
సాక్షి, తిరుపతి: సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడకూడదని మంత్రి రోజా హితవు పలికారు. చిరంజీవి సలహా ఇవ్వాలి అనుకుంటే ముందు అయన తమ్ముడికి ఇవ్వాలని సూచించారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏమీ చేశారని ప్రశ్నించారు. పార్టీ విలీనం చేసినప్పుడు చిరంజీవి లబ్ధి పొందారని, కానీ రాష్ట్రానికి చేసింది ఏం లేదన్నారు. సినిమా వాళ్లు చెప్తే వినే స్థాయిలో లేమని అన్నారు.
బుధవారం తిరుపతిలో రోజా మాట్లాడుతూ.. చిరంజీవి, పవన్‌పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. గడపగడపకు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎన్ని రోడ్లు వేశామోనని పేర్కొన్నారు. ఏ అర్హత ఉందని సినిమా టికెట్ ధర పెంచమని అడిగారని ప్రశ్నించారు. హీరోలందరూ సీఎం జగన్ దగ్గరకు ఎందుకెళ్లారని నిలదీశారు. ఏ హీరో కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని అన్నారు. రాష్ట్రం విడిపోతే చిరంజీవి ఏం చేశారని, హోదా గురించి అప్పుడెందుకు అడగలేదని ప్రశ్నించారు.
చదవండి: రామోజీకి కోర్టుల్లో చాలా పలుకుబడి ఉంది: మాజీ ఎంపీ ఉండవల్లి
Comments
Please login to add a commentAdd a comment