Hakimpeta airport
-
హైదరాబాద్‌లో సెకండ్ ఎయిర్‌పోర్టు?
-
స్వాగతానికి అధికారులు మాత్రమే.. ప్రధాని సభకు దూరంగా వివేక్ వెంకటస్వామి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధానికి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి, మంత్రులు స్వాగతం పలకాల్సి ఉంటుంది. కానీ ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలెవరూ వెళ్లలేదు. ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ ఇతర అధికారులు హకీంపేట వెళ్లి స్వాగతం పలికారు. తిరిగి వెళ్లే సమయంలోనూ అధికారులే వీడ్కోలు పలికారు. ప్రధాని సభకు దూరంగా వివేక్ వెంకటస్వామి! హనుమకొండ: ప్రధాని మోదీ సభకు బీజేపీ చేరికల కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హాజరుకాలేదు. ఆయన కొన్ని రోజులుగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటంతో.. పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభకు ఆయన రాకపోవడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
హకీంపేట్ ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతికి సీఎం కేసీఆర్, గవర్నర్ స్వాగతం
-
కల్నల్ సంతోష్ బాబు భౌతికకాయానికి ప్రముఖుల నివాళి
-
సూర్యాపేటకు సంతోష్ బాబు పార్థీవదేహం
సాక్షి, హైదరాబాద్ : భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహం సూర్యాపేట విద్యానగర్ కాలనీలోని స్వగృహనికి చేరుకుంది. జాతీయ జెండాలు, వందేమాతరం నినాదాలతో ఎదురెళ్లి సంతోష్ బాబు పార్ధీవదేహన్ని ప్రజలు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్మీ మేజర్ జనరల్ అధికారులు రిసీవ్ చేసుకున్నారు. అంబులెన్స్‌తో పాటే హైదరాబాద్ నుంచి మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటకు చేరుకున్నారు. అంతకు ముందు సంతోష్ బాబు పార్థీవ దేహం హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రత్యేక సైనిక విమానం ద్వారా సంతోష్ బాబు పార్థీవదేహాన్ని హకీంపేటకు తరలించారు. ఎయిర్‌పోర్ట్‌లో సంతోష్ బాబు భౌతికకాయానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రుల కేటీఆర్, మల్లారెడ్డిలతో పాటుగా పలువురు ప్రముఖులు నివాళుర్పించారు. అనంతరం సంతోష్ బాబు పార్థీవదేహానికి ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో వందనం సమర్పించారు. గోల్కొండ వసతి గృహం నుంచి సంతోష్ బాబు కుటుంబసభ్యులు కూడా హకీంపేటకు చేరుకున్నారు. కాగా, సంతోష్ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు, స్థానికులు, ప్రజలు హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో అనుమతి ఉన్నవారిని మాత్రమే ఆర్మీ అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోనికి పంపించారు. అంత్యక్రియల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు సూర్యాపేట : కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు గురువారం సూర్యాపేట పక్కనే ఉన్న కేసారం గ్రామంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, ఆర్మీ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీ, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆర్మీ మేజర్లు, ఉన్నతాధికారులు ఈ అంత్యక్రియల్లో పాల్గొంటారని చెప్పారు. బుధవారం రాత్రి 8 గంటలకు సంతోష్ పార్థీవదేహం చేరకుంటుందన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. రేపు జరిగే కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సంతోష్ బాబను కడసారి చూసేందుకు వచ్చేవారు భౌతిక దూరం నిబంధన పాటించాలన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో మీడియా విజిట్
-
సోనియాతో చిరంజీవి భేటీ
హైదరాబాద్: కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి బుధవారమిక్కడ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన సభలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన సోనియాగాంధీని హకీంపేట విమానాశ్రయంలో చిరంజీవి కలిశారు. ఆయన వెంట మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కూడా ఉన్నారు. హెలికాప్టర్ ఎక్కేముందు సోనియాగాంధీ.. చిరంజీవితో కొద్దిసేపు మాట్లాడారు. సీమాంధ్రలో పరిస్థితి, ప్రచార కార్యక్రమాలపై చిరంజీవి ఈ సందర్భంగా క్లుప్తంగా ఆమెకు వివ రించారు. సోనియా సభకు వెళ్లని వయలార్ ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ వయలార్ రవి హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ కరీంనగర్లో సోనియా సభకు వెళ్లలేదు. సోనియాగాంధీకి హకీంపేట విమానాశ్రయంలో దిగ్విజయ్‌సింగ్, చిరంజీవి తదితరులు స్వాగతం పలికారు. అక్కడకూ వయలార్ రవి వెళ్లలేదు. బుధవారం హైదరాబాద్‌లోని ఒక నేత ఇంటిలో విందుకు వెళ్లిన ఆయన తర్వాత హోటల్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు.