హైదరాబాద్: కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి బుధవారమిక్కడ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన సభలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన సోనియాగాంధీని హకీంపేట విమానాశ్రయంలో చిరంజీవి కలిశారు. ఆయన వెంట మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కూడా ఉన్నారు. హెలికాప్టర్ ఎక్కేముందు సోనియాగాంధీ.. చిరంజీవితో కొద్దిసేపు మాట్లాడారు. సీమాంధ్రలో పరిస్థితి, ప్రచార కార్యక్రమాలపై చిరంజీవి ఈ సందర్భంగా క్లుప్తంగా ఆమెకు వివ రించారు.
సోనియా సభకు వెళ్లని వయలార్
ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ వయలార్ రవి హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ కరీంనగర్‌లో సోనియా సభకు వెళ్లలేదు. సోనియాగాంధీకి హకీంపేట విమానాశ్రయంలో దిగ్విజయ్‌సింగ్, చిరంజీవి తదితరులు స్వాగతం పలికారు. అక్కడకూ వయలార్ రవి వెళ్లలేదు. బుధవారం హైదరాబాద్‌లోని ఒక నేత ఇంటిలో విందుకు వెళ్లిన ఆయన తర్వాత హోటల్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు.
సోనియాతో చిరంజీవి భేటీ
Published Thu, Apr 17 2014 2:01 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement