సినీ రంగంలో ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, అందుకు సంబంధించిన నామినేషన్ల కార్యక్రమం పూర్తి అయినట్లు సమాచారం. 65వ సౌత్ భారత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కాన్వెన్షన్ సెంటర్‌లో జూన్16, 2018 జరగనుంది. వివిధ విభాగాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయినట్లు నిర్వాహకులు తెలిపారు. టాలీవుడ్‌కు సంబంధించిన నామినేషన్ల వివరాలు..
ఉత్తమ చిత్రం : అర్జున్ రెడ్డి, బాహుబలి 2, ఫిదా, గౌతమీపుత్ర శాతకర్ణి, ఘాజీ, శతమానం భవతి చిత్రాలు ఎంపికయ్యాయి.
ఉత్తమ నటుడు : చిరంజీవి - ఖైదీ నెంబర్ 150, జూనియర్ ఎన్టీఆర్ - జై లవకుశ, నందమూరి బాలకృష్ణ - గౌతమీపుత్ర శాతకర్ణి, ప్రభాస్ - బాహుబలి 2, వెంకటేష్ - గురు
విజయ్ దేవరకొండ - అర్జున్ రెడ్డి లు ఉత్తమ నటుల క్యాటగిరీలో ఎంపికయ్యారు.
ఉత్తమ నటి : అనుష్క - బాహుబలి2, నివేధా థామస్ - నిన్నుకొరి, రకుల్ ప్రీత్ సింగ్ - రారండోయ్ వేడుక చూద్దాం, రితికా సింగ్ - గురు, సాయి పల్లవి - ఫిదాలు ఉత్తమ నటి విభాగంలో ఎంపికయ్యారు.
ఉత్తమ దర్శకుడు
క్రిష్ - గౌతమీపుత్ర శాతకర్ణి
రాజమౌళి - బాహుబలి 2
సందీప్ వంగ - అర్జున్ రెడ్డి
సంకల్ప్ రెడ్డి - ఘాజీ
సతీష్ వేగేష్న - శతమానం భవతి
శేఖర్ కమ్ముల - ఫిదా
ఉత్తమ సహాయ నటుడు:
ఆది పినిశెట్టి - నిన్నుకోరి
ప్రకాష్ రాజ్ - శతమానం భవతి
రాణా - బాహుబలి2
ఎస్‌జే సూర్య - స్పైడర్
సత్యరాజ్ - బాహుబలి2
ఉత్తమ సహాయ నటి
భూమిక - ఎంసీఏ
కాథరీన్ థ్రెసా - నేనే రాజు నేనే మంత్రి
జయసుధ - శతమానం భవతి
రమ్యకృష్ణ - బాహుబలి 2
శరణ్య ప్రదీప్ - ఫిదా
ఉత్తమ గీత రచయిత
చైతన్య పింగాలి: ఊసుపోదు (ఫిదా)
చంద్రబోస్ - నువ్వేలే నువ్వేలే (జయ జానకి నాయక)
చంద్రబోస్ - రావణ (జై లవకుశ)
ఎం ఎం కీరవాణి - దండాలయ్య (బాహుబలి2)
రామజోగయ్య శాస్త్రి - శతమానం భవతి (శతమానం భవతి)
శ్రేష్ఠ - మధురమే (అర్జున్ రెడ్డి)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్)
అనురాగ్ కులకర్ణి - మెల్లగా తెల్లారిందోయ్
అర్మాన్ మాలిక్ - హలో
హేమచంద్ర - ఊసుపోదు
ఎల్‌వి రేవంత్ - తెలిసెనే నా నువ్వే
సిద్ శ్రీరామ్ - అడిగా అడిగా
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫీమేల్)
గీతా మాధురి & మాన్షి - మహానుభావుడు
మధుప్రియ - వచ్చిండే
నేహా భాసిన్ - స్వింగ్ జరా
సమీరా భరద్వాజ్ - మదురమే
సోని, దీపు - హంసనావ
Comments
Please login to add a commentAdd a comment