
హకీంపేట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధానికి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి, మంత్రులు స్వాగతం పలకాల్సి ఉంటుంది. కానీ ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలెవరూ వెళ్లలేదు. ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ ఇతర అధికారులు హకీంపేట వెళ్లి స్వాగతం పలికారు. తిరిగి వెళ్లే సమయంలోనూ అధికారులే వీడ్కోలు పలికారు.
ప్రధాని సభకు దూరంగా వివేక్ వెంకటస్వామి!
హనుమకొండ: ప్రధాని మోదీ సభకు బీజేపీ చేరికల కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హాజరుకాలేదు. ఆయన కొన్ని రోజులుగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటంతో.. పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభకు ఆయన రాకపోవడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment