khaidi no 150 movie
-
65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినేషన్లు..
సినీ రంగంలో ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, అందుకు సంబంధించిన నామినేషన్ల కార్యక్రమం పూర్తి అయినట్లు సమాచారం. 65వ సౌత్ భారత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కాన్వెన్షన్ సెంటర్లో జూన్16, 2018 జరగనుంది. వివిధ విభాగాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయినట్లు నిర్వాహకులు తెలిపారు. టాలీవుడ్‌కు సంబంధించిన నామినేషన్ల వివరాలు.. ఉత్తమ చిత్రం : అర్జున్ రెడ్డి, బాహుబలి 2, ఫిదా, గౌతమీపుత్ర శాతకర్ణి, ఘాజీ, శతమానం భవతి చిత్రాలు ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడు : చిరంజీవి - ఖైదీ నెంబర్ 150, జూనియర్ ఎన్టీఆర్ - జై లవకుశ, నందమూరి బాలకృష్ణ - గౌతమీపుత్ర శాతకర్ణి, ప్రభాస్ - బాహుబలి 2, వెంకటేష్ - గురు విజయ్ దేవరకొండ - అర్జున్ రెడ్డి లు ఉత్తమ నటుల క్యాటగిరీలో ఎంపికయ్యారు. ఉత్తమ నటి : అనుష్క - బాహుబలి2, నివేధా థామస్ - నిన్నుకొరి, రకుల్ ప్రీత్ సింగ్ - రారండోయ్ వేడుక చూద్దాం, రితికా సింగ్ - గురు, సాయి పల్లవి - ఫిదాలు ఉత్తమ నటి విభాగంలో ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడు క్రిష్ - గౌతమీపుత్ర శాతకర్ణి రాజమౌళి - బాహుబలి 2 సందీప్ వంగ - అర్జున్ రెడ్డి సంకల్ప్ రెడ్డి - ఘాజీ సతీష్ వేగేష్న - శతమానం భవతి శేఖర్ కమ్ముల - ఫిదా ఉత్తమ సహాయ నటుడు: ఆది పినిశెట్టి - నిన్నుకోరి ప్రకాష్ రాజ్ - శతమానం భవతి రాణా - బాహుబలి2 ఎస్జే సూర్య - స్పైడర్ సత్యరాజ్ - బాహుబలి2 ఉత్తమ సహాయ నటి భూమిక - ఎంసీఏ కాథరీన్ థ్రెసా - నేనే రాజు నేనే మంత్రి జయసుధ - శతమానం భవతి రమ్యకృష్ణ - బాహుబలి 2 శరణ్య ప్రదీప్ - ఫిదా ఉత్తమ గీత రచయిత చైతన్య పింగాలి: ఊసుపోదు (ఫిదా) చంద్రబోస్ - నువ్వేలే నువ్వేలే (జయ జానకి నాయక) చంద్రబోస్ - రావణ (జై లవకుశ) ఎం ఎం కీరవాణి - దండాలయ్య (బాహుబలి2) రామజోగయ్య శాస్త్రి - శతమానం భవతి (శతమానం భవతి) శ్రేష్ఠ - మధురమే (అర్జున్ రెడ్డి) బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) అనురాగ్ కులకర్ణి - మెల్లగా తెల్లారిందోయ్ అర్మాన్ మాలిక్ - హలో హేమచంద్ర - ఊసుపోదు ఎల్వి రేవంత్ - తెలిసెనే నా నువ్వే సిద్ శ్రీరామ్ - అడిగా అడిగా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫీమేల్) గీతా మాధురి & మాన్షి - మహానుభావుడు మధుప్రియ - వచ్చిండే నేహా భాసిన్ - స్వింగ్ జరా సమీరా భరద్వాజ్ - మదురమే సోని, దీపు - హంసనావ -
`ఖైదీ'తో స్టెప్పులేయిస్తున్న లారెన్స్
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం `ఖైదీ నంబర్ 150` షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. చిరంజీవి, లక్ష్మీరాయ్‌పై డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీలో భారీ సెట్లో స్పెషల్ సాంగ్ తెరకెక్కిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ తో లారెన్స్ స్టెప్పులు వేయిస్తున్నారు. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ లిరిక్ అందించడమే కాకుండా అదిరిపోయే ట్యూన్ కట్టారు. మూవీ హైలైట్ సాంగ్స్‌లో ఇదొకటిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మళ్లీ ఈ కలయికలో మరో మైండ్ బ్లోవింగ్ పెర్ఫామెన్స్ ను తెలుగు ప్రేక్షకులు వీక్షించే ఛాన్సుందని అంటోంది. పాటల చిత్రీకరణతో పాటు మిగతా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనులు జరుపుకోనున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరిలో సినిమా రిలీజ్ చేస్తామని నిర్మాత రామ్‌చరణ్ ఇదివరకే తెలిపారు. వివి వినాయక్ దర్శ్తకత్వంలో తెరకెక్కుతున్న `ఖైదీ నంబర్ 150'లో చిరంజీవి జోడిగా కాజల్ నటిస్తోంది. -
బాలయ్యతో పోటీకి మెగాస్టార్ రెడీ!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `ఖైదీ నంబర్ 150` సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజవుతోంది. ఈ చిత్రంలో అందాల కాజల్ కథానాయికగా నటిస్తోంది. వి.వి.వినాయక్ ఈ కమర్షియల్ ఎంటర్టైనర్కి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజైన మెగాస్టార్ స్టిల్స్‌కి, మోషన్ పోస్టర్‌కి చక్కని స్పందన వచ్చినందుకు చిత్రయూనిట్ ఎంతో హ్యాపీగా ఉంది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. 2017 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. నిర్మాత రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ``70 శాతం పైగా చిత్రీకరణ పూర్తయింది. నాన్నగారు డబ్బింగ్ కూడా ప్రారంభించారు. ఇప్పటివరకూ చక్కని ఔట్పుట్ వచ్చిందన్న సంతృప్తి ఉంది. అన్ని పనులు పూర్తి చేసి, జనవరిలో సంక్రాంతి కానుకగా `ఖైదీ నంబర్ 150` చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు. రత్నవేలు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్స్ రెడీ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్ పాత్రలో నటిస్తున్నారు. కాగా, నందమూరి నట సింహం బాలయ్య ఇప్పటికే సంక్రాంతి రేసులో నిలిచాడు. నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 12న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది. చాలా కాలం తర్వాత ఇద్దరు సీనియర్ అగ్ర కథానాయకుల సినిమాలు సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతుండడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.