'సోనియాగాంధీ బర్త్ డే ఆంధ్రప్రదేశ్కు డెత్ డే' | Samaikyandhra Protesters follows Sonia gandhi birthday as 'Black Day' | Sakshi
Sakshi News home page

'సోనియాగాంధీ బర్త్ డే ఆంధ్రప్రదేశ్కు డెత్ డే'

Published Mon, Dec 9 2013 9:05 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

Samaikyandhra Protesters follows Sonia gandhi birthday as 'Black Day'

అనంతపురం: రాష్ట్ర విభజనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా సమైక్యవాదులు సోమవారం అనంతపురం జిల్లాలో బ్లాక్ డే గా పాటిస్తున్నారు. జిల్లాలో సమైక్య ఉద్యమాలు కొనసాగుతున్నాయి. మరోవైపు గుంటూరు జిల్లాలోనూ సమైక్యవాదులు నిరసనలు తెలుపుతున్నారు. సోనియాగాంధీ బర్త్ డే ఆంధ్రప్రదేశ్కు డెత్ డే అంటూ ప్లకార్డులతో సమైక్యవాదులు తెనాలిలో తమ నిరసనలు తెలియచేశారు.

రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డిసెంబర్ 9వ తేదీని బ్లాక్ డే గా కర్నూలు జిల్లా వాసులు పాటిస్తున్నారు. మరోవైపు సోనియా జన్మదినాన్ని తెలుగు జాతి విద్రోహదినంగా పాటిస్తూ ఆటో కార్మికుల జేఏసీ నగరంలో నేడు బంద్కు పిలుపునిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement