`ఖైదీ'తో స్టెప్పులేయిస్తున్న లారెన్స్
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం `ఖైదీ నంబర్ 150` షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. చిరంజీవి, లక్ష్మీరాయ్‌పై డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీలో భారీ సెట్‌లో స్పెషల్ సాంగ్ తెరకెక్కిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ తో లారెన్స్ స్టెప్పులు వేయిస్తున్నారు. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ లిరిక్ అందించడమే కాకుండా అదిరిపోయే ట్యూన్ కట్టారు. మూవీ హైలైట్ సాంగ్స్‌లో ఇదొకటిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మళ్లీ ఈ కలయికలో మరో మైండ్ బ్లోవింగ్ పెర్ఫామెన్స్ ను తెలుగు ప్రేక్షకులు వీక్షించే ఛాన్సుందని అంటోంది.
పాటల చిత్రీకరణతో పాటు మిగతా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనులు జరుపుకోనున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరిలో సినిమా రిలీజ్ చేస్తామని నిర్మాత రామ్‌చరణ్ ఇదివరకే తెలిపారు. వివి వినాయక్ దర్శ్తకత్వంలో తెరకెక్కుతున్న `ఖైదీ నంబర్ 150'లో చిరంజీవి జోడిగా కాజల్ నటిస్తోంది.