చేసిన విమర్శలను గుర్తుచేయగా.. ‘‘ఇలా జరుగుతుందని ఎవరనుకుంటారు. అందరూ లేఖలు ఇచ్చాకే నిర్ణయం తీసుకున్నాం’’ అని బదులిచ్చారు. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్.. ప్రధానినుద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించగా దిగ్విజయ్ బదులిస్తూ.. ఆయన(పరేఖ్) ఏం చెప్పదలుచుకున్నా సీబీఐ ముందు చెప్పుకోవాలని సలహా ఇచ్చారు. బొగ్గు గనుల కేటాయింపులపై బీజేపీ చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. బొగ్గు కేటాయింపుల్లో ఎన్డీఏ విధానాల్నే యూపీఏ అనుసరించిందన్నారు. -
సోనియాను అతిహేయంగా చిత్రీకరిస్తున్నారు: చిరంజీవి
హైదరాబాద్: సమైక్యవాదం ముసుగులో కొన్ని స్వార్ధపర శక్తులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని అతిహేయంగా చిత్రీకరిస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి ఒక ప్రకటనలో తప్పుపట్టారు. సోనియాగాంధీకి తిరుపతిలో కొందరు వ్యక్తులు సమాధి క ట్టిన సంఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దురాగతానికి పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి చట్ట ప్రకారం వారిని శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమైక్యవాదానికి కట్టుబడిన కొంత మంది కాంగ్రెస్ నేతలను సైతం వారి ప్రతిష్ట దిగజార్చడానికి ఒక వ్యూహం ప్రకారం దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో నచ్చని విధానాలను వ్యతిరేకించే స్వేచ్ఛ, విమర్శించే హక్కు అందరికీ ఉందని.. అయితే, ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపర్చే విధంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ ఆమోదించరని పేర్కొన్నారు. ఈ విధానాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
పల్లంరాజును అడ్డుకున్న సమైక్యవాదులు
-
వైఎస్ఆర్ సీపీ సభకు అనుమతి ఇవ్వాలి: రాఘవులు
-
సిఎం కిరణ్, పోలీసులపై మండిపడ్డ వైయస్సార్సీపీ
-
కేంద్రానికి సీఎం కిరణ్ కోవర్టు: శ్రీకాంత్‌రెడ్డి
వైఎస్ఆర్ జిల్లా: సమైక్యవాది ముసుగులో సీఎం కిరణ్ దొంగాటాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్రానికి సీఎం కిరణ్ కోవర్టుగా పనిచేస్తూ సమైక్య ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని ఆరోపించారు. తుపాన్ పేరుతో విద్యుత్ ఉద్యోగులను ఉద్యమానికి సీఎం కిరణ్ దూరం చేశారన్నారు. సరైన హామీ ఇవ్వకుండానే ఆర్టీసీ కార్మికులను ఉద్యమాన్ని బొత్స సత్యనారాయణ నీరు కార్చారని అన్నారు. సీఎం కిరణ్ నిజంగా సమైక్యవాది అయితే సమైక్య శంఖారావం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 19న సభకు అనుమతిస్తే లక్షల మంది సమైక్యవాదాన్ని దేశానికి వినిపించే అవకాశం ఉందని తెలిపారు. ప్రపంచంలో ఏ కారణం లేకుండా ఆమరణ దీక్ష చేసిన ఘనత చంద్రబాబుదే అని ఎద్దేవా చేశారు. విజనను వేగవంతం చేసేందుకే చంద్రబాబు దీక్ష చేశారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. -
రేపు విజయనగరంలో కర్ఫ్యూ సడలింపు
విజయనగరం: సమైక్యాంధ్ర ఆందోళనలతో అట్టుడికిన విజయనగరం క్రమేపీ కుదుటపడుతోంది. కర్ఫ్యూ నీడ కొనసాగుతోంది. పట్టణంలో శుక్రవారం ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనా చోటుచేసుకోలేదు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ కర్ఫ్యూను సడలించారు. శనివారం ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తామని కలెక్టర్ కాంతిలాల్ దండె, ఎస్పీ కార్తికేయ తెలిపారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో 144 సెక్షన్ కొనసాగుతుందని చెప్పారు. ఈ సమయంలో ర్యాలీలకు అనుమతి ఉందన్నారు. ఆదివారం నుంచి కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేసే అవకాశముంది. -
డిసెంబర్లో కిరణ్ కొత్త పార్టీ?
రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సొంతపార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్లో కిరణ్ కొత్త పార్టీ పెట్టనున్నారని ఆయన సన్నిహితులు వెల్లడించినట్టు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వార్త ప్రచురించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం కట్టుబడితే కాంగ్రెస్‌ను వీడాలని కిరణ్ భావిస్తున్నారు(ట). అయితే రాష్ట్ర విభజనను అడ్డుకునే శక్తి తనకింకా ఉందని సీఎం నమ్ముతున్నారు. సీమాంధ్రకు మద్దతుగా డిసెంబర్లో కిరణ్ కొత్త పార్టీ పెట్టనున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. నూతన పార్టీ స్థాపనకు మద్దతు కూడకట్టేందుకు ఇప్పటికే ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు. శాసనసభలో తెలంగాణ తీర్మానం ఓడించి, రాష్ట్రపతిని కలిసిన తర్వాత సొంతకుంపటి ప్రారంభించేందుకు సీఎం సన్నద్ధమవుతున్నారని చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ను వదిలిపెట్టాలనుకుంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలను తన పార్టీ కోసమే అసెంబ్లీ తీర్మానం పేరుతో కిరణ్ కట్టడి చేశారన్న వాదన విన్పిస్తోంది. సమైక్యాంధ్ర ఎజెండాతో పార్టీ పెట్టి సీమాంధ్రలో మద్దతు కూడగట్టాలన్నది కిరణ్ వ్యూహంగా కనబడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న కొందరు ఉద్యోగ సంఘాల నాయకులను కిరణ్ తనవైపు తిప్పుకున్నట్టు తెలుస్తోంది. సమైక్య ఉద్యమ వేడి తగ్గకుండా చూసేందుకు కిరణ్‌తో అంగీకారానికి వచ్చారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగుల సమ్మె విరమించినా ఉద్యమం సెగ చల్లారకుండా చూడాలని వీరు భావిస్తున్నారు(ట). రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల రాజకీయ జీవితం ప్రమాదంలో పరిస్థితి తలెత్తింది. కనీసం 50 మంది ఎమ్మెల్యేలు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరు కొత్త పార్టీవైపు చూస్తున్నారు. ఇలాంటి నాయకులు కిరణ్ పెట్టబోయే పార్టీలోకి వస్తారని అంచనా వేస్తున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. పథకం ప్రకారమే కొత్త పార్టీ దిశగా కిరణ్ అడుగులు వేస్తున్నారని వెల్లడించారు. -
గోదావరిలో మార్మోగిన సమైక్య నినాదాలు
రాజమండ్రి: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లాలో సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న డిమాండ్‌తో వివిధ రకాలు ఆందోళనలు, నిరసన, ధర్నాలతో జిల్లా దద్దరిల్లుతోంది. సమైక్యాంధ్ర వర్థిలాలి అంటూ సమైక్యవాదులు రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో వినూత్న నిరసన చేపట్టారు. నడుంలోతు నీళ్లలోకి దిగి సమైక్య నినాదాలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా బొమ్మూరు జాతీయరహదారిపై మాజీ సర్పంచ్ మత్యే్సటి ప్రసాద్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి విద్యార్ధులకు బూట్లు పాలిష్ చేస్తూ నిరసన తెలిపారు. మోరంపూడి జాతీయరహదారిపై యుటిఎఫ్ రూరల్ మండలశాఖ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు 30వరోజుకు చేరుకున్నాయి. సమైక్యాంధ్ర క్రై స్తవ జేఏసి అధ్యక్షలు డాక్టర్ రెవ.మత్తాబత్తుల విజయకుమార్, ప్రధానకార్యదర్శి టివి వర్తమానికులు సువార్తరాజులు ఆధ్వర్యంలో క్రై స్తవులు మోరంపూడి సెంటర్లో శాంతి ర్యాలీ, చేపట్టారు. 16వ నెంబరు జాతీయ రహదారిపై సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. -
బాగా క్షీణించిన జగన్ ఆరోగ్యం
హైదరాబాద్: రాష్ట్ర సమైక్యత కోసం అయిదు రోజుల నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు కొద్దిసేపటి క్రితం జగన్‌కు వైద్య పరీక్షలు చేశారు. ఆయన ఆరోగ్యం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా జగన్ దీక్ష విరమించి వైద్యసేవలు పొందడానికి సహకరించాలని వారు కోరుతున్నారు. మరిన్ని వైద్యపరీక్షలు నిర్వహించడానికి వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
జగన్ దీక్షకు మాజీమంత్రి విశ్వరూప్ సంఘీభావం
-
18న వైఎస్సార్ సిపిలో చేరుతున్నా: విశ్వరూప్
హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణకు దీక్షకు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ సంఘీభావం తెలిపారు. దీక్షా స్థలి వద్ద జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. జగన్ ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. సమైక్యాంధ్ర కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన విశ్వరూప్.. జగన్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఈ నెల 18న వైఎస్సార్ సీపీలో చేరనున్నట్టు విశ్వరూప్ తెలిపారు. సమైక్యాంధ్ర కోసం జగన్ ఒక్కరే దీక్ష చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ విభజనకే మొగ్గు చూపుతోందని, దీన్ని సీఎం కిరణ్ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖా మంత్రి పదవికి విశ్వరూప్ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సమైక్యాంధ్ర ఉద్యమ నేతల నుంచి రాజీనామాకు ఒత్తిడి పెరగడం, విభజనకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపడంతో ఆయన మంత్రి పదవిని వదులుకున్నారు. రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉండి విభజనను అడ్డుకునే పరిస్థితి లేకపోవడంతో.. నిజాయితీగా రాజీనామా చేసి ఆమోదింప చేసుకున్నారు. -
'చంద్రబాబు వైఖరి వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి'
పాలకొల్లు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టిన నిరాహారదీక్ష రాష్ట్ర విభన కోరుకునేవిధంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. చంద్రబాబు దీక్ష సమైక్యవాదానికి తూట్లుపొడిచేలావుందన్నారు. చంద్రబాబు నాయుడు వైఖరి వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. చంద్రబాబు దీక్షలు, ఆత్మగౌరవ యాత్రలను ప్రజలు నమ్మేస్థితిలో లేదని చెప్పారు. 'తెలంగాణ నోట్'కు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో మేకా శేషుబాబు ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. మరోవైపు వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకుల దీక్షలు కొనసాగుతున్నాయి. తణుకు నియోజకవర్గం సమన్వయకర్త చీర్ల రాదయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. పెనుగొండలో వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త మల్లుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జగన్ దీక్షకు మద్దతుగా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాడేపల్లిగూడెం సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 62వ రోజుకు చేరాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆకివీడు జాతీయ రహదారిపై 5000వేల మంది విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అత్తిలి బస్టాండ్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొంటున్న ఆర్టీసీ డిపో కాంట్రాక్ట్ కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. -
అనంతపురం జిల్లాలో ఇంధన కొరత
అనంతపురం: ఇందన ట్యాంకర్ల యజమానులు రెండు రోజుల పాటు సమ్మెలో వెళ్లడంతో అనంతపురం జిల్లాలో ఇందన కొరత ఏర్పడింది. సమైక్యాంధ్ర సమ్మెలో భాగంగా 6,7 తేదిల్లో ఇందన ట్యాంకర్ల యజమానులు సమ్మెలోకి వెళ్లారు. దీంతో జిల్లాకు గుంతకల్లు, కడప జిల్లాల నుంచి ఇందన రవాణాకు బ్రేక్ పడింది. అంతకు ముందు మూడు రోజులు జిల్లా బంద్‌కు ఎన్జీఓ, వైఎస్సార్సీపీ జిల్లా బంద్‌కు పిలుపు నివ్వడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో జిల్లాలో 80 శాతం పెట్రోల్ బంకులు నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. జిల్లాలో 220 పెట్రోల్ బంకులుండగా 190 బంకుల్లో పూర్తిగా పెట్రోల్, డీజిల్ నో స్టాక్ నెలకొంది. దీంతో మంగళవారం మధ్యాహ్నం స్టాకు ఉన్న ఒకటి, రెండు బంకుల వద్ద వేలాది మంది వాహనదారులు బారులు తీరారు. పంపిణీ చేసేందుకు పెట్రోల్ బంకుల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. దీంతో తమ వల్ల కాదని పోలీసుల అనుమతితో బందోబస్తు ఏర్పాటు చేసుకుని పంపిణీ చేశారు. మరో వైపు చిరు వ్యాపారులు బ్లాక్‌లో రూ.150- 250 దాకా అమ్మి సొమ్ము చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇందనరవాణా ప్రారంభమైన జిల్లాలో పూర్తి స్థాయి ఇందనం స్టాక్ రావడానికి రెండు రోజులు సమయం పడుతుందని పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు. -
నాలుగో రోజూ జగన్ దీక్షకు పోటెత్తిన అభిమానులు
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య దీక్షకు హైదరాబాద్‌తోపాటు సీమాంధ్ర అంతటా మద్దతు వెల్లువెత్తుతోంది. నాలుగో రోజు దీక్ష కొనసాగిస్తున్న జగన్‌ను చూసేందుకు, సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అనేక మంది జగన్‌ను కలిసి తమ మద్దతు తెలిపారు. -
ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు: బొత్స
హైదరాబాద్: ఉద్యోగులంతా సమ్మె విరమించాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. సీఎంతో రేపు జరిగే చర్చల్లో ఉద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకుంటామని, ఆమేరకు హామీలు నిలబెట్టుకునేలా బాధ్యత తీసుకుంటామని చెప్పారు. తెలంగాణపై అఖిలపక్షం కోసం కేంద్రానికి లేఖరాస్తానని చెప్పారు. పార్టీల డిమాండ్లను తెలుసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నానని అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు చొరబడ్డాయని ఆరోపించారు. విజయనగరంలో జరిగిన ఘటనలు దురదృష్టకరమన్నారు. పార్టీలతో మాట్లాడి కేంద్రం పరిష్కారం చూపాలన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామంటూ పార్టీ సాంప్రదాయంగా తాను అధిష్టానానికి చెప్పానని వెల్లడించారు. కాని దాన్ని చివరిమాటగా తీసుకోవద్దని తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. సాంప్రదాయం పాటించాం తప్ప తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరంలేదన్నారు. రాష్ట్ర విభజనపై నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీ చులకనైపోయిందన్నారు. పార్టీ గురించి చవకగా ఆలోచించే పరిస్థితి వచ్చిందని వాపోయారు. తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామన్నారు. తెలుగు మట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటనిగతంలో తాను చెప్పిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కొందరు గట్టిగా మాట్లాడ్డంవల్ల విభజన ప్రక్రియ ఆగలేదన్నారు. కొంతమంది అజెండాలో సమైక్య రాష్ట్రమే లేదంటూ సీఎం కిరణ్‌పై బొత్స పరోక్ష విమర్శలు చేశారు. -
ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు: బొత్స
-
సీమాంధ్రలో విద్యుత్ కష్టాలు
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంత విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడంతో సీమాంధ్ర అంతటా చీకట్లు కమ్ముకున్నాయి. విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడంతో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. విద్యుత్ లేకపోతే పరిస్థితి ఏమిటో అధికారులకు, ప్రజలకు అర్ధమైపోయింది. అనేక రైళ్లు రద్దయిపోయాయి. ఇళ్లలో తడుముకోవలసిన పరిస్థితి. టీవిలు పనిచేయడంలేదు. నీటి సరఫరా బంద్ అయిపోయింది. ఆస్పత్రులలో రోగులు నానా పాట్లు పడుతున్నారు. ఆ ప్రభావం హైదరాబాద్‌పై కూడా పడింది. ఇక్కడ కూడా విద్యుత్ కోతలు మొదలయ్యాయి. మొత్తం 30 వేల మంది ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నాట్లు సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. విశాఖ జిల్లా సీలేరు, డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాలవద్ద జేఏసీ ఏర్పాటు చేశారు. జెన్కో సిబ్బంది సమ్మెకు సిద్ధమైంది. పీలేరు జల విద్యుత్ ఉత్పాదన కేంద్రం సిబ్బంది రేపు ఉదయం 6 గంటల నుంచి మెరుపు సమ్మె చేయనున్నారు. వారు సమ్మె చేస్తే 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఆర్టీపీపీ, విజయవాడ వీటీపీఎస్, శ్రీశైలంలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సదరన్ గ్రిడ్ దాదాపు కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. మిగతారాష్ట్రాల్లోనూ విద్యుత్ ఇబ్బందులు తలెత్తుతాయి. తమిళనాడు, కర్ణాటక, బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. రేపు ఉదయం నుంచి పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంది. తిరుమల శ్రీవారికి కూడా విద్యుత్ కోతల బాధలు తప్పలేదు. శ్రీవారి సన్నిధిలో కూడా చీకట్లు కమ్ముకున్నాయి. కరెంట్ లేకపోవడంతో విద్యుత్ దీపాలంకరణ నిలిపివేశారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో విద్యుత్ జేఏసీ నేతలతో టీటీడీ అధికారులు చర్చలు జరిపారు. తిరుమలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. వీఐపీ కాటేజీలు, ప్రధానాలయంకు మినహాయింపు ఇవ్వాలని అడిగారు. అనంతపురం జిల్లాలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, అంధకారంలో పల్లెలు, పట్టణాలు, పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు నిలిచిపోయాయి. వైఎస్ఆర్ జిల్లాలో విద్యుత్ ఉద్యోగులతో కలెక్టర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రాత్రి పూట కూడా విద్యుత్ పునరుద్ధరణకు ఉద్యోగులు నిరాకరించారు. గుంటూరు జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ లేక ఆస్పత్రులలో రోగులు అల్లాడుతున్నారు. రైల్వే శాఖ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. * తిరుపతి - గూడూర్ - రేణి గుంట సెక్షన్ల మధ్య7 ప్యాసెంజర్ రైళ్లు రద్దు చేశారు. * కాజీపేట్-విజయవాడ, విజయవాడ-గూడూరు- తిరుపతిసెక్షన్ల మధ్య 8 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. * తిరుపతి - సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్ రేణిగుంట, గుత్తి, డోన్, కాచిగూడ మీదుగా మళ్లించారు. * తిరుపతి - సికింద్రాబాద్ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రేణిగుంట, గుత్తి, డోన్, కాచిగూడ మీదుగా మళ్లించారు. * తిరుపతి- నెల్లూరు, నెల్లూరు-చెన్నై ప్యాసింజర్లు, చెన్నై- నెల్లూరు, నెల్లూరు - తిరుపతి ప్యాసింజర్లు పాక్షికంగా రద్దు చేశారు. * చెన్నైనుంచి రావాల్సిన పినాకిని ఎక్స్ ప్రెస్ రద్దు * విజయవాడ- చెన్నై జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రద్దు * చెన్నై- విజయవాడ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రద్దు * విజయవాడ- బిట్రగుంట ప్యాసింజర్ రద్దు * బిట్రగుంట- విజయవాడ ప్యాసింజర్ రద్దు * బిట్రగుంట - చెన్నై ప్యాసింజర్ రద్దు * చెన్నై - బిట్ర గుంట ప్యాసింజర్ రద్దు * చెన్నై-గూడూరు ప్యాసింజర్ రద్దు ఇంకా మరిన్ని రైళ్లు రద్దయ్యే అవకాశం ఉంది. -
బొత్స ఇంజనీరింగ్ కాలేజీపై దాడి
విజయనగరం: విజయనగరంలో కర్ఫ్యూ విధించినప్పటికీ సమైక్యాంధ్ర ఉద్యమకారులు పోరు కొనసాగిస్తున్నారు. రోడ్డుపై కనిపిస్తే కాల్చిపారేస్తామని పోలీసులు హెచ్చరించినప్పటికీ సమైక్యవాదులు తమ గళం విన్పిస్తూనే ఉన్నారు. ఉద్యమకారులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఎక్కడికక్కడ ఉద్యమకారులను అడ్డుకుంటున్నారు. రోడ్లపై కనిపించినవారిపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు అని కూడా చూడకుండా చితకబాదుతున్నారు. బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల ధ్వంసం కొనసాగుతోంది. గాజుల రేగలో బొత్స ఇంజనీరింగ్ కాలేజీపై సమైక్యావాదుల దాడి చేశారు. దీంతో సీఆర్పీఎఫ్ సిబ్బంది స్థానికుల ఇళ్లల్లోకి చొరబడి దాడులు చేశారు. దొరికిన వారిని దొరికిట్టు విచక్షణ చావబాదారు. కొత్తపేట వాటర్ ట్యాంకు వద్ద సమైక్యవాదులపై పోలీసులు లాఠీచార్జీ చేసి, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని డీఐజీ ఉమాపతి హెచ్చరించారు. -
బొత్స మేనల్లుడు చిన్న శ్రీను ఇంటిపై సమైక్యవాదుల దాడి
విజయనగరం: 'తెలంగాణ నోట్' సెగలు సీమాంధ్రలో కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేయడంతో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. సమైక్యవాదులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. విజయనగరంలో జిల్లాలో ఉద్యమకారులు కదం తొక్కారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చెందిన సత్యా విజన్ కేబుల్ కార్యాలయంపై శుక్రవారం రాత్రి ఆందోళనకారులు దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కార్యాలయానికి నిప్పు పెట్టారు. మంటలను అదుపు చేయడానికి వచ్చిన అగ్నిమాపక వాహనం అద్దాలు పగులగొట్టారు. పోలీసుల లాఠీచార్జి చేయడంతో ఆందోళనకారులు చెల్లాచెదురయ్యారు. బొత్స మేనల్లుడు చిన్నశ్రీను ఇంటిపై కూడా సమైక్యవాదుల దాడి చేశారు. ఆందోళనకారుల కళ్లలో చిన్న శ్రీను అనుచరులు కారం కొట్టారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. లాఠీచార్జి చేశారు. దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉదయం బొత్సకు చెందిన కళాశాల,లాడ్జీపై విద్యార్థులు రాళ్ల దాడి చేశారు. -
సీమాంధ్రకు 25 కంపెనీల పారా మిలటరీ బలగాలు
హైదరాబాద్: తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది. శాంతి భద్రతలు అదుపుతప్పకుండా చూసేందుకు అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 45 కంపెనీల పారామిలటరీ బలగాలు ఉన్నాయి. అదనంగా 25 కంపెనీల పారా మిలటరీ బలగాలు కావాలని కేంద్రాన్ని కోరింది. కోయంబత్తూరు నుంచి 15, కోల్‌కతా నుంచి 10 పారామిలటరీ బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. కేంద్ర కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం అదనపు బలగాలు కోరినట్టు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ఇన్చార్జి డీజీపీ ప్రసాదరావు తెలిపారు. సీమాంధ్ర నాయకులకు అవసరమయితే భద్రత పెంచుతామన్నారు. సమైక్య ఉద్యమకారులు కేంద్ర కార్యాలయాలు టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం ఉందని తెలిపారు. ఈ మధ్యాహ్నం శాంతి భద్రతలపై సీఎం కిరణ్ సమీక్ష నిర్వహించారు. ఉద్యమకారులపై ఒక్క రబ్బర్ బుల్లెట్ కూడా ప్రయోగించడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారు. -
మహిళ వేషం వేసిన ఎన్.శివప్రసాద్
తిరుపతి: చిత్తూరు టీడీపీ ఎంపీ ఎన్.శివప్రసాద్ మరోసారి వేషం మార్చారు. సమైక్యాంధ్రకు మద్దతు విభిన్న గెటప్పులతో లోక్‌సభలో హల్చల్ చేసిన ఆయన ఈసారి మహిళగా మారిపోయారు. గాంధీ జయంతి రోజున వృద్ధ మహిళగా వేషం ధరించి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తిరుపతిలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అచ్చం మహిళలాగే అభినయిస్తూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి సోనియా గాంధీ, కేసీఆర్ కారణమని విమర్శించారు. జాతీయ మీడియాను ఆకర్షించేందుకు పార్లమెంట్ సమావేశాల్లో పలు 'వేషాలు' వేశారు. శ్రీకృష్ణుడి అవతారంతో లోక్‌సభలో ప్రత్యక్షమయ్యారు. తర్వాత గాంధీ టోపీ పెట్టుకుని నిరసన తెలిపారు. ఒక లోక్‌సభ నుంచి సస్పెండయినప్పడు కొరడాతో కొట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. మరోసారి పార్లమెంట్ వెలుపల చెక్క భజన చేస్తూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
'ఆత్మగౌరవం తెలుగువాడి మీసంలో ఉంది'
హైదరాబాద్: పార్టీలను పక్కనపెట్టి జేఏసీగా ఏర్పడదామని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పిలుపునిచ్చారు. అందరం డ్రామాలు ఆపేద్దామని, పార్టీలను పక్కనపెట్టి సమైక్యాంధ్ర ఎజెండాతో ముందుకెళదామని కోరారు. రాష్ట్రంలో ఎక్కువ మంది సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఆత్మగౌరవం తెలుగువాడి మీసంలో ఉందన్నారు. తెలుగువాడి రోషంలో ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందన్నారు. మిగతా పార్టీలు కూడా ఇదే దారిలో నడవలన్నారు. చంద్రబాబు నాయుడు నాటకాలు కట్టిపెట్టి సమైక్యాంధ్ర కోసం ముందుకు రావాలన్నారు. రథయాత్రలు కట్టిపెట్టాలన్నారు. పాములా బుస కొడుతున్న సమైక్య ఉద్యమానికి నీరుపోయాలన్నారు. గతంలో తెలంగాణ నాయకులు వ్యవహరించిన విధంగా ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీల నాయకులను కలుద్దామన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీ ఎజెండా వారిదే అన్నారు. అసెంబ్లీలో తీర్మానం వస్తే అడ్డుకోవడానికి సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు సిద్ధంగా ఉండాలన్నారు. -
పార్టీలన్నీ యూటర్న్ తీసుకున్నాయి: జగ్గారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో రాష్ట్రం కష్టాల్లో కూరుకుపోయిందని ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాష్ రెడ్డి అన్నారు. రాష్ట్రం మరింత కష్టాల్లో కూరుకుపోకుండా కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని తెలిపారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంభిచడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అభిప్రాయపడ్డారు. పార్టీలు స్పష్టమైన విధానం అవలంభిచకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అడ్డుచెప్పబోమని లేఖలు ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. సీడబ్ల్యూసీ తీర్మానం వచ్చిన తర్వాత పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య సభ పెట్టడం ఇబ్బందికర పరిణామమని జయప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
'సీమాంధ్ర మంత్రుల్లో అభిప్రాయ భేదాలు లేవు'
హైదరాబాద్ : సమైక్య రాష్ట్ర ఉద్యమ తీవ్రతను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ కమిటీ రాష్ట్రానికి రావాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే అంశంపై సీమాంధ్ర మంత్రుల్లో అభిప్రాయ భేధాలు లేవని ప్రభుత్వ విప్ పద్మరాజు అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే అంశంపై తాజా రాజకీయ పరిణామాలను చర్చించుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు గురువారం సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సమావేశం కానున్నట్లు తెలిపారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో రేపు ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో సీమాంధ్ర మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని పద్మరాజు తెలిపారు. -
కాంగ్రెస్ విధానాల్ని ఎండగట్టండి: గౌరు
కర్నూలు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకూ తీసుకు వెళతామని కర్నూలు జిల్లా వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు. సోమవారం ఆయన పాణ్యం నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేసి ప్రజల జీవితాలతో చలగటం ఆడుతున్న కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి అండగా నిలిచిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్సేనని ప్రజలకు ఇది అర్థం అయ్యేలా చెప్పి ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచులతో దీక్షలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
లెంపకాయలేస్తామంటే.. గంపెడు పూలు పంపిస్తాం
తాడేపల్లిగూడెం: లెంపకాయలేస్తామంటే.. గంపెడు పూలు పంపిస్తాం. తెలుగుతల్లి మొదలేదో తల్లి వేరునడుగు.. నీ సంస్కృతి వేరంటే బతుకమ్మనే పాడేస్తానంటూ గజల్స్ శ్రీనివాస్ చేసిన గీతాలాపన ఆకట్టుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం స్థానిక జేఏసీ, వైసీపీ రిలే దీక్షా శిబిరాలను ఆయన సందర్శించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు రాష్ట్రం కలిసి ఉండటానికి ఇంతగా ఉద్యమిస్తున్న రాజకీయ నాయకులకు బుద్ధి రాలేదని, వారు ఇలాగే ఉంటే బ్యాలెట్ బాక్సులలో పొలిటికల్ ఫాక్సులకు (నక్కలకు) బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా గాంధేయ మార్గంలో జరుగుతున్న ఉద్యమంగా సమైక్యాంధ్ర ఉద్యమం పేరొందిందన్నారు. ఉద్యమానికి ఊపిరిలూదటానికి ఓయ్.. తెలుగువాడా గీతం జీవం పోయడం పూర్వజన్మసుకృతమన్నారు. వెంకటేశ్వరునిపై పాడిన గీతానికంటే ఓయ్ తెలుగువాడా ప్రాచుర్యం పొందిందన్నారు. ఉద్యమం ఇంకా వేడెక్కాలన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి రైళ్లలో పాట యాత్ర ప్రారంభించనున్నట్టు శ్రీనివాస్ వెల్లడించారు. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ఈ రైలు పాట యాత్ర ఉంటుందన్నారు. సమైక్య ఉద్యమంలో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. అపార్టుమెంటుల్లోని మహిళలు రిలే దీక్షలలో పాల్గొనడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. 108 గంటల పాటు నిర్విరామంగా సమైక్యాంధ్ర పాటలపోటీ గూడెంలో ఏర్పాటు చేస్తే బాగుంటు ందని, అన్ని విధాలుగా తాను సహకరిస్తానని చెప్పారు. నాన్‌పొలిటికల్ శిబిరంలో కూర్చున్న మహిళలను అభినందించారు. వైసీపీ శిబిరంలో దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేశారు. వైసీపీ సమన్వయకర్త తోట గోపి, జేఏసీ చైర్మన్ ఈతకోట తాతాజీ, పైలు శ్రీనివాసు తదితరులు ఉన్నారు. -
62వ రోజూ కొనసాగుతున్న సమైక్య పోరు
చిత్తూరు/కర్నూలు/అనంతపురం: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం 62కు చేరుకుంది. రాష్ట్రాన్ని విడగొట్టొదంటూ సమైక్య ఉద్యమకారులు గత రెండు నెలలుగా నిర్విరామంగా పోరాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య ప్రజలు సైతం ఉద్యమంలో పాల్గొంటున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లాలో నిరసనలు కొనసాగుతున్నాయి. 2వ రోజు కొనసాగుతున్న ఆటోల బంద్ జరుగుతోంది. చిత్తూరులో నగర పాలక ఉద్యోగులు ర్యాలీ, దీక్షలు చేపట్టారు. అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీఎన్జీవో, రెవెన్యూ, జాక్టోల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో వెయ్యి బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. ఎస్కేయూ, జేఎన్టీయూలో విద్యార్థులు, అధ్యాపకుల దీక్షలు కొనసాగిస్తున్నారు. నేడు పుట్టపర్తిలో సమైక్య భేరి నిర్వహించనున్నారు. రాయదుర్గంలో బంద్‌కు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నందికొట్కూరు, ఆత్మకూరు, ఎమ్మిగనూరులలో వైఎస్ఆర్ సీపీ దీక్షలు చేపట్టింది. కర్నూలులో న్యాయవాదులు, ఉపాధ్యాయులు, పాలిటెక్నిక్ సిబ్బంది, నీటిపారుదల ఉద్యోగులు, మార్కెట్‌యార్డ్, మున్సిపల్ ఉద్యోగుల దీక్షలు చేస్తున్నారు. నంద్యాలలో ఎన్జీవో, జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమవడంతో కర్నూలు జిల్లా రీజియన్‌కు రూ.50 కోట్ల నష్టం వాటిల్లింది. -
ఒకటే గమనం ఒకటే గమనం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. రాష్ట్ర సమైక్యత కోసం ఉద్యమకారులు 61 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కూడా జిల్లావ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. రాస్తారోకోలు, మానవహారాలు, రిలే దీక్షలు, ప్రదర్శనలతో నిరసన తెలియజేశారు. ఒంగోలు నగరంలో ఎన్ఎన్ఎన్ స్కేటింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు చర్చి సెంటర్లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డుపై స్కేటింగ్ విన్యాసాలు ప్రదర్శించి రాష్ట్ర సమైక్యత కోసం నినదించారు. మార్కెట్ యార్డు వద్ద సిబ్బంది చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. అద్దంకి పట్టణంలో సమైక్యవాదుల రిలే దీక్షలు 42వ రోజు కొనసాగాయి. వీరికి రాజస్థాన్‌కు చెందిన వ్యాపారులు సంఘీభావం తెలిపారు. కొరిశపాడు మండలం రావినూతలలో ఇంజినీరింగ్ విద్యార్థులు రిలే దీక్షలకు కూర్చున్నారు. చీరాలలో సమైక్యాంధ్ర నిరసనలు మార్మోగుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ యూత్‌ఫోర్స్ సభ్యులు వాడరేవులోని సముద్రతీరంలో జలదీక్ష నిర్వహించారు. అలాగే ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు 33వ రోజుకు చేరాయి. వేటపాలెంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పర్చూరులో న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్షలు 56వ రోజుకు చేరాయి. మార్టూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయులు జలదీక్ష చేపట్టారు. గిద్దలూరులో తహసీల్దార్ కార్యాలయం వద్ద సమైక్యవాదులు భారీ మానవహారం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. అలాగే కర్నూలులో జరిగే సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు జేఏసీ నాయకులు భారీగా తరలివెళ్లారు. బేస్తవారిపేటలో ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ర్యాలీ, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కొమరోలులో తహసీల్దారు కార్యాలయ సిబ్బంది రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. కనిగిరి పట్టణంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దేవాంగనగర్ మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో రిలే దీక్ష చేశారు. అంతకు ముందు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేశారు. అలాగే సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సాధన కళాశాల విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. గార్లపేట బస్టాండ్‌లో ఆటో కార్మికులు నిరసన ర్యాలీ చేసి, సర్వమత వేషధారణలతో నిరసన తెలిపారు. అలాగే హెచ్‌ఎంపాడులో ఆటో కార్మికులు ర్యాలీగా వచ్చి దీక్షాధారులకు సంఘీభావం తెలిపారు. వంటా- వార్పు కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు 14వ రోజు రిలేదీక్ష చేపట్టారు. అలాగే టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామూరులో వికలాంగులు రిలే దీక్షలకు కూర్చున్నారు. మార్కాపురం పట్టణంలో క్రిస్టియన్ యూత్‌ఫోర్స్ నేతృత్వంలో సమైక్యాంధ్ర కోరుతూ సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పొదిలిలో భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ చేశారు. యర్రగొండపాలెంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు ఆకులు కట్టుకుని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. దోర్నాల పట్టణంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 27వ రోజుకు చేరాయి. -
కూలీ నెంబర్1
ఉవ్వెత్తున ఎగసిన సమైక్యాంధ్ర ఉద్యమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి దూసుకుపోతున్నారు. రాష్ట్ర విభజనకు జరుగుతున్న పోరాటంలో దుమ్ము రేపుతున్నారు. ఉద్యమకారులతో కలిసి తన నియోజకవర్గంలో సీమాంధ్ర ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రజల్లో ఒకడిగా కలిసిపోయి ఆందోళనలు సాగిస్తున్నారు. విభిన్న వేషధారణలు, వైవిధ్య అంశాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. దీంతో గత రెండు నెలలుగా మహోగ్రంగా జరుగుతున్న సమైక్య ఉద్యమంలో భూమన తనదైన ముద్ర వేయగలిగారు. బూట్ పాలిష్ చేయడం, బుట్టలు అల్లడం, రిక్షా తొక్కడం, లాగేజీ మోయడం.. ఇవన్నీ చేసింది ఒక్కరే. ఆయనెవరో కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర రెడ్డి. సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయిన నాటి నుంచి విభిన్న నిరసన ప్రదర్శనలతో ఆయన సమైక్య పోరాటం చేస్తున్నారు. రాష్ట్రాన్ని చీల్చడానికి జరుగుతున్న కుట్రలను చీల్చచెండాడుతున్నారు. ధర్నాలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, నిరాహారదీక్షల్లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. సమైక్య ఉద్యమంలో భాగంగా భూమన కరుణాకర రెడ్డి శనివారంనాడు (సెప్టెంబర్ 28న) రైల్వే కూలి అవతారమెత్తారు. తిరుపతి రైల్వేస్టేషన్లో కూలిపని చేసి నిరసన తెలిపారు. అంతకుముందు కూడా భిన్న వేషధారణలతో ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. ఈ నెల 24న పశువుల కాపరి వేషంలో పశువులను కాస్తూ రాష్ట్ర విభజనకు నిరసన తెలియజేశారు. 19న తిరుపతిలోని తుడా సర్కిల్లో క్రిస్టియన్ మైనార్టీల దీక్షలో నడిరోడ్డుపై బుట్టలు అల్లుతూ నిరసన తెలిపారు. 16న బూట్ పాలిష్ చేశారు. 11న మట్టి కుండలను ఎత్తుకుని నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన నాటి నుంచి ప్రజా సమస్యలపై పోరాటానికి భూమన కేరాఫ్ అడ్రస్‌గా మారారు. తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఆయన ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించిన తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకుంటూ భూమన తన నియోజకవర్గ ప్రజలతో శెభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ తనశైలిలో ముందుకు సాగుతున్నారు. -
61వ రోజు కొనసాగుతున్న సమైక్య ఉద్యమం
అనంతపురం/చిత్తూరు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం 61వ రోజు కొనసాగుతోంది. ఆందోళనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలతో సమైక్య ఉద్యమం హోరెత్తుతోంది. అనంతపురం జిల్లాలో ఆత్మకూరులో ప్రజాగర్జన నిర్వహించనున్నారు. సమైక్యాంధ్ర కోరుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన ప్రదర్శనకు దిగనున్నారు. మడకశిరలో కర్నాటక బస్సులపై సేవ్ ఏపీ అని సమైక్యవాదులు నినాదాలు రాశారు. గుంతకల్లులో వైఎస్సార్ సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్య ఆందోళనలతో జిల్లా వ్యాప్తంగా 1000 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ఆర్టీసీకి సుమారు రూ. 51 కోట్లు నష్టం వాటిల్లింది. చిత్తూరు జిల్లాలోనూ సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు 49వ రోజు కొనసాగుతున్నాయి. నేడు జిల్లాలో విద్యుత్ ఉద్యోగుల ర్యాలీలు నిర్వహించనున్నారు. -
భిక్షాటన చేసిన ఉద్యోగులు
-
జగన్ నాయకత్వంలో రాష్ట్ర సమైక్యత: గాదె
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి పేర్కొన్నారు. జగన్ రాకతో సమైక్యోద్యమం మరింత బలపడుతుందని, ఆయన తన శక్తియుక్తులన్నిటినీ ధారపోసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందన్న నమ్మకముందన్నారు. గాదె మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డే కారణమన్న కొందరి విమర్శలు అవాస్తవమన్నారు. ఆయన పూర్తిగా సమైక్యవాది అని, తొలి నుంచీ సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. 2001లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాష్ట్ర విభజన కోసం సోనియాకు లేఖ ఇప్పించింది వైఎస్సే అనడం కూడా శుద్ధ అబద్ధమన్నారు. ‘‘వైఎస్ ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ దుర్గతి వచ్చేది కాదు’’ అని ఆవేదన వ్యక్తపరిచారు. జగన్ బెయిల్‌పై కొందరు దుర్మార్గమైన విమర్శలు చేస్తుండటం బాధాకరమన్నారు. ‘‘కాంగ్రెస్‌తో కుమ్మక్కైనందుకో, ప్రలోభపడ్డందుకో బెయిల్ వచ్చిందని కొన్ని పార్టీలు సత్యదూరమైన విమర్శలు చేస్తున్నాయి. జగన్‌కు అర్హత ప్రకారం బెయిల్ వచ్చిందే తప్ప మరోటి కాదు. ఆయనపై పెట్టిన క్విడ్ ప్రో కో కేసులు నిరాధారం’’ అని పేర్కొన్నారు. -
సాంబ... ఇదేం దబ్బ!
‘పదవిని పట్టుకుని వేలాడ్డానికి నేను వెధవను కాదు. మీలో ఎవరైనా వెధవలుంటే నేనేం చేయలేను’ ఈ మాటలన్నది గల్లీ నాయకుడు కాదు. ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కాకలు తీరిన కాంగ్రెస్ నాయకుడి నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాలివి. 45 ఏళ్లుగా హస్తం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతాశ్రీ విచక్షణ మరిచిపోయి వదిలిన పరుష పదజాలమిది. ఆయనెవరో కాదు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు. తనను నిలదీసిన సమైక్యవాదులపై ఆయన తిట్ల దండకం అందుకున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయిన 49 రోజుల తర్వాత తొలిసారి సొంత జిల్లాకు వచ్చిన కావూరిని ఉద్యమకారులు అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన ప్రకటనకు వ్యతిరేకంగా తమతో కలిసి ఉద్యమంలోకి రావాలని అభ్యర్థించారు. కేంద్ర అమాత్య పదవికి రాజీనామా చేసి సమైక్య పోరాటంలోకి దూకాలని కోరారు. ఆందోళనకారులను సముదాయిల్సింది పోయి వారిని మరింత రెచ్చగొట్టారు. రాజీనామాకు ససేమీరా అనడంతో సమైక్యవాదులు కావూరిని కదలనీయలేదు. 45 ఏళ్ల పొలిటికర్ కెరీర్ ఉన్న తాను నాలుగు నెలలుండే కేంద్ర మంత్రి పదవి కోసం పాకులాడే వెధవని కానని, మీలో ఎవరైనా వెధవలుంటే నేనేం చేయలేనంటూ మాట తూలారు. దీంతో విద్యార్థులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా కావూరి అనుచరులు వారిపై దాడికి పాల్పడ్డారు. తాను పక్కా సమైక్యవాదినని చెప్పుకునే కావూరి సమైక్యాంధ్ర అనడానికి నిరాకరించడం ఆయన ద్వంద్వ వైఖరిని వెల్లడిస్తోంది. కేంద్ర మంత్రి కాగానే ఆయన సమైక్యాంధ్ర టాగ్‌ను వదిలేశారు. మంత్రి పదవి రాకముందు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులతో కలిసి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గళమెత్తిన కావూరి తర్వాత రూటు మార్చారు. కేంద్ర మంత్రిగా స్థాయికి దిగి మాట్లాడలేనంటూ గతంలో బీరాలు పలికిన కావూరి ఇప్పుడు చేసిన పరుష వ్యాఖ్యలకు ఏమని సమాధానం చెబుతారు? -
ఏపీఎన్జీవోల సమ్మెపై ముగిసిన వాదనలు
ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరఫున వీసీ.హెచ్.నాయుడు, ఏపీఎన్జీవోల తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, రాజకీయ అంశమైన రాష్ట్ర విభజన గురించి సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్, ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు టి.దానయ్య వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏపీఎన్జీవో, ఇతర ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శిక్షార్హమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోందంటూ హైకోర్టు మంగళవారం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సమ్మె విషయంలో సర్కారు అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టింది. ప్రభుత్వ చర్యలను గమనిస్తుంటే అవి సమ్మెను సమర్థిస్తున్నట్లు కనిపిస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేసింది. -
సీమాంద్రలో 49 రోజులుగా సమైక్యకు మద్దతుగా నిరసనలు
-
విభజనపై ఏకాభిప్రాయమేదీ?
* షిండేకు విజయమ్మ లేఖ * కేంద్ర హోం మంత్రి స్థాయిలో ఉండి వక్రీకరణ తగదు * విభజన ప్రక్రియను ఆపండి.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి * వైఎస్సార్సీపీ, ఎంఐఎం, సీపీఎం విభజనను వ్యతిరేకించాయి * అంగీకరించింది కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐలే * అలాంటప్పుడు 100% ఏకాభిప్రాయం వచ్చిందని ఎలా చెప్తారు? * ఒక ప్రాంతానికి న్యాయమంటే మరో ప్రాంతానికి అన్యాయమని కాదు.. 60 శాతం మంది ప్రజలు 43 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టదా? సాక్షి, హైదరాబాద్: ఏకాభిప్రాయం కుదిరినందునే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నామన్న కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర హోం మంత్రి స్థాయిలో ఉండి వక్రీకరణ తగదన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐలు మాత్రమే రాష్ట్ర విభజనకు అంగీకరించాయనీ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, సీపీఎం విభజనను వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 60 శాతం మంతి ప్రజలు 43 రోజులుగా ఆందోళనలు చేస్తుంటే 100 శాతం ఏకాభిప్రాయం కుదిరిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈ మేరకు షిండేకు బుధవారం విజయమ్మ మరో లేఖ రాశారు. విభజనపై వైఎస్సార్సీపీ వైఖరిని తెలియజేస్తూ 2012 డిసెంబర్ 28న ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష భేటీలో అందజేసిన లేఖ, ప్రధానికి 2013 ఆగస్టు 14న రాసిన లేఖ, తాజాగా సెప్టెంబర్ 6న షిండేకే రాసిన లేఖలను తాజా లేఖకు జత చేశారు. అందులోని వివరాలిలా ఉన్నాయి... కేంద్ర హోం మంత్రి షిండే గారికి, బాధ్యతాయుతమైన పార్టీగా ఆంధ్రప్రదేశ్ విభజనపై మీకు ఇలాంటి లేఖ రాయాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదు. కానీ కేంద్ర హోంమంత్రి వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వాస్తవాలను వక్రీకరిస్తూంటే బాధ కలిగింది. ‘సీపీఎం మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలూ లిఖితపూర్వకంగా ఆమోదం తెలిపిన తర్వాతే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఒక్క సీపీఎం మినహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ తెలంగాణకు మద్దతిచ్చాయి’ అని ఈ నెల 7న ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మీరన్నట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ మద్దతివ్వగా... రాష్ట్ర విభజన యత్నాలను వైఎస్సార్సీపీ, ఎంఐఎం, సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని మీకు మేం పదేపదే గుర్తు చేస్తున్నాం. నగ్న సత్యం ఇదైతే, మీరు మాత్రం విభజన ప్రక్రియను ఒకే ఒక పార్టీ వ్యతిరేకిస్తోందని అనడం వాస్తవాలను మరుగు పరచడమే. ఇది మీ హోదాకు తగని పని. అందుకే విభజనపై ప్రధానికి, మీకు మా పార్టీ రాసిన లేఖలను జతపరుస్తున్నాం. రాష్ట్ర విభజనపై 2012 డిసెంబర్ 28న ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం నాటి నుంచీ మా పార్టీ వైఖరిని తేటతెల్లంగా తెలియజెపుతూనే వస్తున్నాం. ప్రధానికి రాసిన లేఖలో కూడా మా పార్టీ వైఖరిని పునరుద్ఘాటించాం. అందులో మేం పేర్కొన్న విషయాన్ని మరోసారి మీకు గుర్తు చేయదలచాం. ‘‘ఒక ప్రాంతానికి న్యాయం చేయడమంటే ఇతర ప్రాంతాలకు అన్యాయం చేయడమని కాదు. ఓట్లు, సీట్లకే ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ మౌలిక సూత్రాన్ని పూర్తిగా విస్మరించింది. ఏ ప్రాంతానికీ అన్యాయం జరక్కుండా భాగస్వాములందరిని ఒప్పించి నిర్ణయం తీసుకోలేనపుడు ఏ రాష్ట్రానైన్నా పునర్విభజించే అధికారాన్ని కేంద్రం తన వద్ద ఉంచుకోవడం ఎంతమాత్రమూ సమంజసం కాదు. ైవె ఎస్సార్సీపీ, ఎంఐఎం, సీపీఎం మూడూ వ్యక్తం చేసిన అభిప్రాయమిది. మీరు న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని విభజించవద్దు. యథాతథ స్థితినే కొనసాగించండి. ఇదే మా మూడు పార్టీల వైఖరి’’ అని ఆ లేఖలో స్పష్టం చేశాం. రాయలసీమ, కోస్తా ప్రాంతాల ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తూంటే... ధర్నాలు, సమ్మెలతో ఆ రెండు ప్రాంతాలూ అట్టుడుకుతుంటే... విభజనపై వంద శాతం ఏకాభిప్రాయాన్ని సాధించామని కాంగ్రెస్ ఎలా చెబుతుంది? విభజనకు అంగీకరించింది టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ మాత్రమే. మీరు మాట్లాడుతూ వస్తున్న విషయాల్లోని వక్రీకరణలను సరిదిద్దుకుంటారనే ఉద్దేశంతోనే మా గత లేఖల ప్రతులను మీకు పంపుతున్నాం. తెలియనట్టు నటిస్తున్నారా? రాష్ట్ర విభజన విషయంలో మీరు చేసిన ప్రతిపాదన రాజకీయ పార్టీలకు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదు. కోట్లాది మంది ప్రజలు కూడా దానికి సమ్మతించడం లేదు. తమకు అన్యాయం జరిగిందని వారు నమ్ముతున్నారు. అలాంటపుడు ఈ ప్రక్రియ అందరికీ ఆమోదయోగ్యమేనని మీరు (కేంద్రం) ఎలా చెప్పగలుగుతారు? మీ ప్రతిపాదనకూ ఆమోదయోగ్యతా లేదు, తమకు న్యాయం జరిగిందని ప్రజలు నమ్మడమూ లేదు. అలాంటప్పుడు వాస్తవాలను వక్రీకరించడం ఏ మేరకు వివేకం అన్పించుకుంటుంది? రాష్ట్ర విభజనకు జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలందరూ జూలై 25వ తేదీనే రాజీనామాలు చేశారు. సీడబ్ల్యూసీ సభ్యునిగా, కేంద్ర హోం మంత్రిగా మీకిది తెలిసే ఉంటుంది. విభజన నిర్ణయం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, విభజనకు వ్యతిరేకంగా మీ పార్టీపై ఒత్తిడి పెంచేందుకే వారు రాజీనామాలు చేశారు. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, నేను కూడా విభజనను వ్యతిరేకిస్తూ పదవులు వదులుకున్నాం. 12 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాం. మీరు కేంద్ర హోంమంత్రి గనుక ఇవి మీకు తెలిసే ఉంటాయి. తెలియలేదంటే కచ్చితంగా మీ దృష్టి వీటిపై పడి ఉండకపోవచ్చు. విభజనను వ్యతిరేకిస్తూ నా సారథ్యంలో మా పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి, ప్రధానితో పాటు ఇతర పార్టీల నేతలను కలవడంతో పాటు ఒక రోజు నిరసన దీక్ష కూడా చేపట్టిన విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ ఢిల్లీలోనే జరిగాయి. అయినా ఇవన్నీ కేంద్ర హోంమంత్రి దృష్టికి రాలేదా? లేదంటే మీరు కావాలనే ఇవేవీ తెలియనట్టుగా నటిస్తున్నారని మేమనుకోవాలా? అదే నిజమైతే అందుకు కారణాలేమిటన్నది కూడా మీకే తెలియాలి. అంతకుముందు మీ పార్టీ నేత దిగ్విజయ్‌సింగ్ కూడా విభజనపై వక్రీకరణలతో కూడిన కథనాలను మీడియాతో ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఏకాభిప్రాయాన్ని సాధించామంటూ ఊదరగొట్టారు. విభజన పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకతను పక్కన పెట్టారు. ఆయన చెప్పిందేదీ వాస్తవం కాదు. అందుకే ప్రధానికి మేం రాసిన లేఖలో మా వైఖరిని స్పష్టం చేశాం. మా విధానంలో ఎలాంటి మార్పూ లేదని, మాతో పాటు ఎంఐఎం, సీపీఎం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నాయని వివరించాం. మీ నిర్ణయాన్ని మాపై రుద్దుతారా? ఈ వాస్తవాలన్నీ బాగా తెలిసి ఉండి కూడా, ప్రభుత్వంలో భాగంగా ఉండి కూడా, ఒక కాంగ్రెస్ వ్యక్తి మాదిరిగా సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని మా తలపై తుపాకి పెట్టి మరీ మాపై రుద్దాలని మీరు చూస్తున్నారు. ఇదే మాత్రమూ న్యాయబద్ధం కాదు. విభజనను వ్యతిరేకిస్తున్న పార్టీల గొంతు నులిమేందుకు మీరు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. మీ పార్టీ నిర్ణయాన్ని ప్రజలపై రుద్దజూస్తున్నారు. మీ నిర్ణయంపై వ్యతిరేకత మిన్నంటుతుందనే భయంతోనే మీరు కనీసం ప్రభుత్వ కమిటీని కూడా వేయలేదు! అసలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు కనీసం అన్ని పార్టీల వివరణ, స్పష్టత అయినా తీసుకోలేదెందుకు? హోంమంత్రి వంటి ఉన్నత స్థానంలో ఉండి, మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దుతూ, మీ స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి దేశ ప్రజలను కూడా తప్పుదోవ పట్టించడం ఎంతవరకు న్యాయం? రాష్ట్రంలోని సుమారు 60 శాతం మంది ప్రజలు విభజన నిర్ణయానికి నిరసనగా 43 రోజులుగా సమ్మె చేస్తుంటే మీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. నీళ్లెక్కడి నుంచి ఇస్తారు? రాష్ట్రం సమైక్యంగా ఉండగానే ఎగువన మహారాష్ట్ర అవసరాలు తీరి, కర్ణాటకలో అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండనిదే మాకు నీళ్లు రావడం లేదు. ఇలాంటప్పుడు మధ్యలో మరో రాష్ట్రం వస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీళ్లెక్కడి నుంచి వస్తాయి? కృష్ణా నదీ ఆయకట్టు వెంబడి ఉన్న రైతుల మధ్య ప్రతి రోజూ నీటి యుద్ధాలు జరుగుతాయి. ఒక ప్రాంతంలో కొన్ని ఓట్లు, సీట్ల కోసం మీరు మా రాష్ట్రాన్ని విభజిస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ మంచినీళ్లే ఉండవు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కానీ మధ్యలో మరో రాష్ర్టం వస్తే పోలవరానికి నీళ్లు రావడం అంత సులువు కాదు. గతంలో మీరు మమ్మల్ని మద్రాసు రాష్ట్రం వదలి వెళ్లమన్నారు. ఇప్పుడేమో పదేళ్లలో హైదరాబాద్‌ను కూడా ఖాళీ చేయాలంటున్నారు. మేం హైదరాబాద్ వీడితే మా పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళతారు? రాష్ట్ర ఆదాయంలో 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. అది మాకు అందుబాటులో లేకున్నా, కొత్త రాజధాని నిర్మాణానికే ఖర్చయినా, కనీసం ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు కూడా డబ్బుండదు! ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలకు, మున్ముందు మొదలు పెట్టే వాటికి కూడా నిధులుండవు. హైదరాబాద్‌లో నివసించే ఉద్యోగులు, ప్రజల భవిష్యత్తు సందిగ్ధంలో పడుతుంది. మీకు చీమ కుట్టినట్టయినా లేదు మాకు మా రాష్ట్రంలోనే సహజ వాయువు అందుబాటులో ఉన్నా, విభజన జరిగితే దాన్ని మేం వాడుకునేందుకు అనుమతించే పరిస్థితి ఉండబోదు. తమకు నీళ్లుండబోవని, హైదరాబాద్ తమకు కాకుండా పోతోందని కోట్లాది మంది ప్రజలు 43 రోజులుగా ఆందోళన చేస్తున్నా మీకు చీమ కుట్టినట్టయినా లేదు. పైగా విభజనపై ఏకాభిప్రాయం ఉందని వక్రీకరిస్తున్నారు. విభజన వల్ల కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లు, ఓట్లు లభించవచ్చేమో గానీ, విభజన ప్రక్రియ కోట్లాది మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. అందుకే విభజన ప్రక్రియను నిలిపి వేయాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మిమ్మల్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. - వైఎస్ విజయమ్మ -
'ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నం'
హైదరాబాద్ : సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని మంత్రి పార్థసారధి అన్నారు. అయితే కొన్ని పార్టీలు ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బుధవారం ఉదయం ఓ ఛానల్ కార్యక్రమంలో మంత్రి పార్థసారధి మాట్లాడుతూ సీమాంధ్రలో ఉద్యమాల వల్ల విద్యార్థుల భవిష్యత్ ఆందోళనకరంగా మారిందన్నారు. పాఠశాలలు తెరిపించేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. టీడీపీ, వైఎస్ఆర్ సీపీ పచ్చి అవకాశవాద పార్టీలని పార్థసారధి విమర్శించారు. చంద్రబాబునాయుడు తన యాత్రలో ఏం చెపుతున్నారో ఆయనకే తెలియటం లేదని ఆయన అన్నారు. -
ఇక ఢిల్లీలో సమైక్య పోరాటం
* సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దేశ రాజధాని ఢిల్లీకి కూడా విస్తరింపజేయూలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సమైక్య సెగ తాకేలా ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల నిర్వహణకు ఉద్యోగులు నిర్ణయించారు. ఉద్యోగులందరూ భారీ సంఖ్యలో ఢిల్లీ చేరుకుని, రెండు మూడు రోజులు ఆందోళనలు, ధర్నాలు భారీ స్థాయిలో చేపట్టాలని ఫోరం వుంగళవారం సచివాలయుం డీ బ్లాక్‌లో జరిగిన సర్వసభ్య సమావేశం తీర్మానించింది. సచివాలయంలో ఇకపై వినూత్న రీతుల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్టు ఫోరం కన్వీనర్ యు. మురళీకృష్ణ, కార్యదర్శి కృష్ణయ్య తెలిపారు. ఢిల్లీలో జరపబోయే ఆందోళనపై కార్యచరణను రూపొందిస్తున్నామన్నారు. మరోవైపు,.. సమైక్యాంధ్ర ప్రదేశ్‌కు మద్దతుగా సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు సమ్మె వుంగళవారమూ కొనసాగింది. పెద్దసంఖ్యలో ఉద్యోగు లు నిరసనలో పాల్గొన్నారు. బుధవారం తో సమ్మె 9వ రోజుకు చేరుకుంటోంది. -
సీమాంధ్రలో 40వ రోజుకు సమైక్యాంధ్ర ఉద్యమం!
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళలు ఆదివారానికి 40వ రోజుకు చేరుకున్నాయి. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమానికి వివిధ సంస్థలు, నేతలు, విద్యార్థులు రాస్తారోకోలతోపాటు, మానవహారాలు నిర్మిస్తూ 13 జిల్లాలో నిరసన తెలుపుతున్నారు. ఉద్యమం ప్రారంభించి.. నెలరోజులు పూర్తవుతున్నా..ఉద్యమ ప్రభావం తగ్గకపోగా.. మరింత ఉధృతమవుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా కర్నూలు, అనంతపురం, తూర్పు గోదావరి, ఇతర జిల్లాలో ర్యాలీలు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. ఆదివారం రోజున గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున్న మానవహారాన్ని నిర్మించారు. విజయనగరంలో పలు పార్టీలకు చెందిన నేతలు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఇతర జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలతో రోడ్లపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ-రాజమండ్రి రహదారిపై మహిళలు రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో పాల్గొన్న ఎపీఎన్జీఓ ఉద్యోగులపై జరిపిన దాడులపై నిరసన వ్యక్తం చేశారు. -
వైజాగ్‌లో సమైక్య సమరం
-
తిరుపతిలో సమైక్య గళం
-
ఉద్యమంపై ఢిల్లీ పెద్దల దృష్టి