
రేపు విజయనగరంలో కర్ఫ్యూ సడలింపు
సమైక్యాంధ్ర ఆందోళనలతో అట్టుడికిన విజయనగరం క్రమేపీ కుదుటపడుతోంది. కర్ఫ్యూ నీడ కొనసాగుతోంది.
విజయనగరం: సమైక్యాంధ్ర ఆందోళనలతో అట్టుడికిన విజయనగరం క్రమేపీ కుదుటపడుతోంది. కర్ఫ్యూ నీడ కొనసాగుతోంది. పట్టణంలో శుక్రవారం ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనా చోటుచేసుకోలేదు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ కర్ఫ్యూను సడలించారు.
శనివారం ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తామని కలెక్టర్ కాంతిలాల్ దండె, ఎస్పీ కార్తికేయ తెలిపారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో 144 సెక్షన్ కొనసాగుతుందని చెప్పారు. ఈ సమయంలో ర్యాలీలకు అనుమతి ఉందన్నారు. ఆదివారం నుంచి కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేసే అవకాశముంది.