61వ రోజు కొనసాగుతున్న సమైక్య ఉద్యమం | Samaikyandhra Agitations Continues from 61 days | Sakshi
Sakshi News home page

61వ రోజు కొనసాగుతున్న సమైక్య ఉద్యమం

Published Sun, Sep 29 2013 8:11 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

Samaikyandhra Agitations Continues from 61 days

అనంతపురం/చిత్తూరు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం 61వ రోజు కొనసాగుతోంది. ఆందోళనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలతో సమైక్య ఉద్యమం హోరెత్తుతోంది. అనంతపురం జిల్లాలో ఆత్మకూరులో ప్రజాగర్జన నిర్వహించనున్నారు. సమైక్యాంధ్ర కోరుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన ప్రదర్శనకు దిగనున్నారు.

మడకశిరలో కర్నాటక బస్సులపై సేవ్‌ ఏపీ అని సమైక్యవాదులు నినాదాలు రాశారు. గుంతకల్లులో వైఎస్సార్ సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్య ఆందోళనలతో జిల్లా వ్యాప్తంగా 1000 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ఆర్టీసీకి సుమారు రూ. 51 కోట్లు నష్టం వాటిల్లింది.

చిత్తూరు జిల్లాలోనూ సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు 49వ రోజు కొనసాగుతున్నాయి. నేడు జిల్లాలో విద్యుత్ ఉద్యోగుల ర్యాలీలు నిర్వహించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement