సూర్యాపేటకు సంతోష్‌ బాబు‌ పార్థీవదేహం | Colonel Santosh Babu Mortal Reaches Hakimpet Airport | Sakshi
Sakshi News home page

సూర్యాపేటకు సంతోష్‌ బాబు‌ పార్థీవదేహం

Published Wed, Jun 17 2020 7:54 PM | Last Updated on Thu, Jun 18 2020 12:16 AM

Colonel Santosh Babu Mortal Reaches Hakimpet Airport - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్‌ సంతోష్‌ బాబు పార్థీవదేహం సూర్యాపేట విద్యానగర్ కాలనీలోని స్వగృహనికి చేరుకుంది. జాతీయ జెండాలు, వందేమాతరం నినాదాలతో  ఎదురెళ్లి సంతోష్ బాబు పార్ధీవదేహన్ని ప్రజలు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్మీ మేజర్ జనరల్ అధికారులు రిసీవ్‌ చేసుకున్నారు. అంబులెన్స్‌తో పాటే హైదరాబాద్ నుంచి మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటకు చేరుకున్నారు.

అంతకు ముందు సంతోష్‌ బాబు పార్థీవ దేహం హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రత్యేక సైనిక విమానం ద్వారా సంతోష్‌ బాబు పార్థీవదేహాన్ని హకీంపేటకు తరలించారు. ఎయిర్‌పోర్ట్‌లో సంతోష్‌ బాబు భౌతికకాయానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, మంత్రుల కేటీఆర్‌, మల్లారెడ్డిలతో పాటుగా పలువురు ప్రముఖులు నివాళుర్పించారు.  అనంతరం సంతోష్‌ బాబు పార్థీవదేహానికి ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో వందనం సమర్పించారు. గోల్కొండ వసతి గృహం నుంచి సంతోష్‌ బాబు కుటుంబసభ్యులు కూడా హకీంపేటకు చేరుకున్నారు. 

కాగా, సంతోష్ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు, స్థానికులు, ప్రజలు హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో అనుమతి ఉన్నవారిని మాత్రమే ఆర్మీ అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోనికి పంపించారు.

అంత్యక్రియల ఏర్పాట‍్లను పరిశీలించిన అధికారులు
సూర్యాపేట : కల్నల్‌ సంతోష్‌ బాబు అంత్యక్రియలు గురువారం సూర్యాపేట పక్కనే ఉన్న కేసారం గ్రామంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌, ఆర్మీ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీ, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సంతోష్‌ బాబు అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆర్మీ మేజర్లు, ఉన్నతాధికారులు ఈ అంత్యక్రియల్లో పాల్గొంటారని చెప్పారు. బుధవారం రాత్రి 8 గంటలకు సంతోష్‌ పార్థీవదేహం చేరకుంటుందన్నారు.


ఎస్పీ మాట్లాడుతూ.. రేపు జరిగే కల్నల్‌ సంతోష్‌ బాబు అంత్యక్రియలకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సంతోష్‌ బాబను కడసారి చూసేందుకు వచ్చేవారు భౌతిక దూరం నిబంధన పాటించాలన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement