n sivaprasad
-
మీడియాతో మాట్లాడొద్దు ప్లీజ్..
ఎంపీ శివప్రసాద్‌తో మంత్రులు సుజన, అమర్నాథ్రెడ్డి రాయబారం తిరుపతి తుడా: రాష్ట్రవ్యాప్తంగా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రభుత్వ తీరును అంబేడ్కర్ జయంతి సభావేదికపై ఎండగట్టిన టీడీపీ చిత్తూరు ఎంపీ ఎన్.శివప్రసాద్‌ను శాంతింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, చిత్తూరు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అమర్నాథరెడ్డి శనివారం రాత్రి 10 గంటల తరువాత ఫోన్‌ద్వారా రాయబారం నడిపారని విశ్వసనీయ సమాచారం. ఎంపీ శివప్రసాద్ దళితుడు కాబట్టే ఏకంగా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి సస్పెండ్ చేస్తానని బెదిరించి, కబ్జా మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారని బాబుపై రాష్ట్రవ్యాప్తంగా దళితసంఘాలు గళం విప్పాయి. దీంతో ప్రస్తుతానికి రాయబారమే సరైందని గుర్తించి సుజనాచౌదరి, అమరనాథరెడ్డిలను ఎంపీ వద్దకు పంపాలని నిర్ణయించారు. దీంతో శనివారం రాత్రి వారిద్దరూ ఫోన్‌చేసి ఎంపీని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. దీంతో శివప్రసాద్ ‘నిజం మాట్లాడితే నన్ను సస్పెండ్ చేస్తానంటారా.. ఎలా చేస్తారో చూస్తాను, దళితులకు అన్యాయం జరుగుతున్నది నిజం కాదా.. అందుకే మాట్లాడాను, మావాళ్లకు నేనేం సమాధానం చెప్పాలి..’ అని తన ఆవేదనను వెళ్లగక్కారు. ఆయన ఎంతకీ ససేమిరా అనడంతో ఆ ఇద్దరు మంత్రులు రేపో ఎల్లుండో తిరుపతి వస్తారని తెలిసింది. -
‘అందుకే నాపై చంద్రబాబు నిందలు’
చిత్తూరు: దళితులకు జరుగుతున్న అన్యాయంపై వెనక్కితగ్గే ప్రసక్తే లేదని చిత్తూరు టీడీపీ ఎంపీ ఎన్. శివప్రసాద్ స్పష్టం చేశారు. దళితులకు న్యాయం చేయాలని తాను అడగడం తప్పా అని ప్రశ్నించారు. డీకేటీ భూముల రెగ్యులరైజేషన్ హామీ ఏమైంది, బ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు, ఎస్సీ సబ్ ప్లాన్ కు నిధులు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. ఈ ప్రశ్నలు అడినందుకే తనపై సీఎం చంద్రబాబు నిందలు వేస్తున్నారని వాపోయారు. కాగా, శివప్రసాద్ కు సంఘీభావం తెలిపేందుకు దళిత సంఘాల నేతలు పెద్దఎత్తున ఆయన నివాసానికి తరలివచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలపై దళిత సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గడిచిన మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో దళితులకు టీడీపీ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదని అంబేడ్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం శివప్రసాద్ చిత్తూరులో ధ్వజమెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివప్రసాద్ పై చర్యలు తప్పవని చంద్రబాబు సూచనప్రాయంగా వెల్లడించారు. -
మహిళ వేషం వేసిన ఎన్.శివప్రసాద్
తిరుపతి: చిత్తూరు టీడీపీ ఎంపీ ఎన్.శివప్రసాద్ మరోసారి వేషం మార్చారు. సమైక్యాంధ్రకు మద్దతు విభిన్న గెటప్పులతో లోక్‌సభలో హల్చల్ చేసిన ఆయన ఈసారి మహిళగా మారిపోయారు. గాంధీ జయంతి రోజున వృద్ధ మహిళగా వేషం ధరించి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తిరుపతిలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అచ్చం మహిళలాగే అభినయిస్తూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి సోనియా గాంధీ, కేసీఆర్ కారణమని విమర్శించారు. జాతీయ మీడియాను ఆకర్షించేందుకు పార్లమెంట్ సమావేశాల్లో పలు 'వేషాలు' వేశారు. శ్రీకృష్ణుడి అవతారంతో లోక్‌సభలో ప్రత్యక్షమయ్యారు. తర్వాత గాంధీ టోపీ పెట్టుకుని నిరసన తెలిపారు. ఒక లోక్‌సభ నుంచి సస్పెండయినప్పడు కొరడాతో కొట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. మరోసారి పార్లమెంట్ వెలుపల చెక్క భజన చేస్తూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.