‘అందుకే నాపై చంద్రబాబు నిందలు’ | dalit associations supports tdp mp sivaprasad | Sakshi
Sakshi News home page

‘అందుకే నాపై చంద్రబాబు నిందలు’

Published Sun, Apr 16 2017 12:35 PM | Last Updated on Fri, Aug 10 2018 7:07 PM

‘అందుకే నాపై చంద్రబాబు నిందలు’ - Sakshi

‘అందుకే నాపై చంద్రబాబు నిందలు’

చిత్తూరు: దళితులకు జరుగుతున్న అన్యాయంపై వెనక్కితగ్గే ప్రసక్తే లేదని చిత్తూరు టీడీపీ ఎంపీ ఎన్‌. శివప్రసాద్‌ స్పష్టం చేశారు. దళితులకు న్యాయం చేయాలని తాను అడగడం తప్పా అని ప్రశ్నించారు. డీకేటీ భూముల రెగ్యులరైజేషన్‌ హామీ ఏమైంది, బ్యాక్‌ లాగ్‌ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు, ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కు నిధులు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. ఈ ప్రశ్నలు అడినందుకే తనపై సీఎం చంద్రబాబు నిందలు వేస్తున్నారని వాపోయారు.

కాగా, శివప్రసాద్‌ కు సంఘీభావం తెలిపేందుకు దళిత సంఘాల నేతలు పెద్దఎత్తున ఆయన నివాసానికి తరలివచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలపై దళిత సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గడిచిన మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ లో దళితులకు టీడీపీ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదని అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా శుక్రవారం శివప్రసాద్‌ చిత్తూరులో ధ్వజమెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివప్రసాద్‌ పై చర్యలు తప్పవని చంద్రబాబు సూచనప్రాయంగా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement