సోనియాను అతిహేయంగా చిత్రీకరిస్తున్నారు: చిరంజీవి
హైదరాబాద్: సమైక్యవాదం ముసుగులో కొన్ని స్వార్ధపర శక్తులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని అతిహేయంగా చిత్రీకరిస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి ఒక ప్రకటనలో తప్పుపట్టారు. సోనియాగాంధీకి తిరుపతిలో కొందరు వ్యక్తులు సమాధి క ట్టిన సంఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దురాగతానికి పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి చట్ట ప్రకారం వారిని శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమైక్యవాదానికి కట్టుబడిన కొంత మంది కాంగ్రెస్ నేతలను సైతం వారి ప్రతిష్ట దిగజార్చడానికి ఒక వ్యూహం ప్రకారం దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో నచ్చని విధానాలను వ్యతిరేకించే స్వేచ్ఛ, విమర్శించే హక్కు అందరికీ ఉందని.. అయితే, ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపర్చే విధంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ ఆమోదించరని పేర్కొన్నారు. ఈ విధానాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.