మహిళ వేషం వేసిన ఎన్.శివప్రసాద్
తిరుపతి: చిత్తూరు టీడీపీ ఎంపీ ఎన్.శివప్రసాద్ మరోసారి వేషం మార్చారు. సమైక్యాంధ్రకు మద్దతు విభిన్న గెటప్పులతో లోక్సభలో హల్చల్ చేసిన ఆయన ఈసారి మహిళగా మారిపోయారు. గాంధీ జయంతి రోజున వృద్ధ మహిళగా వేషం ధరించి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తిరుపతిలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అచ్చం మహిళలాగే అభినయిస్తూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి సోనియా గాంధీ, కేసీఆర్ కారణమని విమర్శించారు.
జాతీయ మీడియాను ఆకర్షించేందుకు పార్లమెంట్ సమావేశాల్లో పలు 'వేషాలు' వేశారు. శ్రీకృష్ణుడి అవతారంతో లోక్సభలో ప్రత్యక్షమయ్యారు. తర్వాత గాంధీ టోపీ పెట్టుకుని నిరసన తెలిపారు. ఒక లోక్సభ నుంచి సస్పెండయినప్పడు కొరడాతో కొట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. మరోసారి పార్లమెంట్ వెలుపల చెక్క భజన చేస్తూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.